పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : ప్రథమాశ్వాసము - భాగం 1

ద్విపద బాల భాగవతము (దోనేరి కోనేరునాథకవి విరచితము)

ప్రథమాశ్వాసము

అవతారిక
ఇష్టదేవతాస్తుతి

1
శ్రీవేంకటేశు నూర్జి[1] దయావేశు
సేక శ్రీదు[2] నంచిత తీర్థపాదు
నిరుపమోల్లస సువర్ణిత మందహాసుఁ
రిపూర్ణ సంతోషుభాసుర వేషు
కౌస్తుభోదారు సారసుతాధారుఁ
స్తో[3] రుచిజాలుఁ నంబుద నీలు
ఘాత్మగమ్యుఁ బీతాంబరరమ్యు
వినుత చిత్ర చరిత్రు విమలాబ్జ నేత్రు
శ్రణ మంగళనాము గదేక కాము
విచంద్ర నయను నిర్మల భోగిశయను
రకుండలభూషు మంజీరవేషుఁ
బ్రట కాంచీదాముఁ రిభూతకాము
రిరాజ వరదాయిఁ రి[4]దర్ప దమనుఁ
రిసాధకాసన్నుఁ రి సాధనాంకు
ర్జున స్థితి హరుఁ ర్జున[5] మిత్రు
ర్జిత లోభుఁ నార్జిత కల్పు
దేసంరక్షకు దేవాధిదేవు
భానాతీతుఁ బ్రభావ విఖ్యాతు
నంవత్సలు మహానంద స్వరూపు
నంక ధరు గోపనంద కిశోరు


[1] ఊర్జిత- దృఢమైన
[2] శ్రీదు- సంపదలను ప్రసాదించువాడు
[3] అస్తోకము- అనల్పము
[4] కరి- 1వది గజేంద్రుడు, 2వది కంసుని కువలయాపీడం
[5] అర్జున- 1వది మద్దిచెట్లు, 2వ వాడు పాండవ మధ్యముడు

11
సిందూర ప్రకటాంధ్ర సింధు సౌవీర
సింధురాచలవీరు సూత్రప్రకారుఁ
గారుణ్య కలిత పుష్కర జాలధీరు
ధీరుచి కల్పితస్థితి మహాదేవు
దేకీ వసుదేవు దృష్ట[6] స్వభావు
భాజకేళి సంభావిత నీళు[7]
రాయ తిమ్మ భూమణు సూనునకు
నాను బుక్క భూపామరేంద్రునకు
నునకుఁ జాళుక్యకంఠీరవునకుఁ
జితిమ్మ నృపతికి సిరులిచ్చు వేల్పు
వెయు జంగుళిదైవవేశ్యా భుజంగుఁ
ఘు నకల్పు నారాయణు గొలుతు
లినాక్షుఁ దా నాశ్రయించియునుఁ
ధానుఁనవ్విభుని చెంగ సేవఁగొనియు
శ్రీనామ మలరెడు చిగురాకు బోటి
మానినీ పతి భుజాధ్యైక వసతి
లిమి చూపుల తల్లి లశాబ్ధి పట్టు
జవాసిని దివ్యలజాంక హస్త
నిశంబు సిరులిచ్చి ర్షం బొసంగు
చితిమ్మ భూపాలశేఖర మణికి


[6] దృష్ట- చూడబడినది, ప్రపంచము
[7] ఇళ- ఈళుడు ఇళ గలవాడు, 1. విష్ణుమూర్తి భార్యలలో ఒకరు, 2. శ్రీకృష్ణుని భార్య, రాధాదేవి పెంచిన కన్య, యశోదమ్మ సోదరుని కుమార్తె

21
వేత్రంబు ధరియించి విశ్వంబునేలు
సూత్రవతీ[8] హృదీశుండైన ఘనుఁడు
ర్వశేషికి భక్తిర్వకైంకర్య
నిర్వాహియై యింపునిలుపు శేషుండు
రిపదాంభోజ విన్యాస పవిత్ర
శోభితుండైన గవల్లభుండు
ముక్తులు హరిపదాంభోజాత భజన
యుక్తులు సనకాది యోగీంద్రవరులు
లివిభీషణ, శుక, వనజ[9], వ్యాస,
జ సూతిజ[10], పరార, వసిష్ఠులును,
రిసూను[11], వసువులునాదిగాఁ గలుగు
మ భాగవతులుఁ బ్రబల మోదమున
నుఁడైన తిమ్మ భూకాంతు కుమారు
చితిమ్మ నృపుని వాంఛిత మిత్తురెపుడు
నిసపరిచ్ఛదం గునట్లుఁగాఁగఁ
నువొందు భక్తిచే రిఁ బ్రస్తుతించి

శారద స్తుతి

సాదయాలోల నకామితార్థ
పాద వల్లకీవాదన నిపుణ
శాద నీరద మదేహ కాంతి
శాద చిత్తాంబుజంబున నిలిపి


[8] సూత్రవతి- విష్వక్సేనుని భార్య సూత్రవతి, మరొకభార్య జయ
[9] పవనజుడు- వాయుపుత్రుడు హనుమ
[10] జలజసూతిజుడు- జలజసూతు అంటే పద్మసంభవుడైన బ్రహ్మ, ఆ బ్రహ్మపుత్రుడు నారదుడు
[11] హరిసూనుడు- ఇంద్రుని కొడుకు, అర్జునుడు

సంస్కృత సాహిత్య పూర్వకవిస్తుతి

31
వ్యావాల్మీకి సంముల నపార
భాసుర కవితా ప్రభావుల గొలుతు
నాళీకభవ[12] సమాత బెంపుఁగన్న
కాళిదాసాదిక వులఁ గీర్తింతు

ఆంధ్ర సాహిత్య పూర్వకవిస్తుతి

న్నపార్యుఁడు, భీమయుఁ, దిక్క శౌరి,
న్నుతక్రముఁడైన శంభు దాసుండు
మొలైన వారల మున్నాంధ్ర కవిత
యొవించినది యార్యులఁ బ్రస్తుతింతు

కుకవినింద సుకవి స్తుతి

డుఁబ్రయాసమున దుష్కవితలుఁ గూర్చి
యెపక సభఁ నార్యులెల్లఁ జా యనఁగ
దివి తారొక వంక పచపఁ నగుచు
మెలెడు సుకవుల మేలు కావ్యములఁ
సి రాజులు మెచ్చుట్లుగాఁ నెపుడు
దెరువులుఁ దెల్పెడు ధీరచిత్తులకు
కువుల కింపులుఁ గూడ దీర్ఘాయుఁ
కుటిలం బగుఁ గాత నుచు దీవింతు
నితలఁ పొనఁగూడుట్లుగా సుకవి
మతాచారంబుఁ క్క నొనర్చి

కవి కావ్యరచనా కౌతుకము - కృతిపతి అనురోధము

యేనొక్క శుభవేళ నిందిరా విభుని
భూనుత కథలచేఁ బొగడంగఁదగిన


[12] నాళీకభవుడు- బ్రహ్మదేవుడు

41
వొప్రబంధము పల్కు నుద్యోగ పరత
ప్రటించి ముదము చొప్పడ నుండునంత
యేరాజు ఘనకీర్తు లెల్ల దిక్కులకు
హారాచలస్ఫూర్తు నువొంద నిలుపు
యేహీశు ప్రతాప మేపుమై నహిత
భూమిపాలకుల పెంపులు మాయఁ జేయు
యేరేంద్రుని చాగ[13] నెలమి దైవాఱ[14]
ధేనురత్నంబుల తెలివి హరించు
యేపార్థివుని భుజం బిల ధరియించి
ప్రాగు శేషాద్రి ద్రేభములకు
యేనృపోత్తము సత్యహిత వచో మహిమ
పూనిగెల్చుఁ ద్రిశంకు పుత్రాది ఘనుల
ట్టిమహోన్నతుం తుల ప్రతాప
ట్టిత సామంతణ హృదయుండు
బిరుదుమన్నెరగండ బిరుద లాంఛనుఁడు
మహీశాంబుధి బాడబానలము
నిరుపమ గాంభీర్యనిధి మండలీక
ణీ వరాహుండు ధైర్య హేమాద్రి
సురుచి రాపస్తంబసూత్రుఁ డాత్రేయ
గోత్రుఁ డతిసాంద్ర వైభవేంద్రుండు


[13] చాగము (వికృతి) త్యాగము (ప్రకృతి)
[14] దైవాఱు- అతిశయించు

51
సోవంశాంబుధి సోముండు కీర్తి
ధాముండు బుక్కభూవ ప్రపౌత్రుండు
రాభూపతి తిమ్మరాజ పుత్రుండు
ధీమాననీయుండు తిరుమల నృపతి
మృమద కుంకుమ మిశ్రలేపనము
ప్రగుణ ముక్తాఫల రంగవల్లికలు
ప్రవోపహారాది రిమళ క్రమము
మ నిర్మల వితానాది[15] సంగతులుఁ
లుగు శోభన సభాగారంబు నందు
నైన జయ జయ ధ్వనులు పెల్లొదవ
క్షిణాశా జయస్తంభ యోజకులు
శిక్షిత దుర్మద క్షితిపాలగణులు
వియ లక్ష్మీ యుతుల్ విఠ్ఠలోర్వీశ
చితిమ్మనృపతు లంచితకీర్తి ధనులు
పాతిమ్మక్షమాతియును నాది
యైపొల్చు ననుజన్ము తి భక్తిఁ గొలువ
వివిధ శాస్త్ర విలాస విద్వజ్జనంబు
రసాలంకార నైపుణ[16] కవులు
సంగీత వేదులు చిన పుంగవులు
మంళ పాఠకుల్ ల్లులు, భటులు


[15] వితామన- చాందినీ
[16] నైపుణి- నైపుణ్యము, నేర్పరితనము

61
మొలైన నియ్యోగములు నిండి కొలువ
ముము గావించు పెంపునఁ గొలువుండి
సాహిత్య గోష్ఠి ప్రసంగవశమున
నూహించి కృతి మీద నుల్లంబు వొడమి
రంగఁ నాశ్వలానశాఖ యందు
కొరొందు శ్రీవత్సగోత్రాంబురాశిఁ
లుగు దోనూరి నాయ మంత్రి సుతుని
విసిత సాహిత్య విశ్రాంతిమంతు
వినుతాష్ట భాషాకవిత్వ ప్రచండు
ఘఁ గోనేరునాథాఖ్యుని నన్నుఁ
బిలిపించి సముచిత ప్రియ పూర్వకముగఁ
లికె గంభీర విభ్రమ విశేషమున
నుతాహోబలరసింహ భజన
గురుయోగ దోనూరి కోనేరునాథ!
మాకుఁ నాశ్రితుడవు హనీయ లీల
లోకులు మెచ్చఁ బల్కుఁదు[17] మేలు కవిత
రఁగల్గు సప్తసంతానంబు లందు
రుదైన యది నిల్చుఁ దియునుఁ గృతియె
పతీ మణికి మజ్జనకుఁడౌ రామ
నాథు తిమ్మ భూజానికి మున్ను


[17] పల్కుదు పల్కుదువు

71
చియించి తౌనన ద్య కావ్యముగఁ
బ్రచురంబుగా బాలభాగవతంబు
వాసికి నెక్కి యివ్వసుధా తలమున
భాసిల్లు నా బాలభాగవతంబె
రుదుగా నడచిన న్ని మార్గములఁ
దిముగా మా చినతిమ్మయ్య పేర
ద్విద కావ్యంబుగా వెలయంగఁ జేయు
మిపుడు మాకెంతయు హితమిది” యనుచు
వివిధ విచిత్ర నవీనాంబరములు
రత్నమయ భూషము లెన్నఁ దగిన
గ్రహారంబులు గ్ర హారములుఁ
గ్రి[18] పల్యంకికాది[19] వస్తువులు
నిచ్చి కర్పూరతాంబూల మొసఁగి
ప్రగుణిత బహుమాన రితుష్టుఁ జేసె

కవి మనోగత కాంక్ష

నుమతించితిఁ నప్పు వ్వాక్య మేనుఁ
నురూప శుభ నిమిత్తాలోకనమున
లాక్షు కథలచేఁ డు బవిత్రంబుఁ
నీయమునునైన కావ్యంబు పలుకుఁ
లఁపుఁ జొచ్చిన తిమ్మరణీశ్వరుండుఁ
లిగె నందులకుఁ జక్కని నాయకుండు


[18] అగ్రియ- శ్రేష్టమైన
[19] పల్యంకిక- పల్లకీ

81
రికి లచ్చి నొసంగి యంభోధి వోలె
మించు నా కవితాకన్య నిపుడు
చితిమ్మ నృపతికిఁ జెలువుగా నొసఁగి
తర సంతోష లితుండ నగుదు
డుపునఁ బుట్టిన న్యకుఁ బెండ్లి
కొడుకనుకూలుండుఁ గూడుటం బోలె
వితకు నరవరాగ్రణి నాథుఁడైన
వుల మోదమునకుం డపలఁ గలదె?
జారిశోభనవంశ మౌక్తికము
చితిమ్మ నరభర్త చేపట్టు కతన
నీధరుని ప్రసాపు జాజిదండ
ణిఁ నాకృతి సర్వనసేవనొందు
కృతిముఖంబునఁ కలంకృతిగాఁగ నింకఁ
గృతినాథు వంశంబుఁ గీర్తింతు నిపుడు

కృతినాథుని వంశక్రమము

రినాభి కమలంబునందు జనించె
మేష్ఠి శారదాతి చతుర్ముఖుఁడు
నికిఁ నాత్మ జుండైపెంపు గాంచెఁ
తుల తపో ధనుంగు నత్రి మౌని
భిరూపమైన యయ్యత్రి నేత్రమున
శుకళాన్వితుఁడైన సోముండు వొడమె

91
నికి బుధుఁడను నాత్మజుం డొదెవెఁ
తఁడు పురూరవుంను పుత్రుఁ గాంచె
యువవ్వి భునకుఁ తనికి నహుషుఁ
డా యుత్తమునకు యయాతి జనించె
ని పుత్రుఁడు పూరుఁ తని వంశమునఁ
బ్రతిలేక కడుఁ బేరుడియెఁ బరిక్షి[20]
వద్య గుణుడైన తని వంశమున
నుఁ డారెవీటి బుక్కనృపాలుఁ డెసగె
నాథమణి సాళ్వరసింగరాయ
సఖుండై బుక్కసుధీశుఁ డలరె
హీపతికి బల్లాంబిక యందు
రానృపాలుండు రాజేంద్రుఁ డొదవె
యెందుఁనెన్నఁగఁ జాలు నిద్ధ శౌర్యమునఁ
గంనవోలి[21] దుర్గంబులో నుండి
బుక్కయు రామభూభుజుఁ డెల్ల నృపులుఁ
నెక్కువ యిది యని యెన్నంగఁ జాలి
వీరులు డెబ్బదివేవు రాశ్వికులు
చేరికొల్వంగ వచ్చిన సవా నెదిరి
లఁనంది[22] పంచబంగాళంబు[23] సేసె
గెలిచెఁ నచ్చరితంబుఁ గీర్తింపఁ దరమె
వినుతింపఁదగుఁ నాదువేని[24] దుర్గమునఁ
తుఁడై యుండు కాచాధీశుఁ[25] గెలిచి


[20] ‘పరిక్షి‘- ‘పరీక్షిత్తు’
[21] కందనవోలు- కందనవూరు, ప్రస్తుత కర్నూలు,
[22] కలను- యుద్ధం, కలహము
[23] పంచ బంగాళము చేయు- చెల్లాచెదరు చేయు, పటాపంచలు చేయు
[24] ఆదువేని, తర్వాత ఆదవాని, ప్రస్తుతం ఆదోని అనే పేరు గల యీ పట్టణం కర్నూలులోని ఆదోని తాలూకాకు ముఖ్యపట్టణం.
[25] కాచాధీశుడు- మొదటి రామరాజు ఆనవేని (ప్రస్తుత ఆదోని) దుర్గాధీశుడైన కాచరాజు