పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్యగద్యలలో - గణన : గోపికలు కృష్ణుని వెదకుట

10.1-1010-సీ. పద్యంలో గొల్లపడచులు శ్రీకృష్ణుని వెతకడం అనే ఘట్టంలో వేసిన పదచిత్రీకరణ యందు మన ప్రజాకవి బమ్మెర పోతనామాత్యులవారు 11 రకాల చెట్ల పేర్లను, 2 రకాల పుష్పాల పేర్లను మఱియు శ్రీకృష్ణుని గురించి 11 రకాల వర్ణనలు ఎంతో మనోహరంగా ప్రయోగించారు వీక్షించండి.

పున్నాగవృక్షము
బొట్టుగుచెట్టు
కర్పూర చెట్టు
మంకెన మొక్క
వెలగమ్రాను
వెదురు పొద
చందన వృక్షము
మొల్లలతిక
మరువము
రేగుచెట్టు
కడప చెట్టు


మొల్లమొగ్గలు
తామర పువ్వు
పురుష పుంగవుల వందనాలు అందుకునే వాడు
ఫాలమున తిలకం ధరించిన వాడు
గొప్ప బలిమిచే భాసిల్లు వాడు
అందరికీ బంధుమిత్రుడైన వాడు
మన్మథుని వంటి ఆకారం గల వాడు
వేణువు ధరించి ఉండు వెన్నుడు
చందనము వలె చల్లనైన వాడు
మొల్లమొగ్గలవంటి దంతములవాడు
దేవేంద్ర వైభవం గల వాడు
భూమండలానికి అధినాదుడు
ప్రియ విహారములు గల వాడు