పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : వ్యాసచింత

  •  
  •  
  •  

1-83.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శిష్యు లెల్లను నాత్మీయశిష్యజనుల
కంత బహుమార్గములు సెప్పి నుమతింపఁ;
బెక్కుశాఖలు గలిగి యీ పృథివిలోన
నిగమ మొప్పారె భూసుర నివహమందు.

టీకా:

పైలుండు = పైలుడు; ఋగ్వేద = ఋగ్వేదము యొక్క; పఠనంబు = చదువుకొనుట; దొరఁకొనెన్ = పూనుకొన్నాడు; సామంబు = సామ వేదము; జైమిని = జైమిని; సదువుచున్ = పఠిస్తూ; ఉండెన్ = ఉన్నాడు; యజువు = యజుర్వేదము; వైశంపాయన = వైశంపాయనుడు; ఆఖ్యుండు = అనుపేరు గలవాడు; కైకొనెన్ = తీసుకొన్నాు; తుదిన్ = చివరకు; అధర్వంబు = అధర్వణవేదము; సుమంతుఁడు = సుమంతుడు; పఠించెన్ = చదువుకొన్నాడు అఖిల = సమస్తమైన; పురాణ = పురాణములు; ఇతిహాసముల్ = ఇతిహాసములు; మా = మా; తండ్రి = తండ్రి; రోమహర్షణుఁడు = రోమహర్షణుడు; నిరూఢిన్ = నిష్ఠగా; తాల్చెన్ = ధరించాడు; తమతమ = వారివారి; వేదము = వేదములను; ఆ = ఆ; తపసులు = తాపసులు; భాగించి = విభజించి; శిష్య = శిష్యులయొక్క; సంఘములు = సమూహములు; కున్ = కు; చెప్పిరి = బోధించారు; అంతన్ = అంతట;
శిష్యులు = శిష్యులు; ఎల్లను = అందరును; ఆత్మీయ = తమయొక్క; శిష్యజనులు = శిష్యులు; కున్ = కు; అంత = అంతట; బహు = పెక్క; మార్గములు = విధములు; చెప్పి = చెప్పి; అనుమతింపన్ = అనుమతింపగా; పెక్కు = అనేక; శాఖలు = శాఖలు; కలిగి = ఏర్పడి; ఈ = ఈ; పృథివి = భూప్రపంచము; లోనన్ = లోపల; నిగమము = వేదము; ఒప్పారెన్ = ప్రకాశించెను; భూసుర = బ్రాహ్మణుల; నివహమందు = సమూహములో.

భావము:

పైలుడు ఋగ్వేదాన్ని చదవటం మొదలు పెట్టాడు. జైమిని సామవేదం చదువసాగాడు. వైశంపాయనుడు యజుర్వేదాన్ని అధ్యయనం చేయటం మొదలు పెట్టాడు. సుమంతుడు అథర్వ వేదాన్ని ఆరంభించాడు. మా తండ్రిగారైన రోమహర్షణుడు పట్టుదలతో సమస్త పురాణాలూ, ఇతిహాసాలూ పఠించటం ప్రారంభించాడు. ఇలా తాము నేర్చుకొన్న వేదాలూ, పురాణాలూ, ఇతిహాసాలూ ఆ తపోధనులు తమ శిష్యులకు వేరువేరుగా విభజించి చెప్పారు. ఆ శిష్యు లందయా తమ తమ శిష్యులకు అనేక విధాలూగా ఉపదేశించారు. అలా వేదం భూమి మీద అనేక శాఖలతో బ్రాహ్మణ సమాజంలో ప్రకాశించింది.