పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : శుకుడు భాగవతంబు జెప్పుట

  •  
  •  
  •  

1-76-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బుధేంద్రా! వ్యాసపుత్త్రుండైన శుకుండను మహాయోగి సమదర్శనుం, డేకాంతమతి, మాయాశయనంబువలనం దెలిసిన వాఁడు, గూఢుండు మూఢునిక్రియ నుండు నిరస్తఖేదుం డదియునుంగాక.

టీకా:

బుధ = జ్ఞానులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా; వ్యాస = వ్యాసుని యొక్క; పుత్త్రుండు = కుమారుడు; ఐన = అయినట్టి; శుకుండు = శుకుడు; అను = అనే; మహా = గొప్ప; యోగి = యోగి; సమదర్శనుండు = (సర్వమును) సమానముగా చూచువాడు; ఏకాంత = ఏకాంతముగా, ఒంటరిగా; మతి = ఉండగోరువాడు; మాయ = మాయ; శయనంబు = దాగిన తావు; వలనన్ = గురించిన; తెలిసినవాఁడు = మర్మము తెలిసినవాడు; గూఢుండు = గూఢుడు {గూఢుడు - సాధరణముగ వ్యక్తము కాక యుండువాడు}; మూఢుని = తెలియని వాని; క్రియన్ = వలె; ఉండున్ = ఉండును; నిరస్త = తిరస్కరింపబడిన; ఖేదుండు = దుఃఖము గలవాడు; అదియునున్ = అదికూడా; కాక = కాకుండా.

భావము:

సుధీమణి! సూతా! వ్యాసుభగవానుని పుత్రుడైన శుకుడు మహా గొప్పయోగి, విరాగి, సమదర్శనుడు, బ్రహ్మజ్ఞుడు, మాయాతీతుడు, సర్వజ్ఞుడు. ఆయన నిగూఢ వర్తన కలవాడు. మూఢునిలా లోకానికి కనిపిస్తాడు, భేదాలు ఖేదాలు అంటని నిత్యానందుడు. అంతేకాకుండా,