పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : వ్యాసచింత

  •  
  •  
  •  

1-85-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వ్రతధారినై వేదహ్ని గురుశ్రేణి-
న్నింతు, విహితకర్మములఁ గొఱఁత
డకుండ నడుపుదు, భారతమిషమునఁ-
లికితి వేదార్థభావ మెల్ల,
మునుకొని స్త్రీశూద్రముఖ్యధర్మము లందుఁ-
దెలిపితి నేఁజెల్ల, దీనఁ జేసి
యాత్మ సంతస మంద, దాత్మలో నీశుండు-
సంతసింపక యున్న జాడ దోఁచె,

1-85.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రికి యోగివరుల భిలషితంబైన
భాగవత విధంబుఁ లుకనైతి,
మోసమయ్యెఁ దెలివి మొనయదు, మఱచితి"
నుచు వగచుచున్న వసరమున.

టీకా:

వ్రతధారిని = నిష్ఠలో నున్న వానిగ; ఐ = అయ్యి; వేద = వేదముల {వేదములు - 4 ఋక్ ,యజు, సామ, అధర్వణ వేదములు}; వహ్ని = అగ్నుల {త్రేతాగ్నులు - 1ఆహవనీయము 2దక్షిణాగ్ని, 4గార్హపత్యము}; గురు = గురువుల {గురువులు - కన్నతండ్రి, పెంచినతండ్రి, ఉపాధ్యాయుడు, బృహస్పతి, కులముపెద్ద, తండ్రితోడ పుట్టిన వాడు, తాత, అన్న, మామ, మేనమామ, రాజు, కాపాడినవాడు.}; శ్రేణి = సమూహమును; మన్నింతున్ = గౌరవింతును; విహిత = వేదములలో విధింపబడిన; కర్మములన్ = పనులలో; కొఱఁత = లోపము; పడకుండన్ = లేకుండా; నడుపుదు = నడిపిస్తాను; భారత = భారతమనే; మిషమునన్ = వంకతో; పలికితి = వెల్లడించితిని; వేద = వేదములయొక్క; అర్థ = ప్రయోజనము; భావము = సారాంశము; ఎల్లన్ = అంతటిని; మునుకొని = పూనుకొని; స్త్రీ = స్త్రీలకు; శూద్ర = శూద్రులకు; ముఖ్య = ముఖ్యమైన; ధర్మములు = ధర్మములు; అందున్ = అందులో; తెలిపితిన్ = తెలియ జేసితిని; నేన్ = నేను; చెల్లన్ = చెలఁగి, ఉత్సాహముతో; దీనఁన్ = దీని; చేసి = వలన; ఆత్మ = ఆత్మ; సంతసము = సంతోషము; అందదు = పొందదు; ఆత్మ = ఆత్మ; లోన్ = లోని; ఈశుండున్ = ఈశ్వరుడు; సంతసింపక = సంతోషింపకుండగ; ఉన్న = ఉన్న; జాడన్ = విధముగ; తోఁచెన్ = తోచుచున్నది;
హరి = శ్రీహరి; కిన్ = కి; యోగి = యోగులలో; వరులు = శ్రేష్ఠులు; కున్ = కు; అభిలషితంబు = అత్యంత ప్రియము; ఐన = అయినట్టి; భాగవత = భాగవతము యొక్క {భాగవతము - భగవంతునికి సంబంధించినదైన}; విధంబున్ = విషయమును; పలుకన్ = వివరింపలేని వాడను; ఐతిన్ = అయితిని; మోసము = ప్రమాదము; అయ్యెన్ = జరిగెను; తెలివి = తెలివి; మొనయదు = చేకూరలేదు; మఱచితిన్ = మరచిపోయితిని; అనుచు = అనుకొనుచు; వగచుచున్న = బాధపడుతున్న; అవసరమునన్ = సమయములో.

భావము:

“దీక్ష చేపట్టిన వాడినై, వేదాలను విభజించాను. అగ్నులను అర్చించాను. ఆచార్యులను గౌరవించాను. శాస్ర్తోక్తాలైన కర్మలన్నీ ఏ మాత్రం లోపం లేకుండా నడుపుతున్నాను. వేదాల్లోని అర్థాన్నంతా మహాభారత రూపంలో వెల్లడించాను. ఈ రూపంగా స్ర్తీలు శూద్రాదులు సహితం తమ తమ ధర్మకర్మలు గుర్తించేటట్లు చేశాను. ఇంత చేసినా ఎందుకో గాని నా అంతరాత్మకు సంతోషం కలగటం లేదు. నా మనస్సులో ఉన్న పరమేశ్వరుడు సంతుష్టుడు కానట్లే తోస్తున్నది. కారణం ఏమిటో. అన్నీ చేశాను కాని హరికీ, హరిభక్తులైన పరమ హంసలకూ అత్యంత ప్రియమైన భాగవత స్వరూపాన్ని చెప్పటం మాత్రం మరచిపోయాను. ఎంత పొరపాటు చేశాను ఎంత తెలివి తక్కువ పని చేశాను ఎంతటి విస్మృతి పాలయ్యాను” అని వ్యాసమహర్షి విచారిస్తూ కూర్చున్నాడు.