పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : నారదాగమనంబు

  •  
  •  
  •  

1-100-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కులధర్మమున్ విడిచి దానవవైరి పదారవిందముల్
నివడి సేవసేసి పరిపాకముఁ వొందక యెవ్వఁడేనిఁ జ
చ్చిన, మఱు మేన నైన నది సిద్ధి వహించుఁ దదీయ సేవఁ బా
సినఁ గుల ధర్మగౌరవము సిద్ధి వహించునె యెన్ని మేనులన్.

టీకా:

తన = తనయొక్క; కుల = కులము యొక్క; ధర్మమున్ = ధర్మమును; విడిచి = విడిచిపెట్టి; దానవవైరి = విష్ణువు {దానవులశత్రువు - దానవులకు శత్రువు, హరి}; పద = పాదములనే; అరవిందముల్ = పద్మములను; పనిపడి = పనిగట్టుకు; సేవ = భక్తి; చేసి = చేసి; పరిపాకమున్ = సిద్ధిని; పొందక = పొందకుండగ; ఎవ్వఁడేనిన్ = ఎవడైనా; చచ్చిన = చనిపోయిన; మఱు = తరువాతి; మేనన్ = జన్మలో (శరీరంలో); ఐనన్ = అయినను; అది = అది; సిద్ధి = సిద్ధి; వహించున్ = పొందును; తదీయ = అతని; సేవన్ = భక్తిని; పాసినన్ = విడిచిన; కుల = కులము; ధర్మ = ధర్మము; గౌరవము = గౌరవము(లతో); సిద్ధి = సిద్ధి; వహించునె = పొందునా; ఎన్ని = ఎన్ని; మేనులన్ = జన్మలకైనా.

భావము:

ఎవడైతే తన కులధర్మాలను వదలిపెట్టినా సరే, గోవింద పదారవిందాలను శ్రద్ధాభక్తులతో సేవిస్తూ కృతార్థుడు కాకుండానే మృతి పొందుతాడో, అట్టివానికి నష్టమేమీ కలుగదు. అతడు ఆ జన్మలో కాకపోయినా మరుజన్మలో నైనా తన సేవకు ఫలాన్ని పొందుతాడు. అలా కాకుండా విష్ణుసేవకి దూరమైనవాడు ఎట్టి కులధర్మాలను గౌరవించి ఆచరించినప్పటికీ వాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు కాలేడు.