పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (పద్మ - పుడమిఱేడు)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


2957} పద్మకల్పము  - 1. ప్రస్తుతము జరుగుచున్న శ్వేతవరాహ కల్పమునకు ముందరి కల్పము, 2. జీవుడు గర్భమున పడినది మొదలు బొడ్డు కోయుటవరకు గల సమయము పద్మకల్పము తరువాతది శ్వేతవరాహకల్పము :-
[3-150-వ.]

2958} పద్మకోశకరభావము  - తామరమొగ్గవలె ఐదువేళ్ళను కొంచెము వంచి ఎడము కలవిగా చేసి అరచేయి పల్లముగ ఏర్పడునట్లు పట్టునది, శ్లో. అంగుళ్యో విరాళాః కించిత్కుంచితాస్త నిమ్నగాః, పద్మకోశాభిధో హస్తస్తన్నిరూపణముచ్యతే., రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

2959} పద్మగంధి  - పద్మముల వంటి దేహ పరిమళము కల స్త్రీ :-
[10.2-212.1-ఆ.]

2960} పద్మగర్భుడు  - పద్మము జన్మస్థానముగా కలవాడు, బ్రహ్మదేవుడు :-
[2-242-తే., 4-9-క., 12-48-వ.]

2961} పద్మజుడు  - పద్మమున జన్మించినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-332-క., 3-339-వ., 3-405-క., 3-725-వ.]

2962} పద్మదళనేత్రుడు  - పద్మముల రేకుల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు, విష్ణువు :-
[4-712.1-తే.]

2963} పద్మదళాక్షుడు  - పద్మముల రేకుల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు, విష్ణువు :-
[10.1-94-క., 10.1-1251-క., 10.2-200-క., 10.2-209-ఉ., 10.2-760-క.]

2964} పద్మనయన  - పద్మములవంటి కన్నులు స్త్రీ :-
[9-64-ఆ.]

2965} పద్మనయనుడు  - పద్మముల రేకుల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు, విష్ణువు :-
[10.1-1692.1-ఆ.]

2966} పద్మనాభుడు  - పద్మము నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు :-
[1-206-వ., 1-396-వ., 3-921-వ., 4-150.1-తే., 10.2-749-ఆ.]

2967} పద్మనేత్రులు - కమలములవంటి కన్నులు కలవారు, బలరాముడు మరియు కృష్ణుడు :-
[10.1-1201-మ.]

2968} పద్మపత్రనేత్రుడు  - తామర ఆకుల వంటి కన్నులు కలవాడు, విష్ణువు, కృష్ణుడు, బలరాముడు :-
[4-370.1-తే.]

2969} పద్మపత్రలోచనుడు  - పద్మ (తామర) పత్ర (ఆకుల)వంటి లోచనుడు (కన్నులు గలవాడు), విష్ణువు :-
[4-892-చ.]

2970} పద్మపత్రాక్షుడు  - పద్మముల రేకులవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-203-దం.]

2971} పద్మబంధుడు  - పద్మములకు బంధువు, సూర్యుడు :-
[1-243-వ.]

2972} పద్మబాంధవుడు  - పద్మములకు బంధువు, సూర్యుడు :-
[3-498-ఉ., 10.2-636-వ.]

2973} పద్మభవకుమారుడు  - పద్మభవ (బ్రహ్మదేవుని) కుమారుడు, నారదుడు :-
[10.2-625-క.]

2974} పద్మభవాండము  - పద్మభవ (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము :-
[10.1-1541-ఉ.]

2975} పద్మభవుడు  - పద్మమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-316-తే., 10.2-131-మ.]

2976} పద్మమాలికాలంకృతుడు  - పద్మ మాలికలతో అలంకరింపబడిన వాడు, కృష్ణుడు :-
[1-188-వ.]

2977} పద్మలోచనుడు  - పద్మముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు, విష్ణువు :-
[1-148.1-ఆ., 1-188-వ., 3-315-మ., 3-393-చ., 3-631-చ., 3-646-తే., 3-836-చ., 4-917-చ., 7-106-ఉ.]

2978} పద్మసంకాశచరణుడు  - పద్మముల వలె ప్రకాశించు పాదములు గలవాడు, కృష్ణుడు :-
[1-188-వ.]

2979} పద్మసంభవుడు  - పద్మమున సంభవించిన (పుట్టిన) వాడు, బ్రహ్మదేవుడు :-
[3-150-వ., 3-376-తే., 3-667-వ., 3-702-తే., 3-720.1-తే., 3-1055-గ., 4-132-వ.]

2980} పద్మాకారబంధము  - తామరరేకుల వలె పేర్పుగాను వలయాకారముగాను నిలిచి పరస్పర హస్త విన్యాసాదులు చూపునది, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

2981} పద్మాక్షి  - పద్మముల వంటి కన్నులు కలామె, స్త్రీ :-
[10.1-790-మ.]

2982} పద్మాక్షుడు  - పద్మముల వంటి కన్నులు ఉన్న వాడు, కృష్ణుడు, విష్ణువు :-
[2-180-మ., 2-196-మ., 2-221.1-తే., 3-126.1-తే., 3-294.1-తే., 3-362.1-తే., 3-400-మ., 4-177-మ., 7-171.1-తే., 8-483.1-తే., 10.1-714-మ.]

2983} పద్మాపతి  - పద్మ (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు :-
[3-248-క.]

2984} పద్మాయతాక్షుడు  - పద్మముల వలె విశాలమైన కన్నులు కలవాడు, విష్ణువు :-
[10.2-440-తే., 10.2-516.1-తే.]

2985} పద్మాలయ  - పద్మములను నివాసముగా కలామె, లక్ష్మీదేవి :-
[3-532-మ.]

2986} పద్మావిభుడు  - పద్మ (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు. :-
[3-355.1-తే.]

2987} పద్మాసనము  - కాళ్ళుమడిచి కూర్చొనుటలో పద్మము వంటి ఆకారము కల (విశిష్టమైన) ఆసనము :-
[3-180.1-తే.]

2988} పద్మాసనుడు  - పద్మము ఆసనముగా గలవాడు, బ్రహ్మదేవుడు :-
[5.1-7.1-తే., 5.1-8-వ., 5.1-40-వ.]

2989} పద్మినీవల్లభుడు  - పద్మములకు ప్రియుడు, సూర్యుడు . :-
[9-719-వ.]

2990} పద్మోదరుడు  - పద్మము ఉదరమున (కడుపున) కలవాడు, విష్ణువు, కృష్ణుడు :-
[3-674-క., 3-686.1-తే., 4-900-క., 10.2-680-క.]

2991} పన్నగతల్పుడు  - పన్నగము (ఆదిశేష సర్పము) తల్పము (పాన్పుగాగల వాడు), విష్ణువు :-
[7-106-ఉ.]

2992} పన్నగపతిశాయి  - పన్నగపతి (ఆదిశేషుని) పై శాయి (శయినించువాడు), విష్ణువు :-
[6-177-క.]

2993} పన్నగరాజశాయి  - పన్నగరాజు (ఆదిశేషుని) శాయి (శయ్యగా కలవాడు), విష్ణువు :-
[6-12-ఉ.]

2994} పన్నగశాయి  - పన్నగ (శేషసర్పము) పైన శాయి(శయనించువాడు), విష్ణువు :-
[7-193-ఉ.]

2995} పన్నగాంతకుడు  - పన్నగము (పాము) లకు అంతకుడు (యముని వంటి వాడు), గరుడుడు :-
[10.1-708.1-తే., 10.2-747.1-తే.]

2996} పన్నగాకల్పుడు  - పన్నగ (సర్పాలచే) ఆకల్పుడు (ఆలంకరింపబడినవాడు), శివుడు :-
[10.2-358.1-తే.]

2997} పన్నగాధీశతల్పుడు  - పన్నగాధీశుడు (ఆదిశేషుడు) తల్పుడు (పాన్పుగా కలవాడు), విష్ణువు :-
[10.1-1236-దం.]

2998} పన్నగాధీశులు  - ఆదిశేషుడు అనంతుడు వాసుకి మున్నగు సర్పరాజులు :-
[10.1-291.1-తే.]

2999} పన్నగేంద్రుడు  - పన్నగ (సర్పము)లకు రాజు, వాసుకి, శేషుడు :-
[10.1-1747-వ., 10.2-248.1-తే.]

3000} పయస్యము  - పయస్సు (పాల) నుండి వచ్చినది, నెయ్యి :-
[3-451.1-తే.]

3001} పయోజగర్భుడు  - పయోజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[2-247-చ., 4-144-తే.]

3002} పయోజభవుడు  - పయోజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[8-533-శా.]

3003} పయోజసన్నిభపదుడు  - పయోజ (పద్మము) సన్నిభ (సమానమైమ) పదుడు (పాదములు గలవాడ), విష్ణువు :-
[4-920-ఉ.]

3004} పయోజాసనార్చితుడు  - బ్రహ్మచేపూజింపబడువాడు, విష్ణువు :-
[3-58-మ.]

3005} పయోదశ్యాముడు  - పయోద (మేఘము వంటి) శ్యామ (నల్లనివాడు), రాముడు :-
[8-1-క.]

3006} పయోధరము  - 1. పయః (పాలను) ధరించునది, కుచము, 2. పయః (నీటిని) ధరించునది, మేఘ ము :-
[10.1-1747-వ.]

3007} పయోధరాకారుడు  - పయోధరము (మేఘముల వలె) నల్లని ఆకారుడు (దేహము కలవాడు), కృష్ణుడు :-
[10.1-644-ఉ.]

3008} పయోధి  - పయస్ (నీటి)కి నిధి, కడలి :-
[3-437.1-తే., 3-459-వ., 10.1-144-క.]

3009} పయోధినాథుడు  - పయస్ (నీటి)కి అధి (నివాసమైనది) (సముద్రము)నకు నాథుడు (ప్రభువు), వరుణుడు. :-
[3-617-చ.]

3010} పయోభక్షణము  - పయస్ (నీరు) భక్షణము (నీరు ఆహారముగా తీసుకొనెడి వ్రతము), విష్ణు ప్రీతి కోసం పన్నెండు రోజులు చేసే ఒక వ్రతం :-
[8-480-వ.]

3011} పయోరాశి  - పయస్(నీటి)ని రాశిపోసినది, మహాసముద్రము :-
[3-355.1-తే., 8-210-వ., 8-706.1-ఆ.]

3012} పయోరుహగర్భాండము  - పయోరుహగర్భ (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము :-
[3-184-వ.]

3013} పయోరుహగర్భుఁడు  - పయోరుహము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-279-ఉ.]

3014} పయోరుహనాభుడు - పద్మము బొడ్డున గల వాడు, విష్ణువు :-
[10.2-455-చ.]

3015} పయోరుహపత్రలోచనుడు  - పయోరుహ (తామర) పత్ర (ఆకుల) వంటి లోచనుడు (కన్నులున్నవాడు), విష్ణువు. :-
[4-552-చ.]

3016} పయోరుహము  - పయస్ (నీట) పుట్టినది, పద్మము :-
[3-275.1-తే.]

3017} పయోరుహహితుడు  - పయస్ (నీటి) యందు రుహ (పుట్టినవి) పద్మములకు హితుడు (ఇష్టుడు), సూర్యుడు :-
[4-330-క.]

3018} పయోరుహాక్షి  - పయోరుహము (పద్మము)లవంటి కన్నులు గలామె, స్త్రీ :-
[4-786-ఆ.]

3019} పయోరుహోదరుడు  - పయోరుహము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు. :-
[4-187-చ.]

3020} పయోవిహారి  - జలములలో విహరించువాడు, విష్ణువు :-
[3-335-ఉ.]

3021} పయోవ్రతము  - నీరుమాత్రము తీసుకొనెడి ఉప్పోషము, నిరాహార వ్రతము, జలము లేదా పాలు మాత్రము ఆహారముగా చేయు వ్రతము. :-
[9-10.1-తే.]

3022} పరంజ్యోతి  - పరము (అత్యుత్తమ) ప్రకాశమైన స్వరూపము, సర్వాతీతమైన ప్రకాశము, పరబ్రహ్మము, విష్ణువు :-
[3-203-దం., 3-203-దం., 3-373-మ., 3-861-క., 3-942.1-తే., 5.1-155-వ.]

3023} పరకాష్ఠ  - అవధి, అవధి వంటివాడు, పతాక స్థాయి, అత్యధికుడు :-
[3-89.1-తే.]

3024} పరతంత్రుడు  - పరులచే నడపబడువాడు :-
[3-244-వ.]

3025} పరబ్రహ్మ  - సర్వాతీతమైన విశ్వకారణభూతుడు, విష్ణువు, అఖండ పరిపూర్ణ సచ్చిదానంద పరబ్రహ్మ (శో. బహిర్బ్రహ్మ వృద్ధై బృహతేర్ధాతోః అర్థానుగమాత్ దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్నం యద్వస్తు తద్బ్రహ్మేతి భాష్యం), నజాయతే మ్రియతేవా కథాచిన్నాయంభూత్వా భవితా వా నభూయః, అజోనిత్యశ్శాశ్వత్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే (శ్రుతి ప్రతిపాద్య బ్రహ్మతత్వము) :-
[3-1025-వ., 3-1025-వ., 4-468-వ., 10.1-681-వ., 10.1-1449-మ.]

3026} పరబ్రహ్మమయుడు  - పరబ్రహ్మముయైనవాడు, విష్ణువు :-
[4-359.1-తే.]

3027} పరబ్రహ్మస్వరూపుడు  - పరబ్రహ్మ యొక్క స్వరూపము అయినవాడు, విష్ణువు :-
[3-839-వ.]

3028} పరమకళ్యాణుడు  - పరమ (అత్యున్నతమైన) కళ్యాణుడు (శ్రేయస్సు కలిగించువాడు), విష్ణువు :-
[6-343-వ.]

3029} పరమపదము  - సర్వోత్కృష్ట స్థానము, మోక్షము :-
[10.1-871-క.]

3030} పరమపదవాసుడు  - పరమపదము (వైకుంఠము)న వాసుడు (వసించెడివాడ), విష్ణువు, శ్రీకృష్ణ :-
[5.1-182-క.]

3031} పరమపరుడు  - పరమైనవానికిని పరమైన (ఉన్నతమైన) వాడు, పరాత్పరుడు :-
[3-68-క.]

3032} పరమపుణ్యుడు  - ఉత్కృష్టమైన పుణ్యవంతుడు, విష్ణువు :-
[10.2-108.1-తే.]

3033} పరమపురుషుడు  - సర్వాతీతమైన పురుషయత్నము కలవాడు, విష్ణువు. :-
[2-238-వ., 2-239-క., 3-215-వ., 3-308.1-తే., 3-365-క., 3-874-వ., 3-1025-వ., 4-191.1-తే., 4-280-వ., 4-408-వ., 4-478-క., 4-733-క., 6-124.1-ఆ., 6-342-ఆ., 7-217-వ., 8-483.1-తే., 8-675-వ., 10.1-129-తే., 10.1-572.1-తే., 10.1-681-వ., 10.1-975-వ.]

3034} పరమమంగళుడు  - పరమ (అత్యుత్తమమైన) మంగళుడు (శుభకరుడు), విష్ణువు :-
[6-343-వ.]

3035} పరమమునిగేయుడు  - అత్యుత్తమైన మునులచే కీర్తింపబడువాడు, విష్ణువు :-
[4-286.1-తే.]

3036} పరమహంస  - 1.సర్వ పరిత్యాగము చేసి జ్ఞానమార్గమున చరించు సన్యాసి, ఆనందాత్మను నేను అని ఎరుక కలిగిన వాడు పరమహంస. (పరం ఆనందాత్మా అహం అస్మీతిహన్తి గచ్ఛతి జనాతీతి పరమహంసః శబ్ద కల్పద్రువం). 2.యతులకు వాడేపదం. :-
[1-63-వ., 2-239-క., 3-534-చ., 4-703.1-తే.]

3037} పరమహంసము  - పరమ హంస యైనవాడు, బ్రహ్మ :-
[6-3-ఉ.]

3038} పరమాణుకారణవాదులు  - పరమాణు స్వరూపుడే పరబ్రహ్మ జగత్తుకి మూలకారణభూతుడు అనెడివారు :-
[10.2-1220-వ.]

3039} పరమాణువు  - కిటికీలోంచి పడెడి సూర్య కిరణమునందు కనబడెడి రేణువునంద ఆరవ భాగము అణువు. ఇది కంటికి కనబడదు. అట్టి దానిలో ఆరవ భాగము పరమాణువు అనెదరు. :-
[10.1-557.1-తే.]

3040} పరమాత్మ  - ఏకమేవాద్వితీయంబ్రహ్మ (శ్రుతి), ఏకము కనుక సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనిది అద్వితీయము కనుక ఇతరము (తనుకానిది) లేనిది పరమాత్మ :-
[2-28-వ., 2-110-మ., 2-267-వ., 3-1032-వ., 4-286.1-తే., 4-459-వ., 7-371-వ., 10.1-568-వ., 10.1-1779-వ., 10.2-477-ఆ.]

3041} పరమాత్మకుడు  - పరమ (అత్యన్నతమైన) ఆత్మ కలవాడు, విష్ణువు :-
[3-668-ఉ.]

3042} పరమాత్మత్రైవిధ్యము - దేహము (మొదటివాడు) దేహి (జీవుడు, రెండవవాడు), దేహములో (సర్వాంతర్యామి, మూడవవాడు) తానై యుండుట :-
[6-172-చ.]

3043} పరమాత్ముడు  - సర్వమునందు ఆత్మ యై ఉండి సర్వాత్మలు తానైన వాడు, విష్ణువు, శివుడు :-
[2-209-చ., 3-198.1-తే., 3-212-చ., 3-473-వ., 3-874-వ., 3-1025-వ., 4-358.1-తే., 11-56-వ., 11-77-వ.]

3044} పరమానందుడు  - పరమానంద స్వరూపుడు, విష్ణువు :-
[3-96-క.]

3045} పరము  - పరలోకము :-
[3-300-చ.]

3046} పరముడు  - సర్వమునకు పరమైనవాడు (అతీతమై ఉండువాడు), విష్ణువు :-
[3-293.1-తే., 3-400-మ., 3-523-చ., 3-1024-క., 4-367.1-తే., 6-173-చ., 6-213-తే., 6-229-తే., 7-376.1-తే., 7-447-ఆ., 8-477-మ.]

3047} పరమేశుడు  - సమస్తమునకు పరమమైన ఈశ్వరుడు, కృష్ణుడు :-
[2-96-క., 2-99-క., 3-30-ఉ., 3-257-క., 3-510-చ., 3-844-చ., 3-861-క., 4-298-చ., 4-892-చ., 4-917-చ., 6-342-ఆ., 7-459-ఉ., 10.1-622-ఉ., 10.1-1449-మ.]

3048} పరమేశ్వరుడు  - పరమమైన ఈశ్వరుడు, సర్వోత్కృష్టమైన మరియు సర్వుల (బ్రహ్మాది పిపీలకపర్యంతము)ను నియమించు వాడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు :-
[1-183-వ., 1-218-వ., 2-26-వ., 2-152-వ., 2-174-వ., 2-252-వ., 3-202-వ., 3-215-వ., 3-423.1-తే., 3-473-వ., 3-473-వ., 3-591-క., 3-856.1-తే., 3-956-చ., 3-1055-గ., 5.1-54-వ., 6-217-వ., 7-109-వ., 7-147-వ., 7-217-వ., 7-371-వ., 7-397-వ., 8-11-వ., 8-479-క., 9-15-వ., 10.1-887-వ., 10.1-958-ఉ., 10.1-1503-వ., 11-26-వ., 11-62-వ.]

3049} పరమేష్టి  - అత్యున్నతమైన సంకల్పశక్తుడు, పరమము (ఉత్తమమైన) ఇష్టి (యజ్ఞము) అయినవాడు, బ్రహ్మదేవుడు :-
[2-30-వ., 2-58-మ., 2-222-వ., 2-231.1-తే., 3-367-వ., 3-1055-గ., 4-54-వ., 7-88-వ., 8-158-వ., 10.1-540-ఉ., 10.2-209-ఉ., 11-83-క.]

3050} పరమేష్ఠితనయుడు  - బ్రహ్మపుత్రుడు, నారదుడు :-
[10.2-629-ఆ.]

3051} పరమేష్ఠిసుతుడు  - బ్రహ్మదేవుని కొడుకు, నారదుడు :-
[10.2-617-క.]

3052} పరలోకక్రియలు  - మరణానంతరము జీవి, పై లోకములకేగుటకు చేసెడి విధులు, కార్యక్రమము, ఉత్తరక్రియలు :-
[1-228-వ., 10.2-95-వ.]

3053} పరలోకగతుడు  - పరలోకమునకు పోవువాడు, మరణించినవాడు :-
[4-823.1-తే., 4-829-వ.]

3054} పరశుధరుడు  - పరశువు (గొడ్డలి)ని ధరించినవాడు, పరశురాముడు :-
[11-72.1-తే.]

3055} పరహృదయవిదారి  - పర (విరోధుల) హృదయ (గుండెలను) విదారి (చీల్చెడి వాడు), శ్రీరాముడు :-
[10.1-1791-మాలి.]

3056} పరాక్రమము  - పర (గొప్ప) క్రమము (విధానము), శౌర్యము, వ్యు. పరా+క్రమ్+ఘఞ్, పరాక్రమ్యతే అనేన, దీనిచే ఆక్రమించబడును. పరాక్రమము; దాటి వెళ్లుట. :-
[3-973-క.]

3057} పరాఙ్ముఖుడు  - పక్కకు తిప్పిన ముఖము కలవాడు, పెడముఖమువాడు, విముఖుడు :-
[10.2-424.1-తే.]

3058} పరాజితకంసుఁడు  - ఓడింపబడిన కంసుడు కలవాడు, కృష్ణుడు :-
[10.2-206-ఉ.]

3059} పరాత్పరుడు  - పరముకన్న పరమైన వాడు, అన్నిటికి ఉన్నతమైన వాడు, విష్ణువు :-
[3-100-వ., 3-220-క.]

3060} పరాత్మభూముడు  - పరబ్రహ్మము తానే ఐన వాడు, విష్ణువు :-
[10.1-566-ఆ.]

3061} పరాపరుడు  - పరము, అపరము తానైనవాడు, పర (ఇతరము) అన్నది అపరము (ఇతరము లేని) వాడు, తాను తప్పఇతరము లేనివాడు, పరాత్పరుడు, కృష్ణుడు, విష్ణువు :-
[3-31-ఉ., 3-91-వ., 3-166-క., 3-364-చ., 4-357-వ., 4-920-ఉ.]

3062} పరాయత్తము  - ఆయత్తమునకు పరమైనది, వికలము :-
[1-381-వ.]

3063} పరావృత్తశిరోభావాలు  - వెనుకకు తిప్పిన శిరస్సులు కలవి. రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3064} పరాశరప్రియసూతి  - పరాశరుని ప్రియమైన సంతానము, వ్యాసుడు :-
[3-185-త.]

3065} పరాశరమునిమనుమడు  - పరాశరుని (పుత్రుడు వ్యాసుడు అతని పుత్రుడు) మనుమడు, శుకయోగి :-
[3-228-క., 9-5-వ.]

3066} పరాశరసుతుడు  - పరాశరుని పుత్రుడు, వేదవ్యాసుడు :-
[3-189.1-తే.]

3067} పరాశరాత్మజుడు  - పరాశరుని పుత్రుడు, వ్యాసుడు. :-
[1-89-ఉ., 6-9-చ.]

3068} పరాశరుడు  - 1. ఒక మహర్షి, 2. వ్యాసుని తండ్రి, 3. వసిష్ఠుని మనుమడు. 4. పడవలో నది దాటుతూ దాశరాజు కూతురు సత్యవతిని మోహించి ఆమెకు యోజనగంధిత్వము మఱియి సద్యోగర్భమున వ్యాసుని పుత్రునిగ అనుగ్రహించెను. :-
[2-204.1-తే.]

3069} పరిఘ  - ఇనుపకట్ల గుదియ :-
[6-406-ఆ.]

3070} పరిచ్ఛిన్నంగహారము  - భిన్నభావములను సూచించునవి, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3071} పరిధి  - సూర్యుని చుట్టు చంద్రుని చుట్టును ఏర్పడు కాంతి వలయము, పరివేషము. హద్దు, ఎల్ల :-
[10.2-183.1-తే.]

3072} పరిపంథి  - పరి (ఎదుటి) పంథి (పక్షమువాడు), శత్రువు :-
[7-376.1-తే.]

3073} పరిబర్హము  - వ్యు. (పర్హ బర్హ పరిభాషణ హంసాచ్ఛాదనేషు, పరి బర్హ ఘఞ) :-
[4-62-క.]

3074} పరిభ్రాంతుండు  - జననమరణములలో తిరుగు తున్నవాడు, సంసారి :-
[10.1-1503-వ.]

3075} పరిమాణవిరహితుడు  - అణోరణాయాన్మహతో మహీయాన్ (శ్రుతి) చేత ఇంతవాడు అంతవాడు అని నిర్ణయింపరానివాడు, కొలతలకు అతీతమైన వాడు, అవికారుడు, కృష్ణుడు :-
[10.1-901-క.]

3076} పరిరక్షితశిక్షితభక్తమురుడు  - పరిరక్షిత(చక్కగా కాపాడ బడెడి) శిక్షిత (శిక్షింప బడిన) భక్త (భక్తులు) మురుడు (మురాసుర ఆదులు) గల వాడు, విష్ణువు :-
[6-530-తో.]

3077} పరివాహితశిరోభావాలు  - ఇరుపక్కలకు చామరములు వీచునట్లు వంచిన శిరస్సులు కలవి, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3078} పరివేషము, గుడికట్టుట  - ఆకాశమునందు సూర్యుని / చంద్రుని చుట్టు ఏర్పడెడి ప్రకాశవంతమైన తెల్లని వలయము :-
[10.1-754.1-ఆ.]

3079} పరిశోషితరత్నాకరుడు  - పరిశోషిత (ఇంకిపోవునట్లు చేసిన) రత్నాకరుడు (సముద్రము కలవాడు), రాముడు :-
[10.2-1-క.]

3080} పరుడు  - పరబ్రహ్మము, సమస్తమునకు పరము (అతీతము) యైనవాడు, పరా పశ్యంతి మధ్యమ వైఖరీ అనెడి వాక్కులకు అందనివాడు, విష్ణువు :-
[2-173.1-తే., 2-279-మ., 3-143-క., 3-145.1-తే., 3-198.1-తే., 3-373-మ., 3-629-చ., 3-836-చ., 3-841-క., 4-195-చ., 4-233.1-తే., 4-347.1-తే., 4-917-చ., 4-936-వ., 10.1-236-వ., 10.1-404-క.]

3081} పరేతనాయకుడు  - పరేత (మరణించినవారి, భూతముల)కి నాయకుడు, యముడు :-
[6-82-ఉ.]

3082} పరేశుడు  - పర (సర్వ అతీతమైన బ్రహ్మమునకు) ఈశుడు (ప్రభువు), విష్ణువు :-
[2-214-మ., 3-236-చ., 3-238-చ., 3-490-ఉ., 3-930-చ., 4-920-ఉ.]

3083} పరేశ్వరుడు  - పర (సర్వ అతీతమైన బ్రహ్మమునకు) ఈశ్వరుడు (ప్రభువు), విష్ణువు :-
[3-221-తే.]

3084} పరోక్షజ్ఞానము  - ప్రపంచ కల్పనాది రూపము కలది :-
[10.1-681-వ.]

3085} పర్జన్యుడు  - 1ఉరిమెడువాడు, మేఘుడు, 2పృషు – వర్షణే – పృష + అన్య – జః అంతాదేశః, కృ.ప్ర., 3. వాన కురిపించువాడు, 4. భక్తుల కోరికలను వర్షించు వాడు., 5ఇంద్రుడు :-
[1-233.1-ఆ., 8-634-వ., 10.1-880.1-తే.]

3086} పర్ణశాల  - పర్ణ (ఆకుల) శాల (ఇల్లు), ఆశ్రమము, :-
[9-56-ఆ.]

3087} పర్వతము  - సంధులు కలది, కొండ :-
[10.1-340-క.]

3088} పర్వతరిపుడు  - పర్వతముల శత్రువు (వాటి రెక్కలు వజ్రాముతో ఖండించుట చేత), ఇంద్రుడు :-
[8-148-క.]

3089} పర్వము  - పండుగ, పంచపర్వములు, 1అష్టమి 2చతుర్దశి 3కుహువు (చంద్రకళ కానరాని అమావాస్య) 4పూర్ణిమ 5రవిసంక్రాంతి :-
[10.2-937-చ.]

3090} పర్వేందుముఖీ  - పర్వ (పౌర్ణమినాటి) ఇందు (చంద్రునివంటి) ముఖి (మోముకలామె), స్త్రీ. :-
[8-235-క., 10.1-320-క.]

3091} పలలాశి  - మాంసము తినువాడు, రాక్షసుడు :-
[10.1-1178-క.]

3092} పల్వలుడు  - ఇల్వలుడు అను రాక్షసుని కొడుకు పల్వలుడు, బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మునుల కోరిక మేర పల్వలుని సంహరించాడు. :-
[2-190-చ.]

3093} పవనతనయుడు  - వాయుపుత్రుడు, హనుమంతుడు :-
[9-291-వ.]

3094} పవననందనుడు  - వాయుదేవుని పుత్రుడు, భీముడు :-
[1-172-వ.]

3095} పవనము  - పరిశుద్ధము చేయునది, గాలి :-
[10.1-1582-మ.]

3096} పవనాశుడు  - పవనము (గాలి)ని అశనుడు (తినువాడు), పాము, ఊపిరికి సంకేతం :-
[4-750-క.]

3097} పవనుడు  - పరిశుద్ధము చేయువాడు, వాయుదేవుడు :-
[10.1-1556-చ.]

3098} పవమానతనయుడు  - వాయుదేవుని కొడుకు, భీముడు :-
[10.2-668-వ.]

3099} పవమానసఖుడు  - పవమాన (వాయుదేవుని) సఖుడు (స్నేహితుడు), అగ్నిదేవుడు :-
[3-214.1-తే., 4-838-క.]

3100} పవమానుడు  - వాయుదేవుడు, వ్య. పూఞ్+శానచ్, పవమానః పునాతి పవిత్రీ కరోతి, పవిత్రము చేయునది. గాలి; గార్హపత్యాగ్ని. :-
[4-34-వ.]

3101} పవి  - ఎల్లపుడు చరించునది, కులిశము, వజ్రము :-
[9-68-క.]

3102} పవిత్రుడు  - పవిత్రతేతానైనవాడు, విష్ణువు :-
[4-917-చ.]

3103} పశుఘ్నుడు  - పశువులను చంపి జీవించువాడు, కటికవాడు :-
[10.1-5-క.]

3104} పశుపతి  - పశు (పాశబద్దులు) లకు పతి (ప్రభువు), పాశములచే బంధించబడిన సకల జీవులను పాలించు అధిపతి, శివుడు :-
[3-472-క., 4-59-క., 4-130-క., 10.2-528-క., 10.2-832-క.]

3105} పశువులు  - 1. పాశబద్ధమగునవి, పెంపుడు జంతువులు, ఆవులు మొదలగునవి. 2. సంసార బంధనాలచే బద్దులు, జీవులు, వ్యు, పశ్+కు, పాశ్యతే బధ్యతే అసౌ, బంధింపబడినది. గ్రామ్య పశువు. :-
[2-16-వ., 2-49.1-తే., 3-306-మ., 3-501-వ., 3-754-వ.]

3106} పశుసోమములు  - పశువులను బలిచ్చెడి సోమములు (యజ్ఞములు) :-
[5.1-95.1-తే.]

3107} పశ్చాత్తాపము  - పశ్చాత్ ((చేసిన) తరువాత తాపము (బాధ) పొందుట :-
[3-367-వ.]

3108} పాంచజన్యము  - విష్ణుమూర్తి యొక్క శంఖము, పంచజన అను దైత్యునికి సంబంధించిన శంఖము. :-
[8-116-శా., 10.1-1433-వ., 10.1-1541-ఉ., 10.2-422-తే., 10.2-518-చ., 10.2-1108-చ.]

3109} పాంచభౌతికము = పంచభూతములతో చేయబడినది, జీవుని దేహము - :-
[7-51.1-ఆ.]

3110} పాంచభౌతికము  - శరీరము దేహము పంచ భూతములైన నీరు గాలి నిప్పు మన్ను ఆకాశము లనుండి తయారైనది. కనుక పాంచభౌతికము :-
[2-223.1-తే.]

3111} పాంచాల  - 1. పంచేంద్రియములు ప్రసరించ గలుగు ప్రదేశములకు (విషయములకు) సంకేతము. 2. భారతదేశములోని ఒక దేశము :-
[4-768-వ., 4-819-వ.]

3112} పాంచాలతనూజ  - పాంచాలదేశ రాకుమారి, ద్రౌపది :-
[10.2-104-క.]

3113} పాంచాలపుత్రిక  - పాంచాలదేశ రాకుమారి, ద్రౌపది :-
[1-365.1-తే.]

3114} పాంచాలి  - పాంచాల దేశ రాకుమారి , పాండవులు ఐదుగురకు భార్య కనుక పంచ భర్తృక, ద్రౌపది :-
[1-176-వ., 1-186-వ., 1-365.1-తే., 10.2-694-వ., 10.2-1082-వ.]

3115} పాండవపౌత్రుడు  - పాండవుల యొక్క మనుమడు, పరీక్షిన్మహారాజు :-
[1-448-ఆ., 1-508-వ., 7-479-వ.]

3116} పాండవాగ్రజుడు  - పంచపాండవులలో పెద్దవాడు, ధర్మరాజు :-
[10.2-768-ఆ.]

3117} పాండవులు  - పాండురాజు పుత్రులు, పంచపాండవులు, 1ధర్మరాజు 2భీముడు 3అర్జునుడు 4నకులుడు 5సహదేవుడు :-
[1-176-వ., 1-199-వ., 1-396-వ., 1-396-వ., 3-12-వ., 3-21-క., 10.1-1519.1-ఆ.]

3118} పాండవేయుడు  - పాండవవంశస్తుడు, పరీక్షిత్తు :-
[8-200-ఉ.]

3119} పాండవోత్తముడు  - పాండువంశము నందు ఉత్తముడు, పరీక్షిత్తు :-
[9-342.1-తే.]

3120} పాండుతనయుడు  - పాండురాజు పుత్రుడు, అర్జునుడు :-
[1-371-క.]

3121} పాండునందనులు  - పాండురాజు పుత్రులు, పంచపాండవులు :-
[3-32-ఉ., 3-98-చ., 3-131.1-తే.]

3122} పాండునీలరుచిశంకరవర్ణనిజాంగుడు  - పాండు (తెలుపు) నీల (నలుపు) రుచి (కాంతులచే) శంకర (శుభము కలుగ జేయుచున్న) వర్ణ (రంగులు కల) నిజ (తన) అంగుడు (దేహము కలవాడు), శివుడు :-
[10.2-315-ఉ.]

3123} పాండునృపనందనుడు  - పాండురాజు కొడుకు, ధర్మరాజు :-
[10.2-701-చ.]

3124} పాండుభూవరసుతాగ్రజుడు  - పాండురాజు పెద్ద కొడుకు, ధర్మరాజు :-
[10.2-820-చ.]

3125} పాండుభూవరసుతుడు  - పాండురాజు యొక్క కొడుకు, ధర్మరాజు :-
[10.2-812-చ.]

3126} పాండురాజు  - పాండవుల తండ్రి, ధృతరాష్ట్రుని తమ్ముడు :-
[3-11-చ.]

3127} పాండుసుతులు  - పాండురాజు పుత్రులు, పంచపాండవులు :-
[3-42-చ.]

3128} పాండ్యభూమీశుడు  - పండా (నిశ్చయబుద్ధి) కలవాడు (పాండ్యుడు) వారిదేశము పాండ్యము, పాండ్యదేశపురాజు, మలయకేతనుడు :-
[4-830.1-తే.]

3129} పాంథుడు  - పథమున పోవువాడు, బాటసారి :-
[10.1-967.1-ఆ.]

3130} పాకశాసనుడు  - వృత్రాసురుని సోదరుడగు పాకాసురుని చంపినవాడు, ఇంద్రుడు :-
[5.2-112.1-ఆ., 11-69-వ.]

3131} పాకారి  - వృత్రాసురుని సోదరుడగు పాకాసురుని శత్రువు, ఇంద్రుడు :-
[7-224-శా.]

3132} పాకారిప్రముఖవినుతభండనుడు  - (పాకాసురుని శత్రువైన ఇంద్రుడు) మున్నగువారి చేత వినుత (పొగడబడిన) భండనుడు (యుద్ధము కలవాడు), రాముడు :-
[10.1-1-క.]

3133} పాటలగంధి  - పాదిరిపూలవంటి దేహ సువాసన కలిగిన స్త్రీ :-
[10.1-896-క., 10.1-1122-క.]

3134} పాఠకుడు  - వంశావళి వర్ణించుచు జీవించువాడు, పద్యములు చదువు వారు, వంది :-
[1-396-వ., 1-396-వ., 10.1-724-క.]

3135} పాఠాంతరం - పుట్టంబుట్టశిరంబున్ మొలువ = శిరస్సు మీద పుట్టపుట్టి ఉన్నవాడను కాదు (వాల్మీకిని కాదు) :-
[1-7-శా.]

3136} పాఠీననయన  - చేపవంటి కన్నులు కలామె, స్త్రీ :-
[10.1-1072-క.]

3137} పాతకములు  - 1స్వర్ణస్థేయము 2సురాపానము 3బ్రహ్మహత్య 4గురుపత్నీగమనము 5ఇవి చేయువారి తోడి స్నేహము, పంచమహాపాతకములు :-
[6-140-ఆ.]

3138} పాతకహరుడు  - పాతక (పాపములను) హరుడు (హరించువాడు), కృష్ణుడు :-
[5.2-166-క.]

3139} పాతివ్రత్యము  - పతివ్రత యొక్క శీలము, పతిభక్తి కలిగి ఉండుట. :-
[3-806.1-తే.]

3140} పాథోనిధి  - పాథస్ (జలము)నకు నిధి (ఆవాసము) వంటిది, సముద్రము :-
[3-775-మ.]

3141} పాదపము  - వేళ్ళతో నీరుతాగునది, చెట్టు :-
[2-21.1-తే., 10.1-413-క.]

3142} పాద్యము  - పాదముల కొఱకైనది, జలము మున్నగునవి :-
[10.1-1267-వ., 10.2-92.1-తే.]

3143} పానీయము  - పానము (తాగుట)కు అనుకూలమైన ద్రవపదార్థములు :-
[7-123-శా.]

3144} పాపఘ్నుడు  - పాపములను పోగొట్టు వాడు, విష్ణువు :-
[2-214-మ.]

3145} పాపజాతి  - దుష్కృత వంశస్థులు, రాక్షసులు :-
[10.1-219-క.]

3146} పాపనికాయము  - మనోవాక్కాయకర్మల చేత చేయబడిన పాపములు :-
[10.1-1119-మ.]

3147} పాపమోచనుడు  - పాపమునుండి మోచనుడు (ముక్తిని ప్రసాదించువాడు), విష్ణువు. :-
[3-571-చ.]

3148} పాపఱేడు  - పాప (సర్పము)లకు ఱేడు (రాజు), ఆదిశేషుడు :-
[10.1-143-వ.]

3149} పాపశోషణుడు  - పాపములను శోషణము (ఆవిరి) చేయు వాడు, విష్ణువు :-
[3-588-ఉ., 10.2-1340-చ.]

3150} పాపాత్ముడు  - పాపపు ఆత్మ (మనసు) కలవాడు, పాపి :-
[5.2-137-క.]

3151} పాయసము  - పాలతో వండినది, పరమాన్నము :-
[10.1-889.1-తే.]

3152} పారగులు  - పారము (తుది) చూసినవారు, పండితులు :-
[4-684-వ.]

3153} పారతంత్రము  - పరునిచే (భగవంతునిచే) నడుపబడుట :-
[3-297-వ.]

3154} పారమేష్ఠ్యము  - పరమేష్ఠి (బ్రహ్మ) యొక్క స్థానము, అన్నిటికన్న ఉత్తమమైన పదవి. బ్రహ్మపదము :-
[6-267-ఆ.]

3155} పారలౌకికము  - ఆముష్మికము, పరలోక సంబంధమైనది. :-
[2-12-వ.]

3156} పారాయణము  - వేదాదులను నియమముతో చదువుట, నిష్ఠగా పూని ఒక పూజా కార్యక్రమము వలె చదువుట, మరల మరల చదువుట :-
[6-38-క.]

3157} పారావారము  - అపారమైన తీరము కలది, పార (దాటుటకు) అవారము (రానిది), సముద్రము :-
[6-424-క., 10.1-1532-వ.]

3158} పారాశర్యనందనుడు  - పారాశర్యుడు (పరాశరుని కుమారుని, వ్యాసుని) నందనుడు (కుమారుడు), శుకుడు :-
[10.2-636-వ.]

3159} పారాశర్యుడు  - పరాశరుని పుత్రుడు, వ్యాసుడు :-
[1-90-వ., 12-29-క.]

3160} పారిజాతవృక్షము  - 1. కోరినకోరికలు తీర్చెడి దేవతావృక్షము, కల్పవృక్షము. 2. పాల్కడలిలో పుట్టినది (ఆంధ్ర శబ్ధాకరము) :-
[10.2-215-మ.]

3161} పారిబర్హము  - పారిబర్హము, పెండ్లి కానుకలు (సర్వారాయాంధ్ర నిఘంటువు) :-
[3-792-వ.]

3162} పార్థివుడు  - పృథివికి సంబంధించినవాడు, రాజు :-
[3-806.1-తే., 4-808-ఆ.]

3163} పార్థివేంద్రుడు  - పార్థివుల (రాజుల)లో ఇంద్రునివంటివాడు, రాజు. :-
[4-629.1-తే., 5.1-119.1-తే., 5.2-4-ఆ., 9-344-ఆ.]

3164} పార్థివేశ్వరుడు  - రాజులలో ఈశ్వరుడు, రాజు. :-
[5.1-143-చ.]

3165} పార్థివోత్తముడు  - పార్థివులు (రాజుల)లో ఉత్తముడు, రాజు :-
[4-460.1-తే., 4-541.1-తే.]

3166} పార్థుడు  - పృథ (కుంతీదేవి) కొడుకు, పాండవ మధ్యముడు, కుంతీదేవి రెండవ కొడుకు, అర్డునుడు :-
[10.2-1165.1-తే.]

3167} పార్థుడు  - పృథు (కుంతి) కొడుకు, అర్జునుడు. :-
[1-147-వ., 1-371-క., 2-204.1-తే., 10.2-115-ఉ., 10.2-1288-మ.]

3168} పార్వతీపతి  - పార్వతికి భర్త శివుడు :-
[2-101-చ.]

3169} పార్వతీహృదయకైరవకైరవమిత్రుడు  - పార్వతి మనస్సు అను కైరవ (తెల్ల కలువకు) కైరవమిత్రుడు (చంద్రుడు వంటి వాడు), శివుడు :-
[10.2-315-ఉ.]

3170} పార్శ్వగపాదకర్మములు  - పార్శ్వము లందు పొందునట్లు బొటనవేలితో నేలరాయుచు అడుగు లుంచుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3171} పార్శ్వవర్తులు  - పార్శ్వమున (పక్కన) ఉండువారు, కూడ నుండువారు, కొలువున నుండువాలు :-
[4-557.1-తే.]

3172} పార్షదుడు  - పార్శ్వమున (పక్కన) ఉండువాడు, కూడ నుండువాడు, కొలువున నుండువాడు, సేవకుడు :-
[4-374-వ., 5.2-74.1-తే.]

3173} పాలకుప్ప  - పాలు+కుప్ప, సముద్రము :-
[8-207-ఆ.]

3174} పాలితప్రకటధాత్రీచక్రము  - పాలిత (పాలింపబడుతున్న) ప్రకట (ప్రసిద్దమైన) ధాత్రీచక్రము (భూమండలము) కలది, విష్ణుచక్రము :-
[3-678-మ.]

3175} పాలేటిరాచూలి  - పాలసముద్రుని రాకుమారి, లక్ష్మీదేవి :-
[10.1-1031.1-ఆ.]

3176} పాళీలు  - మల్లవిద్యావిశేషము :-
[10.1-1334-మ.]

3177} పావకుడు  - పవిత్రము చేయువాడు, అగ్ని :-
[4-34-వ., 10.2-121-క., 10.2-518-చ.]

3178} పావని  - వాయువు కొడుకు, భీముడు :-
[10.2-728-ఉ.]

3179} పాశి  - పాశములు ఆయుధముగా కలవాడు, వరుణుడు, పడమటి దిక్పతి :-
[10.2-773-చ.]

3180} పాషండాదులు  - పాషండ కాపాలిక బౌద్ధ చార్వాక జైన శైవ శాక్త గాణాపత్యాది మతస్థుల మార్గములు :-
[10.1-1504.1-ఆ.]

3181} పాషాండమతములు  - పాషండ కాపాలిక బౌద్ధ చార్వాక జైన శైవ శాక్త గాణాపత్యాది మతస్థుల మార్గములు :-
[2-196-మ.]

3182} పాషాండులు  - వేదోక్త ధర్మములకు దూరమైనవారు, పాషండ కాపాలిక బౌద్ధ చార్వాక జైన శైవ శాక్త గాణాపత్యాది మతస్థులు :-
[5.1-175-వ.]

3183} పింజ  - బాణము వెనుక నారిని సంధించుటకైన రెక్కలవంటివి :-
[10.2-853-చ.]

3184} పింజపింజకఱవగా  - పింజ (బాణమునకు వెనుక చివర) పింజను తగులుతూ వెళ్ళేలా (బాణములు వేగంగా వేయుట) :-
[4-334-మ.]

3185} పింజపింజతోదాకుట  - ప్రతిబాణము పింజతోను ఇంకో బాణము తాకుతుండుట :-
[10.2-436-ఉ.]

3186} పిండము  - (నిందా పూర్వకముగ) భోజనము, తద్దినము రోజు గుండ్రముగ చేయు ముద్దలు :-
[1-314-క.]

3187} పితలు  - పంచచత్వారింశత (49) అగ్నులలోని వారు, కవ్యవాహనులు, పిత్రుదేవతల కవ్యములను తీసుకుపోవు అగ్నులు? :-
[4-34-వ.]

3188} పితామహుడు  - తండ్రికి తండ్రి తాత, అందరి తండ్రులను పుట్టించినవాడు, బ్రహ్మ :-
[2-199-వ., 3-370-వ., 6-252-వ., 10.1-1648-మ.]

3189} పితృఋణము  - ప్రజాసృష్టి ద్వారా తీర్చుకొనునది :-
[6-252-వ.]

3190} పితృదేవతలు  - వసురుద్రాది రూపులైన అగ్నిష్వాత్తుడు కవ్యవాహనుడు మొదలైనవారు (పాలపర్తి నాగేశ్వర్లు శాస్త్రులు వారి దశమ స్కంధము), 2. దేవతలవలె మాన్యులైన పితరులు. (ఆంధ్ర శబ్ధరత్నాకరము) :-
[10.1-173-వ.]

3191} పితృపతి  - పితరుల ఱేడు, యముడు :-
[5.2-47-క.]

3192} పితృపితామహాది  - తండ్రి తాత మొదలగు వారినుండి వచ్చెడివి, వంశపారంపర్యము :-
[5.1-97-వ.]

3193} పితృహూ  - పితృదేవతలను ఆహ్వానించెడిదికి సంకేతము, కుడిచెవి :-
[4-768-వ.]

3194} పినాకుడు  - పినాకము అను విల్లు ధరించువాడు, శివుడు :-
[3-323-క.]

3195} పిప్పలుడు  - పిప్పలాచార్యుడు తత్వశాస్త్రవేత్త :-
[2-204.1-తే.]

3196} పిశాచము  - దేవయోని విశేషము, దేహమున మాంసముపై ఆధార పడి వర్తించు శక్తులు, పిశాచ బేధము :-
[2-274.1-తే., 6-307-వ., 10.2-405-చ.]

3197} పిశితాశనుడు  - పిశితము (మాంసము) అశనుడు (ఆహారముగా కలవాడు), రాక్షసుడు :-
[10.2-1254-వ.]

3198} పీట  - కూర్చొనుటకైన క్రింద కోళ్ళు గల బల్ల, పీటలలో కొన్ని రకాలు నేల పీట, ఎత్తు పీట, ముక్కాలి పీట, పీఠ (ప్ర) పీట (వి) :-
[10.1-310-మత్త.]

3199} పీఠార్ధము  - అర్ధసింహాసన మిచ్చుట అను గౌరవము. :-
[1-366.1-ఆ.]

3200} పీతకౌశేయవాసుడు  - పచ్చని పట్టువస్త్రము ధరించినవాడు, విష్ణువు :-
[3-145.1-తే.]

3201} పీతాంబరధారి  - పచ్చని వస్త్రములు ధరించువాడు, హరి :-
[1-218-వ.]

3202} పీతాంబరుడు  - పచ్చని బట్టలు ధరించు వాడు, కృష్ణుడు, విష్ణువు :-
[10.2-406-వ.]

3203} పీతావాసుఁడు - పచ్చని పట్టువస్త్రము ధరించిన వాడు, విష్ణువు :-
[2-237-మ.]

3204} పుంఖానుపుంఖము  - పుంఖము (బాణము వెనుక పింజె) తరువాత పుంఖముగ, ఎడతెరపిలేని బాణ ప్రయోగము :-
[9-454-మ.]

3205} పుండరీకనయనుడు  - తెల్లతామరల వంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[2-214-మ., 10.1-968-వ.]

3206} పుండరీకనేత్రుడు  - తెల్లతామరల వంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[10.2-1318-చ.]

3207} పుండరీకలోచనుడు  - తెల్లతామరల వంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[3-225-తే., 3-398-చ.]

3208} పుండరీకాక్షుడు  - పుండరీకము (తెల్లతామర)ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[1-214-వ., 1-235.1-ఆ., 1-396-వ., 2-49.1-తే., 2-107-వ., 2-174-వ., 2-186-వ., 2-199-వ., 2-228.1-తే., 2-238-వ., 2-248-వ., 2-253.1-తే., 3-79-వ., 3-100-వ., 3-150-వ., 3-184-వ., 3-205-వ., 3-263-తే., 3-309.1-తే., 3-334-వ., 3-344-వ., 3-344-వ., 3-507-వ., 3-649-వ., 3-667-వ., 3-673-తే., 3-697-వ., 3-787-తే., 3-824-వ., 3-1000-వ., 3-1007-వ., 3-1051-వ., 3-1055-గ., 4-135-వ., 4-193.1-తే., 4-468-వ., 5.1-4-వ., 5.1-42-వ., 5.1-180-వ., 5.2-115-వ., 6-168-వ., 6-486.1-తే., 11-18-వ., 11-77-వ.]

3209} పుండరీకాయతాక్షుడు  - పుండరీకములు (తెల్లతామర) వలె ఆయత (విశాలమైన) అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు :-
[4-963.1-తే.]

3210} పుండ్రేక్షుకోదండుడు  - పుండ్ర (నలుపు కలసిన ఎఱ్ఱ చెఱకు) ఇక్షు (చెరకుగడ)ను కోదండుడు (విల్లుగా ధరించినవాడు, మన్మథుడు :-
[6-446.1-తే.]

3211} పుంశ్చలి  - పురుషుని చూచి చలించునట్టి ఆడుది, రంకుటాలు :-
[6-225.1-ఆ.]

3212} పుంసవనము  - గర్భచిహ్నము తెలిసాక పుత్ర సంతానము గావలె నని చేసెడి కర్మము (శుభకార్యము) :-
[6-521-వ.]

3213} పుక్కలి  - బుగ్గల లోపల భాగం :-
[10.2-333-చ.]

3214} పుట్టించెదవు - చతుర్ముఖబ్రహ్మ రూపమున రజోగణముచే సృష్టించెదవు :-
[10.1-1180.1-ఆ.]

3215} పుడమిఱేడు  - పుడమి (భూమి)కి ఱేడు (ప్రభువు), రాజు :-
[9-48-వ.]