పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (సరస్వతి - సుమాస్త్రుడు)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


5372} సరస్వతి  - జ్ఞానమును ప్రసరించునది, సరస్+మతుప్, సరః విజ్ఞాన విద్యతే అస్మిన్, విద్య కలది. వాణి, సరస్వతి :-
[2-67-మ.]

5373} సరస్వతీరమణుడు  - సరస్వతీదేవి రమణ (భర్త), బ్రహ్మదేవుడు :-
[3-156-వ.]

5374} సరోజకేసరపిశఙ్గవినిర్మలదివ్యభర్మవస్త్రుడు  - సరోజ (పద్మము)ల కేసరముల వలె పిశంగ (పసుపు రంగు) గల వినిర్మల (స్వచ్ఛమైన) దివ్య (దివ్యమైన) భర్మ (బంగారు) వస్త్రుడు (బట్టలు ధరించినవాడు), విష్ణువు :-
[4-920-ఉ.]

5375} సరోజగర్భుడు  - సరోజ (పద్మము)న పుట్టినవాడు :-
[3-354-క., 7-359-ఉ.]

5376} సరోజజుడు  - సరోజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-321-క., 3-336-తే.]

5377} సరోజదళనిభాక్షుడు  - సరోజ (పద్మముల) దళముల నిభ (వంటి) అక్షుడు (కన్నులున్నవాడు), విష్ణువు :-
[3-256-చ.]

5378} సరోజనాభుడు  - సరోజము (పద్మము) నాభిని కలవాడు, విష్ణువు :-
[3-91-వ.]

5379} సరోజభవుడు  - సరోజ (పద్మమున) భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-380-ఉ., 4-163.1-తే., 4-965-క.]

5380} సరోజము  - సరస్సున పుట్టినది, పద్మము :-
[2-93-ఉ., 3-288-వ., 3-550-చ., 3-558-క., 11-12.1-తే.]

5381} సరోజలోచన  - సరోజ (పద్మముల)వంటి లోచన (కన్నులు కల స్త్రీ) :-
[10.2-693-మ.]

5382} సరోజలోచనుడు  - సరోజము (పద్మము)ల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు, కృష్ణుడు :-
[3-46-చ., 3-152-చ., 3-442-ఉ., 4-550-చ., 10.2-493-మ.]

5383} సరోజసంభవుడు  - సరోజ (పద్మము) అందు పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు :-
[2-243-చ.]

5384} సరోజాక్షుడు  - సరోజము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు, కృష్ణుడు :-
[3-71.1-తే., 3-99.1-తే., 3-757-మ., 4-832-తే.]

5385} సరోజాతభవుడు  - సరోజాతము (పద్మము)న భవుడు (పుట్టిన వాడు), బ్రహ్మదేవుడు :-
[3-644.1-తే.]

5386} సరోజాతము  - సరసున జాతము (పుట్టునది), పద్మము :-
[3-281-మ., 3-485-తే., 3-862-క., 4-88-క.]

5387} సరోజాతాక్షుసూనుడు  - సరోజాతాక్షుడు (కృష్ణుడు) యొక్క సూనుడు (కొడుకు), సాంబుడు :-
[10.2-564-శా.]

5388} సరోజానన  - సరోజ (పద్మముల వంటి) ఆనన (మోముకలామె), స్త్రీ. :-
[10.1-797-మ.]

5389} సరోజాయతలోచనుడు  - సరోజ (పద్మముల) వంటి ఆయత (పెద్ద) లోచనుడు (కన్నులుగలవాడ), విష్ణువు :-
[4-925.1-తే.]

5390} సరోరుహనయనుడు  - సరోరుహము (పద్మము) వంటి నయనుడు (కన్నులుగలవాడు), విష్ణువు :-
[4-910.1-తే.]

5391} సరోరుహనాభుడు  - సరోరుహము (పద్మము) నాబిన కలవాడు, విష్ణువు :-
[3-120-ఉ.]

5392} సరోరుహమాలికుడు  - సరోరుహ (పద్మము)ల మాలిక ధరించినవాడ, విష్ణువు :-
[4-920-ఉ.]

5393} సరోరుహము  - సరసున రుహము (పుట్టినది), పద్మము :-
[1-227-మ., 3-937-వ., 4-124-చ., 10.1-597-వ., 10.2-1069-చ.]

5394} సరోరుహసంభవుడు  - సరోరుహము (పద్మము)న సంభవించినవాడు, బ్రహ్మదేవుడు :-
[4-730-చ.]

5395} సరోరుహాక్షుడు  - సరోరుహము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-270-క., 3-662-మ., 3-684-క.]

5396} సరోరుహానన  - పద్మముఖి, స్త్రీ. :-
[10.2-343-చ.]

5397} సరోరుహోదరుడు  - సరోరుహము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[3-114-చ., 3-511-చ.]

5398} సర్పపరిపంథి  - సర్ప (పాములకు) పరిపంథి (శత్రువు), గరుత్మంతుడు :-
[7-290-వ.]

5399} సర్పాంతకుడు  - పాములకు యముని వంటి వాడు, గరుత్మంతుడు :-
[10.1-703.1-తే.]

5400} సర్వంబునెఱుగు  - సృష్టి స్థితి లయ తిరోధానానుగ్రహము లనెడి పంచకృత్యములు మొదలైనవానిని అన్నిటిని దేముడు ఎరుగును :-
[10.1-683-వ.]

5401} సర్వంసహా  - సమస్తమును భరించునది, భూమి :-
[10.1-1521-శా.]

5402} సర్వంసహావల్లభుడు  - సర్వంసహా (భూమికి) రాజు, ప్రభువు. :-
[1-377-మ.]

5403} సర్వకాలములు  - భూతభవిష్యద్వర్తమాన కాలములు, నిమేషమాది మహాప్రళయాంతము వరకు కల సమస్తమైన కాలములు, సమస్తమైన కాలములు :-
[10.1-1631.1-ఆ.]

5404} సర్వగతుడు  - సర్వ (సమస్త మందు) గతుడు (ఉండెడి వాడు), విష్ణువు :-
[6-220-క.]

5405} సర్వగుడు  - ఎల్ల యెడల నిండి ఉండువాడు, విష్ణువు. :-
[6-220-క., 10.1-944-మ.]

5406} సర్వజగజ్జయాంగజభ్రాత  - సర్వ (అఖిల) జగత్ (లోకములను) జయ(జయించెడి) అంగజ (మన్మథుని) భ్రాత (సోదరుడు), బ్రహ్మ :-
[6-278-ఉ.]

5407} సర్వజ్ఞనిధి  - సర్వజ్ఞత్వమున (సమస్తము ఎరుగుట, జ్ఞానము)కు నిధివంటివాడు, విష్ణువు. :-
[11-112-క.]

5408} సర్వజ్ఞుడు  - సమస్తమైన జ్ఞానము కలవాడు, విష్ణువు :-
[4-705-వ.]

5409} సర్వదాసత్యభాషి  - ఎల్లప్పుడు సత్యమును పలుకువాడు, రాముడు . :-
[9-735-మాలి., 12-53-మాలి.]

5410} సర్వదేవమయుడు  - సమస్తమైన దేవతలు తానైన వాడు, విష్ణువు :-
[9-342.1-తే.]

5411} సర్వదేవుడు  - సమస్తమును (దివయింతి ఇతి దేవః) ప్రకాశింపజేయువాడు, విష్ణువు :-
[11-77-వ.]

5412} సర్వద్రష్ట  - సర్వమును సరిగ చూచువాడు, పరమాత్మ :-
[2-84-వ.]

5413} సర్వనియామకుడు  - సర్వులను నియమించువాడు, కృష్ణుడు :-
[4-468-వ.]

5414} సర్వపుణ్యుడు  - సమస్తమైన సుకృతముల రాశియైన వాడు, విష్ణువు :-
[10.1-942-ఆ.]

5415} సర్వప్రభువు  - సర్వులను (బ్రహ్మాది పిపీలక పర్యంతమును) ప్రభావము చూపు (నియమించు) వాడు, విష్ణువు :-
[10.1-1497-మ.]

5416} సర్వభూతగణావాసుడు  - సమస్తమైన జీవరాశి యందును ఆత్మరూపమున ఉండువాడు, విష్ణువు :-
[3-373-మ.]

5417} సర్వభూతనివాసి  - సర్వ (సకల) భూతముల (జీవుల) యందును నివసించెడివాడు, విష్ణువు :-
[4-918.1-తే.]

5418} సర్వభూతభవవృద్ధివినాశనహేతుభూతుడు  - సర్వమైన భూతముల యొక్క భవ (సృష్టి) వృద్ధి ( స్థితి) నాశన (లయము) లకు మూలకారణమైనవాడు, విష్ణువు :-
[3-599-ఉ.]

5419} సర్వభూతభావనుడు  - సమస్తమైన భూతముల (జీవుల)ను భావనుడు (భావించి సృష్టించువాడు), విష్ణువు :-
[4-421-వ.]

5420} సర్వభూతాంతరాత్ముడు  - సమస్తమైన జీవుల అంతరాత్మ అయినవాడు, విష్ణువు :-
[3-407.1-తే.]

5421} సర్వభూతాంతర్యామి  - అఖిల జీవులకును అంతర్యామి (లోపల ఉండెడి వాడు), విష్ణువు :-
[4-964-వ.]

5422} సర్వభూతాత్మకుడు  - సమస్త జీవుల ఆత్మలందు నిండి ఉండువాడు, విష్ణువు :-
[11-77-వ.]

5423} సర్వభూతాత్మవిగ్రహుడు  - సర్వమైన భూత (జీవుల) ఆత్మ (ఆత్మలను) విగ్రహుడు (నియమించువాడు), విష్ణువు :-
[4-366-వ.]

5424} సర్వభూతాధారుడు  - సమస్తమైన (స్థావర జంగమ) జీవులకు ఆధారభూతమైనవాడు, విష్ణువు :-
[10.1-1180.1-ఆ.]

5425} సర్వమంగళ  - సర్వులకు మంగళము కలిగించునది, పార్వతి :-
[8-241-క.]

5426} సర్వమయుడు  - సకల భువనములు కలిగినవాడు, విశ్వంభరుడు :-
[2-89-వ., 6-220-క., 10.1-120-క.]

5427} సర్వరసాత్మ  - సమస్త రసములకు అంతర్యామి, విష్ణువు :-
[4-703.1-తే.]

5428} సర్వర్థి  - 1. వత్సరుని భార్య పుష్పార్ణుని తల్లి. 2. సమస్తమైన ప్రయోజనములు తానైనామె :-
[4-390-వ.]

5429} సర్వలోకజిష్ణుడు  - సర్వ (అఖిలమైన) లోక (భువనములను) జిష్ణుడు (జయించెడి శీలము గలవాడు), విష్ణువు :-
[6-307-వ.]

5430} సర్వలోకపాలావళిమౌళిభూషణుండు  - సమస్తమైన లోకములను పాలించువారి ఆవళి (సమూహము) కిని మౌళి (శిరస్సు)నకు భూషణుడు (భూషణము వంటివాడు), బ్రహ్మదేవుడు :-
[3-500-ఉ.]

5431} సర్వలోకపావనుడు  - సర్వ (అఖిలమైన) లోకములను పావనుడు (పవిత్రము జేయువాడు), కృష్ణుడు :-
[5.2-166-క.]

5432} సర్వలోకప్రజాధిపుడు  - సమస్తమైన లోకముల ప్రజలకును ప్రభువు, విష్ణువు :-
[3-546.1-తే.]

5433} సర్వలోకప్రశస్తుడు  - సర్వ (సమస్తమైన) లోక (లోకములలోను) ప్రశస్తుడు (శ్లాఘింపబడువాడు), శ్రీరాముడు :-
[10.1-1791-మాలి.]

5434} సర్వలోకశరణ్యుడు  - సర్వ (సమస్తమైన) లోక (లోకములకు) శరణ్యుడు (అభయము నిచ్చువాడు), విష్ణువు :-
[6-330-తే., 10.2-1318-చ.]

5435} సర్వలోకహితదాత  - సర్వ (అఖిల) లోక (లోకముల) హిత (హితమును) దాత (కలిగించెడి వాడు), బ్రహ్మ :-
[6-278-ఉ.]

5436} సర్వలోకాభిరాముడు  - ఎల్ల లోకములకు అభిరాముడు (మనోజ్ఞుడు), శ్రీరాముడు :-
[10.2-1342-మాలి.]

5437} సర్వలోకేశ్వరుడు  - సమస్తమైన లోకములకు ప్రభువు, విష్ణువు :-
[7-376.1-తే.]

5438} సర్వలోకేశ్వరేశుడు  - అఖిల లోకపాలకులకు ఈశ్వరుడు, విష్ణువు :-
[10.2-247-తే.]

5439} సర్వలోకోపకారి  - సర్వ (సమస్తమైన) లోక (లోకములకు) ఉపకారి (ఉపకారము చేయువాడు), రాముడు :-
[4-976-మాలి.]

5440} సర్వవ్యాపారప్రవర్తకము  - సమస్తమైన పంచవ్యాపారముల (1సృష్టి 2స్థితి 3లయ 4తిరోధాన 5అనుగ్రహములు) యందు విచిత్రముగ వ్యాపించగలుగుట :-
[10.1-681-వ.]

5441} సర్వశక్తి  - సర్వమునకు శక్తి యైనవాడు, విష్ణువు :-
[3-212-చ.]

5442} సర్వశక్తియుక్తుడు  - సమస్తమైన శక్తులుకలవాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

5443} సర్వశబ్దవాచ్యుడు  - సర్వ శబ్దముచే తెలియబడు వాడు, ప్రమాణ శ్లో. సర్వగత్వాదనంతస్య సఏవాహ మనస్థితః, మత్తస్సర్వమహం సర్వం మయి సర్వం సనాతనః., విష్ణువు :-
[10.2-1203-వ.]

5444} సర్వశరణ్యుడు  - అందరకును శరణ్యుడు (శరణుజొచ్చుటకు తగినవాడు), విష్ణువు :-
[3-19-చ., 3-552-చ., 3-623-ఉ., 4-276-చ., 4-917-చ.]

5445} సర్వసంగపరిత్యాగము  - సర్వ (సమస్తమైన) సంగ (తగులములను) పరిత్యాగము (పూర్తిగా విడిచివేయుట) :-
[5.1-163-వ., 11-105-వ.]

5446} సర్వసంపదలు  - అష్టైశ్వర్యములు, 1దాసీజనము 2భృత్యులు 3పుత్రులు 4మిత్రులు 5బంధువులు 6వాహనములు 7ధనము 8ధాన్యము :-
[10.2-205-వ.]

5447} సర్వసత్తుడు  - అఖిలమైన సత్తువలు (సామర్థ్యములు) తానైన వాడు, విష్ణువు :-
[4-704-తే.]

5448} సర్వసాక్షి  - సమస్తమునకు సాక్షీభూతుడు, విష్ణువు :-
[4-918.1-తే.]

5449} సర్వస్వామి  - అందరకును స్వామి (ప్రభువు), విష్ణువు :-
[3-935-మ.]

5450} సర్వాతిశాయి  - సమస్తమును అతిశయించి (మించి) ఉండువాడు, విష్ణువు :-
[2-214-మ.]

5451} సర్వాత్మ - జగత్తు అంతయు తానైన వాడు, విష్ణువు :-
[10.2-1014-క.]

5452} సర్వాత్మకుడు  - సమస్తమునందు ఆత్మగ ఉండువాడు సర్వాంతర్యామి, విష్ణువు :-
[2-84-వ., 4-367.1-తే., 4-509.1-తే., 6-327.1-తే., 7-148-శా., 8-477-మ., 9-283-శా.]

5453} సర్వాత్ముడు  - సర్వ (అఖిల జీవులకు) ఆత్ముడు (అంతరాత్మ యైన వాడు), విష్ణువు :-
[3-355.1-తే., 6-220-క., 7-167-మ., 8-122-మ., 10.1-120-క., 10.1-343-ఆ.]

5454} సర్వానుగతుడు  - అఖిలమును అనుసరించు వాడు, విష్ణువు :-
[6-216-ఉ.]

5455} సర్వార్థసాధకులు  - సర్వోత్తమైన ప్రయోజనమనకై (పరమహంస పదవికై) సాధన చేయువారు :-
[7-88-వ.]

5456} సర్వులు  - బ్రహ్మాది పిపీలక పర్యంతము బ్రహ్మ మొదలు క్రిమివరకు కల సమస్తమైన మూర్తులు :-
[10.1-1450.1-ఆ.]

5457} సర్వేశుడు  - సర్వులను (పిపీలకాది బ్రహ్మ పర్యంతము), పంచకృత్యములను (సృష్టి స్థితి లయ తిరోధానానుగ్రహములను) నియమించు ప్రభువు, విష్ణువు, భగవంతుడు :-
[2-221.1-తే., 2-262-క., 3-220-క., 3-307.1-తే., 3-532-మ., 3-755-మ., 6-220-క., 6-397.1-ఆ., 6-414.1-తే., 6-497.1-తే., 7-354.1-తే., 10.1-557.1-తే., 10.1-572.1-తే., 10.1-578-క., 10.1-693.1-తే., 10.1-943-శా., 11-85-తే.]

5458} సర్వేశ్వరుడు  - సమస్తమునకు అధిపతి, భగవంతుడు, విష్ణువు, కృష్ణుడు :-
[1-215.1-తే., 1-380-మ., 2-89-వ., 2-89-వ., 2-222-వ., 2-267-వ., 3-91-వ., 3-293.1-తే., 3-412-వ., 3-416-వ., 3-507-వ., 3-524-వ., 3-539-వ., 3-896-వ., 3-921-వ., 3-921-వ., 3-972-వ., 3-992-వ., 3-1020.1-తే., 4-162-వ., 4-357-వ., 4-359.1-తే., 4-421-వ., 4-670-వ., 4-963.1-తే., 5.1-51-వ., 6-221-వ., 6-327.1-తే., 7-365-మ., 9-728.1-తే., 10.1-120-క., 10.2-1203-వ., 11-60-వ.]

5459} సర్వోపాధివర్జితుడు  - సమస్తమైన ఉపాధులను (ఆధారములను, జాతి గుణ క్రియా సంజ్ఞా రూపమైనవి) వర్జితుడు (వదలినవాడు), విష్ణువు :-
[4-367.1-తే.]

5460} సలలితశ్రీవత్సకలితవక్షుడు  - సలలిత (అందమైన) శ్రీవత్స (శ్రీవత్సము అనెడి పుట్టుమచ్చ) కలిత (కలిగిన) వక్షుడు (వక్షస్థలము కలవాడు) , విష్ణువు :-
[3-922.1-తే.]

5461} సలలితానర్ఘ్యరత్నకుండలకిరీటహారకంకణకటకకేయూరముద్రికాతులాకోటిభూషుడు - సలలితా (అంద మైన) అనర్ఘ్య (వేలకట్టలేని) రత్నములు తాపిన కుండలములు కిరీటములు హారములు కంకణములు కటక (కడియము)లు కేయూర (భుజకీర్తులు) ముద్రికా (ఉంగరములు) తులాకోటి (అందెలు) లతో భూషితుడు (అలంకరింపబడినవాడు), విష్ణువు :-
[3-922.1-తే.]

5462} సవనమయస్తబ్ధరోముడు  - సవన (యజ్ఞ) మయ స్తబ్ధ రోముడు (నిక్కబొడుచుకున్న వెండ్రుకలు గలవాడు , వరాహుడు), విష్ణువు :-
[3-633-క.]

5463} సవనములు+తనున్  - సవనములుదనున్, గసడదవాదేశ సంధి :-
[10.2-1322-క.]

5464} సవితృడు  - ద్వాదశాదిత్యులు పన్నెండుగురులో ఒకడు :-
[6-506.1-ఆ.]

5466} సవిశేషోత్సవసంవిధాత  - సవిశేష (విశిష్టలతోకూడిన) ఉత్సవ (సంతోషమును) సంవిధాత (చక్కగాకలిగించెడివాడు), బ్రహ్మ :-
[7-85-మ.]

5467} సవ్యసాచి  - రెండు చేతులతో బాణములు వేయగలవాడు, అర్జునుడు :-
[11-122-వ.]

5468} సష్టృ  - సృష్టికర్తలు, బ్రహ్మలు, వ్య. సృజ్+తృచ్, సృజతి జగత్ అసౌ, ప్రపంచమును సృష్టించువాడు. బ్రహ్మదేవుడు. :-
[3-248-క.]

5469} సహజకోపనులు  - సహ (కూడా) జ (పుట్టిన) (సహజసిద్ధంగా) కోపనులు (కోప స్వభావము కలవారు), పాములు :-
[10.1-693.1-తే.]

5470} సహజము  - తోడపుట్టినది, స్వభావము. :-
[2-21.1-తే.]

5471} సహస్రకిరణుడు  - సహస్ర (అనంతమైన) కిరణములు కలవాడు, సూర్యుడు :-
[12-44-క.]

5472} సహస్రనయనుడు  - వెయ్యి కన్నులు కలవాడు, ఇంద్రుడు :-
[10.1-1101-వ.]

5473} సహస్రాక్షుడు  - సహస్ర (వేయి 1,000) అక్షుడు (కన్నులు గలవాడు), ఇంద్రుడు :-
[6-437-వ.]

5474} సహిష్ణుడు  - సహజమైన యోర్పు గలవాఁడు, సుఖదుఃఖముల మానావమానముల జ్ఞానాజ్ఞానముల ఎడ మిక్కిలి ఓర్పుగలవాడు, ద్వంద్వాతీతుడు, విష్ణువు :-
[2-236-మ., 4-26-వ., 8-105-మ., 10.1-445-ఉ., 10.1-1182-శా.]

5475} సాంఖ్యము  - సాంఖ్యశాస్త్రము, తత్త్వదర్శనములలో నొకటి, బ్రహ్మజ్ఞానమును ఎంచి లెక్కించి తరచి తరచి చూసెడి మార్గమున అభ్యసించుట. :-
[1-63-వ., 2-5-ఆ., 2-119-చ., 10.1-1474-ఆ.]

5476} సాంఖ్యాయనుడు  - 1. సంకర్షణుడు భాగవతమును సనత్కుమారునికి ఉపదేశించాడు. ఆయన సాంఖ్యాయనునకు, ఆయన పరాశరునికి, ఆయన బృహస్పతికి, ఆయన మైత్రేయునికి ఉపదేశించారు. 2. ఋగ్వేదము చదివిన ఒక ఋషి, :-
[3-268-తే.]

5477} సాందీపని  - 1. బలరామకృష్ణుల గురువు, అవంతి నివాసి. కొడుకు స్నానం చేస్తుంటే పంచజని అను రాక్షసుడు నీటిలోకి ఎత్తుకుపోయాడు. అట్లు మరణించిన కొడుకును బలరామ కృష్ణులు తెచ్చి గురుదక్షిణగా సమర్పించారు. 2. వేదవ్యాసుడు మైత్రేయుడు సాందీపని యీ ముగ్గురును పరాశరమహర్షి శిష్యులు, బాల్యసఖులు :-
[3-121-మ.]

5478} సాంబుడు  - జాంబవతీ కృష్ణుల కొడుకు :-
[10.2-404-వ.]

5479} సాక్షాత్కారము  - భగవంతుడు కంటికెదురుగ అగబడుట, కంటపడుట :-
[4-619.1-తే.]

5480} సాక్షి  - అంటకుండ కనుగొనువాడు, కాల వస్తు స్థితి స్వభావముల ప్రభావములకు లోనుగాక చూచువాడు :-
[10.1-681-వ., 10.2-1230-వ.]

5481} సాగరకన్య  - సాగరము (సముద్రము) యొక్క కన్య (పుత్రిక), లక్ష్మీదేవి :-
[4-586-చ.]

5482} సాగరకన్యక  - సాగరము (సముద్రము) యొక్క కన్యక (పుత్రిక), లక్ష్మీదేవి :-
[3-750.1-తే.]

5483} సాగరకన్యకాకుచకుంకుమాంకితవిపులబాహాంతరుడు  - సాగర (సముద్రము)నకు కన్యకా (పుత్రిక) కుచములకు రాసుకొన్న కుంకుమ అంకిత (అంటిన) విపుల (విస్తారమైన) బాహాంతరము (వక్షము) కలవాడు, విష్ణువు :-
[3-99.1-తే.]

5484} సాగరతనయాహృదీశుఁడు  - సాగరతనయ (లక్ష్మీదేవి) హృదీశుడు (భర్త), విష్ణువు :-
[3-212-చ.]

5485} సాగరతనూజ  - సాగర (సముద్రుని) తనూజ (పుత్రిక), లక్ష్మి :-
[4-555.1-తే.]

5486} సాగరము  - సగరపుత్రులచే తవ్వబడినది, సముద్రము :-
[12-48-వ.]

5487} సాగరమేఖలామహీభరణధురంధురుడు  - సాగర (సముద్రములే) మేఖలా (సరిహద్దులుగా గల) మహీ (భూమండలమును) భరణ (పాలించుటఅను) ధురంధరుడు (భారము వహించు వాడు), రాముడు :-
[4-974-చ.]

5488} సాగిలపడుట  - సాష్టాంగ నమస్కారము చేయుట :-
[10.1-116-ఆ.]

5489} సాగ్నులు  - పంచచత్వారింశత (49) అగ్నులలోని వారు, మంటలతో నుండువారు, సహ+అగ్ని, సహ అగ్నినా, సహ యజ్ఞాగ్నినా, యజ్ఞ అగ్ని కల అగ్నులు? :-
[4-34-వ.]

5490} సాత్యకి  - 1. కృష్ణుని రథ సారథి, 2. శిని కొడుకైన సత్యకుని కొడుకు. :-
[10.2-404-వ.]

5491} సాత్యవతేయుడు  - సత్యవతికి పరాశరుని వలన కలిగిన పుత్రుడు, వ్యాసుడు :-
[3-196-వ., 10.2-766.1-ఆ., 10.2-1117-ఉ.]

5492} సాత్వతాంపతి  - 1. సాత్వతులకు ప్రభువు, 2. కృష్ణుడు సాత్వత వంశములో పుట్టెను :-
[2-236-మ.]

5493} సాత్వతులు - 1. పరబ్రహ్మను భగవంతుడు అనువారు, 2. సత్వగుణులు, 3. బలరాముడు ఆదిగురువుగా ఒక ప్రత్యేకమైన భక్తితత్వాన్ని అవలంభించే యాదవులను సాత్వతులంటారు, 4. కృష్ణునికి 8 తరాల పూర్వపు సాత్వతుని వంశము వారు, (సాత్వతుడు , భజమానుడు , విడూరధుడు , శిని , భోజుడు , హృదీకుడు , శూరుడు (దేవమీఢుడు) , వసుదేవుడు , కృష్ణుడు) :-
[2-59-వ.]

5494} సాత్వికాహంకారము  - సత్త్వగుణముతో కూడిన అహంకారము :-
[3-202-వ.]

5495} సాధనంబులు  - సాధించుటకు ఉపయోగపడునవి, పనిముట్లు :-
[3-1025-వ.]

5496} సాధుసంరక్షణుడు  - సజ్జనులను కాపాడువాడు, కృష్ణుడు. :-
[10.1-951-మ.]

5497} సాధ్యులు  - (1) గణదేవతాభేదము. ధర్మునికి సాధ్యయందు పుట్టినవారు. (సిద్ధిగలవారు అని శబ్దార్థము.) వీరు పన్నిద్దఱు.(2) ద్వాదశ సాధ్యులు 1. మనువు, 2. అనుమంత, 3. ప్రాణుడు, 4. నరుడు, 5. నారాయణుడు, 6. వృత్తి, 7. తపుడు, 8. హయుడు, 9. హంసుడు, 10. ధర్ముడు, 11. విభుడు, 12. ప్రభుడు. [సాం.పు. 18 18] :-
[2-38-వ., 2-274.1-తే.]

5498} సాధ్వి  - పతివ్రత, సాధుస్వభావురాలు, స్త్రీ, సాధు+ఙీప్, సాధు వ్యవహరతి, చక్కగా వ్యవహరించుస్త్రీ. :-
[4-42.1-తే., 4-657.1-తే.]

5499} సామగానములు  - గానము చేయుటకు అనువైన సామవేద మంత్రములు :-
[8-536.1-తే.]

5500} సామజము  - సామవేదముల వలన పుట్టినది, ఏనుగు :-
[10.1-1532-వ.]

5501} సామోపాయము  - (అ)అనుకూలప్రవర్తన, (ఆ)సామము, దానము, భేదము, దండము అను చతురుపాయములలోనిది, ఇది అయిదు విధములు 1పరస్పరోపాకారము కనిపింపజేయుట 2మంచితనము చూపుట 3గుణములను కొనియాడుట 4సంబంధములునెరపుట 5నేను నీవాడనని మంచిమాటలాడుట :-
[8-637-క.]

5502} సాయకము  - అమ్ము, బాణము, వ్యు. పో సో, అంతఃకర్మణి, కృ,ప్ర. చంపునది. :-
[3-469-క.]

5503} సాయము  - సాయంత్రము, సో+ణమ్, స్యతి సమాయతి దినమ్, దినమును సమాప్తి చేయునది. :-
[4-390-వ., 6-507-వ.]

5504} సాయుజ్యము  - సహయోగము చెందుట, సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము, సార్ష్టి అను పంచవిధ మోక్షములలోనిది :-
[12-45-వ., 12-48-వ.]

5505} సారథి  - రథము తోలువాడు :-
[4-327-ఉ.]

5506} సారమేయము  - సరమ యందు కశ్యపునకు పుట్టినది, కుక్క :-
[10.1-1199-వ.]

5507} సారమేయాదనము  - కుక్కలచే శిక్షించుట, నరక విశేషము :-
[5.2-136-వ.]

5508} సారసము  - సరస్సుల ఉండునది, తామర, పద్మము, బెగ్గురు పక్షి :-
[10.1-1101-వ.]

5509} సారసాకరము  - సారస (తామరలకు, బెగ్గురు పక్షులకు) ఆకరము (నెలవైనది), చెరువు :-
[3-513-మ.]

5510} సార్ఙ్గకోదండడు  - సార్ఙ్గ్యము యనెడి ఖడ్గము కోదండము యనెడి విల్లు మొదలగు ఆయుధములు గలవాడు, విష్ణువు :-
[7-171.1-తే.]

5511} సార్వభౌముడు  - సర్వ భూములకు ప్రభువు, చక్రవర్తి :-
[6-455-వ., 6-456.1-ఆ., 10.1-1661-ఆ.]

5512} సాలగ్రామము  - విష్ణుమూర్తి చిహ్నిత శిలావిశేషము, హిమాలయాలలోని గండకీనది (సాలగ్రామమనెడి) యందు లభించు పవిత్రమైన శిలాజములు, :-
[5.1-98.1-తే.]

5513} సాల్వుడు  - సాల్వ దేశపు రాజు, శిశుపాలుని తమ్ముడు, శిశుపాలుని మరణానికి ప్రతీకారానికై శివుని వరంతో సౌంభకము అను విమానము పొంది, దండెత్తగా, కృష్ణుఁడు వీనిని సంహరించెను. :-
[2-190-చ., 10.1-1722-ఉ.]

5514} సావధానము  - అవధరించుటను కలిగిఉండుట, శ్రద్ధ :-
[2-284-వ.]

5515} సావిత్రము  - సవితను ఉపాసించుట :-
[3-388-వ.]

5516} సాష్టాంగదండప్రణామము  - అష్ట (ఎనిమిది 1నుదురు 2కళ్ళు 3ముక్కు 4చెవులు 5 గడ్డము 6రొమ్ము 7ఉదరము 8కాళ్ళు) అంగములతోను దండము (కఱ్ఱ) వలె నేలపై పండుకొని చేయు నమస్కారము :-
[3-751-వ., 3-1027-వ., 4-17-వ., 5.1-146-వ., 7-346-వ., 9-317-వ., 10.2-433-వ., 11-60-వ.]

5517} సింధురభంజనుడు  - సింధుర (కువలయాపీడం అను ఏనుగును) భంజనుడు సంహరించినవాడి, కృష్ణుడు :-
[10.2-918-చ.]

5518} సింధురవైరి  - సింధుర (ఏనుగు, కువలయాపీడం)కు వైరి (శత్రువు), సింహము :-
[10.2-349-ఉ.]

5519} సింహమధ్యముడు  - సింహము వంటి నడుము కలవాడు, కృష్ణుడు :-
[10.1-1467.1-తే.]

5520} సింహాసనము  - 1) రాజు కూర్చొనెడి పీఠము, 2) గుహ (పై పోట్ట యందు పక్కటెముకల క్రింద ఉండు గుహ వంటి (గుండె, హృదయము) స్థానమని యోగశాస్త్రార్థము), ఈ గుహలో ఆసీనుడైన భగవంతుని ధ్యానించుట యోగ సాధనమార్గము లలో ముఖ్యమైనది. ఉదా. నరుల గుహలో నుండు వాడు నృసింహుడు, :-
[2-238-వ., 6-260.1-తే.]

5521} సింహిక  - సింహిక ప్రహ్లాదుని సోదరి, హిరణ్యకశిపుని కూతురు, స్వర్భానుని తల్లి, స్వర్భానుడు దొంగతనంగా అమృతం తాగుతుంటే విష్ణువు చక్రంతో తల నరికాడు అలా రాహువు కేతువులుగా అయ్యి గ్రహాలు అయ్యారు; నీడను బట్టి లాగి మింగే ఆ సింహికను హనుమంతుడు సముద్ర లఘనంలో సంహరించాడు :-
[10.1-1621.1-ఆ.]

5522} సిగ్గు  - స్తుత్యాదులచే కలుగు సంకోచము :-
[10.2-578-వ.]

5523} సితకరిగమనుడు  - సితకరి (తెల్ల ఏనుగు, ఐరావతము) పై గమనడు (తిరుగువాడు), ఇంద్రుడు. :-
[10.1-947-క.]

5524} సితగిరి  - సిత (తెల్లని) గిరి (పర్వతము), కైలాసపర్వతము :-
[6-487-మ.]

5525} సితరాజీవదళనయనుడు  - సిత (తెల్లని) రాజీవ (తామరపువ్వు) దళ (రేకుల) వంటి నయనుడు (కన్నులు గల వాడు), శ్రీరామ :-
[4-1-క.]

5526} సితాంబుజాక్షుడు  - తెల్లని అంబుజ (తామరలవంటి) అక్షుడు కన్నులు కలవాడు, కృష్ణుడు :-
[10.2-677-ఆ.]

5527} సిద్ధరసము  - సిద్ధి (వాంఛిత ప్రాప్తి) కలిగించెడి రసము (ఔషధము, రసాయనము) :-
[5.2-110-వ.]

5528} సిద్ధి  - 1. పరిపక్వము, 2. ఒక గ్రహయోగము. 3. అణిమాదులు సిద్ధించుట. :-
[3-348-ఉ.]

5529} సిద్ధులు  - 1. సిద్ది పొందినవారు, 2. దేవతలలో ఒక తెగవారు. 3. అణిమాది సిద్ధిగలవారు, 4. అతీంద్రియ శక్తులు :-
[2-30-వ., 2-274.1-తే., 10.1-107-క.]

5530} సినివాలి  - చంద్రకళ కాన వచ్చెడి అమావాస్య, అమావాస్యా భేదము, అంతకు ముందు తెల్లవారుఝామున సన్నటి చంద్రరేఖ తూర్పున కనబడు అమావాస్య :-
[4-25-క., 5.2-62-వ., 6-507-వ.]

5531} సిరిపెనిమిటి  - సిరి (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు, కృష్ణుడు :-
[10.2-43-క.]

5532} సీత  - సీత (నాగేటి చాలు)న పుట్టినామె, సీతాదేవి :-
[9-373-ఆ.]

5533} సీతాపతి  - జానకీ వల్లభుడు, రాముడు :-
[11-1-క.]

5534} సీతారామాశ్రమము  - సీతరాములు కొన్నాళ్ళు కాపురమున్న పంచవటిలోని ఒక ప్రదేశము :-
[7-451-వ.]

5535} సీతేశుడు  - సీతాదేవి యొక్క భర్త, రాముడు :-
[10.1-144-క.]

5536} సీరధ్వజుడు  - సీరము (నాగలి) ధ్వజుడు (గుర్తుగా గలవాడు), జనకుడు, సీతాదేవి భర్త :-
[9-373-ఆ.]

5537} సీరి  - సీరము (నాగలి) ఆయుధమును ధరించివాడు, బలరాముడు :-
[10.1-1575-శా., 10.2-293-క., 10.2-486-క.]

5538} సుందరాంగి  - అందమైన అంగి (దేహము) కల స్త్రీ :-
[6-259.1-తే., 10.2-1165.1-తే.]

5539} సుందరాకారుడు  - సుందరమైన ఆకారము కలవాడు , విష్ణువు :-
[3-145.1-తే., 3-924.1-తే.]

5540} సుందరీమానహారుడు  - అందగత్తెల అభిమానమును అపహరించువాడు, రాముడు :-
[9-735-మాలి., 12-53-మాలి.]

5541} సుందరీలోకకాముడు  - సుందర స్త్రీసమూహములకు మన్మథుడు, శ్రీరాముడు :-
[10.2-1342-మాలి.]

5542} సుందరీశంబరారుడు  - సుందరీ (అందమైన వారికి) శంబరారుడు (శంబరాసురుని శత్రువు యైన మన్మథుడు వంటివాడు), రాముడు :-
[4-976-మాలి.]

5543} సుకర్ములు  - మంచి పనులు చేయువారు, పుణ్యాత్ములు :-
[3-511-చ.]

5544} సుకుమారాంగని  - సుకుమారమైన దేహముగల స్త్రీ :-
[6-102-క.]

5545} సుఖము - సుఖతరము సుఖతమము :-
[4-732-వ.]

5546} సుగుణభ్రాజితుడు  - సద్గుణములతో విలసిల్లు వాడు :-
[3-373-మ.]

5547} సుగుణములు  - శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము ఆది గొప్ప మంచి గుణములు :-
[10.1-112.1-తే., 10.1-1682-మ.]

5548} సుగుణవనవిహారుడు  - సుగుణముల వన (సమూహము) నందు విహరించువాడు, రాముడు :-
[9-735-మాలి., 12-53-మాలి.]

5549} సుగుణస్తోముడు  - సుగుణముల సమూహము గలవాడు, పరశురాముడు :-
[6-305-క.]

5550} సుగుణుడు  - సుగుణములు గలవాడ, విష్ణువు :-
[4-920-ఉ.]

5551} సుగుణోత్తముడు  - సుగుణములు గల ఉత్తముడు, విష్ణువు :-
[8-92-ఉ.]

5552} సుచికాంగహారము  - అభిప్రాయమును సూచించునవి, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

5553} సుత్య  - సుత్యస్నపనము, స్నానము, సోమలతను కొట్టిపిడుచుట, సోమపానము (అని కొంధఱు) :-
[8-638-వ.]

5554} సుత్రాముడు  - లోకములను లెస్సగా రక్షించువాడు, ఇంద్రుడు :-
[2-160-క., 10.2-949-క.]

5555} సుదతి  - మంచి పలువరుస కల స్త్రీ :-
[4-747-వ., 4-790-వ., 10.1-184-ఆ., 10.1-317-క., 10.1-860-క., 10.2-117-మ., 11-20-ఉ.]

5556} సుదర్శనకరుడు  - సుదర్శన చక్రము చేతకలవాడు, విష్ణువు :-
[3-748-క.]

5557} సుదర్శనధరుడు  - సుదర్శనము అను చక్రాయుధము ధరించువాడు, విష్ణువు :-
[10.1-727-వ.]

5558} సుదర్శనాయుధుడు  - సుదర్శన మను చక్రాయుధము కలవాడు, విష్ణువు, కృష్ణుడు :-
[10.1-1736-ఉ.]

5559} సుదాంశుడు  - అమృతము వంటి కిరణములు కలవాడు, చంద్రుడు :-
[10.2-640-చ.]

5560} సుదాముడు  - సు (మంచి) దామములు (దండలు) వాడు, మాలాకారుడు, శ్రీకృష్ణునకు మంచి మాలలను ఇచ్చిన మధురానగరములోని మాలాకారుడు :-
[10.1-1267-వ.]

5561} సుదేవుడు  - మంచిదేవుడు, యజ్ఞుడు దక్షిణలకు పుట్టిన పన్నెండుగురు కొడుకులలో చిన్నవాడు. వీరు యామ నామ దేవతలు. :-
[4-6-వ.]

5562} సుధర్మసభ  - ఇంద్రుడు కృష్ణునికి గోవర్ధనగిరి ధరించిన పిమ్మట బహూకరించిన దేవ సభ :-
[10.2-393-వ.]

5563} సుధాంధసమౌనిమనోజ్ఞఖేలనుడు  - సుంధాంధస (దేవతల) మౌని (మునుల)కు మనోజ్ఞ (ప్రియముగ) ఖేలనుడు (క్రీడించువాడు), రాముడు) :-
[7-482-చ.]

5564} సుధాంధసులు  - సుధా (అమృతమును) అంధసులు (అన్నముగా కలవారు), దేవతలు :-
[1-184-మ., 8-109-మ.]

5565} సుధాంధువులు - సుధ (అమృతము)ను అంధుస్సు (అన్నము)గా కలవారు, దేవతలు :-
[8-66-ఆ.]

5566} సుధాంశుడు  - సుధ (అమృతము) అంశుడు (అంశగా గలవాడు), చంద్రుడు :-
[6-384-ఉ.]

5567} సుధాంశుమౌళి  - సుధాంశువు (చంద్రుని) మౌళి (శిరోలంకారముగా ధరించినవాడు), శివుడు :-
[4-933-చ.]

5568} సుధాకరార్కసునేత్రుడు  - సుధాకర (చంద్రుడు) అర్క (సూర్యుడు) సు (చక్కగా) నేత్రుడు (కన్నులుగా కలవాడు), విష్ణువు, కృష్ణుడు :-
[5.2-167-మత్త.]

5569} సుధాకరుడు  - సుధ (వెన్నెల)ని ఆకరుడు (కలుగ జేయువాడు), సుధా (అముతముతో కూడిన) కరుడు (కిరణములు కలవాడు), చంద్రుడు :-
[1-521-వ., 3-535-చ., 4-567-వ.]

5570} సుధాశనముఖ్యస్తుతిపాత్రుడు  - సుధాశన (దేవతలు) ముఖ్య (మొదలగువారి)చే స్తుతింపబడుటకు పాత్రుడు (అర్హుడు), విష్ణువు :-
[3-284-మ.]

5571} సుధాశనరిపుఖండనుడు  - సుధాశనరిపు (రాక్షసులను) ఖండనుడు (సంహరించిన వాడు), బలరాముడు :-
[10.2-489-కవి.]

5572} సుధాశనవంద్యుడు  - సుధాశన (దేవతలు)కు వంద్యుడు (వందనము చేయతగ్గవాడు), విష్ణువు :-
[3-315-మ.]

5573} సుధాశనులు  - సుధ (అమృతము) అశనము (భోజనము) గా గలవారు, దేవతలు :-
[3-338-క., 10.2-347.1-తే.]

5574} సుధాహారులు  - సుధ (అమృతము) ఆహారులు (భోజనముగా గలవారు), దేవతలు :-
[10.2-628-క.]

5575} సుధీజనతావనుడు  - సుధీ (మంచి) జనతా (జనుల యొక్క) అవనుడు (రక్షకుడు), విష్ణువు :-
[3-570-ఉ.]

5576} సుధీవరుడు  - శ్రేష్ఠమైన జ్ఞానవంతుడు, కృష్ణుడు :-
[10.2-1185-చ.]

5577} సునందము  - బలరాముని ముసలాయుధము పేరు, సుందరము ఆనందము కలుగజేయునది. :-
[10.2-551-చ.]

5578} సునందాదిపరిజనులు  - సునంద, నంద, జయ, విజయ, జయంత మున్నగు విష్ణుమూర్తి పరిజనులు :-
[10.2-1313-వ.]

5579} సునాభాస్త్రుడు  - సునాభము(అను చక్రము) ఆయుధముగా గలవాడు, విష్ణువు :-
[3-101-మ.]

5580} సునాసీరుడు  - శ్రేష్ఠమైన సేనాగ్రభాగము కలవాడు, ఇంద్రుడు, సు+నా+సీర, సుష్ఠు నాసీరః సైన్యాగ్రం యస్య. :-
[11-69-వ.]

5581} సునీతి  - ధ్రువుని తల్లి, ఉత్తానపాదుని పెద్దభార్య, సునీతి (ధర్మము కలామె) :-
[4-218-క.]

5582} సునీథ  - పుణ్యాత్మురాలు, ధార్మికురాలు, మంచిది, సు + నీ (ప్రాపణే) థక్, కృప్ర., ధర్మశీలన కలామె (ఆంధ్ర శబ్ధాకరము) :-
[4-390-వ.]

5583} సుపర్ణుడు  - సు (మంచి) పర్ణుడు (రెక్కలుకలవాడు) గరుత్మంతుడు :-
[4-166-చ., 4-502-వ.]

5584} సుపర్యారాతి  - సుపర్వులు (దేవతలు)కు ఆరాతి (శత్రువు), హిరణ్యకశిపుడు :-
[7-105-వ.]

5585} సుపర్వమహీజము  - సుపర్వు (దేవత)ల మహీజము (చెట్టు), కల్పవృక్షము :-
[3-442-ఉ.]

5586} సుపర్వులు  - మంచి పుణ్యులు, దేవతలు :-
[2-223.1-తే., 3-722-వ., 10.1-1188-ఉ.]

5587} సుభగయోగసమాధినిష్ఠుడు  - సౌభాగ్యములకైన యోగసమాధి యందు నిష్ఠలో యుండువాడు :-
[4-680.1-తే.]

5588} సుభగుడు  - సౌభాగ్యస్వరూపుడు, సౌభాగ్యము కలవాడు, కృష్ణుడు :-
[1-242-ఉ., 3-99.1-తే.]

5589} సుభిక్షము  - సు (చక్కటి) భిక్షము దొరకునది, సుసంపన్నము :-
[5.1-60-వ.]

5590} సుమనుస్సులు  - మంచి మనసున్నవారు, దేవతలు :-
[1-39-వ.]

5591} సుమనోగణములు  - దేవగణములు ఇవి ఇంద్రియ అధిదేవతలు మొదలగునవి :-
[3-344-వ.]

5592} సుమాస్త్రుడు  - పూలబాణముల వాడు, మన్మథుడు :-
[6-106-క.]