పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పటములు : Test-2

సూర్య వంశ విస్తారం పాఠ్య రూపంలో వీక్షించుటకు ఇక్కడ తట్టండి

సూర్య వంశం వర్ణనలో - శ్రాద్ధదేవుడి వంశక్రమం

ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు 33:-
+ ఇళాకన్యక / సుద్యుమ్నుడు; అదితి; అశ్వనీ దేవతలు; ఇక్ష్వాకుడు; కవి; కశ్యపుడు; గరూశకుండు; చతుర్ముఖ బ్రహ్మ; ఛాయ; తపతి; దక్షుడు; దిష్టుడు; ధృష్టుడు; నభగుడు; నరిష్యంతుడు; నిర్మోహుడు: ;నృగుడు; ప్రముఖులు; బడబ; మరీచి; యముడు; యమున; విరజుడు; విశ్వకర్మ; విష్ణువు; వృషద్ధ్రుడు; శనైశ్వర్యుడు; శర్యాతి; శ్రద్ధ; శ్రాద్ధ దేవుడు; సంజ్ఞ; సూర్యసావర్ణి మనువు; సూర్యుడు.

. . శ్రాద్ధ దేవుడు.

శ్రీరామ సూర్యవంశము పద్మనాభుడు- 1. చతుర్ముఖబ్రహ్మ- 1-1. సనకుడు, 1-2. సనందనుడు, 1-3. సనత్కుమారుడు, 1-4. సనత్సుజాతుడు, 1-5. నీలలోహితుడు / రుద్రుడు, 1-6. దక్షుడు, 1-7. నారదుడు, 1-8. పులహుడు, 1-9. భృగువు, 1-10. క్రతువు, 1-11. అంగిరసుడు, 1-12. వసిష్ఠుడు, 1-13. మరీచి, 1-14. అత్రి, 1-15. పులస్త్యుడు, 1-16. వాణి, 1-17. నిరృతి, 1-18. కర్దముడు, 1-19. స్వాయంభువుడు + శతరూప 1-13.మరీచి- 1. కశ్యపుడు, భార్య దక్షపుత్రి 48/60. అదితి- ద్వాదశాదిత్యులు, వివస్వతుడు 1., అర్యముడు 2., పూషుడు 3., త్వష్ట 4., సవిత 5., భగుడు 6., ధాత 7., విధాత 8., వరుణుడు 9., మిత్రుడు 10., శక్రుడు 11., ఉరుక్రముడు 12. 1-13-1-1.సూర్యుడు / వివస్వతుడు.- భార్యలు సంజ్ఞ 1., ఛాయ 2., బడబ 3. సంజ్ఞాదేవి 1.- పుత్రుడు శ్రాద్ధదేవుడు / వైవస్వతుడు (1/14 వ. మనువు) మఱియు యముడు, యమి అనే కవలలు ఛాయ 2.- పుత్రులు సూర్యసావర్ణి మనువు (8/14 వ. మనువు), శనైశ్వరుడు, పుత్రిక తపతి. సూర్య సావర్ణి మనువు- పుత్రులు నిర్మోహుడు, విరజుడు మున్నగువారు బడబ 3.- పుత్రులు ఇద్దరు అశ్వనీ దేవతలు. పోయిన కల్పాంతము నందలి ద్రావిడ దేశపు రాజు సత్యవ్రతుడు. ఆయన సూర్యునికి పుట్టి వైవస్వత మనువు అయ్యాడు. సూర్య వంశ విస్తారము (1 వ. తరం) శ్రాద్ధదేవుడు (1/14 వ. వైవస్వత మనువు), భార్య శ్రద్ధ- పుత్రిక/పుత్రుడు ఇళాకన్యక / సుద్యుమ్నుడు (నెల విడిచి నెల);పుత్రులు పదిమంది. ఇక్ష్వాకుడు (1, నృగుడు (2, శర్యాతి (3, దిష్టుడు (4, ధృష్టుడు (5, కరూశకుడును (6, నరిష్యంతుడు (7, పృషద్రధుడు (8, నభగుడు (9, కవి (10. (2 వ. తరం) మను పుత్రుడు / పుత్రిక- ఇళాకన్యకగా, చంద్రపుత్రుడైన బుధుడుతో- పుత్రుడు పురూరవుడు సుద్యుమ్నుడుగా- పుత్రులు ముగ్గురు. ఉత్కళుడు, గయుడు, విమలుడు. (2 వ. తరం) ఇక్ష్వాకుడు, పుత్రులు నూరు మంది, వారిలో వికుక్షి / శశాదుడు, నిమి, దండకుడు పెద్దకొడుకులు, శ్రీరాముడు పుట్టిన సూర్యవంశంలోని ఇక్ష్వాక పుత్రుడైన వికుక్షి వంశ విస్తారము. (3 వ. తరం) వికుక్షి- కొడుకు పురంజయుడు / అమరేంద్రవాహుడు / కకుత్సుడు- పుత్రుడు (4 వ. తరం) అనేనసుడు- పుత్రుడు (5 వ. తరం) పృథువు- పుత్రుడు (6 వ. తరం) విశ్వగంధుడు- పుత్రుడు (7 వ. తరం) చంద్రుడు- పుత్రుడు (8 వ. తరం) యవనాశ్వుడు- పుత్రుడు (9 వ. తరం) శవస్తుడు (శావస్తి నగర నిర్మాత)- పుత్రుడు (10 వ. తరం) బృహదశ్వుడు- పుత్రుడు (11 వ. తరం) కువలయాశ్వుడు / దుందుమారుడు- పుత్రులు దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు (12 వ. తరం) దృఢాశ్వుడు- పుత్రుడు (13 వ. తరం) హర్యశ్వుడు- పుత్రుడు (14 వ. తరం) నికుంభుడు- పుత్రుడు (15 వ. తరం) బర్హిణాశ్వుడు- పుత్రుడు (16 వ. తరం) కృతాశ్వుడు- పుత్రుడు (17 వ. తరం) సేనజిత్తు- పుత్రుడు (18 వ. తరం) యువనాశ్వుడు- పుత్రుడు (19 వ. తరం) మాంధాత / త్రసదస్యుడు, భార్య శతబిందుని కూతురగు బిందుమతి- పుత్రులు అంబరీషుడు (తాత యువనాశ్వునికి పెంపుడు కొడుకు), పురుక్సుతుడు, ముచుకుందుడు, పుత్రికలు- 50 మంది భర్త సౌభరి ముని. (19 వ. తరం) (యువనాశ్వుని పెంపుడు కొడుకూ మాంధాత పుత్రుడూ ఐన) అంబరీషుడు- పుత్రుడు (20 వ. తరం) యౌవనాశ్వుడు- పుత్రుడు (21 వ. తరం) హారితుడు (20 వ. తరం) పురుక్సుతుడు, నాగకన్య నర్మద- పుత్రుడు (21 వ. తరం) త్రసదస్యుడు- పుత్రుడు (22 వ. తరం) అనరణ్యుడు- పుత్రుడు (23 వ. తరం) హర్యశ్వుడు- పుత్రుడు (24 వ. తరం) అరుణుడు- పుత్రుడు (25 వ. తరం) త్రిబంధనుడు- పుత్రుడు (26 వ. తరం) సత్యవ్రతుడు / త్రిశంకుడు- పుత్రుడు (27 వ. తరం) రోహితుడు- పుత్రుడు (28 వ. తరం) హరితుడు- పుత్రుడు (29 వ. తరం) చంపుడు (చంపానగర నిర్మాత) నిర్మించె- పుత్రుడు (30 వ. తరం) సుదేవుడు- పుత్రుడు (31 వ. తరం) విజయుడు- పుత్రుడు (32 వ. తరం) రురుకుడు- పుత్రుడు (33 వ. తరం) వృకుడు- పుత్రుడు (34 వ. తరం) బాహుకుడు- పుత్రుడు (35 వ. తరం) సగరుడు, ఒక భార్య- పుత్రులు అందరూ కపిలుని కంటిమంటకు ఆహుతయ్యారు. సగరుడు, మరొక భార్య కేశిని- పుత్రుడు (36 వ. తరం) అసమంజసుడు- పుత్రుడు (37 వ. తరం) అంశుమంతుడు- పుత్రుడు (38 వ. తరం) దిలీపుడు- పుత్రుడు (39 వ. తరం) భగీరథుడు (గంగను భూమికి తెచ్చెను వ. తరం) – పుత్రుడు (40 వ. తరం) శ్రుతుడు- పుత్రుడు (41 వ. తరం) నాభావరుడు- పుత్రుడు (42 వ. తరం) సింధుద్వీపుడు- పుత్రుడు (43 వ. తరం) అయుతాయువు- పుత్రుడు (44 వ. తరం) ఋతుపర్ణుడు- పుత్రుడు (45 వ. తరం) సర్వకాముడు- పుత్రుడు మదయంతి భర్త ఐన (46 వ. తరం) సుదాసుడు / మిత్రసహుడు / కల్మాషపాదుడు- వసిష్ఠుని వలన మదయంతి యందు కలిగిన పుత్రుడు (47 వ. తరం) అశ్మకుడు- పుత్రుడు (48 వ. తరం) మూలకుడు / నారీకవచుడు- (49 వ. తరం) విశ్వసహుడు- పుత్రుడు (50 వ. తరం) ఖట్వాంగుడు- పుత్రుడు (51 వ. తరం) దీర్ఘబాహుడు- పుత్రుడు (52 వ. తరం) రఘువు- పుత్రుడు (53 వ. తరం) పృథుశ్రవుడు- పుత్రుడు (54 వ. తరం) అజుడు- పుత్రుడు (55 వ. తరం) దశరథుడు- భార్యలు కౌసల్య- పుత్రుడు రాముడు, సుమిత్ర- పుత్రులు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయి- పుత్రుడు భరతుడు. (56 వ. తరం) శ్రీ రాముడు, భార్య సీతాదేవి- పుత్రులు లవుడు, కుశుడు లక్ష్మణుడు- పుత్రులు అంగదుడు, చంద్రకేతుడు భరతుడు- పుత్రులు దక్షుడు, పుష్కలుడు శత్రుఘ్నుడు- పుత్రులు సుబాహుడు, శ్రుతసేనుడు (57 వ. తరం) కుశుడు- పుత్రుడు (58 వ. తరం) అతిథి- పుత్రుడు (59 వ. తరం) నిషధుడు- పుత్రుడు (60 వ. తరం) నభుడు- పుత్రుడు (61 వ. తరం) పుండరీకుడు- పుత్రుడు (62 వ. తరం) క్షేమధన్వుడు- పుత్రుడు (63 వ. తరం) దేవానీకుడు- పుత్రుడు (64 వ. తరం) అహీనుడు- పుత్రుడు (65 వ. తరం) పారియాత్రుడు- పుత్రుడు (66 వ. తరం) బలుడు- పుత్రుడు (67 వ. తరం) జలుడు- పుత్రుడు అర్కసంభవు డగు (68 వ. తరం) వజ్రనాభుడు- పుత్రుడు (69 వ. తరం) శంఖణుడు- పుత్రుడు (70 వ. తరం) విధృతి- పుత్రుడు (71 వ. తరం) హిరణ్యనాభుడు- పుత్రుడు (72 వ. తరం) పుష్యుడు- పుత్రుడు (73 వ. తరం) ధ్రువసంధి- పుత్రుడు (74 వ. తరం) సుదర్శనుడు- పుత్రుడు (75 వ. తరం) అగ్నివర్ణుండు- పుత్రుడు (76 వ. తరం) శీఘ్రుడు- పుత్రుడు (77 వ. తరం) మరువు (సిద్ధుండయి కలాపగ్రామంలో ఉన్నాడు కలియుగాంతమున సూర్యవంశాన్ని మరల పుట్టింప గలడు వ. తరం) - పుత్రుడు (78 వ. తరం) ప్రశుశ్రుకుడు- పుత్రుడు (79 వ. తరం) సంధి- పుత్రుడు (80 వ. తరం) అమర్షణుడు- పుత్రుడు (81 వ. తరం) మహస్వంతుడు- పుత్రుడు (82 వ. తరం) విశ్వసాహ్యుడు- పుత్రుడు (83 వ. తరం) బృహద్బలుడు. పరీక్షిత్కాలానికి భవిష్యద్రాజులు- శ్రీరాముడు పుట్టిన సూర్య వంశంలోని ఇక్ష్వాకుని వంశ విస్తారం. బృహద్బలుడు- పుత్రుడు బృహద్రణుడు- పుత్రుడు ఉరుక్షతుడు- పుత్రుడు వత్సప్రీతుడు- పుత్రుడు ప్రతివ్యోముడు- పుత్రుడు భానుడు- పుత్రుడు సహదేవుడు- పుత్రుడు బృహదశ్వుడు- పుత్రుడు భానుమంతుడు- పుత్రుడు ప్రతీకాశ్వుడు- పుత్రుడు సుప్రతీకుడు- పుత్రుడు మేరుదేవుడు- పుత్రుడు సుతక్షత్రుడు- పుత్రుడు ఋక్షకుడు- పుత్రుడు అంతరిక్షుడు- పుత్రుడు సుతపుడు- పుత్రుడు అమిత్రజిత్తు- పుత్రుడు బృహద్వాజి- పుత్రుడు బర్హి- పుత్రుడు ధనంజయుడు- పుత్రుడు రణంజయుడు- పుత్రుడు సృంజయుడు- పుత్రుడు శాక్యుడు- పుత్రుడు శుద్ధాదుడు- పుత్రుడు లాంగలుడు- పుత్రుడు ప్రసేనజిత్తు- పుత్రుడు క్షుద్రకుడు- పుత్రుడు ఋణకుడు- పుత్రుడు సురథుడు- పుత్రుడు సుమిత్రుడృ; సుమిత్రుని అనంతర కాలంలో సూర్యవంశంబు నశింపఁ గలదు సీతాదేవి పుట్టిన సూర్యవంశంలోనిల ఇక్ష్వాక పుత్రుడైన నిమి వంశ విస్తారము (3 వ. తరం) నిమి- పుత్రుడు జనకుడు / విదేహుడు / మిథిలుడు (మిథిలా నగర నిర్మాత) – పుత్రుడు ఉదావసుడు- పుత్రుడు నందివర్ధనుడు- పుత్రుడు సుకేతుడు- పుత్రుడు దేవరాతుడు బృహద్రథుడు- పుత్రుడు మహావీర్యుడు- పుత్రుడు సుధృతి- పుత్రుడు ధృష్టకేతుడు- పుత్రుడు హర్యశ్వుడు- పుత్రుడు మరువు- పుత్రుడు ప్రతింధకుడు- పుత్రుడు కృతరయుడు- పుత్రుడు దేవమీఢుఁడు- పుత్రుడు విధృతుడు- పుత్రుడు మహాధృతి- పుత్రుడు కీర్తిరాతుడు- పుత్రుడు మహారోముడు- పుత్రుడు స్వర్ణరోముడు- పుత్రుడు హ్రస్వరోముడు- పుత్రుడు సీరధ్వజుడు- పుత్రిక సీత (శ్రీరాముని భార్య), పుత్రుడు కుశధ్వజుడు- పుత్రుడు ధర్మధ్వజుడు- పుత్రుడు కృతధ్వజుడు మితధ్వజుడు కృతధ్వజుడు- పుత్రుడు కేశిధ్వజుడు మితధ్వజుడు- పుత్రుడు ఖాండిక్యుడు- పుత్రుడు భానుమంతుడు- పుత్రుడు శతద్యుమ్నుడు- పుత్రుడు శుచి- పుత్రుడు సనధ్వాజుడు- పుత్రుడు ఊర్ధ్వకేతుడు- పుత్రుడు అజుడు- పుత్రుడు గురుజిత్తు- పుత్రుడు అరిష్టనేమి- పుత్రుడు శ్రుతాయువు- పుత్రుడు పార్శ్వకుడు- పుత్రుడు జిత్రరథుడు- పుత్రుడు క్షేమాపి- పుత్రుడు హేమరథుడు- పుత్రుడు సత్యరథుడు- పుత్రుడు ఉపగురుడు- పుత్రుడు అగ్నిదేవు వరంతో ఉపగుర్వుడు- పుత్రుడు సావనుడు- పుత్రుడు సువర్చసుడు / సుభూషణుడు- పుత్రుడు జయుడు- పుత్రుడు విజయుడు- పుత్రుడు ధృతుడు- పుత్రుడు అనఘుడు- పుత్రుడు వీతిహవ్యుడు- పుత్రుడు ధృతి- పుత్రుడు బహుళాశ్వుడు- పుత్రుడు కృతి- పుత్రుడు మహావశియు. (2వ. తరం) నృగుడు (2,- పుతుడు సుమతి - పుత్రుడు భూతజ్యోతి- పుత్రుడు వసువు- పుత్రుడు ప్రతీతుడు- ఓఘవంతుడు- కూతురు ఓఘవతి, భర్త సుదర్శనుడు. (2వ. తరం) శర్యాతి (3, - పుత్రిక సుకన్య, పుత్రులు ఉత్తానబర్హి, ఆనర్తుడు, భూరిషేణుడు సుకన్య, భర్త చ్యవనుడు. ఉత్తానబర్హి- పుత్రులు పదిమంది ప్రచేతసులు- దక్షుడు. శర్యాతి- పుత్రుడు రైవతుడు (సముద్రంలో కుశస్థలి అను పట్టణ నిర్మాత)- కుమార్తె రైవతి, భర్త బలరాముడు. (2వ. తరం) దిష్టుడు (4,- నాభాగుడు- పుత్రుడు హలంధనుడు- పుత్రుడు వత్సప్రీతి- పుత్రుడు ప్రాంశువు- పుత్రుడు ప్రమతి- ప్రమతి- పుత్రుడు ఖమిత్రుడు- పుత్రుడు చాక్షుషుడు- పుత్రుడు వివింశతి- పుత్రుడు రంభుడు- పుత్రుడు ఖనిమిత్రుడు- పుత్రుడు కరంధనుడు- పుత్రుడు అవిక్షిత్తు- పుత్రుడు చక్రవర్తి మరుత్తుడు- పుత్రుడు దముడు- పుత్రుడు రాజవర్ధనుడు- పుత్రుడు సుధృతి- పుత్రుడు సౌధృతేయుడు- పుత్రుడు కేవలుడు- పుత్రుడు బంధుమంతుడు- పుత్రుడు వేదవంతుడు- పుత్రుడు బంధుండు- పుత్రుడు తృణబిందువు- కుమార్తె ఇలబిల, కొడుకులు విశాలుడు, శూన్యబంధుడు, ధూమ్రకేతుడు ఇలబిల, భర్త విశ్రవసుడు- ఐలబిలుడు / కుబేరుడు విశాలుడు (వైశాలి నగర నిర్మాత)- పుత్రుడు హేమచంద్రుడు- పుత్రుడు ధూమ్రాక్షుడు- పుత్రుడు సహదేవుడు- పుత్రుడు కృశాశ్వుడు- పుత్రుడు సోమదత్తుడు- పుత్రుడు సుమతి- పుత్రుడు జనమేజయుడు. (వీరిని విశాలులు అందురు) (2వ. తరం) ధృష్టుడు (5,- ధార్ష్యం అను బ్రహ్మణ వంశము. కరూశకుడును (6,- కారూశులు (బ్రాహ్మణులు అయ్యారు) (2వ. తరం) నరిష్యంతుడు (7,- పుత్రుడు చిత్రసేనుడు- పుత్రుడు దక్షుడు- పుత్రుడు మీఢ్వాంసుడు- పుత్రుడు శర్వుడు- పుత్రుడు ఇంద్రసేనుడు- పుత్రుడు వీతిహోత్రుడు- పుత్రుడు సత్యశ్రవుడు- పుత్రుడు ఉరుశ్రవుడు- పుత్రుడు దేవజత్తుడు- పుత్రుడు అగ్నివేశుడు- కానీనుండు / జాతకర్ణ మహర్షి- ఆగ్నివేశ్యాయనం అను బ్రహ్మకులము. (2వ. తరం) పృషద్రధుడు (8,- శాంతుడు, అపుత్రకుడు. (2వ. తరం) నభగుడు (9, పుత్రులు నాభాగుడు మున్నగువారు నాభాగుడు- అంబరీషుడు- పుత్రులు విరూపుడు, కేతుమంతుడు, శంభుడు విరూపుడు- బృషదశ్వుడు- రథీతరుడు- రథీతరునిభర్య యందు అంగిరసుడు అను బ్రహ్మణుని పుత్రులు రథీతరగోత్రులు ఆంగీరసులను బ్రాహ్మణులు. కేతుమంతుడు, శంభుడు- సంతానరహితులు (2వ. తరం) కవి (10.- అపుత్రకుడు.