పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (ఫణి - భీష్ణుడు)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


3458} ఫణి  - ఫణములు (పడగలు) కలది, సర్పము :-
[10.1-1515-మ.]

3459} ఫణిపతి  - ఫణి (సర్పములకు) పతి (రాజు), ఆదిశేషుడు :-
[7-120-క.]

3460} ఫణిరాజమండనుడు  - ఫణి (సర్పములలో) రాజ (శ్రేష్ఠములచే) మండన (అలంకరింపబడిన వాడు), శివుడు :-
[8-49.1-ఆ.]

3461} ఫణిరాజు  - సర్పములకు రాజు, ఆదిశేషువు :-
[2-265.1-తే., 3-309.1-తే., 3-413.1-తే.]

3462} ఫలము  - ఫలితము :-
[3-401-చ.]

3463} ఫలి  - ఫలములనిచ్చునది, చెట్టు :-
[10.2-94-క.]

3464} ఫల్గున  - ఉత్తర ఫల్గుని నక్షత్రము నందు పుట్టినవాడు, వేగముగా పాదరసం వలె ప్రసరించువాడ, అర్జున :-
[1-371-క.]

3465} ఫాలక్షుడు - నుదుట కన్ను కలవాడ, శివుడు, అహంకారేంద్రియమునకు అధిదేవత :-
[10.1-572.1-తే.]

3466} ఫాలనయనుడు  - ఫాల (నుదుట) నయనుడు (కన్నుగలవాడు), శివుడు. :-
[8-227-ఆ., 10.2-832-క.]

3467} ఫాలలోచనుడు  - ఫాలము (నుదురు) యందు లోచనుండు (కన్ను కలవాడు), శివుడు :-
[4-170-వ., 10.2-352-మ., 10.2-1241-వ.]

3468} ఫాలాక్షుడు  - ఫాలమున (నుదుట) అక్షుడు (కన్ను గలవాడు), శివుడు :-
[1-366.1-ఆ., 8-177-క., 9-229-ఆ., 10.1-1334-మ., 12-36-మ.]

3469} ఫుల్లసరోజపత్రనేత్రుడు  - వికసించిన (ఫుల్ల) పద్మముల (సరోజ) రేకులు (పత్ర)వంటి నేత్రములు కలవాడు, విష్ణువు :-
[3-236-చ.]

3470} ఫుల్లసరోరుహపత్రనేత్రుడు  - ఫుల్లన్ (వికసించిన) సరోరుహ పత్రము (తామర రేకు)లవంటి నేత్రుడు (కన్నులు) ఉన్నవాడు, విష్ణువు :-
[3-595-ఉ.]

3471} బంతెనగుండ్లు  - భోజనపంక్తిలో ఒకరికొకరు విసరుకొను బంతి+ఎన+గుండ్లు, గుండులు (బంతుల వంటి అన్నపు ముద్దలు) :-
[10.1-496.1-ఆ.]

3472} బంధుపోషప్రవర్తి  - ఆత్మీయులను పోషించెడి వాడు, శ్రీరాముడు :-
[8-744-మాలి.]

3473} బంధురము - బంధురతరము బంధురతమము :-
[10.1-1542-క.]

3474} బకవైరి  - బకాసురుని శత్రువు, కృష్ణుడు :-
[10.1-465-క.]

3475} బకారాతి  - బకాసురుని శత్రువు, కృష్ణుడు :-
[10.1-1126-శా.]

3476} బకాసురుడు  - అతి పెద్ద బకము (కొంగ) రూపమున బాల కృష్ణుని వధించవచ్చిన వాడు :-
[2-190-చ.]

3477} బదరి  - రేగుచెట్టు, ఒక పుణ్యక్షేత్రం :-
[3-171-వ.]

3478} బదరిక  - రేగుపళ్ళు, రేగుచెట్టు :-
[2-127-క., 3-160-మ.]

3479} బదరికాశ్రమము  - రేగు చెట్లవనమున కల ఆశ్రమము, వ్యాసుడు ఉండు ఆశ్రమము :-
[3-174-క.]

3480} బదరీ  - రేగుపళ్ళు :-
[2-126-క.]

3481} బద్దుడు  - ప్రకృతి పాశములచేత కట్టుబడువాడు, మాయకు లోబడువాడు :-
[10.1-683-వ.]

3482} బయలాలకించు  - బయలు (శూన్యములోనికి) ఆలకించు (విను), నిశ్చేష్టమగు :-
[8-93-వ.]

3483} బర్హిర్ముఖుడు  - వ్యు. (బర్హిః ముఖమ్ అస్య ), బ.వ్రీ., నోటియందు అగ్ని కల దేవత, (శబ్దరత్నాకరము) అగ్నిదేవుడు :-
[3-612-వ.]

3484} బర్హిషదులు  - పంచచత్వారింశత (49) అగ్నులలోని వారు, బర్హి (దర్భ)లందు ఉండు అగ్నులు? :-
[4-34-వ.]

3485} బర్హిష్మదుడు  - దర్భలు కలిగి మిక్కిలిన వాడు, యజించువాడు :-
[4-679-వ.]

3486} బలభిత్తు  - బలాసురుని ధ్వంసము చేసినవాడు, ఇంద్రుడు :-
[12-36-మ.]

3487} బలభేది  - బల (బలాసురుని) భేదించిన (సంహరించిన) వాడు, ఇంద్రుడు :-
[1-39-వ., 6-430-వ., 11-64-తే.]

3488} బలరాముడు  - బలముచే రమింపజేయువాడు, కృష్ణుని అన్న :-
[10.1-1556-చ.]

3489} బలరిపుడు  - బలాసురుని శత్రువు, ఇంద్రుడు :-
[10.1-738-క., 10.1-925-క.]

3490} బలసూదనుడు  - బలాసురుని సంహరించిన వాడు, ఇంద్రుడు :-
[10.1-740-క.]

3491} బలానుజుడు  - బలరాముని సోదరుడు, కృష్ణుడు :-
[10.1-1348-వ.]

3492} బలాభీలహరి  - బలుడు అభీలుడను రాక్షసులను హరి (సంహరించిన వాడు), విష్ణువు :-
[6-33-క.]

3493} బలారాతి  - బలి యొక్క అరాతి (శత్రువు), ఇంద్రుడు :-
[8-182-వ.]

3494} బలారి  - బలి (బలాసురుని) శత్రువు, ఇంద్రుడు :-
[10.1-936-మ.]

3495} బలి  - 1. కోరికలు తీర్చుటకు పెట్టునవి, 2. దైత్యఛక్రవర్తి :-
[10.2-249-వ.]

3496} బలిచక్రవర్తి  - దైత్య ఛక్రవర్తి, వామనునకు దానమిచ్చిన మహాదానశీలి, ప్రహ్లాదుని మనుమడు. :-
[2-204.1-తే.]

3497} బలినందనుడు  - బలిచక్రవర్తి యొక్క కొడుకు, బాణుడు. :-
[10.2-318-వ.]

3498} బలిభంజనుడు  - బలిని శిక్షించిన వాడు, వామనుడు :-
[10.1-905-వ.]

3499} బలివిద్వేషి  - బలికి శత్రువు, ఇంద్రుడు :-
[8-487-మ.]

3500} బలుడు  - బలము కలవాడు, బలరాముడు :-
[10.1-1577-ఉ.]

3501} బహిరంగవీధులు  - అంతర బాహ్య శబ్ద దృశ్యాది విషయ పంచక మార్గములు, బాహ్యప్రదేశములు :-
[10.1-553.1-ఆ.]

3502} బహిరన్తరాత్మ  - పరమాత్మ మరియు అంతరాత్మ అయినవాడు, విష్ణువు :-
[4-704-తే.]

3503} బహు - బహుతర బహుతమ :-
[9-327.1-తే.]

3504} బహు - బహుతరము బహుతమము :-
[7-217-వ., 10.1-762.1-తే.]

3505} బహుజగదవనుడు  - అనేక లోకములను రక్షించువాడు, విష్ణువు :-
[10.1-1629.1-తే.]

3506} బహుతరధృతి  - బహుతర (అనేకమైన) ధృతి (ధీరత్వం కల వాడు), విష్ణువు :-
[6-32-క.]

3507} బహుపాదులు  - అనేక పాదములు కలవి, కీటకాదులు :-
[4-853-వ., 11-91-వ.]

3508} బహుప్రభావప్రతీతుడు  - క. నానా దేహోపాధుల, నానాత్వ భ్రాంతినొంది నానీదనుచున్, నానాభిమానములచే, నానావిభవంబులాయె నారాయణుఁడే (రామస్తవరాజము) :-
[10.1-683-వ.]

3509} బహురసాన్నములు  - అనేకమైన రస (రుచులు) కలిగిన ఆహార పదార్థములు, షడ్రసోపేతములు :-
[10.1-889.1-తే.]

3510} బహుళము - బహుళతరము బహుళతమము :-
[7-464.1-తే., 10.1-1677-వ.]

3511} బహుసన్నుతలోకాళి  - బహు (అనేకమైన) సన్నుత (స్తుతించెడి) లోక (లోకముల) ఆళి (సమూహములు గలామె), పార్వతి :-
[6-7-క.]

3512} బాణదనుజేంద్రకూఁతుపతి  - బాణాసుర పుత్రిక (ఉషాకన్య) పతి, అనిరుద్ధుడు :-
[1-348.1-తే.]

3513} బాణుడు  - 1. హర్షచరిత్ర, చండికా శతకము, పార్వతీ పరిణయం మున్నగునవి వ్రాసిన హర్షవర్థనుని ఆస్థాన కవి, 2. బలి పెద్దకొడుకు, ఇతని కూతురు ఉషాకన్య కలలో చూసి అనిరుద్ధుని వరించింది. :-
[6-11.1-తే.]

3514} బాదరాయణి  - బదరీవనమున ఉండువాడు బాదరాయణుడు (వ్యాసమహర్షి) వారి పుత్రుడు బాదరాయణి (శుకమహర్షి) :-
[1-55-మ., 1-140-క., 3-11-చ., 3-78-క., 5.2-3-క., 6-444-వ., 8-693-వ., 10.2-1203-వ., 10.2-1338-క., 11-26-వ.]

3515} బాదరాయణుడు  - బదరీవనములో నుండు వాడు, వ్యాసుడు :-
[1-136-వ., 1-206-వ., 2-257.1-తే., 3-234-వ., 9-669-ఉ.]

3516} బారువ  - ఇరవై (20) మణుగుల బరువు, ఒక మణుగు ఎనిమిది వీశల బరువు :-
[10.2-51-వ.]

3517} బాలచంద్రభూషణుడు  - బాలచంద్రుడు (చంద్రవంక) భూషణముగ కలవాడు, శివుడు :-
[4-138.1-తే.]

3518} బాలుడు  - విష్ణువు లోకోత్పత్తి కారణమైన ప్రథమస్ఫురణ రూపమైనవాడు కనుక బాలుడు :-
[10.1-901-క.]

3519} బాలేందుముఖి  - బాల ఇందు (బాల చంద్రుని వంటి) ముఖి (మోముకలామె), స్త్రీ. :-
[4-746.1-తే.]

3520} బాలేందురేఖ  - నెల మొదటిరోజు (అమావాశ్య వెళ్ళిన పాడ్యమి నాటి) చంద్రబింబము యొక్క వంక, నెలవంక :-
[10.1-1688-క.]

3521} బాల్యము  - 1 నుండి 5 సం., కౌమారము, పసితనము :-
[10.1-1392.1-తే.]

3522} బావ  - భార్య/ భర్త యొక్క అన్న, మేనత్త మేనమామల పుత్రుడు. :-
[10.2-304-క.]

3523} బాహ్యేంద్రియములు  - వెలుపలి కన్ను మొదలగు పంచేంద్రియములు :-
[3-180.1-తే.]

3524} బిందువు  - ఓం లోని ఓ తరువాతి పూర్ణానుస్వారం :-
[7-467-వ.]

3525} బింబోష్ఠి  - దొండపండు వంటి పెదవి కలామె, స్త్రీ :-
[10.2-212.1-ఆ.]

3526} బిలము  - భూమి లేదా కొండల యందలి ఖాళీస్థలము లేదా కన్నము. గుహ, రంద్రము :-
[5.2-105-వ.]

3527} బిసరుహనేత్రుడు  - బిసరుహము (పద్మము) లవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-693-క.]

3528} బిసరుహసంభవుడు  - బిసరుహము (పద్మము)న సంభవుడు (జనించినవాడు), బ్రహ్మ :-
[5.2-100-క.]

3529} బీజన్యాసముచేయుట  - ద్వాదశాక్షరి (ఓంనమో భగవతే వాసుదేవాయః) మున్నగు జప మంత్రమును ప్రణవాదిగా అంగన్యాస సహితంగా (లలాటాది స్థానములను తాకుట కలదిగా) ఆచరించుట :-
[10.1-236-వ.]

3530} బీడు  - నిస్సారమైన భూమి, దున్ననిభూమి :-
[9-281-క.]

3531} బీష్మకవరపుత్రి  - భీష్మకుని ఉత్తమమైన కుమార్తె, రుక్మిణి :-
[10.2-243-క.]

3532} బుద్ధి - మతి (దీని లక్షణములు 1శుశ్రూష 2శ్రవణము 3గ్రహణము 4ధారణము 5ఊహము 6అపోహము 7అర్థవిజ్ఞానము 8తత్త్వజ్ఞానము) :-
[6-307-వ.]

3533} బుద్ధి  - నిశ్చయాత్మకమైన అంతఃకరణము, మతి (దీని లక్షణములు 1శుశ్రూష 2శ్రవణము 3గ్రహణము 4ధారణము 5ఊహము 6అపోహము 7అర్థవిజ్ఞానము 8తత్త్వజ్ఞానము) :-
[10.1-682.1-తే., 10.1-1472.1-తే., 10.2-1203-వ.]

3534} బుద్ధుడు  - శాక్యముని, జ్ఞానోదయము పొందిన శుద్ధోదనుడు, బుద్ధావతారము, 1ఆదిబుద్దుడు ఋషభుడు (సుగతుడు), 2రెండవ బుద్ధుడు భరతుడు (సద్గతుడు), 3మూడవ బుద్ధుడు సుమతి (రెండవ సుగతుడు), ... 6ఆరవ బుద్ధుడు గౌతమ బుద్దుడు (తథాగతుడు), 7ఏడవ బుద్ధుడు మైత్రేయ బుద్ధుడు (భవిష్యత్తులో రాబోవువాడు) :-
[5.2-5-క., 10.1-1236-దం.]

3535} బుధమాన్యచరిత్రపవిత్రుడు  - బుధ (మంచివారి)చే మన్నింపబడు చరితము (వర్తనము) వలన పరిశుద్ధమైనవాడు, విష్ణువు :-
[3-212-చ.]

3536} బుధవంద్యుడు  - బుధులచే నమస్కరింపబడువాడు, బ్రహ్మదేవుడు :-
[3-335-ఉ.]

3537} బుధాగ్రగణ్యుడు  - బుధ (జ్ఞానులలో) అగ్రగణ్య (మొదటి లెక్కించ బడువాడు, శ్రేష్ఠుడు), కృష్ణుడు. :-
[10.2-108.1-తే.]

3538} బృందావనభాసురుడు  - బృందావనమునందు ప్రకాశించువాడు, శ్రీకృష్ణుడు :-
[5.1-181-మ.]

3539} బృందావనము  - 1. బృంద (సమూహము) ఆవనము (రక్షించుట), 2. బృంద (తులసి) వనము (తోట), 3. యమున ఈవలి ఒడ్డున పశ్చిమతీరమున మధుర దగ్గఱ బృందావనం ఉంది. ఆవలి ఒడ్డున (అనఁగా యమున తూర్పు గట్టున) గోకులము ఉంది. అక్కడ కృష్ణుడు గోపకన్యకలతో అనేకలీలలు సలిపాడు. :-
[2-188.1-తే.]

3540} బృహత్కాలము  - దినములోని భాగములు సూక్ష్మకాలములు, వాటికి పెద్దవి బృహత్కాలములు :-
[2-222-వ.]

3541} బృహస్పతి  - బ్రహ్మవిద్యకు అధిపతి, దేవతలకు గురువు :-
[4-26-వ.]

3542} బృహస్పతిసవనము  - వాగుచ్ఛారణ ప్రధానమైన యాగము :-
[4-54-వ.]

3543} బేతాళ  - పిశాచ భేదము. భూతావశిష్ట మృత శరీరము :-
[2-274.1-తే., 10.1-1757-వ., 10.2-418-వ.]

3544} బోధ  - పరమాత్మ స్వస్వరూపమై తెలిసి యుండుట, జ్ఞానము :-
[10.1-567.1-ఆ.]

3545} బోరగిలపడుట  - బోర (పొట్ట) కిందపడేలా పడుట, బోర్లాపడుట :-
[10.2-943-చ.]

3546} బ్రహ్మ - బృహిర్బహ్మ వృద్ధౌ బృహతేర్ధాతోః అర్థానుగమాత్ దేశతః కాలతః స్వరూపతః అపరిచ్ఛిన్నం యద్వస్తు తద్బ్రహ్మ (వ్యుత్పత్తి), శ్రీకృష్ణుడు :-
[10.1-942-ఆ.]

3547} బ్రహ్మకూకటిముట్టెదను  - 1. బ్రహ్మయొక్క జుట్టును అందుకొనెదను, 2. అంతెత్తు ఆనందం పొందెదను 3. మహానందపడెదను :-
[8-566-ఆ.]

3548} బ్రహ్మగాయత్రి  - ప్రణవము, ఓంకారము :-
[3-471-వ.]

3549} బ్రహ్మచర్యాది  - చతురాశ్రమములు, బ్రహ్మచర్య గృహస్త వానప్రస్త సన్యాస ఆశ్రమములు :-
[2-222-వ.]

3550} బ్రహ్మణ్యత  - బ్రహ్మ(వేదము)లను అనుసరించి జీవించుట, బ్రాహ్మణుల యెడ హితవు :-
[1-403-వ.]

3551} బ్రహ్మదండనము  - బ్రహ్మ (అతి పెద్దదైన) దండనము (శిక్ష), మరణశిక్ష :-
[4-393-వ.]

3552} బ్రహ్మదేవుడు  - బుద్ధీంద్రియమునకు అధిదేవత, జగత్తు సృష్టికర్త :-
[10.1-572.1-తే.]

3553} బ్రహ్మదేవునిపదుగురుకొడుకులు  - 1 అంగుష్టమున, దక్షుడు 2 ఊరువుల, నారదుడు 3 నాభిన, పులహుడు 4 కర్ణముల, పులస్త్యుడు 5 త్వక్కున, భృగువు 6 హస్తమున, క్రతువు 7 నాస్యంబున, అంగిరసుడు 8 ప్రాణమున, వసిష్టుడు 9 మనమున, మరీచుడు 10 కన్నుల అత్రి పుట్టిరి. :-
[3-376-తే.]

3554} బ్రహ్మనగరంబు  - బ్రహ్మదేవుని పట్టణము, సత్యవతి :-
[10.1-1593-ఆ.]

3555} బ్రహ్మపుత్రుడు - నారదుడు, బ్రహ్మదేవుని మానస పుత్రుడు :-
[7-476-వ.]

3556} బ్రహ్మబంధుడు  - బ్రష్టుపట్టిన బ్రాహ్మణునికి వాడే జాతీయము :-
[4-101.1-తే.]

3557} బ్రహ్మమయుడు - బ్రహ్మ స్వరూపుడు, శివుని. :-
[4-138.1-తే.]

3558} బ్రహ్మము  - 1. దేశకాలవస్తువులచే విభాగింపరానిది, పరబ్రహ్మము, భగవంతుడు, 2. పరబ్రహ్మ స్వరూపుడు, విష్ణువు :-
[2-210-ఉ., 3-720.1-తే., 4-195-చ., 7-478-మ., 10.1-962-మ.]

3559} బ్రహ్మరంధ్రము - నడినెత్తిన మాడుపట్టు వద్ద ఉండునది :-
[2-29.1-ఆ.]

3560} బ్రహ్మరాతుడు  - బ్రహ్మముచే అనుగ్రహింపబడిన వాడు, శుకబ్రహ్మ :-
[2-222-వ.]

3561} బ్రహ్మలు  - బ్రహ్మజ్ఞాన స్వరూపులైన గణదేవతా విశేషము. నవబ్రహ్మలు 1 మరీచి 2 భరద్వాజుడు 3 అంగీరసుడు 4 పులస్త్యుడు 5 పులహుడు 6 క్రతువు 7 దక్షుడు 8 వశిష్టుడు 9 వామదేవుడు, పాఠ్యంతరములు కలవు :-
[3-150-వ.]

3562} బ్రహ్మవేత్తలు  - వేద ధర్మములు బాగుగనెరినవారు, బ్రాహ్మణులు, శ్రు. బ్రహ్మై వేద బ్రహ్మవిద్భవతి, బ్రహ్మవేత్తలు బ్రహ్మమే (నీ స్వరూపులే) ఐయున్నారు :-
[4-465.1-తే., 10.1-577-క.]

3563} బ్రహ్మహత్య  - బ్రాహ్మణుని చంపుట, పంచ మహా పాతకములలో ఒకటి (1స్వర్ణస్తేయము 2సురాపానము 3బ్రహ్మహత్య 4గురుపత్నీగమనము 5ఇవి చేసేవారితో స్నేహము) :-
[6-316-వ., 10.2-931-క.]

3564} బ్రహ్మాండభాండము  - సకల లోకములు కల బ్రహ్మాండాలు తనలో గల అతి పెద్దదైన అండ స్వరూప భాండము :-
[6-307-వ.]

3565} బ్రహ్మాండము  - ఒక పెద్ద గుడ్డు ఆకారమున ఉండు భూగోళ ఖగోళాదికములు కల పెద్ద అండము (గోళము) :-
[5.2-75-వ., 10.1-340-క., 10.1-916-క.]

3566} బ్రహ్మాత్ముడు  - బ్రహ్మపదార్థమే తానైన వాడు :-
[2-110-మ.]

3567} బ్రహ్మావర్తము  - బ్రహ్మ జ్ఞానులు తిరిగెడి నేల, సరస్వతీ దృషద్వతీ నదులకు నడిమి దేశము, ప్రస్తుతపు ఢిల్లీ నగరమునకు వాయవ్యభాగపు దేశ విశేషము. :-
[5.1-64-వ.]

3568} బ్రాహ్మణాదులు  - చతుర్వర్ణములు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములు :-
[2-222-వ.]

3569} బ్రాహ్మణాననుడు  - బ్రాహ్మణులే అననుడు (ముఖముగా, నోరుగా గలవాడు), విష్ణువు :-
[7-448-వ.]

3570} బ్రాహ్మణుడు  - వ్యుత్పత్తి, బ్రహ్మణి పరబ్రహ్మణి నిష్ఠావత్త్వాత్ బ్రాహ్మణః. బ్రహ్మదేవుని ఉత్కృష్టమైన దైవమనెడి నిష్ఠ యందుండువాడు, విప్రుడు :-
[10.1-889.1-తే.]

3571} బ్రాహ్మబంధువు  - భ్రష్టుడైన బ్రాహ్మణునకు జాతీయము :-
[1-171-ఉ.]

3572} బ్రాహ్మి  - బ్రహ్మ దేవుని భార్య, సరస్వతి :-
[1-7-శా.]

3573} భక్తకల్పకుడు  - భక్తులకు కల్పవృక్షమువంటి వాడు, విష్ణువు. :-
[4-730-చ.]

3574} భక్తకల్మషవల్లికాపటులవిత్రుడు  - భక్త (భక్తుల యొక్క) కల్మష (పాపములు) యనెడి వల్లికా (లతలకు) పటు (గట్టి) లవిత్ర (కొడవలివంటివాడు), విష్ణువు. :-
[7-376.1-తే.]

3575} భక్తజననుతగాత్రుడు  - భక్తజన (భక్తులైనవారి)చేత నుత (స్తోత్రములు)చేయబడుతున్న గాత్రుడు (దేహము కలవాడ), శ్రీకృష్ణ. :-
[5.1-182-క.]

3576} భక్తజనపోషణభూషణుడు  - భక్తులైనవారిని కాపాడుట అను భూషణములు కలవాడు, శ్రీరాముడు :-
[10.2-1340-చ.]

3577} భక్తజనపోషపరితోషుడు  - భక్తులు అయిన జనులను పోషించుట యందు సంతోషము కలవాడు, విష్ణువు :-
[3-308.1-తే.]

3578} భక్తజనపోషుడు  - భక్తులయినవారిని కాపాడువాడ, శివుడు :-
[4-147.1-తే.]

3579} భక్తజనబృందప్రాభవాలంకరిష్ణుడు  - భక్తజనుల బృంద (సమూహములను) ప్రాభవ (గొప్పదనము)తో అలంకరిష్ణుడు (అలంకరించెడి వాడు), విష్ణువు :-
[8-105-మ.]

3580} భక్తజనలోకమందార  - భక్తులైనజనులు సమస్తమునకు కల్పవృక్షమువంటివాడు, విష్ణువు :-
[4-555.1-తే.]

3581} భక్తజనానురూపసందర్శనుడు  - భక్తులు ఐన జనులకు అను(ధ్యానించిన)రూపమున సందర్శనుండు (చక్కగా కనిపించువాడు), విష్ణువు :-
[3-722-వ.]

3582} భక్తజనార్తిహరుండు  - భక్తులైనవారి ఆర్తి (బాధలను) హరించువాడు, విష్ణువు :-
[4-347.1-తే.]

3583} భక్తజలధితరంగుడు  - భక్త (భక్తులు అనెడి) జలధి (సముద్రపు) తరంగుడు (కెరటములు గలవాడు), రాముడు :-
[4-975-క.]

3584} భక్తనతపదయుగళుడు  - భక్తులుచే నుతింపబడు పాదముల జంట కలవాడు, విష్ణువు. :-
[11-108-క.]

3585} భక్తనిధానుడు  - భక్తులకు నిధానుడు (నిధియైనవాడు), కృష్ణుడు :-
[5.2-167-మత్త.]

3586} భక్తపరతంత్రుడు  - భక్తుల యెడ సాభిప్రాయము కలవాడు, విష్ణువు :-
[10.2-204-చ.]

3587} భక్తపరిపాలుడు  - భక్తులను చక్కగా పాలించువాడు, విష్ణువు :-
[3-523-చ.]

3588} భక్తపాలనకరుడు  - భక్తులను పాలించుట చేయువాడు, విష్ణువు :-
[4-937-త.]

3589} భక్తపాలనుడు  - భక్త (భక్తులను) పాలన (పోషణ చేసెడివాడు), రాముడు. :-
[4-974-చ., 10.2-315-ఉ.]

3590} భక్తప్రపోషుడు  - భక్తులను చక్కగా పోషించువాడు, విష్ణువు :-
[3-922.1-తే.]

3591} భక్తప్రసన్నుడు  - భక్తుల యెడ ప్రసన్నముగ యుండువాడు, శివుడు :-
[4-138.1-తే., 4-173.1-తే.]

3592} భక్తఫలప్రదాయకుడు  - భక్త(భక్తులకు) ఫల (మంచి ఫలితములను) ప్రదాయకుడు (చక్కగా యిచ్చువాడ), విష్ణువు. :-
[3-312-చ., 4-922-చ.]

3593} భక్తమందారుడు  - భక్తుల ఎడ కల్పవృక్షము వంటివాడు, కృష్ణుడు :-
[3-304.1-తే., 10.2-257.1-తే.]

3594} భక్తమానసవశంకరుడు  - భక్తుల మనసులను వశపరచుకొనువాడు, శివుడు :-
[10.2-315-ఉ.]

3595} భక్తమిత్రుడు  - భక్తులకు ఆప్తుడు, విష్ణువు. :-
[10.1-407-ఉపేం.]

3596} భక్తరంజనుడు  - భక్తులను రంజనుడు (రంజింపజేయువాడు), శివుడు. :-
[6-2-ఉ.]

3597} భక్తలోకపరిగ్రహప్రకటశీలుడు  - భక్తుల లోక (అందరను) పరిగ్రహ (అనుగ్రహించు) శీలము (వ్యక్తిత్వము, ప్రవర్తన) కలవాడు, విష్ణువు :-
[3-924.1-తే.]

3598} భక్తలోకపరిపాలనశీలుడు  - భక్తులు లోక (సర్వులను) పరిపాలన (పాలించెడి) శీలుడు (వర్తన గలవాడు), విష్ణువు :-
[6-173-చ.]

3599} భక్తలోకోపకారి  - భక్తులను లోక (ఎల్లరకు) ఉపకారి (ఉపకారము చేయువాడు), శ్రీరాముడు :-
[10.1-1791-మాలి.]

3600} భక్తవత్సలుడు  - భక్తులయెడ వాత్సల్యము కలవాడు, విష్ణువు, శ్రీకృష్ణుడు, శివుడు :-
[3-154-క., 3-545-చ., 4-233.1-తే., 4-697-వ., 5.1-181-మ., 6-343-వ., 7-122.1-తే., 7-281-వ., 7-308-చ., 7-377-వ., 7-397-వ., 10.1-439-క., 10.1-572.1-తే., 10.1-1204-క., 10.1-1516-మ., 10.2-246-క.]

3601} భక్తవరదుడు  - భక్తులకు వరములను ప్రసాదించువాడు, భగవంతుడు, విష్ణువు :-
[3-576.1-తే., 6-342-ఆ., 6-397.1-ఆ., 10.1-689-ఆ.]

3602} భక్తవిధేయుడు  - భక్తులకు అనుకూలముగ ఉండువాడు, విష్ణువు. :-
[3-143-క.]

3603} భక్తవ్రాతచింతామణి  - అనన్య భక్తుల సమూహమునకు చింతామణి (తలచిన కోరికలు తీర్చెడి మణి) వంటివాడు, విష్ణువు. :-
[10.1-1507-శా.]

3604} భక్తసంఘాతముఖపద్మపద్మమిత్ర  - భక్త (భక్తుల) సంఘాత (సమూహముల) యొక్క ముఖములు యనెడి పద్మ (కమలములకు) పద్మమిత్ర (సూర్యుని వంటివాడ), విష్ణువు :-
[7-376.1-తే.]

3605} భక్తసులభుడు  - భక్తులకు సులువుగా లభించువాడు, శివుడు :-
[3-473-వ.]

3606} భక్తహృదయుడు  - భక్తుల హృదయమున ఉండెడివాడ, విష్ణువు :-
[4-924-చ.]

3607} భక్తార్తిసంహరణాలోకనుడు  - భక్తుల ఆర్తి (బాధలను) సంహరణ (నాశము) చేయుటకు ఆలోకనుడు (చూసెడివాడు), విష్ణువు :-
[4-177-మ.]

3608} భక్తార్తిహరణకరణుడు  - భక్తుల ఆర్తిని పోగొట్టుటను చేయువాడు, విష్ణువు :-
[3-307.1-తే.]

3609} భక్షణాదులు  - పంచభక్ష్యము (1భక్ష 2భోజ్య 3లేహ్య 4చోష్య 5పానీయము) లతో కూడిన పరమ (శ్రేష్ఠమైన) అన్నములు (ఆహార పదార్థములు) :-
[10.1-870.1-తే.]

3610} భక్ష్యములు  - కొఱికి తినవలసినవి, అరిసెలు, బూరెలు, పిండివంటలు వంటివి :-
[4-510-వ.]

3611} భగవంతుడు  - (అ). షడ్గుణైశ్వర్యముల (మహత్వ ధైర్య యశో శ్రీ జ్ఞాన వైరాగ్యములు అనెడి ఐశ్వర్యములు)తో సంపన్నుండు (సమృద్ధిగా కలవాడు), (ఆ). శ్లో. ఉత్పత్తించ వినాశంచ భూతానామా గతింగతిం, వేత్తి విద్యామవిద్యాంచ షణ్ణాంభగ ఇతీరితః. ఈ ఆరు కలవాడు భగవంతుడు, (ఇ). వ్యు. (భగ + మతుప్ + మస్య వః) త. ప్ర. 1) సమగ్రములైన ఐశ్వర్యము, వీర్యము, సిరి, యశస్సు, జ్ఞానము, వైరాగ్యము అను ఆరును కలవాడు, 2) విశ్వమునకు భగము (పుట్టుకకు స్థానము) అయినవాడు, విష్ణువు :-
[1-61-వ., 2-23-వ., 2-68.1-తే., 2-89-వ., 2-99-క., 2-174-వ., 2-211-ఉ., 2-224-వ., 2-248-వ., 2-252-వ., 2-257.1-తే., 2-269-వ., 2-269-వ., 2-280-వ., 3-19-చ., 3-184-వ., 3-198.1-తే., 3-334-వ., 3-373-మ., 3-465-క., 3-473-వ., 3-524-వ., 3-582-క., 3-754-వ., 3-833-క., 3-836-చ., 3-1025-వ., 4-280-వ., 4-347.1-తే., 4-359.1-తే., 4-370.1-తే., 4-421-వ., 4-468-వ., 4-468-వ., 4-509.1-తే., 4-697-వ., 4-834-వ., 4-936-వ., 5.2-64-వ., 5.2-74.1-తే., 6-229-తే., 7-109-వ., 7-217-వ., 7-239-వ., 7-453-వ., 8-660-వ., 9-23-వ., 10.1-236-వ., 10.1-580-వ., 10.1-1099-వ., 10.2-102-క., 10.2-127-వ.]

3612} భగవంతుని జన్మములు - స్థావర జంగమ జీవులన్ని తనే కనుక అసంఖ్యాకంబులు :-
[10.1-1653.1-ఆ.]

3613} భగవంతునిగుణములు  - 1. సంభర్తృత్వము, 2. భర్తృత్వము, 3. సర్వనేతృత్వము, 4. గమయతృత్వము, 5. స్రష్టృత్వము, 6. సర్వశరీరత్వము, 7. సర్వభూతాంతరాత్మత్వము, 8. నిరస్త నిఖిలదోషత్వము, 9.షాడ్గుణ్యపూర్ణత్వము మొదలగునవి పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879 :-
[10.1-1653.1-ఆ., 10.1-1704.1-తే.]

3614} భగవంతునిగుణషట్కములు  - 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యములు :-
[7-365-మ., 7-384-వ.]

3615} భగవంతునిసద్గుణములు  - సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వభోక్తృత్వ సర్వాంతర్యామిత్వ సర్వస్రష్టృత్వ సర్వపాలకత్వ సర్వసంహారకత్వాది సుగుణములు :-
[10.2-110-మ.]

3616} భగవతి  - షడ్గుణములచే (1మహత్వ 2ధైర్య 3కీర్తి 4శ్రీ 5జ్ఞాన 6వైరాగ్యములుచే) ఐశ్వర్యురాలు, దేవి :-
[10.1-809-క., 10.1-1682-మ.]

3617} భగవత్పాది  - భగవంతుని పాదము లందు పుట్టినది, గంగానది :-
[5.2-32-వ.]

3618} భగవదనుభవప్రకారములు  - 1శ్రవణము 2మననము 3నిదిధ్యాసనము (మఱి మఱి తలచుట, మనస్సును పరిపరి విధాల పోకుండా చేయడం నిదిధ్యాస ప్రయోజనం), పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010 :-
[10.2-249-వ.]

3619} భగవన్నారాయణుడు  - భగవంతుడు అయిన నారాయణుడు, విష్ణువు :-
[6-343-వ.]

3620} భగుడు  - అదితి సంతానము పన్నెండుగురులో ఒకడు, జనులచే పూజింపబడువాడు, సూర్యుడు (విద్యార్థికల్పతరువు) :-
[6-506.1-ఆ., 12-43-వ.]

3621} భజనీయపాదారవిందుండు  - భజనీయ (పూజింప దగిన) పాదపద్మములు కలవాడు, విష్ణువు :-
[4-366-వ.]

3622} భద్ర/పద్మఆసనం  - పాదములను తొడల పైకి ముడిచిన ఒక యోగ ఆసనము :-
[2-27.1-తే.]

3623} భద్రకాళి  - భద్రేశ్వర క్షేత్రమున భద్రకాళి (నిత్యమంగళ స్వరూపము నీలవర్ణము కలామె) :-
[10.1-61-వ.]

3624} భద్రము  - శుభకార్యములందు పురప్రచార యోగ్య మైనది ఈ జాతి ఏనుగు / గజము వీనిలో జాతులు ప్రధానంగా భద్రము, మందము, మృగము అని మూడు :-
[10.1-1721-మ.]

3625} భద్రసేన  - శుభము అధికముగ కల ప్రదేశము, భరతవర్షమందలి తొమ్మిది దేశాలలో ఒకటి :-
[5.1-64-వ.]

3626} భద్రాయతనములు  - భద్రములు (మంగళముల) కి ఆయతనములు (ఇళ్ళు), మేలుకలిగించెడివి :-
[10.1-245-క.]

3627} భద్రాసనము  - 1. రాజు కూర్చొనెడి పీఠము, సింహాసనము 2. ఒక యోగ ఆసనము రెండు అరికాళ్లు ఎదురుబెదురుగా కలిపి, రెండుమోకాళ్ళు భూమికి సమాంతరంగా ఉంచి, రెండు అరచేతులవేళ్ళతోమూసి ఆ అరికాళ్ళను పట్టుకుని భద్రముగా కూర్చొను ఆసనము (భద్రాసనము) :-
[6-259.1-తే.]

3628} భద్రుడు  - క్షేమము కలవాడు, యజ్ఞుడు దక్షిణల పన్నెండుగురు కొడుకులలో ఒకడు :-
[4-6-వ.]

3629} భయము  - జరగబోవుదాని గురించి ఆందోళన :-
[4-215-వ.]

3630} భరతముఖ్యుడు  - భరత వంశము నందలి రాజులలో ముఖ్యుడు, పరీక్షిత్తు. :-
[10.1-1021.1-ఆ.]

3631} భరితశుభచరిత్రుడు  - భరిత (నిండైన) శుభచరిత్ర కలవాడు, శ్రీకృష్ణుడు :-
[5.1-183-మాలి.]

3632} భర్గుడు  - భరించువాడు, శివుడు :-
[5.1-74.1-తే.]

3633} భర్మాచలము  - బంగారుకొండ, మేరుపర్వతము :-
[10.1-1296-క.]

3634} భర్మాచలేంద్రము  - భర్మ (బంగారు) అచల (కొండ)లలో ఇంద్రము (శ్రేష్ఠమైనది), మేరుపర్వతము :-
[6-218.1-ఆ.]

3635} భల్లూకేశ్వరుడు  - భల్లూకముల (ఎలుగుబంట్ల)కు ప్రభువు, జాంబవంతుడు :-
[10.2-66-శా., 10.2-70-క.]

3636} భవచ్ఛేదకుండు  - భవత్ (సంసార బంధములను) చేదించువాడు, విష్ణువు :-
[4-366-వ.]

3637} భవదుఃఖహరుడు  - భవ (సంసారము)యొక్క దుఃఖములను హరుడు (హరించెడివాడ), విష్ణువు :-
[4-920-ఉ.]

3638} భవదూరుడు  - భవబంధములను దూరము చేయువాడు, విష్ణువు :-
[6-123-ఉ.]

3639} భవప్రహారి  - భవ (సంసార) బంధములను తెగగొట్టువాడు, విష్ణువు :-
[3-335-ఉ.]

3640} భవబంధవిమోచనుడు  - సంసారబంధనములనుండి విముక్తిని ప్రసాదించువాడు, విష్ణువు :-
[4-917-చ.]

3641} భవభయనివారకుడు  - భవ (సంసారము) వలని భయ (భయమును) నివారకుడు (పోగొట్టువాడు), విష్ణువు :-
[5.2-1-క.]

3642} భవవిదూరుడు  - భవ (సంసార బంధనములను) విదూరుడు (తొలగించెడివాడు), విష్ణువు :-
[4-555.1-తే., 6-342-ఆ.]

3643} భవాని  - భవుని భార్య, పార్వతి :-
[10.1-1743-వ.]

3644} భవుడు  - శివుడు, (వ్యు. భూ+అప్ కృ.ప్ర. ప్రపంచము ఈతనినుండి పొడమినది కావున ఈ వ్యవహారము) :-
[3-243-చ., 3-365-క., 4-52-వ., 8-239-మ., 8-681-వ., 10.1-1743-వ., 12-24-వ.]

3645} భవ్యగాత్రుడు  - దివ్యమంగళమైన గాత్ర (దేహముగలవాడు), విష్ణువు :-
[7-376.1-తే.]

3646} భవ్యచరిత్రుడు  - దివ్యమైన వర్తనలు గలవాడు, శ్రీకృష్ణ :-
[5.1-1-క.]

3647} భస్మదండలింగఘనజటాజినధరుడు  - భస్మము (విభూతి) దండము లింగము ఘన (గొప్ప)జటలు అజిన(లేడిచర్మము) ధరించినవాడు, శివుడు :-
[4-138.1-తే.]

3648} భాండీరకము  - 1. భాండీరము అంటే మఱ్ఱిచెట్టు కనుక చిన్న మఱ్ఱిచెట్టు, 2. ఒక రకమైన కుంభము (కుండ), నవద్వారకలిత దేహమనవచ్చు, 3. భాణ్డీరః అంటే భర్మనిర్మిత వాసః :-
[10.1-749-వ.]

3649} భాగవతము  - భగవంతునికి సంబంధించినది, ఒక మహాపురాణము, భాగవత గ్రంథరూప పరబ్రహ్మ. :-
[1-85.1-ఆ.]

3650} భాగవతుడు  - భాగవత సంప్రదాయము అనుసరించువాడు, భగవంతునికి చెందినవాడు, భక్తుడు :-
[1-391-వ., 3-88-మ., 3-147-వ., 3-496-క., 3-715-వ., 3-921-వ., 5.2-58-వ.]

3651} భాగీరథి  - భగీరథుని ప్రయత్నము వలన భూలోకానికి వచ్చిన నది, గంగానది :-
[1-176-వ., 12-48-వ.]

3652} భానుడు  - 1. ప్రకాశించువాడు, సూర్యుడు, 2. ఊరుభంగం మున్నగు అద్భుత నాటకాలు వ్రాసిన గొప్ప సంస్కృత కవి, :-
[6-11.1-తే., 10.1-1101-వ., 10.1-1236-దం., 10.1-1556-చ., 10.2-579-ఉ., 11-58-వ.]

3653} భానుశశాంకలోచనుడు  - భాను (సూర్యుడు) శశాంక (చంద్రుడు) లోచనుడు (కన్నులుగా కలవాడు), కృష్ణుడు :-
[5.2-165-చ.]

3654} భామ  - 1. సులభముగా కోపము వచ్చెడి స్త్రీ, 2. గొల్లభామ, 3. వీధిభాగవతములో నాయికాపాత్ర :-
[10.1-1096.1-ఆ.]

3655} భామామనోహారి  - భామా (స్త్రీల) మనః (మనస్సులను) హారి (హరించువాడు), కృష్ణుడు :-
[10.2-80-మ.]

3656} భామిని  - క్రీడాసమయమునందు కోపము చూపునామె, స్త్రీ :-
[3-1023-చ.]

3657} భారత  - భరతవంశమున పుట్టినవాడ, పరీక్షిత్తు :-
[9-592-క.]

3658} భారతీధనుడు  - భారతీదేవికి ధనము వంటివాడు, బ్రహ్మదేవుడు :-
[3-709-చ.]

3659} భారతీవిభుడు  - భారతీదేవి యొక్క విభుడు (భర్త), బ్రహ్మదేవుడు :-
[3-739.1-తే., 3-742.1-తే.]

3660} భారతీశ్వరుడు  - భారతీదేవి యొక్క భర్త, బ్రహ్మదేవుడు :-
[3-49-చ.]

3661} భారము  - అధికమైన బరువు మీదనుండుట :-
[10.1-1523.1-ఆ.]

3662} భారవి  - కిరాతార్జునీయం వ్రాసిన దక్షిణభారతదేశానికి చెందిన సంస్కృత మహాకవి :-
[6-11.1-తే.]

3663} భార్గవకుమారకులు  - భార్గవ (శుక్రుని) కుమారకులు (పుత్రులు), చండామార్కులు :-
[7-220-ఉ.]

3664} భార్గవముఖ్యుడు  - భృగువు వంశంలో ముఖ్యుడు, శౌనక మహర్షీ. :-
[1-441-క.]

3665} భార్గవరాముడు  - భార్గవుని యొక్క రాముడు, భృగుమహర్షి వంశములో పుట్టిన రాముడు, పరశురాముడు :-
[1-63-వ., 3-1-క., 9-264-క., 10.2-949-క.]

3666} భార్గవి  - భృగు వంశస్థురాలు, దేవయాని. :-
[9-527-శా.]

3667} భార్గవుడు  - భృగువు వంశములో పుట్టినవాడు, శౌనకుడు, శుక్రుడు, పరశురాముడు :-
[1-263-మ., 3-44-ఉ., 6-270.1-తే., 6-292-క., 8-523-మ., 8-590-శా., 9-458-క.]

3668} భార్గవులు  - భార్గవుని (శుక్రుని) కొడుకులు, చండామార్కులు :-
[7-145-శా.]

3669} భార్గవోత్తముడు  - భృగువు వంశంలో పుట్టినవారిలో ఉత్తముడు, శౌనకుడు. :-
[1-306-చ.]

3670} భావజుడు  - భావము (సంకల్పము)న పుట్టువాడు, మన్మథుడు :-
[9-390-ఉ., 10.1-1713.1-ఆ., 10.2-1170-చ.]

3671} భావభవారి  - భావభవుని (మన్మథుని) అరి (శత్రువు), శివుడు :-
[10.2-317-ఉ.]

3672} భావభవుడు  - వ్యు. మనస్సులో పుట్టువాఁడు, మన్మథుడు :-
[2-127-క., 3-381-ఉ.]

3673} భావభేదములు  - 1శ్లథ 2ఘన 3ప్రౌఢ 4బాల భావములు, :-
[10.1-1495-ఉ.]

3674} భావాభావమధ్యంబు  - భావ(ఉందో) అభావ (లేదో) మధ్యంబు (సందేహాస్పదమైనది), ఉందో లేదో తెలియనిది, స్త్రీల నడుము వర్ణనకు కవిసమయం :-
[10.1-1713.1-ఆ.]

3675} భాషాపతి  - భాషా (భాషకి దేవత సరస్వతి) యొక్క పతి (భర్త), బ్రహ్మ :-
[7-120-క., 11-71-వ.]

3676} భాసురగోపికామనోహర  - భాసుర (ప్రకాశవంతమైన) గోపికా (గోపికల యొక్క) మనః (మనసులను) హర (దొంగిలించినవాడ), శ్రీకృష్ణ :-
[5.1-182-క.]

3677} భాస్కరకులవార్ధిచంద్రుడు  - భాస్కరకుల (సూర్యవంశము అను) వార్ధి (సముద్రమునకు) చంద్రుడు, శ్రీరాముడు :-
[10.2-1340-చ.]

3678} భాస్కరసుతుడు  - భాస్కర (సూర్యుని) సుతుడు (పుత్రుడు), 4.శనీశ్వరుడు, 1.వైవస్వతుడు (శ్రాద్ధదేవుడు), 2.యముడు, 3.సూర్యసార్ణి, :-
[5.2-90-క.]

3679} భాస్కరాబ్జారినేత్రా  - భాస్కర (సూర్యుడు) అబ్జారి (పద్మములకు శత్రువైన చంద్రుడు) వంటి నేత్రా (కన్నులు కలవాడ), శ్రీకృష్ణ :-
[5.1-183-మాలి.]

3680} భాస్కరుడు  - 1. భాసత్ +కరుడు వెలుగునకు కారకుడు, సూర్యుడు, 2, రామాయణం ఆంధ్రీకరించిన మహాకవి :-
[2-92-క., 6-11.1-తే.]

3681} భిక్షాశనుడు  - భిక్షమెత్తుకొని ఆశనుడు (తినువాడు), శివుడు :-
[3-467.1-తే.]

3682} భిదురపాణి  - భిదురము (వజ్రాయుధము) పాణి (చేతపట్టినవాడు), ఇంద్రుడు :-
[6-390-వ., 6-521-వ.]

3683} భీకరము - భీకరతరము భీకరతమము :-
[1-503-క.]

3684} భీకరశరధారాకంపితదానవేంద్రుడు  - భీకర (భయంకర మైన) శర (బాణముల) ధారా (పరంపరలచే) ఆకంపిత (వణికింపబడిన) దానవేంద్రుడు (రాక్షస ప్రభువులు కలవాడు), రాముడు :-
[10.2-1-క.]

3685} భీభత్సుడు  - బీభత్సము (అతి క్రూరత్త్వము)గా యుద్ధము చేయువాడు, అర్జునుడు :-
[1-151-శా.]

3686} భీముడు  - 1. భయము కలిగించువాడు. 2.భయంకరుడు, పంచపాండవులలో 2వ వాడు :-
[10.2-354-మ., 10.2-1092-క.]

3687} భీష్మభూవరసుతుడు  - భీష్మకమహారాజు కొడుకు, రుక్మి :-
[10.2-281.1-తే.]

3688} భీష్ముడు  - కురువృద్దుడు భీష్మ (అతి భయంకర మైన) ప్రతిజ్ఞ చేసిన కురువంశ మహాపురుషుడు :-
[2-204.1-తే.]