పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్యగద్యలలో - గణన : గోపికలు కృష్ణుని వెదకుట - వృక్ష

గోపికలు కృష్ణుని వేదకు సందర్భంలో వాడిన వృక్ష సంబంధ పదములు.
10.1-1009లో
వనాంతరములు = అడవులు
10.1-1010లో
పున్నాగ = పొన్నచెట్టు
పున్నాగ = మగ ఏనుగు
తిలకము = బొట్టుగ చెట్టు
ఘనసార = కప్పురపు చెట్టు
బంధూక = మంకెన చెట్టు
మన్మథ = వెలగచెట్టు
వంశము = వెదురు పొద
చందన = గంధపుచెట్టు
చందనము = మంచిగంధము
కుందము = మొల్లచెట్టు
కుంద = మల్లెమొగ్గలు
ఇంద్రభూజము = మరువపు చెట్టు
కువలవృక్షము = రేగుచెట్టు
ప్రియకపాదపము = కడపచెట్టు
అబ్జము = పద్మము
10.1-1012లో
మల్లియలు = మల్లెపూలు
పొదలు = పొదలు
10.1-1013లో
పువ్వుతూపులు = పూలబాణములు
లవంగ = లవంగము చెట్టు
లుంగ = పుల్ల మాధీఫలము చెట్టు
నారంగములు = నారింజ చెట్లు
10.1-1014లో
వత్సకములు = కొడిసె చెట్లు
సుందరోన్నతలతార్జనములు = అందమైన ఎత్తైన తీగలతోకూడి ఉన్న మద్దిచెట్లు
సుందరోన్నతలతార్జనములు = అందమైన ఎత్తైన తీగలతోకూడి ఉన్న మద్దిచెట్లు
ఘనతరలసదశోకములు = మిక్కిలి ఉన్నతమైన చక్కటి అశోకవృక్షములు
నవ్యరుచిరకాంచనములు = సరిక్రొత్తకాంతులు గల సంపెంగ పూవులు
కురవకములు = ఎఱ్ఱగోరింట చెట్లు
కురవక = ఎఱ్ఱగోరింట చెట్లు
గణికలు = అడవిమెల్లపువ్వులు
గణికలు = ఆడ ఏనుగులు
10.1-1015లో
పాటలీతరులు = పాదిరిచెట్లు
ఐలేయలతలు = ఏలకితీగలు
చూతమంజరులు = తియ్యమామిడి గుబుర్లు
మాధవీ లతలు = పూలగురివింద తీగెలు
జాతులు = జాజిపొదలు
కదళులు = అరటిచెట్లు
10.1-1016లో
తులసి = తులసి చెట్టు
10.1-1017లో
పొగడలు = పొగడచెట్లు
ఈడెలు = కమలాఫల చెట్లు
మొల్లలు = మొల్లపొదలు
కింశుకములు = మోదుగ చెట్లు