పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శుకుడు భాగవతంబు జెప్పుట

  •  
  •  
  •  

1-79-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాండవ వంశంబు లము మానంబును-
ర్ధిల్లఁ గడిమి నెవ్వాఁడు మనియెఁ;
రిపంథిరాజులు ర్మాది ధనముల-
ర్చింతు రెవ్వని యంఘ్రియుగముఁ;
గుంభజ కర్ణాది కురు భట వ్యూహంబు-
సొచ్చి చెండాడెనే శూరు తండ్రి;
గాంగేయ సైనికాక్రాంత గోవర్గంబు-
విడిపించి తెచ్చె నే వీరుతాత;

1-79.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి గాఢకీర్తి గు పరీక్షిన్మహా
రాజు విడువరాని రాజ్యలక్ష్మిఁ
రిహరించి గంగఁ బ్రాయోపవిష్టుఁడై
సువు లుండ, నేల డఁగి యుండె?

టీకా:

పాండవ = పాండవుల యొక్క; వంశంబు = వంశమునకు; బలము = శక్తియు; మానంబును = గౌరవమును; వర్ధిల్లన్ = అధికమగునట్లు; కడిమిన్ = పరాక్రమముతో; ఎవ్వాఁడు = ఎవడైతే; మనియెన్ = జీవించాడో; పరిపంథి = శత్రు; రాజులు = రాజులు; భర్మ = బంగారము; ఆది = మొదలగు; ధనములన్ = సంపదలతో; అర్చింతురు = పూజిస్తారో; ఎవ్వని = ఎవని యొక్క; అంఘ్రి = పాద; యుగమున్ = ద్వయమును; కుంభజ = ద్రోణుడు {ద్రోణుడు - కుంభములో (ద్రోణిలో) పుట్టినవాడు}; కర్ణ = కర్ణుడు; ఆది = మొదలగు (వారి); కురు = కౌరవ; భట = సైనిక; వ్యూహంబున్ = వ్యూహమును; సొచ్చి = ప్రవేశించి; చెండాడెన్ = ఖండించాడో; ఏ = ఏ; శూరు = శూరుని; తండ్రి = తండ్రి; గాంగేయ = భీష్ముని {గాంగేయుడు - భీష్ముడు - గంగ యొక్క పుత్రుడు}; సైనిక = సైనికులచే; ఆక్రాంత = ఆక్రమింపబడిన; గో = ఆవుల; వర్గంబు = మందను; విడిపించి = విడిపించి; తెచ్చెన్ = తెచ్చాడో; ఏ = ఏ; వీరు = వీరుని; తాత = పితామహుడు;
అట్టి = అటువంటి; గాఢ = గాఢమైన, దట్టమైన; కీర్తి = కీర్తికలవాడు; అగు = అయిన; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; మహా = గొప్ప; రాజు = రాజు; విడువన్ = విడుచుటకు; రాని = తగని; రాజ్య = రాజ్యమను; లక్ష్మిన్ = మహా సంపదను; పరిహరించి = విసర్జించి; గంగన్ = గంగలో; ప్రాయోపవిష్టుఁడు = ప్రాయోపవేశమున ఉన్నవాడు, మరణాయత్త దీక్షుడు; ఐ = అయ్యి; అసువులు = ప్రాణములు; ఉండన్ = ఉండగనే; ఏల = ఎందులకు; అడఁగి = అణగి; ఉండెన్ = ఉండెను.

భావము:

ఆ పరీక్షిన్మహారాజు సామాన్యుడు కాడు; తన పరాక్రమంతో పాండవుల వంశం, బలం, గౌరవప్రతిష్ఠలు వర్థిల్లునట్లు ప్రవర్తించిన వాడు; పరరాజ్యపాలకులు అందరు బంగారురాసులు తీసికొచ్చి ఆయన కాళ్ల ముందు క్రుమ్మరించి ఆయన పాదపద్మాలను సేవించారు; ఆ మహావీరుని తండ్రి అయిన అభిమన్యుడు అసహాయశూరుడై, ద్రోణ కర్ణాదులచే పరిరక్షితమైన కౌరవసేవావ్యూహంలో ప్రవేశించి చీల్చి చెండాడాడు; ఆయన తాత యైన అర్జునుడు మహారథుడైన భీష్ముని రక్షణలో ఉన్న కురుసేనావాహినిని పారద్రోలి గోవులను మరలించి తెచ్చాడు; అటువంటి అఖండ కీర్తి సంపన్నుడైన పరీక్షిత్తు మహారాజు విడువరాని రాజ్యలక్ష్మిని విడిచి, గంగానదిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలను బిగట్టుకొని ఎందుకు ఉండవలసి వచ్చింది.