పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తోత్రాలు కీర్తనలు : వెంగమాంబ కృష్ణ మంజరి

।।మాతృ శ్రీ తరిగొండ వేంగమాంబ విరచిత శ్రీకృష్ణ మంజరి।।

శ్రీవేంకటేశ! నా చిత్తంబునందు
నీపాదయుగళంబు నిల్పవే కృష్ణ!
న్నేలు తరిగొండ రమృగాకృతిని
ప్రత్యక్షమై నన్ను పాలించు కృష్ణ!
పాపకర్మములు తప్పక జేసి జేసి
హుజన్మముల నెత్తి డలితి కృష్ణ!
జన్మమందైన నేను నీమాయ
డ చెదనన్న శక్యముగాదు కృష్ణ!!
రి! నీ పదాంబుజం నునావ నిచ్చి
మాయాబ్ధి దాటించి నుపవే కృష్ణ!
నయ మవిద్యచే ఘము నాచేత
నుడుగక చేయింపుచుంటివే కృష్ణ!
మునుపటి దుష్కర్మములు మించి యిపుడు
ప్రారబ్ధ రోగ రూములాయె కృష్ణ!
గాన, నేనింక దుష్కర్మముల్ చేయ
వెరతు నన్న నవిద్య విడువదే కృష్ణ!
నాదుర్గుణంబుల శియింప జేసి
భూరి సద్గుణముల పుట్టించు కృష్ణ!
తెమలక నన్ను వేధింపుచున్నట్టి
వితత మూలావిద్య విడువదే కృష్ణ!
దుర్దన సఖ్యంబు దూరంబు జేసి
న సాధుజన మైత్రి ల్పింపు కృష్ణ!
లనైన నీ మూర్తిగాని యన్యంబు
నేమైన గనుపింపనీకవే కృష్ణ!
నక రత్నప్రభా చితమైనట్టి
సురుచిర మకుటంబు జూపవే కృష్ణ!
ళుకుల కుటిల కుంల యుక్తమైన
లలిత ఫాలదేము జూపు కృష్ణ!
సుందర భ్రూలతా శోభితంబైన
నుగవ బెళుకు తక్కక జూపు కృష్ణ!
ముదిరిన సంపంగి మొగ్గ కైవడిని
మనీయమగు నాసిము జూపు కృష్ణ!
నిరుపమ కుందసన్నిభ దంతచయము,
మణీయ బింబాధము జూపు కృష్ణ!
లువురు సిరులు బొంము లందగించు
చెక్కుటద్దముల మచ్చిక జూపు కృష్ణ!
కరకుండల కాంతి, ణికళాకలిత
గండ భాగములు తక్కక జూపు కృష్ణ!
మెరుపైన కురుకరు మీసంబు లమర
సొగసైన చుబుకంబు జూపవే కృష్ణ!
న్ని చిహ్నాలకు నిరవైన వదన
రిపూర్ణ చంద్రబింము జూపు కృష్ణ!
శంఖ చక్ర గదాది హితంబులగుచు
గు చతుర్బాహువుల్ యజూపు కృష్ణ!
కౌస్తుభ మణిహార లితమైనట్టి
కంబుకంఠంబు చక్కగజూపు కృష్ణ!
చెలువుగా వనమాల శ్రీవత్సమణుల
దనమైనట్టి వక్షముజూపు కృష్ణ!
బ్రహ్మాండ భాండముల్ హుకోటులున్న
సూక్ష్మమౌ ఉదర మచ్చుగ జూపు కృష్ణ!
లు మరు విశ్వకల్పన జేయు బ్రహ్మ
దనమౌ నాభికంము జూపు కృష్ణ!
నుపమ మణిమేఖలావృతంబైన
మృగవమధ్యంబు నెమ్మినిజూపు కృష్ణ!
నకాంబరాబద్ధ టి తోడ కాంతి
యమైన యూరుయుగ్మము జూపు కృష్ణ!
అంబుధి కన్యకా స్తోపచార
లితంబులైన జంలు జూపు కృష్ణ!
బ్రహ్మరుద్రాది దిక్పతులైన వారు
మ్రొక్క నొప్పగు పాదములు జూపు కృష్ణ!
గంగా తరంగ సంత వామ పాద
భాసురాంగుష్ట మేర్పడ జూపు కృష్ణ!
క్షీర వారిధి యందు శేషతల్పమున
యనించియున్న ముచ్చట జూపు కృష్ణ!
ష్టభుజములతో ధికాబ్ధి నడుమ
కొలువున్న మహిమ మక్కువజూపు కృష్ణ!
బాలుండవై వటత్రం విూద
వళించురీతి తప్పక జూపు కృష్ణ!
మొనసి శ్వేతద్వీపమున దివ్యకాంతి
నొనరు నీరూపంబు నొగిజూపు కృష్ణ!
తలాది సర్వ లోకాధార మగుచు
లమైన విశ్వరూము జూపు కృష్ణ!
గు భూతతతుల కంర్యామివైన
భావ మెల్లను తేటరుపవే కృష్ణ!
నిశ మర్చా విగ్రహాకృతి గాను
మెలగు నీలీలలు వెలయింపు కృష్ణ!
విభవావతారముల్ వింతగా దాల్చి
పొలుపొందు సరణు లొప్పడుజూపు కృష్ణ!
వాసుదేవ ముఖ్యవ్యూహములను
లిమించు రూపంబును జూపు కృష్ణ!
నిత్యశూరుల గొల్వ నిలచి వైకుంఠ
పురిని నీవున్న సొంపును జూపు కృష్ణ!
దెలియ నన్నిటికి నతీతమై వెలయు
రమ పదమునందు ప్రభజూపు కృష్ణ!
ది మిథ్య యనగూడ దెల్లవిశ్వంబు
తానయ్యె వస్తుతత్వము జూపు కృష్ణ!
ద్గురుస్వామివై హితతత్వంబు
చిరతరంబుగ బోధ చేయవే కృష్ణ!
సుధ నే గురుకులా వాసంబు చేయ
క్తిజాలక నిన్ను రణంటి కృష్ణ!
గాన, నన్నెట్లైన డతేర్పదగిన
భారంబు నీకు తప్పదు సుమ్ము కృష్ణ!
నీవు నా స్వామివి, నీసొత్తు నేను
కావున బాధ్య తెక్కడ బోదు కృష్ణ!
శేషభూతము నేను శేషివి నీవు
కావున బాధ్య తెక్కడ బోదు కృష్ణ!
పావనుండవు నీవు తితను నేను
కావున బాధ్య తెక్కడ బోదు కృష్ణ!
నీవు బాధ్యుడవని నేను యిన్నాళ్లు
న లేక పోతిని క్రమముగా కృష్ణ!
మాయ, నహంకార, మకారములను
గిలి దేహము లెన్ని దాల్చితి కృష్ణ!
నేటికైననుగాని నీకటాక్షమున
నీబాధ్య తెరిగితి నిజముగా కృష్ణ!
క నేను జన్మంబు లెత్త నటంచు
నామది దైర్యమున్నది చాల కృష్ణ!
యేపుణ్యములు జేసి ఇంత దైర్యంబు
చెందితివన్న నే జెప్పెద కృష్ణ!
రగ నేజేయు పాము లిన్నియనుచు
గురి జేసి లెక్కింప గూడదే కృష్ణ!
నిశంబు పెద్ద పిన్నంతరం లేక
తెగువ నెన్వరినైన తిట్టుదు కృష్ణ!
తిడంభ కుచ్ఛితా హంకారములకు
రను నే మూలభూము నైతి కృష్ణ!
గాన, కామాదివర్గము నాశ్రయించి
పాప దుర్విషయాల పాలైతి కృష్ణ!
నిరతంబు పరులను నిందింతుగాని,
నాదుర్గుణంబు లెన్నగనేర కృష్ణ!
తామస రాజస ద్వయములో జిక్కి
కోపతాపములకే గుదురైతి కృష్ణ!
దిగాక భాగవ తాపచారముల
నుడుగక కావింపుచుందునే కృష్ణ!
టుగాన, పతిత జనాగ్రణి నైతి
లుమారు లిన్ని జెప్పగనేల కృష్ణ!
జ్ఞాని, నపరాధి గు నేను పతిత
పావన బిరుదు చేట్టితి కృష్ణ!
గాన, నీ బిరుదంబు డతేర్చు ననెడి
ధైర్యంబు మదిని సిద్ధంబయ్యె కృష్ణ!
బెనసి నీయందున్న బిరుదు లన్నియును
చేకొని నన్ను రక్షింపవే కృష్ణ!
మును నజామిళుని నిమ్ముగ బ్రోచినట్టి
కారుణ్యమును జూపి డతేర్చు కృష్ణ!
సుధ నీ పతిత పాన కీర్తి బిరుదు
ట్టితి నిక నాకు యమేమి? కృష్ణ!
బిరుదులబట్టి యిక జన్మమెత్త
ని ప్రమాణంబు చేగవచ్చు కృష్ణ!
రమాత్మ యిటువంటి భావనాయాత్మ
సిద్దించు సాదృశ స్థితి యందు కృష్ణ!
టుగాన, యీనిశ్చయంబు నా మదిని
ట్టుగా నిల్ప నీ భారమే కృష్ణ!
మూలమంత్రార్థ మిమ్ముగ నాత్మ నీకె
శేషభూతంబని జెప్పనే కృష్ణ!
రవి నన్యులకు శేషంబు గాదనుచు
నుప్పొంగి బోధింపు చుండునే కృష్ణ!
గాన నీసొమ్ము నెక్కడనున్న వెదకి
చేకొను పని నీకు సిద్ధమే కృష్ణ!
పాదంబు లెవ రైన ట్టినపట్టు
నిక్కంబు విడిపింప నేరవే కృష్ణ!
పుడె నీ పాదంబు నేను బట్టితిని
నీవింక విడిపింప నేరవే కృష్ణ!
రనొప్పు మంత్ర రత్నద్వయార్ధంబు
చెలగి యీధర్మంబు జెప్పవే కృష్ణ!
ద్వయ మాదియం దిందిర కీవె
తెలిపితి, విపుడు సందియమేమి కృష్ణ!
నముగా సకల యోములు బోధించి
టుమీద బహునిశ్చయంబుగా కృష్ణ!
ర్వధర్మముల నెంక నన్ను శరణు
పొందు పాపములన్ని పొలియింతు కృష్ణ!
ని చరముశ్లోక మర బోధించి
తిరుగేమి జెప్పవైతివి నీవు కృష్ణ!
గాన సిద్ధాన్తవాక్యంబిదే యనుచు
నామదిలో చాల మ్మితి కృష్ణ!
హినొప్పు సర్వధర్మముల పోవిడిచి
పొసగ నీ శరణు నే పొందితి కృష్ణ!
గాన నా పాపసంమును పోగొట్టి
రమపదం బిచ్చి పాలింపు కృష్ణ!
సొమ్ము కలిగి నీవు, సొమ్ము గైకొనెడి
నికి నే, నిన్ని జెప్పగనేల కృష్ణ!
రి, నేను నీసొత్తు నైతి నీ వింక
గైకొనతగియుంటె గైకొను కృష్ణ!
పోగొట్టవలసి తే పోగొట్టు దీని
నేనింత ప్రార్ధింపనేరనే కృష్ణ!
నీవు యేసిన దిక్కునేనుందుగాని,
లాభంబు లెవరివో క్షించు కృష్ణ!
హి మీఱ కవికిశోన్యాయ మాత్ర
మేని స్వశక్తి నాయెడ లేదు కృష్ణ!
సొలసి మార్ధారకిశోరంబు వలెను
నీవు బెట్టిన చోటనేనుందు కృష్ణ!
నీవు ప్రేరేపక నిఖిల కర్మములు
నూరక నేను జేయుట లేదు కృష్ణ!
చెలగి నీ ప్రేరణ చేతనే ప్రకృతి
ర్మముల్ చెడును నెక్కడనైన కృష్ణ!
ప్రకృతితో గూడిన పాపంబు చేత
వియెల్ల నే జేతు నుకొందు కృష్ణ!
నిజము భావించితే నేనిందులోన
నొక కర్మమైన చేయుట లేదు కృష్ణ!
క్కటా! నేను నే నియెడి దంత
యూరక భ్రమ పెట్టుచున్నదే కృష్ణ!
టువంటి నా భ్రాంతి నెడ బాపు మనుచు
సొలసి నీమరుగు నే జొచ్చితి కృష్ణ!
గతి పై నన్యధా రణంబు లేక
రుగు జేరితి నన్ను న్నించు కృష్ణ!
ప్రకృతి గుణంబు లేర్పడ నన్ను బట్టి
కమిద బాధింపనీకవే కృష్ణ!
మాయ చే జన్మకర్మప్రవాహమున
డలిన నన్ను చేట్టవే కృష్ణ!
పటంబు లేక నిక్కముగ నాయాత్మ
త్వంబు జూపవే యచేసి కృష్ణ!
రణిలో సంశయాత్మనశించు గనుక
మొనసి నాసంశయమ్ములు దీర్చు కృష్ణ!
రమ యోగీంద్రుల భావనిశ్చయము
నాయాత్మ నుంచు నిర్ణయముగ కృష్ణ!
క్కటా! స్మూక్ష దేమనిత్య మంటె
స్థూల దేహములు నెచ్చుచునుండె కృష్ణ!
కావున, లింగభంము జేసి వేగ
దేహధారిత్వంబు తీర్పవే కృష్ణ!
వ్యయంబై, పునరావృత్తి లేని
న్నతపదవి నా కొసగవే కృష్ణ!
నుడవై నిర్హేతుకంబుగా తొలుత
రుణ నేలితివి చక్కగ నన్ను కృష్ణ!
నిన్నొల్ల కావల నేబోవుతరిని
పోనీక బ్రోచితి పొలుపుగా కృష్ణ!
లితంబులైన లీలు జూపి నన్ను
కోరి మాలిమి జేసుకొంటివే కృష్ణ!
ద్గురుస్వామివై మంత్రోప దేశ
మిచ్చితివాదియం దిరవుగా కృష్ణ!
టుమీద, నాత్మ తత్వార్థ సంగతులు
ప్రియము దీపింప జెప్పితి వీవె కృష్ణ!
లచిన యప్డె ముంర వచ్చి నిలిచి
యెడ లేని సంతోషమిత్తువే కృష్ణ!
ల్లిదండ్రులు సహోరులై న నన్ను
లీల నీకరణి పాలింపరే కృష్ణ!
చెలరేగి నాకు వచ్చిన యాపదలకు
రగ నీవుండ నేతికితి కృష్ణ!
నీవంటి మిత్రు లీ నిఖిల లోకముల
చేరి నేవెదకిన చిక్కరే కృష్ణ!
రూఢిగా యిపుడె నీ ణము నిక్కముగ
కోరి నేనిక తీర్చుకోలేను కృష్ణ!
నీమన్ననంబులన్నియును దలంచి
నామది గరగుచున్నది చాల కృష్ణ!
నాయపచారాలు నాదుర్గుణములు
సైరించి బ్రోవ నాస్వామివే కృష్ణ!
తోప భోగ్యుండ వై తొలినుండి నన్ను
యూరక రక్షింపుచుంటివె కృష్ణ!
రీతి ప్రాణప్రయాణ కాలమున
నీవు నాముందర నిలువవే కృష్ణ!
రుచైన వాత పైత్యశ్లేష్మబాధ
లంటిన మురువ నియ్యకు నన్ను కృష్ణ!
కుదురైన సగుణ నిర్గుణ సామరస్య
భావ మెప్పటికి తప్పక జూపు కృష్ణ!
పాపపు దేహ ప్రపంచ వాసనలు
అంటిన మరువనీకు నన్ను కృష్ణ!
రమాత్మ నీవు నీ పాదంబులాన
ముక్తిబొందించు మిమ్ముగ నన్ను కృష్ణ!
దివ్యదేహంబులు, దివ్యలోకములు
చ్చెదనంటివా యిపుడొల్ల కృష్ణ!
వ్యయ బ్రహ్మమైట్టి నీలోన
పొందక నాజాలి పోదింక కృష్ణ!
మేటి ప్రారబ్ధంబుమీద నీవింక
భారంబు పెట్టిన నిగాదు కృష్ణ!
రి, నీవుగావలెనంటె ప్రారబ్ద
మెంతది? పోగొట్టు మీలోన కృష్ణ!
కాలంబు చేరువై దిసి కొంపోవు
రియందు నాస్వతంత్రంబేమి? కృష్ణ!
దేవ! నే ముక్తిబొందేయుపాయంబు
భావించి, నన్ను తప్పక జూడు కృష్ణ!
లసి రయంబుగా అంటి ;నామాట
యెగ్గుపట్టక బ్రేమ నేలవేకృష్ణ!
చెలరేగి నాకు తోచిన వెల్ల మనవి
జేసితి నింక నీ చిత్తమే కృష్ణ!
నిన్నిట్లు వినుతింప నేనెంతగలను
ప్పొప్పులను గాంచి యజూపు కృష్ణ!
మంగళం బలమేలుమంగ చిత్తాబ్ది
సారంగధర నీకు యమంగళంబు
సుర చిర గుణ నీకు శుభ మంగళంబు
ద్గురు దేవేశ ర్వమంగళము
ని, ఇట్లు శ్రీ వేంకటాద్రీశు పేర
న్నేలు తరికొండధాముని పేర
వాసికెక్కిన నందర కులోద్భవుడు
శ్రీకరంబుగ సవాశిష్ట గోత్రుండు
సుధలో కానాల వంశవర్ధనుడు
గు కృష్ణమార్యున తిభక్తి మీర
ర భార్యయగు పతివ్రత మంగమాంబ
సుత వెంగమాంబిక, సొరిది చేపట్టె
ద్గురు కరుణచే సారూప్య పదవి
దీపింప నిహపర దీధితుల్ మెరయ
హనీయ ముగు కృష్ణమంజరి జేసె
రభక్తితో శ్రీనివాసుల, కృష్ణ!
దయుగళికి సమర్పణ మొప్ప జేసి

।।ఫల శ్రుతి।।

ది కృష్ణ!జప తుల్య మిది మోక్షపదము,
శిష్టులై ఇది పఠించిన వారి కెల్ల
మొనసి కామ్యార్ధంబులనునిచ్చి తుదను
రమపదం బిచ్చు బాలకృష్ణుండు
కావున నీ కృతి కంజాక్షు కరుణ
నాచంద్ర తారార్కమైయొప్పు చుండు

-x-