పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదుని పూర్వకల్పము

  •  
  •  
  •  

1-103-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మహాత్మా! నేను పూర్వకల్పంబునం దొల్లిఁటి జన్మంబున వేదవాదుల యింటిదాసికిం బుట్టి, పిన్ననాఁడు వారలచేఁ బంపంబడి, యొక్క వానకాలంబునఁ జాతుర్మాస్యంబున నేకస్థల నివాసంబు సేయ నిశ్చయించు యోగిజనులకుం బరిచర్య సేయుచు.

టీకా:

మహా = గొప్ప; ఆత్మా = ఆత్మ కలవాడా; నేను = నేను; పూర్వ = ఇంతకు ముందటి; కల్పంబునన్ = కల్పములో; తొల్లిఁటి = పూర్వ; జన్మంబునన్ = జన్మలో; వేద = వేదము; వాదుల = చదువు వారి; ఇంటి = ఇంటిలో; దాసి = దాసి; కిన్ = కి; పుట్టి = జన్మించి; పిన్ననాఁడు = చిన్నతనమున; వారల = వారి; చేన్ = చేత; పంపంబడి = పంపబడి; ఒక్క = ఒక; వానకాలంబునన్ = వానాకాలమందు; చాతుర్మాస్యంబునన్ = చాతుర్మాస్యదీక్షలో {చాతుర్మాస్యము - యోగులు ప్రతి సంవత్సరము ఆషాఢశుద్ధము మొదలు కార్తికశుద్ధము వఱకు నాలుగు నెలలు ఒకే ప్రదేశమున ఉండు దీక్ష}; ఏక = ఒకే; స్థల = స్థలములో; నివాసంబున్ = నివాసము; సేయ = చేయుటకు; నిశ్చయించు = నిశ్చయించుకొన్న; యోగి = యోగుల; జనుల = సమూహమున; కున్ = కు; పరిచర్య = సేవ; సేయుచున్ = చేయుచు.

భావము:

మహానుభావా! నేను గడచిన కల్పంలో గత జన్మలో ఒక దాసీపుత్రుణ్ణి. మా అమ్మ వేదవేత్తలైన వారి ఇంటిలో పని చేస్తూ ఉండేది. నన్ను చాతుర్మాస్యాలలో వానాకాలం నాలుగు నెలలూ ఒకే స్థానంలో నివాసం ఏర్పరచుకొనిన కొందరు యోగిజనుల సేవనిమిత్తమై వారు నియమించారు. ఆ పెద్దల ఆనతి శిరసా వహిస్తూ వారికి సేవ చేస్తూ ఉండేవాణ్ణి. ఆ మహానుభావులకు పరిచర్యలు చేసేవాణ్ణి.