పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తోత్రాలు కీర్తనలు : అచ్యుతరత్న భాగవతమాల

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :


ఓం ఓం ఓం
ఓం నమో భగవతే వాసుదేవాయ

ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సం
పాదికి, దోషభేదికిఁ, బ్రపన్నవినోదికి, విఘ్నవల్లికా
చ్ఛేదికి, మంజువాదికి, నశేష జగజ్జన నంద వేదికిన్,
మోదకఖాదికిన్, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్.

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

ఆచమనం :-
కేశవ నారాయణ మాధవ గోవిందా...
గాయత్రి జపం, ప్రాణాయామము

సంకల్పం :-
శ్రీమహావిష్ణుసామ్రాజ్యంలో భూలోకములో శోభన ప్రదేశంలో,
కలియుగంలో శుభ ముహూర్తంలో శోభన సమయంలో,
హరితస గోత్రం ఊలపల్లి వంశమునకు చెందిన సాంబశివ రావు
అనే నేను, కుటుంబ పరివార సమేతంగా
భాగవత బంధువులు అందరి మేలు కోరి, లోక క్షేమం కోరి,
శ్రీ భాగవత గ్రంథరూప పరబ్రహ్మను ఉద్దేశించి,
అచ్యుతరత్న భాగవతమాల సంక్షిప్త భాగవత పారాయణం
చేయుచున్నాను.
ఇది సుసంపన్నం అగు గాక. అవిఘ్నంగా కొనసాగు గాక.....

అచ్యుత రత్న భాగవత మాల
శ్రీరామ
అచ్యుతరత్న భాగవతమాల
సంక్షిప్త భాగవత పారాయణం

1
వ్యాస అవతరణం - నారద ఉద్భోదనం
పారిక్షిత విరచితం - శుక ముఖ వినుతం
సూత నోట వితరణం - శౌనకాది సంప్రశ్నం
శ్రీరాముని ఆదేశం - పోతన ప్రసాదం
అశ్వత్థామ దారుణం - కుంతి స్తుతించడం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహారం
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం
2
భీష్మస్తుతి తారణం - ఉత్తరగర్భ రక్షణం
కృష్ణనిర్యాణ శ్రవణం - పాండవ ప్రస్థానం
కలిపురుష నిగ్రహం - శృంగి శాపం
భాగవతపురాణ వైభవం - సృష్టిక్రమ వివరణం
అవతార వైభవం - వైకుంఠ వర్ణనం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహారం
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం
3
బ్రహ్మజన్మ ప్రకారం - సృష్టిభేదనం
వరాహ అవతరణం - భూమ్యుద్ధరణం
సనకాదుల శాపం - హిరణ్యాక్షవరాల వితరణం
వరాహుని విజయం - కపిలుని సాంఖ్యం
దక్షాధ్వర ధ్వంసం - ధృవస్థితి నొందడం
4
వేన చరితం - భూమిని పితకడం
పురంజను కథనం - ప్రచేతసుల తపం
ద్వీపవర్ష నిర్ణయం - ఋషభుని చరితం
భరతుని తపం - జడభరతుని మోక్షం.
భగణ విషయం - చతుర్దశ భువనం
5
అజామిళ కథనం - దేవాసుర యుద్ధం
నారాయణ కవచం - వృత్రాసుర వృత్తాంతం
చిత్రకేతు చరితం - మరుద్గణ జన్మం
ప్రహ్లాద చరితం - నారసింహ విజయం
త్రిపురాసుర సంహారం - ప్రహ్లాద అజగరం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహారం
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం
6
గజేంద్ర మోక్షణం - సముద్ర మథనం
గరళ భక్షణం - అమృత ఆహారం
బలి ప్రహసనం - వామన విజయం
త్రివిక్రమ స్పురణం - మత్స్యావతారం
సూర్యవంశ వర్ణనం - అంబరీష కథనం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహారం
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం
7
భాగీరథ యత్నం - శ్రీరామ జయం
చంద్రవంశ వర్ణనం - యయాతి శాపం
భరతుని చరిత్రం - యదువంశ వృత్తాతం.
దేవకీవసుదేవ వివాహం - ఆకాశవాణి పలకడం
కన్నయ్య జననం - చెరసాల వీడడం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహారం
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం
8
యమునా తరణం - యశోదానందన స్ఫురణం
పూతనాది హరణం - వెన్నదొంగ విహరణం
విశ్వ వీక్షణం - జంటమద్ది గూల్చడం
చల్లులు కుడవడం - కాళీయమర్దనం
వస్త్రాపహరణం - మానస చోరణం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహారం
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం
9
గిరి ధారణం- దావాగ్ని తాగడం
బృందా విహారం - రాసక్రీడా ఖేలనం
అక్రూర పాలనం - త్రివిక్ర విస్ఫురణం
కువలయపీడా హరణం - మల్ల విహారం
కంసాది హరణం - దుష్ట ప్రహరణం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహారం
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం
10
భ్రమరగీతల ఆలాపం - రుక్మిణీ కల్యాణం
ప్రద్యుమ్నాది ఉదయం- శ్యమంతక హరణం
అష్టమహషీ పరిణయం - నరకాసుర వధం
పదాఱువేల కన్యకా గ్రహణం - పారిజాత అపహరణం
ప్రద్యుమ్న కల్యాణం - ఉషాపరిణయం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహారం
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం
11
బాణాసుర గర్వమర్దనం - కాళిందీ భేదనం
పౌండ్రకాది వధం - పదాఱువేల విహరణం
జరాసంధ వధం - శిశుపాల శిక్షణం
పాండవ పాలనం - సాళ్వాదుల హరణం
కుచేల వరదం - యదువృష్ణి వంశం
తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహారం
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం
12
సుభద్రా పరిణయం - విప్రశోక హరణం
ఉద్ధవునకు ఉపదేశం - శ్రీకృష్ణ నిర్యాణం
పరీక్షిత్తు మోక్షం - మార్కండేయ రక్షణం
అచ్యుతరత్న భాగవతమాల - గణనాధ్యాయ దర్శనం
ఇది తెలుగు భాగవతామృతం - సర్వదుఃఖ పరిహారం
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం

ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వేజనాస్సుఖినోభవంతు!!

ఇది శ్రీ అచ్యుతరత్న భాగవతమాల సుసంపూర్ణం.
శ్రీ భాగవత గ్రంథరూప పరబ్మహ్మకు నమస్కారములు.


-x-