పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తోత్రాలు కీర్తనలు : విష్ణు అక్షరమాలా స్తోత్రం

అక్షరమాలా శ్రీ విష్ణుస్తుతి శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని ప్రణీతము.
("అ" నుంచి "క్ష" వరకు గల అక్షరాలను అక్షరమాల అంటారు కదా. ఈ స్తోత్రంలో అక్షరమాల వరసలో పాదాలు మొదలవుతాయి, మన తెలుగు "ఱ" లేదు)

అవ్యయ మాధవ అంతవివర్జిత అబ్ధిసుతాప్రియకాంతహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!!
ఆశరనాశన ఆదివివర్జిత ఆత్మజ్ఞానద నాథహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఇంద్రముఖామర బృందసమర్చిత పాదసరోరుహ యుగ్మహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఈశ్వరసన్నుత ఈతిభయాపహ రాక్షసనాశన దక్షహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఉన్నతమానస ఉచ్చపదప్రద ఉజ్వలవిగ్రహ దేవహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఊర్జోనాశిత శాత్రవసంచయ జలధరఘర్జిత కంఠహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఋషిజనసన్నుత దివ్యకథామృత భవ్యగుణోజ్వల చిత్తహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఋూకారప్రియ ఋక్షగణేశ్వర వందితపాద పయోజహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
* ఌతకసమర్చిత కాంక్షితదాయక కుక్షిగతాఖిల లోకహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
* ౡవల్లోకాచార సమీరిత రూపవివర్జిత నిత్యహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఏకమనో మునిమానసగోచర గోకులపాలక వేషహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఐరావతకర సన్నిభ దోర్బలనిర్జితదానవ సైన్యహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఓంకారాంబుజ వనకలహంసక కలిమలనాశన నామహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఔన్నత్యాశ్రయ సంశ్రితపాలక పాకనిబర్హణ సహజ హరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
అంగదసేవిత భంగవివర్జిత సంగవివర్జిత సేవ్య హరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
అస్తగిరిస్థిత భాస్కరలోహిత చరణసరోజిత లాఢ్యహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
కమలావల్లభ కమలవిలోచన కమలవిభాహర పాదహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఖరముఖదానవ సైనికఖండన ఖేచరకీర్తిత కీర్తిహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
గణపతిసేవిత గుణగణసాగర వరగతినిర్జిత నాగహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఘటికాపర్వత వాసి నృకేసరి వేషవినాశిత దోషహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
జ్ఞః ప్రత్యేకం నయథావాక్యే నాధ తథాతే చిత్తేక్రోధః! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
చపలాభాసుర మేఘనిభప్రభ కమలాభాసుర వక్షహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఛలయుతదూర చలాచలలోచన గోపవథూ హృదయేశహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
జగతీవల్లభ రూపపరాత్పర సర్వజగజ్జన పూజ్యహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఝంకారధ్వనికారి మధువ్రత మంజులకేశ కలాపహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఞాక్షరసంయుత ‘జా’ధాత్వర్థే పరిసిష్టితనైష్ఠిక గమ్యహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
టంకారధ్వనికారి ధనుర్ధర శాతశరాహత దైత్యహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
‘ఠ’మితి మనుంవా ‘స’మితి మనుంవా జపతాంసిద్ధిద నాదహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
డమరుకరేశ్వర పూజితనిర్జిత రావణదానవ రామహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఢక్కావాద్య ప్రియభయవారణ వినయవివర్జిత దూరహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ణట దాత్వర్థే పండితమండిత సకలావయవో ద్భాసిహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
తత్త్వమసీతి వ్యాహృతివాచ్య ప్రాచ్యధినాయక పూజ్యహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
థూత్కారానిల వేగనభోగత సప్తసముద్ర వరాహహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
దయితాలింగిత వక్షోభాసుర భూసురపూజిత పాదహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ధరణీతనయా జీవితనాయక వాలినిబర్హణ రామహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
నారాయణ మాధవ కేశవవామన గోపాలక గోవిందహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
పరమేశ్వర పక్షి కులేశ్వర వాహనమోహన రూపహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
ఫాలవిలోచన పంకజసంభవ కీర్తిత సద్గుణ జాలహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
బలరిపుపూజిత బలజితదానవ బలదేవానుజ బాలహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
భవభయనాశన భక్తజనప్రియ భూభరనాశనకారి హరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
మాయామోహిత సకలజగజ్జన మారీచాసుర మధనహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
యమునాతటినీ వరతటవిహరణ యక్షగణేశ్వర వంధ్యహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
రామరమేశ్వర రావణమర్దన రతిలలనాధవ తాతహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
లక్ష్మణసేవిత మంగళలక్షణ లక్షితశిక్షిత దుష్టహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
వాలివినాశన వారిధిబంధన వనచరసేవిత పాదహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
శంకరకీర్తిత నిజనామామృత శత్రునిబర్హణ బాణహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
షడ్గుణమండిత షడ్దోషాపహ దోషాచరకుల కాలహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
సదయసదాశివ పూజితపాదుక హృదయవిరాజిత దయితహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
హస్త చతుష్టయ భాసురనందక శంఖగదా రథ చరణహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
‘ళుబు,ళుబు’ నిస్వన మజ్జితమంధర పర్వతధారణ కూర్మహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
క్షయితనిశాట క్షాంతిగుణాఢ్య క్షేత్రజ్ఞాత్మక దేవహరే! కృష్ణజనార్దన కృష్ణజనార్దన కృష్ణహరే!
గణపతి పండిత రచితం స్తోత్రం, కృష్ణస్యేదం జయతు ధరణ్యాం! _/||\_ _/||\_ _/||\_
**************************************

*(“అలు- ఌ”; “అలూ - ౡ” అనేవి అచ్చులు కాలప్రభావంలో వాడుక నుండి తప్పుకొని ఉండవచ్చు, కంప్యూటరు ఫాంటులో ఇవి లేకపోవచ్చు కాని, వాటిని ఇలాగే అచ్చులుగా ఉచ్చరించాలని గ్రహించాలి).