పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (విషగళుడు - వ్రేల్మిడి)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


4815} విషగళసఖుడు - విషగళు (శివు)ని సఖుడు, విష్ణువు :-
[10.1-233-క.]

4816} విషగళుడు  - విషమును కంఠమున ధరించినవాడు, శంకరుడు :-
[10.1-233-క.]

4817} విషధరము  - విషము ధరించునది, సర్పము. :-
[2-274.1-తే.]

4818} విషధరరిపుగమనుడు - విషధరరిపు (గరుత్మంమతు)నిపై గమనుడు (పోవువాడు), విష్ణువు :-
[10.1-233-క.]

4819} విషధరరిపుడు  - విషధర (సర్పములకు) రిపుడు (శత్రువు), గరుత్మంతుడు :-
[10.1-233-క.]

4820} విషధి  - విషము (నీటి)కి నిధి, సాగరము :-
[8-175.1-ఆ.]

4821} విషభవభవజనకుడు - విషభవభవు (బ్రహ్మదేవు) నికి జనకుడు, విష్ణువు :-
[10.1-233-క.]

4822} విషభవభవుడు  - విష (నీటియందు) భవ (పుట్టెడిది) యైన పద్మమున భవ (పుట్టినవాడు), బ్రహ్మ :-
[10.1-233-క.]

4823} విషముని  - రాగద్వేషాదిగుణములచే విషమమైన బుద్ధి కలవాడు :-
[7-3.1-ఆ.]

4824} విషయత్వములేనిది  - విషయత్వము (ఇంద్రియార్థములైన 1శబ్ద 2స్పర్శ 3రూప 4రస 5గంధ లక్షణము లేవియును) లేనిది, ఇంద్రియముల కందనిది, విష్ణుదేవుని నిర్గుణ శ్రీవిభూతి. :-
[10.1-553.1-ఆ.]

4825} విషయములు  - ఇంద్రియములకు గోచరము అగునవి, ఇంద్రియార్థములు :-
[1-130-వ., 1-329-వ., 3-308.1-తే., 3-346-వ., 3-756-వ.]

4826} విషరుహలోచనుడు  - విషరుహ (నీటపుట్టు పద్మము)ల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు :-
[10.1-655-క.]

4827} విషశయనుడు  - విష (జలము)పై శయనుడు, విష్ణువు :-
[10.1-233-క.]

4828} విషువు  - పగలు రాత్రి సమానముగ నుండు దినములు, (1)మార్చి21న వచ్చెడి ఉత్తర (వసంత) విషువు మొదటిది, (2)సెప్టంబరు 21న వచ్చెడి దక్షిణ (శరత్) విషువు రెండవది, వ్యు, విషు+వా+క, విషు దినరాత్ర్యోః సామ్యం వాతి :-
[5.2-78-వ.]

4829} విషూచి  - 1. మనసు, విష్వచ్ఛ, విషూచీన, (విష్వ అంటే వ్యాపతౌ, వాచస్పతం) అన్ని వైపులకు (పరిపరి విధాల) పోవునది, 2. వ్యు. విశిష్టా సూచీ ఇవ ప్రాదిన, అజీర్ణ ప్రకుపితమైన వాయువుచే ఒడలెల్ల సూదులు గ్రుచ్చినట్లగు వ్యాధి :-
[4-768-వ., 4-853-వ.]

4830} విష్కంభఅంగహారము  - విషయమును విరివిగా సూచించునవి, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4831} విష్ణుచక్రము  - విష్ణుమూర్తి యొక్క చక్రాయుధము, పేరు సుదర్శన చక్రము. :-
[5.2-108-తే.]

4832} విష్ణునిఅష్టాయుధములు  - 1 శంఖము పాంచజన్యము 2 చక్రము సుదర్శనము. 3 విల్లు శారజ్ఞము, 4కత్తి నందకము 5పద్మము 6 గద కౌమోదకి 7 దండము 8శూలము :-
[4-902.1-తే.]

4833} విష్ణుపది  - విష్ణుమూర్తి పాదమున పుట్టినది, గంగ :-
[1-499-వ., 10.1-13-క.]

4834} విష్ణుపరిచరులు  - జయ, విజయ, సునందుడు, నందుడు, కుముదుడు మున్నగువారు :-
[4-371-వ.]

4835} విష్ణుమూర్తి పరికరాదులు  - (అ)ఆయుధములు 1ధనుస్సు శాఙ్గము 2గద కౌమోదకి 3శంఖము పాంచజన్యము 4చక్రము సుదర్శనము 5కత్తి నందకము (ఆ)రథము శతానందము (ఇ)సేనానాయకుడు విష్వక్సేనుడు :-
[8-98-మ.]

4836} విష్ణుమూర్తిగద  - కౌమోదకి, వ్యుత్పత్తి. కుం భూమిం మోదయతి హర్షయతీతి కుమోదకో విష్ణుః తస్యేయం కౌమోదకీ, తా. భూమిని సంతోషింపజేయు విష్ణు సంబంధమయినది :-
[10.2-157-మ.]

4837} విష్ణుమూర్తిసాధనములు  - 1చక్రము (సుదర్శనము) 2గద (కౌముదకి) 3శంఖము (పాంచజన్యము) 4ఖడ్గము (నందకము) 5చర్మము (డాలు) (శతచంద్రము) 6విల్లు (శార్ఙ్గము) :-
[6-307-వ.]

4838} విష్ణురాతుడు  - విష్ణువు చే కాపాడబడిన వాడు, పరీక్షితుడు :-
[2-222-వ.]

4839} విష్ణువు  - 1. శ్రీమన్నారాయణుడు, హరి, 2. సృష్టికి లోపల బయట నిండి (వ్యాపించి) ఉన్నవాడు, 3. ద్వాదశాదిత్యులలో ఒకడు., 4వ్యు. విష వ్యాప్తౌ + నుక్, విశ ప్రవేశే + నుక్ పృషో, అన్నింటిలోనూ వ్యాపించిన యున్నవాడు, అన్నింటిలోనూ ప్రవేశించి యున్నవాడు :-
[1-185-మ., 1-290-చ., 2-236-మ., 2-269-వ., 3-96-క., 3-148-మ., 3-197-క., 3-365-క., 3-400-మ., 3-448-క., 4-16-చ., 4-702.1-తే., 7-169.1-తే., 7-195-వ., 7-246-క., 8-94-ఆ., 8-105-మ., 9-3.1-తే., 9-82.1-తే., 9-170.1-తే., 10.1-4-క., 10.1-14.1-తే., 10.1-109-క., 10.1-187-ఉ., 10.1-582-ఆ., 10.1-1182-శా., 10.2-67-వ., 10.2-130-ఆ., 10.2-906-క., 11-76-ఆ., 11-77-వ.]

4840} విష్ణువుయెప్పుడునుండుచోటులు  - వైకుంఠము, సత్పురుషుల హృదయములు మున్నగునవి :-
[10.2-256-వ.]

4841} విష్వక్సేనుడు  - 1. విష్ణుమూర్తి యొక్క సేనాని, ఇతనినే వైష్ణవ సంప్రదాయమున విఘ్నేశ్వరుడందురు, ఇతను బృహదిషుని వంశస్థుడైన బ్రహ్మదత్తుని కొడుకు. 2. అంతటను వ్యాపించిన సేన కలవాడు, విష్ణువు :-
[4-642-వ., 5.2-74.1-తే., 10.1-1341-శా.]

4842} విస్ఫురద్రాజకళాధరుడు  - బాగా కనబడుతున్న చంద్రకళను ధరించినవాడు, శివుడు :-
[10.2-1147-ఉ.]

4843} విహంగకులరాజు  - విహంగ (పక్షుల) కులమునకు రాజు, గరుత్మంతుడు :-
[7-290-వ.]

4844} విహంగకులేశ్వరుడు  - విహంగ (పక్షుల) కులమునకు ప్రభువు, గరుడుడు :-
[4-278.1-తే.]

4845} విహంగవిభుడు  - పక్షులకు ప్రభువు, గరుత్మంతుడు :-
[3-123.1-తే.]

4846} విహగపరివృఢుడు  - విహగ (పక్షులకు) పరివృఢుడు (ప్రభువు), గరుత్మంతుడు :-
[8-136-వ.]

4847} విహగేంద్రుడు  - విహగము (పక్షి)లందు ఇంద్రుడు (శ్రేష్ఠుడు), గరుడుడు :-
[10.1-705-ఉ.]

4848} విహ్వలము  - భయాదులచేత అవయవముల స్వాధీనము తప్పుట :-
[8-95-మ.]

4849} విహ్వలుడు - భయాదులచే అవయవముల పట్టు తప్పినవాడు :-
[1-432-వ.]

4850} వీణ  - విపంచి, తంత్రీవాద్య విశేషము (సరస్వతి వీణ 'కచ్ఛపి', నారదుని వీణ 'మహతి', తుంబురుని వీణ పేరు 'కళావతి', వినాయకుని వీణ పేరు 'లకుమి'. విశ్వ వసువు వీణ పేరు 'బృహతి', రావణబ్రహ్మ 'రుద్రవీణ' ప్రసిమైనవి 'బొబ్బిలివీణ', 'తంజావూరు వీణ', 'సరస్వతీ వీణ') :-
[10.2-181.1-ఆ.]

4851} వీధులు  - ఇండ్లవరుసల మధ్యనుండు దారులు, మార్గములు :-
[10.1-1247-మ.]

4852} వీరమోహిని  - వీరులను మోహింపజేయు నామె, వీరత్వమును మోహించునామె :-
[10.2-1168-ఆ.]

4853} వీరవర్యాభిలాషుడు  - వీరవర్యులచేత అభిలషింపదగినవాడు, రాముడు :-
[12-53-మాలి.]

4854} వీరవిద్యాభిలాషుడు  - వీరత్వము చూపుటందు ఆసక్తికలవాడు, రాముడు :-
[9-735-మాలి.]

4855} వీరశార్దూలుడు  - వీరులలో పులి వంటి వాడు, కృష్ణుడు :-
[10.2-140-ఉ.]

4856} వీరాసనము  - యోగాసనములలో నొకటి, పాదములు రెండును రెండవ తొడపక్కకి వచ్చెడి భంగిమగల ఆసనము :-
[5.1-131-ఆ.]

4857} వీరుడు  - వీరత్వము అదికముగా కలవాడు, కృష్ణుడు :-
[10.1-1187-ఉ.]

4858} వీర్యము  - రేతస్సు, శుక్రము :-
[5.2-111.1-తే.]

4859} వృకము  - తోడేలు వ్యు. వృక్+క, వారకః మార్గస్య, మార్గమునకు అడ్డు తగులునది. :-
[4-640-వ.]

4860} వృకుడు+అను  - వృకుడను, ఉకార సంధి :-
[10.2-1237-క.]

4861} వృకోదరుడు  - వృకము వంటి పొట్ట ఉన్నవాడు, భీముడు :-
[1-234-వ.]

4862} వృక్షరాజము  - వృక్షములలో రాజు వంటివి, మహావృక్షములు :-
[5.2-20-వ.]

4863} వృత్రారి  - వృత్రాసురుని చంపినవాడు, ఇంద్రుడు :-
[10.2-624-క.]

4864} వృద్ధశ్రవుడు  - వృద్ధ (పండితుల)చే శ్రవుడు (కీర్తింపబడు) వాడు, ఇంద్రుడు :-
[3-176-క.]

4865} వృషభము  - ఎద్దు, ఋషభము (ప్రకృతి) వృషభము (వికృతి), ఋషభము రేఫ, ఈశానుని (శివుని) వాహనము, వ్యు, వృష+అభచ్, వర్షతి కామాన్, కోరికలను పూరించునది. వ్యు. ఋష్+అభచ్, ఋషతి గచ్ఛతి శ్రేష్ఠశ్చ, వెళ్లునది; శ్రేష్ఠమైనది. ఎద్దు. :-
[2-139-వ.]

4866} వృషభాసురుడు  - ఎద్దు రూపమున ఉన్న అసురుడు :-
[2-190-చ.]

4867} వృషభేంద్రము  - వృషభము (ఆబోతులలో) ఇంద్రము (శ్రేష్ఠము), నంది, శివుని వాహనము :-
[4-16-చ., 10.2-403.1-తే.]

4868} వృషలి  - వ్యు. వృష (వర్షణే) + కలచ్ (జీష్), కృ.ప్ర., శూద్రజాతిస్త్రీ, కన్యక, రజస్వల అయి తండ్రి ఇంట ఉన్న పడచు :-
[6-96-క., 6-135.1-ఆ.]

4869} వృషలుడు  - శూద్రునికి బ్రాహ్మణస్త్రీ యందు పుట్టినవాడు :-
[6-521-వ.]

4870} వృషాకపి  - 1. విష్ణువు, వ్యు. వృష+న+కంప+ఇన్, న ో పః, కృప్ర., 2. ధర్మమునకు లోపము రానీయనివాడు. 3. శంకరుని అంశతో పుట్టిన భూతునకు సురూప అనే భార్య వల్ల పుట్టిన అనేకులలో వృషాకపి ఒకరు, వారు కోట్లకొలది రుద్రగణాలు, రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, అగ్రుడు, వృషాకపి, అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాంతుడు, రుద్రపారిషదులు, ప్రేతలు, వినాయకులు. :-
[11-77-వ.]

4871} వృష్ణికులప్రదీపకుడు  - వృష్ణి కులమును ప్రకాశింపజేయువాడు, ఉద్ధవుడు. :-
[3-50-చ.]

4872} వృష్ణికులాంభోజసూర్యుడు  - వృష్ణి అనెడి కుల (వంశము) అనెడి అంభోజ (పద్మము)నకు సూర్యునివంటివాడు, కృష్ణుడు :-
[10.1-579-క.]

4873} వృష్ణిపుంగవుడు  - వృష్ణి వఁశమున శ్రేష్ఠుడు, ఉద్దవుడు. :-
[3-53-చ.]

4874} వృష్ణులు  - వృష్ణివంశపు యాదవులు :-
[7-18-శా.]

4875} వెంటంబడి  - వెంబడించి, చతుర్దశేంద్రియ వ్యాపారములను విష్ణుని యందె చేర్చి వెంటబడుట పరమ భక్తి :-
[10.1-555-శా.]

4876} వెక్కిరించు  - వికారపు చేష్టలతో అపహాస్యము చేయుట :-
[10.2-544.1-తే.]

4877} వెడవిలతుడు  - వెడ (పూల) విలతుడు (ధనుస్సు కలవాడు), మన్మథుడు, వ్యు. (వెడ + విల్లు కలవాడు) బ.వ్రీ :-
[9-569-క.]

4878} వెన్నుడు(వి)  - విష్ణువు (ప్ర) :-
[10.1-335-వ., 10.1-960-వ., 10.1-1400-క., 10.1-1443-శా., 10.2-196-క.]

4879} వెలచేడియ  - ధరకు స్త్రీ, వేశ్య :-
[9-378-ఉ.]

4880} వెలది  - వెలది (నిర్మలము)గలామె, స్త్రీ, భార్య :-
[7-416.1-ఆ., 10.1-1252.1-తే.]

4881} వెలయాలు  - వెలయు (ఆవిధమగ నటించునది) ఆలు, వెలకి వచ్చు ఆలు (స్త్రీ), వేశ్య :-
[3-477-మ.]

4882} వెలి  - శరీరములకు వెలుపలది, బాహ్యసంసారము (ఆలుబిడ్డాలాది) :-
[10.1-8-ఆ.]

4883} వెలుగుఱేడు  - వెలుగు (కాంతులు)గల ఱేడు (రాజు), చంద్రుడు :-
[7-434.1-ఆ., 9-717-వ.]

4884} వేదత్రయము  - 1ఋగ్వేదము 2యజుర్వేదము 3సామవేదము :-
[7-425-వ.]

4885} వేదమయుడు  - వేదములు స్వరూపముగా కలవాడు, విష్ణువు :-
[9-420-క.]

4886} వేదమాత  - వేదములకు తల్లి వంటిది, గాయత్రి :-
[3-56-క.]

4887} వేదమునకు శాఖలు  - ఋక్ యజుస్ సామ అధర్వణ అని 4 శాఖలు :-
[1-63-వ.]

4888} వేదములు  - చతుర్వేదములు, అవి నాలుగు ఋక్ ,యజు, సామ, అధర్వణ వేదములు :-
[1-85.1-ఆ.]

4889} వేదరూపుడు  - వేదములు తన రూపమైనవాడు, విష్ణువు. :-
[12-35-తే.]

4890} వేదవిదులు - వేదాంతార్థములు తెలిసిన బ్రహ్మవేత్తలు :-
[10.1-537-వ.]

4891} వేదవేద్యుడు  - వేదములచే వేద్యుడు (తెలియబడువాడు), విష్ణువు :-
[4-179.1-తే., 6-124.1-ఆ., 10.2-1187-తే.]

4892} వేదవ్యాసునితనయుడు  - శుకయోగి :-
[3-195-క.]

4893} వేదశిరుడు  - వేదమునకు శిరస్సు, ఓంకారము పేరుగల ఒక ముని :-
[4-26-వ.]

4894} వేదసారుడు  - వేదముల యొక్క సారమైనవాడు, విష్ణువు :-
[8-483.1-తే.]

4895} వేదాంగములు  - షడంగములు, 1శిక్ష 2వ్యాకరణము 3చంధస్సు 4నిరుక్తము 5జ్యోతిషము 6కల్పము. పాఠ్యంతరములు కలవు :-
[8-136-వ., 10.1-1412-శా.]

4896} వేదాంతవిభుడు  - వేదాంతములు (ఉపనిషత్తాదులు) యందలి విభుడు (ప్రభువు), విష్ణువు :-
[6-124.1-ఆ.]

4897} వేదాంతవీధులు  - శో. బ్రహ్మానారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః సర్వం నారాయణః నిష్కళంకో నిరంజనో నిర్వికారో నిరాకారో శుద్ధై కో నారాయణఃనద్వితీయోస్థి (నారయణోపనిషత్తు) వంటి ప్రతిపాదనల మార్గములు :-
[10.1-608.1-ఆ.]

4898} వేదాత్మకుడు  - వేదస్వరూపుడు, విష్ణువు :-
[9-205.1-తే.]

4899} వేదాధ్యయనము  - చతుర్వేదములు షష్టాంగకములు ఆదులను అధ్యయనము చేయుట :-
[10.1-1474-ఆ.]

4900} వేధ  - పరబ్రహ్మ స్వరూపము యైనవాడు, విష్ణువు, వ్యు. వి + ధా + అనున్ వేధాదేశః, కృ.ప్ర. :-
[4-704-తే., 4-920-ఉ.]

4901} వేనుడు  - పృథుచక్రవర్తి తండ్రి, అంగుని కొడుకు. క్రూరత్వంతో బ్రాహ్మణ శాపగ్రస్తుడై ప్రాణం వీడెను. కళేబరం తొడలు మధించగా నిషాదుని రూపమున పాపము బయటకు పోయింది. అంత బాహువులు మధించగా విష్ణుమూర్తి అంశతో పృథుచక్రవర్తి పుట్టెను. :-
[7-11-ఉ.]

4902} వేయికన్నులవాడు  - వెయ్యి కన్నులు గలవాడు, సహస్రాక్షుడు, ఇంద్రుడు :-
[8-49.1-ఆ.]

4903} వేయిగన్నులుగలగఱువ  - వేయి (వెయ్యి, 1000) కన్నులు గల గఱువ (ఘనుడు), ఇంద్రుడు :-
[7-228-వ.]

4904} వేయువేలు  - వెయ్యివెయ్యిలు, సహస్రసహస్రములు, పదిలక్షలు, పద్మములు 10,00,000 లు. :-
[10.2-945-క.]

4905} వేయుశిరములభోగి  - వేయు (వెయ్యి (1,000)) శిరముల (తలల) భోగి (పడగల వాడు, దేహము కల వాజు, భోగించువాడు), ఆదిశేషుడు :-
[6-477-తే.]

4906} వేలు  - వేయికి బహువచనము :-
[9-113.1-ఆ.]

4907} వేలుపులతల్లి  - దేవతల అమ్మ, అదితి :-
[8-684-క.]

4908} వేలుపులప్రోలు  - వేలుపుల (దేవతలయొక్క) ప్రోలు (పట్టణము), స్వర్గము :-
[9-61-వ.]

4909} వేల్చుట  - అగ్నిహోత్రమున నేయి మొదలగునవి సమర్పించుట :-
[5.2-58-వ.]

4910} వేల్పుగమికాడు  - వేల్పు (దేవత)లకు గమికాడు (నాయకుడు), బ్రహ్మదేవుడు :-
[10.1-543-వ.]

4911} వేల్పులపెద్ద  - దేవతలందరి లోను అధికుడు , బ్రహ్మదేవుడు :-
[10.1-353.1-ఆ.]

4912} వేల్పులఱేడు  - వేల్పుల(దేవతల) ఱేడు (ప్రభువు), ఇంద్రుడు :-
[7-230-వ.]

4913} వైకారికములు  - సాత్విక అహంకారము, రాజస అహంకారం, తైజసము, తామసాహంకారం తామసము :-
[3-202-వ.]

4914} వైకుంఠనాథుడు  - వైకుంఠమునకు ప్రభువు, విష్ణువు :-
[2-261-క.]

4915} వైకుంఠపురము+కున్  - వైకుంఠపురమునకున్, నుగాగమ సంధి :-
[10.2-1276.1-తే.]

4916} వైకుంఠభర్త  - వైకుంఠమునకు భర్త (ప్రభువు), విష్ణువు :-
[6-486.1-తే.]

4917} వైకుంఠమందిరుడు  - వైకుంఠము నివాసముగా కలవాడ, విష్ణువు, శ్రీకృష్ణుడు :-
[5.1-181-మ.]

4918} వైకుంఠము  - విష్ణులోకము, అక్షయ స్థానము, పరమపదము, వ్యు. వివధాః కుంఠాః ( మాయాః) అస్మిన్ వి+కుంఠ+ (స్వార్థే) అమ్, త.ప్ర., తత్ప్రాప్తికి పెక్కు విరోధములు కలది. :-
[1-50.1-ఆ., 3-203-దం., 9-114-వ., 12-39-వ.]

4919} వైకుంఠుడు  - విష్ణువు, వైకుంఠవాసుడు, చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమెకు జన్మించినవాడు, కుంఠనము (మొక్కపోవుట) లేని వాడు, వ్యు., వికుంఠమే (జ్ఢానమ్) + అణ్, త.ప్ర., జడమైన ప్రకృతికి జ్ఞానమొసగి యుద్దరించిన వాడు. :-
[1-295-భు., 1-384-క., 1-388.1-తే., 3-921-వ., 5.2-58-వ., 6-55.1-తే., 6-331-వ., 7-3.1-ఆ., 7-30-శా., 7-145-శా., 7-170.1-ఆ., 7-239-వ., 7-240.1-తే., 7-259-శా., 7-389-క., 10.1-236-వ., 11-77-వ., 12-18-వ.]

4920} వైఖానసులు  - 1. వానప్రస్థులలో ఒక శాఖ వీరు అకృష్ట (దున్నకుండ లభించినవి) పచ్య (వండినవి) ఐన ఆహారులు (ఆహారం తినువారు) (4 388 వ.) 2. అర్చకులలో విష్ణు అర్చకులలో ఒక తెగవారు. మఱియొక తెగవారు పాంచరాత్రులు మఱియొక తెగ భాగవతులు. 3. విఖనస ధర్మ శాస్త్రాలను అనుసరించే వారు. :-
[4-645-వ.]

4921} వైడూర్యము  - విడూర దేశమున పుట్టిన రత్నములు, పిల్లి కన్ను మణి, :-
[2-230.1-తే.]

4922} వైతరణి  - యమలోకపు దారిలోని నిప్పుల నది, వ్యు. వితరణముల (దానముల)చే దాటబడునది :-
[2-24-మ., 2-26-వ., 5.2-136-వ., 7-364-వ.]

4923} వైదర్భి  - విదర్భదేశ రాకుమారి, భీమకుని పుత్రిక, రుక్మిణి :-
[10.1-1737-వ., 10.2-831.1-తే.]

4924} వైదిక  - వేదంలో చెప్పబడ్డది. వైదిక విధి. :-
[3-131.1-తే.]

4925} వైదికధర్మమార్గనిర్ణేత  - వైదిక (వేదశాస్త్రము లందలి) ధర్మ (ధర్మబద్ధమైన) మార్గ (విధానములను) నిర్ణేత (నిర్దేశించెడివాడు), బ్రహ్మదేవుడు :-
[6-278-ఉ.]

4926} వైదేహుడు  - విదేహరాజ్యమునకు ప్రభువు, జనకుడు :-
[10.2-92.1-తే.]

4927} వైనతేయుడు  - వినతా దేవి యొక్క పుత్రుడు, గరుత్మంతుడు :-
[3-538.1-తే., 3-751-వ.]

4928} వైన్యుడు  - వేనుని పుత్రుడు, పృథువు :-
[4-438-కవి., 4-444-వ., 4-454.1-తే., 4-468-వ., 4-637-ఆ.]

4929} వైమానికులు  - విమానము లందు సంచరించువారు, దేవయోని విశేషములు :-
[8-686-వ., 10.1-153-వ.]

4930} వైయాసి  - వ్యాసుని పుత్రుడు, శుకుడు :-
[2-52-వ.]

4931} వైరాగ్యము  - రాగబంధనములు లేకపోవుట. :-
[2-10-క., 3-203-దం.]

4932} వైరాజపురుషుడు  - (విశ్వముగ) విరాజిల్లుతున్న సామర్థ్య రూపుడు (పురుషుడు), విష్ణువు :-
[3-213-వ.]

4933} వైరోచని  - విరోచనుని పుత్రుడు, బలి :-
[8-180-వ., 8-551-వ., 10.1-1236-దం.]

4934} వైరోచనుడు  - విరోచనునిపుత్రుడు, బలి :-
[8-618-వ.]

4935} వైవస్వతుడు  - వివస్వతుని (సూర్యుని) కుమారుడు, యముడు :-
[10.2-474-వ.]

4936} వైశాఖతానకము  - కిందు మీదుగ శాఖల వలె చేతులు చాచి వేళ్ళు తాడించుకొనుచు నటించుట, రాసక్రీడా పారిభాషిక పదము. :-
[10.1-1084-వ.]

4937} వైష్ణవాలయము  - 1. విష్ణువు యొక్క నివాసము, వైకుంఠము, 2. విష్ణువు ఆరాధించు కోవెల, గుడి :-
[8-558-వ.]

4938} వైష్ణవి  - మాతృకాక్షేత్రమున వైష్ణవి (సర్వ లోకములకు వెలుపల లోపల ఉండెడియామె) :-
[10.1-61-వ.]

4939} వ్యసనము  - కామక్రోధములవలన పుట్టిన దోషము, [ఇవి యేడు. పానము, స్త్రీ, మృగయ, దూతము, (ఇవి కామమువలనఁ బుట్టినవి.) వాక్పారుష్యము, దండపారుష్యము, అర్థదూషణము. (ఇవి కోపమువలనఁబుట్టినవి.)] :-
[1-512-మ., 4-284-చ.]

4940} వ్యాపకము  - ఇది హిందూ తర్క పారిభాషిక పదము. 1. నియత సాహచర్యము వ్యాప్తి, 2. అవినాభావ రూప సంబంధము వ్యాప్తి, 3. ధూమము వ్యాప్యము, 4. అగ్ని వ్యాపకము, 5. వ్యాప్తిసహితమైనది వ్యాప్య మనబడును. 6. వ్యాప్తి నిరూపకము వ్యాపక మనబడును. 7. వ్యాపకమెప్పుడును వ్యాప్యమునకంటె నెక్కుడు ప్రదేశ మాక్రమించుకొని యుండును, అగ్ని లేనిది ధూమ ముండదు. కాని ధూమము లేనిది అగ్ని యుండును. :-
[4-540-వ.]

4941} వ్యాప్యము  - ఇది హిందూ తర్క పారిభాషిక పదము. 1. నియత సాహచర్యము వ్యాప్తి, 2. అవినాభావ రూప సంబంధము వ్యాప్తి, 3. ధూమము వ్యాప్యము, 4. అగ్ని వ్యాపకము, 5. వ్యాప్తిసహితమైనది వ్యాప్య మనబడును. 6. వ్యాప్తి నిరూపకము వ్యాపక మనబడును. 7. వ్యాపకమెప్పుడును వ్యాప్యమునకంటె నెక్కుడు ప్రదేశ మాక్రమించుకొని యుండును, అగ్ని లేనిది ధూమ ముండదు. కాని ధూమము లేనిది అగ్ని యుండును. :-
[4-540-వ.]

4942} వ్యాసనందనుడు  - వ్యాసుని యొక్క కొడుకు, శుకమహర్షి. :-
[9-3.1-తే., 10.1-595-వ.]

4943} వ్యాసునితనయుడు  - వేదవ్యాసుని పుత్రుడు, శుకమహర్షి :-
[3-443-క.]

4944} వ్యాసునిసుతుడు  - శుకమహర్షి :-
[3-261-క.]

4945} వ్యాహృతులు  - 1భూః 2భువః 3సువః వ్యాహృతి త్రయం, 1. భూః, 2. భువః, 3. సువః, 4. మహః, 5. జనః, 6. తపః, 7. సత్యమ్ సప్త వ్యాహృతులు :-
[3-388-వ., 5.1-122-వ.]

4946} వ్యుష్టము  - తెల్లవారకపూర్వపు కాలము, వేకువ :-
[4-390-వ.]

4947} వ్యూహచతుష్టయములు, చతుర్వ్యూహములు - 1వాసుదేవ 2సంకర్షణ 3ప్రద్యుమ్న 4అనిరుద్ధ అనబడు నాలుగు :-
[10.1-1558-వ.]

4948} వ్యూహము  - 1. విశేషమైన శత్రుదుర్భేధ్యమైన సేనా రచనలు, 2. అయిదు విధములైన శ్రీమన్నాకాయణుని స్వరూపములలో 2 వది వ్యూహము, మిగతావి 1. వరము, 3. విభవము, 4. అంతర్యామి, 5. అర్చామూర్తి :-
[10.1-1558-వ.]

4949} వ్రతము  - నిష్ఠ ధరించి చేసెడిది, ఉపవాసాది పుణ్యకర్మము,, వ్యు. వ్రజ (గతౌ)+ఘ జన్య తః, వృషో. కృ.ప్ర. :-
[6-521-వ.]

4950} వ్రాత్యుడు  - ఉపనయనాది సంస్కారములు లేని ద్విజుడు, సంస్కారరహితుడు :-
[12-8-వ.]

4951} వ్రేపల్లె  - రామ కృష్ణులు చిన్నతనము గడపిన నందుని మంద :-
[10.2-483.1-తే.]

4952} వ్రేల్మిడి  - చిటికవేసినంత తొందరగా, త్రుటి :-
[6-512-తే.]