పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని పూర్వకల్పము

  •  
  •  
  •  

1-106-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లేను వర్షాకాల శరత్కాలంబులు సేవించితి; వారును నా యందుఁ గృపసేసి రంత.

టీకా:

ఇట్లు = ఈవిధముగ; ఏను = నేను; వర్షాకాల = వానాకాలము; శరత్కాలంబులు = శరత్కాలములు; సేవించితిన్ = సేవించితిని; వారును = వారుకూడ; నాయందున్ = నాయందు; కృప = దయ; సేసిరి = చూపిరి; అంత = అంతట.

భావము:

ఈ ప్రకారంగా వర్షాకాలం, శరత్కాలం గడచిపోయాయి. ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది.