పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదాగమనంబు

  •  
  •  
  •  

1-89-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ధావు, భారతశ్రుతివిధాతవు, వేదపదార్థజాతవి
జ్ఞావు, కామముఖ్యరిపుట్కవిజేతవు, బ్రహ్మతత్త్వని
ర్ణేవు, యోగినేతవు, వినీతుఁడ వీవు చలించి చెల్లరే!
కారుకైవడిన్ వగవఁ గారణ మేమి? పరాశరాత్మజా!""

టీకా:

ధాతవు = బ్రహ్మ దేవుడివి; భారత = భారతమనే; శ్రుతి = వేదము; విధాతవు = సృష్టించిన వాడివి; వేద = వేదము లందలి; పదార్థ = విషయముల నుండి; జాత = పుట్టిన; విజ్ఞాతవు = విజ్ఞానము కలవాడివి; కామ = కామము {అరిషడ్వర్గములు - 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములనెడి ఆరుగురు శత్రు కూటములు}; ముఖ్య = మొదలగు; రిపు = శత్రు; షట్క = షట్కమును (6); విజేతవు = జయించినవాడివి; బ్రహ్మ = బ్రహ్మజ్ఞానము యొక్క; తత్త్వ = స్వభావమును; నిర్ణేతవు = నిర్ణయించిన వాడవు; యోగి = యోగులలో; నేతవు = నాయకుడవు; వినీతుఁడవు = జితేంద్రియుడవు; ఈవు = నీవు; చలించి = చలించి పోయి; చెల్లరే = తగునా; కాతరు = దీనుని; కైవడిన్ = వలె; వగవన్ = దుఃఖ పడుటకు; కారణము = కారణము; ఏమి = ఏమిటి; పరాశరాత్మజా = వ్యాసా {పరాశరాత్మజుడు - పరాశరుని పుత్రుడు, వ్యాసుడు.}.

భావము:

“పరాశరుని పుత్రుడా! వ్యాసమునీంద్రా! నీవు బ్రహ్మదేవుడివి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాల్ని జయించిన వాడివి. పరబ్రహ్మ తత్త్వాన్ని నిర్ణయించిన వాడివి, యోగులలో అగ్రేసరుడివి, వినయసంపన్నుడివి. ఇటువంటి నీవు ఈ విధంగా చలించిపోయి పిరికివాడి లాగ విచారించటం ఆశ్చర్యంగా ఉంది. కారణమేమిటయ్యా?”