పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : చతుర్థాశ్వాసము 4-1-100

బాలభాగవతము

చతుర్థాశ్వాసము

నుతి

శ్రీవిలసిత గాత్ర! జితపద్మ నేత్ర!
భాజ్ఞతా భోజ! భామామనోజ!
విరణ నవకర్ణ వినయ సంపూర్ణ!
తురిమోపేంద్ర! నిఃశ్చల కృపాసాంద్ర!
మంళ గుణగేహ! మంజులోత్సాహ!
సంర రఘురామ! త్కాంతి సోమ!
ద్మబాంధవతేజ[1] ! భాగ్య బిడౌజ[2] !
ద్మారి కులనాథ[3] ! ప్రణతారియూధ[4] !
ధి గంభీర! పాన కీర్తి హార!
చితిమ్మ భూపాల శేఖర వినుము!

నైమిశారణ్యమున శౌనకాది మునులకు సూతుఁడు తదుపరి కథను చెప్పుట

భూనుత హరికీర్తి భోగసాంద్రులకు
శౌకాదికులైన న్మునీంద్రులకు
నిమాంత విశద వాణీవినీతుండు
సుగుణ విఖ్యాతుండు సూతుఁడిట్లనియె

స్వాయంభువాది మనువుల కాలంలో విష్ణు వేయే రీతులలో నవతరించినాడో, అవతరించనున్నాడో తెలుపుడని పరీక్షిన్మహారాజు శుకయోగినిప్రార్థించుట

స్వాయంభువుని మహావంశ వృత్తములు
ధీయుత లలితోక్తిఁ దెలిపితింపొసఁగ
యంఱు మనువు లిట్లగుఁచును నేగి
రెంఱు ధరిణిపై నెసఁగుదు రింక?
యేనువేళ యం దేరీతిఁ బుట్టి
యేమియొనర్చె సర్వేశుండు ధాత్రి?

[1] పద్మబాంధవ తేజుడు- సూర్యుని వంటి తేజస్సు గలవాఁడు

[2] భాగ్యబిడౌజుడు- భాగ్యం కలిగి ఉండడంలో ఇంద్రుని వంటి వాడు.

[3] పద్మారి కులనాథుడు- చంద్ర వంశమునకు నాథుఁడు

[4] ప్రణత అరి యూధుడు- శత్రు సమూహములను లొంగదీసిన వాడు

11

విరింపు నాకు నివ్విధ మెల్ల” ననుఁడు
నీశ తోడ వైయాసి యిట్లనియె!

శుకయోగి తొలుత నార్గుఱు మనువుల కాలములో విష్ణుమూర్తిఅవతరించిన విధము వర్ణించుట

ల్పమున నార్గు రిపుడైరి మనువు
లాలితప్రభావాఢ్యు లందఱును
యేవ వాఁడిపు డెసఁగెడు[5] నింక
నేడుగు రిటమీద నిల యేలఁగలరు
దివా డితఁడు “స్వాయంభువుం” డతని
నాదినే పలికితి మ్మనువేళ
నికి నందని గు దేవహూతి
తులత నాత్మజుఁడైకపిలాఖ్య”

వెన్నుఁడు తల్లికి వివరించు గతినె
న్నుతంబుగ నిల్పె సాంఖ్యయోగముల
కాలముననె పద్మాక్షుండు పుట్టె
నాకూతి కరుదుగా “జ్ఞనామమున”
ముఁ గావించు మాతామహునొంచు[6]
కృలేని యసురుల గెలిచె నా ఘనుఁడు
తిధీర “స్వారోచి షాహ్వయుం” డగుచు
తిమించు రెండవ నువు కాలమున
అంబుజాక్షుఁడు ఋషి గు దేవశిరుఁడు

[5] ఎలగు- అతిశయించు

[6] నొంచు- నొప్పించు, చంపు

21

బింబోష్ఠి తుషితయుఁ బితరులుఁగాఁగ
విభుఁడనం బ్రభవించి విడువక మునుల
లు మెచ్చఁగ బ్రహ్మర్యంబు నడిపె
నుజేశ! మూడవ ను “వూత్తముండు”
వితులం జెలువొందు వేళ నచ్యుతుఁడు
ర్మునకును సూనృతాసతిమణికి
ర్మిలి[7] “సత్య సేనాఖ్య” జనించి
నుజ సంఘంబులం న చక్రధార
దునిమి కాపాడె నింద్రునిఁ బేరఁగాఁగ

హితాత్మ! యంతఁ “దాసుఁ” డను పేర
హిఁగల్గు నాలవ నువు కాలమున
రిణికి హరి మేధుఁ ను మునీంద్రునికి
రియన నుదయించి రికీర్తి నొందె
నువేళ నా రిఁ గాచె మొసలి
చే మునింగిన హస్తిఁ జెలువారు కరుణ”

పరీక్షిత్తు కరిమకరములకు జరిగినపోరును గూర్చి తెల్పుఁడనఁగాశుకయోగి యా పుణ్యకథ చెప్పుట

నుఁడు “నో యోగీంద్ర! స్తికి మకర
ముకు నెచ్చట నెట్లు నొఱకటం[8] బయ్యె
వినుపించు” మను మహి విభునితో యోగి
మైన యా పుణ్య థ చెప్పఁ దొణఁగె

శుకయోగి పరీక్షితునికి గజేంద్ర మోక్ష కథ చెప్పుట

[7] నర్మిలిన్- కోరి, ఆపేక్షతో

[8] నొఱకటము- సంకటము, విషమస్థితి

31

నాధ! అయుత యోనముల పొడవు
వినుతింప నంతియ విరివియుం దనర
యినుమును, వెండియు, హేమంబు నగుచుఁ
నుపట్టు మూడు శృంగంబులుం గలిగి
నఁపడుఁ గడు బాలడలిం ద్రికూట
నుపేరుఁ గలుగు మహాశైల మొకటి
మాన మృదుగంధనాహోపనీత[9]
శాంబునిధి[10] సుధా ణ గణోక్షితము
సానుభూ పరిపతఝ్ఝర భరావేగ
నాదన్నికట కంరమందిరంబు

స శాద్వల[11] మహీ సందేహ జనక
కత శ్యామాయమాన స్థలంబు
కేంద్రనీల రుక్ప్రబలావలోక[12]
నార్థ సమ్మదోన్నత బర్హిణంబు[13]
స్రణాంబుమత్సాను[14]  చందనాఘర్ష
గంధరాశి సంపాది తాద్భుతము
దమరీజన ర్కరాభేద[15]
హరి ముక్త ముక్తాయుక్త పథము
సంకుమదామోద[16]  హిత పాషాణ
సంకుచద్ధరినాద సంత్రస్త మృగము[17]

[9] వలమాన- తిరుగుతున్న, మృదుగంధనః- మృదుసువాసనలు, ఉపనీత- దగ్గరకుతెస్తున్న

[10] కళశాంభోనిధి- పాలసముద్రము

[11] శాద్వల- లేతపచ్చికబయలు

[12] రుక్ ప్రబల అవలోక- బంగారురంగు బలిష్టమై వంగిన

[13] బర్హిణము- దర్భలు గలది

[14] స్రవణ + అంబుమత్- కారుతున్న నీరుకలది

[15] చరత్- చరిస్తున్న, అమరీజనము- దేవతలు, శర్కర- పంచదారకు, అబేధ-వంటిది

[16] సంకమద- జవ్వాజి, ఆమోదము- సువాసనలు

[17] సంకుచత్- ముడుచుకున్న, హరినాద- గర్జనతో సంత్రస్త- భయపడిన, మృగము- జంతువులుకలది

41

నైభృగు ప్రణుత గుహాంచితం బగుచు
శోభిల్లు పావకాక్షుని[18] సభ వోలె
పొవైన బలు కూటములు మిన్ను ముట్ట
లని కాముక రితంబు వోలె
శాలి రామాచ్ఛల్ల[19] సందోహ
లితమై లంకోపకంఠంబు వోలె

ధాతువర్ణ విశేష ర్శితాశ్చర్య
సాత్యమై[20] శబ్ద శాస్త్రంబ పోలె
తరవ్యాఘ్రనస్తుత్య బాల
యమై పుణ్యాత్మ ధామంబ పోలె

ప్రచుర లీలోచిత హు పాద కటక
రుచిరమై వైరాజ రూపంబ పోలె
సులుం గవి సమాజంబునుం గలిగి
ణీశవర్యు నాస్థానంబ పోలె
సునో విలాస సంస్తుత భావమలరి
ణీయ యాశ్రమభూమియుం బోలె
మాన ఘన ముక్త కంకణ వలయ
టితమై సతి యలంకారంబ పోలె
స్వహిమ సంవృతసాగరం బగుచు
విల భాగీరథి వృత్తంబ పోలె

[18] పావకాక్షుడు- శివుడు

[19] బలశాలి రామాశ్చభల్లము- బలమైన పెద్దదుప్పి తెల్ల ఎలుగుబంటి కలది, బలాఢ్యుడైన శ్రీరాముని యొక్క బాణములు కలది

[20] సాతత్యము- నిరంతరము, ఎల్లప్పుడు

51

యంబుఁ గడు నొప్పు య్యద్రి యందు
నుజనాయక! ఋతుత్తను పేర
రి యచ్చరలకు నాక్రీడ మగుచుఁ
దొక్క బహుగుణారమైన వనము

త్రికూట పర్వత ప్రాంత పరిసర వనశోభా వర్ణనము

జంబూ, వ, టాశోక, చంపక, క్రముక[21] ,
జంబీర, ఖర్జూర, చందన, సరళ[22] ,
మాతులుంగ[23] , లవంగ, మందార, పనస,
కేకి, చూత, కంకేళి, ప్రియాళు[24] ,
ది, రామలక, బిల్వ[25] కాంచన, ఖనిశ,
రి పలాశ, పిప్పల, రజ్జుదాల[26] ,

తా, తమాల, కుద్దాల, నారంగ[27] ,
సా, భల్లాత, కాన, కకుభాది[28]
రువర నికర సంత ధుతత్తీవ్ర[29]
ఖరకర కరోర సంచరణము
ల, నీలాబ్జ, కోనద, కల్హార,
కుముదాది[30] మధుకరా కులిత మధూళి[31]
సరోవర భంగ రణ విశేష
తు రాంబుచరఖగ స్వర మనోహరము
దళి ఝంకార సంకులం బనిశ[32]
లిత శకుంతౌఘ[33]  లనిస్వనంబు

[21] జంబూ- నేరేఢు, క్రముక- పోకచెట్టు (గమనిక- పోతన భాగవత త్రికూట పర్వతవర్ణన పోలిక)

[22] సరళ- తెల్లతెగడ

[23] మాతులుంగ- మాదీఫలము

[24] ప్రియాళువు- మోరటి లేదా మొరలి

[25] ఖదిర- చండ్రచెట్టు (ముడుగుదామర), అమలక- ఉసిరికాయ, బిల్వ- మారేడు

[26] బదరి- రేగు, పలాశ- మోదుగ, పిప్పల- రావి, రజః- మొగలి, తాల- తాడి(టి)

[27] తమాలము- చీకటి చెట్టు, ఉలిమిరిచెట్టు, కుద్దాలము- కోవిదారము, నారంగ- నారింజ

[28] సాలము- నల్లమద్ది, భల్లాతము- జీడిపిక్కల చెట్టు, కకుభ- ఏఱుమద్ది

[29] సంతత ఉదత్ తీవ్రతర- ఎడతెగకుండా పెంచిన మిక్కిలి తీవ్రత కలిగినది

[30] కమల- ఎఱ్ఱతామర, నీలాబ్జము- నల్లకలువ, కోకనదము- చెంగల్వ (కెందమ్మి), కల్హారము- సౌగంధికము (కొద్దిగ యెఱుపు తెలుపు కల మిక్కిలి పరిమళముగల కలువ), కుముదము- తెల్లకలువ

[31] మధూళి- పూతేనె, మకరందము

[32] అనిశ- ఎల్లప్పుడుకలుగునది

[33] ఓఘ- సమూహము

61

పత్ర యూధికా జాతికుందాది[34]
త సౌరభ మనోజ్ఞంబునై మఱియు
బంధుజీవక[35] కాంతి భాసురం బగుచు
బంధు ప్రియైశ్వర్య దవియె పోలె
ఘ గాయత్రి జపాసక్త[36] ముదితఁ
నుఁగొనఁదగి సంజకాలంబ పోలె

కీచక[37] , కర్కశ, కృష్ణా, విమర్ద[38]
సూచకంబగుచు మాత్స్యుని[39] వీడు వోలె
దేవల్లభ[40] సముద్రేక వైఖరికిఁ
దాలం బగుచు గౌము నిల్లు వోలె

త వానప్రస్థ టి యోగ కలన
ధృతికరంబగు పుణ్య తీర్థంబ పోలె
కుని ధార్తరాష్ట్రప్రియ శల్య
మున భారతాఖ్యానంబ[41] పోలె
ప్రస్తుత గుర్వర్కరాజ మహీజ
స్తమై యల గ్రహక్రంబ పోలె
సేవ్యపవిత్ర లక్ష్మీకరత్వముల
వ్యమై వైష్ణవదధూళి వోలె

దిత దుష్పుత్ర మహోద్వేగ భాగ
నమై యంగుని రితంబ పోలె

[34] శతపత్ర- తామర, యూధిక- అడవిమొల్ల, జాతికుందము- జాతిమల్లె

[35] బంధుజీవకము- మంకెనపూలచెట్టు

[36] గాయత్రి జపా ఆసక్తి- చండ్ర, జపాకుసుమాల (మంకెనపూలదండ) ఎడ ఆసక్తి

[37] భారత విరాటపర్వమందలి కృష్ణా(ద్రౌపది)ని అవమానించిన కీచక వధా ఘట్టము

[38] కీచక- గాలికి చప్పుడుచేసే సన్నని వెదురు, కర్కశ- చెఱుకు, కృష్ణా-నీలి (పిప్పలి), విమర్ద- కాలాంతక వృక్షము

[39] మాత్స్యుడు- చేపలుపట్టువాడు

[40] రామాయణంలోని దేవేంద్ర - అహల్యా ఘట్టము

[41] శకునము, ధార్తరాష్ట్రములన్నవి క్షుద్ర పక్షులు, శల్యము (ముల్లు) వంటివి వాడుతూ కుత్సితులైన భారతంలోని కౌరవపక్షము స్ఫురింపజేసారు.

71

హుసుతా విర్భావ భావితా శోక
హిపయి శశిబిందు హిమయ పోలె

కరేణులుఁ గొల్వఁగా నొక్క మదగజము వనక్రీడలయం

దధేచ్ఛముగా చరించి జల క్రీడలకుఁ దిగుట

క్కజంబగు నవ్వనాంతర సీమ
నుక్కుమీఱి కరేణు యూధముల్ గొలువ
నొక్కనాడొక కరి యూధపం బర్థిఁ
క్కని క్రీడలం రియించి యలసి
యెంగాటముగ నోరెండి నెత్తమ్ము
బండుతావుల గాలి య్యిఁ బైవిసర

గాలికి నెదురుగాఁ దలి మదాంబు
లోలాలి[42] నినదముల్ కొలఁదికి మీర
మ సంధ్యాపాత మయంబు నందు
రులతా తతుల సండు లెడఁగాఁగ
డుమ యొక్కెడ నొక్క లినాకరంబుఁ
బొగాంచె నలపు చూపుననే యడంగ

సరోవరవర్ణనము

లిమించు సుగ్రీవ క్ష్మణోత్సుకతఁ
లిగి రామాయణ కావ్యంబ పోలె
త పద్మామోద సంస్థానమగుచు
ప్రతిలేని హరి యురోభాగంబు పోలె

[42] లోల- మిక్కిలి ఇచ్చగల, అలి- తుమ్మెద

81

కులయ పుష్కరాకుల శిలీముఖత
దివిజ దానవ రణోద్రేకంబ పోలె
పొలు భంగభ్రమంబులు గానఁ బడఁగ
న భీతోర్వీశు ర్జంబ పోలె
సంభిన్న వృషత పోక రమ్య కుశత
గంభీరమై యొప్పు కానయపోలె
సాసభవ గుణమవాయ వృత్తి
నారూఢి గలిగి బ్రహ్మాండంబ పోలె
ద్మినీ విలనన ప్రతిపాదనైక
ద్మమై శృంగార శాస్త్రంబ పోలె

క్రీమై పంక సంకీర్ణత లేక
యోక తిరుగు పుణ్యుని చాయ వోలె
నార్థ మధుప కోలాహల మహిమ
లువొంది పాశ్చాత్యగరంబ పోలె[43]
ప్రదకారి సహస్రత్ర సంయుక్తి
రి దేవేంద్రుని రదంబ పోలె
రిదిఁ గొల్వఁగ జాలు నాసరోవరము
రిణులతోఁ గూడి రిరాజు దరసె!

కరిరాజు కరిణులతో సరోవరమున జలక్రీడలాడుట

ములచేఁ చీల్చి ళగళమనఁగ
రియూధ ముదక మాళముగాఁ ద్రావె

[43] లలన- స్త్రీ ; అర్థము- ధనము; మధుపము- మధువు త్రాగునది; కోలాహలము- సందడి, హడావుడి. పాశ్చాత్య నగరములలో స్త్రీ ధన, మధువు విషయకమై, తుమ్మెదల కోలాహలం వలె మానవుల కోలాహల ముంటుందని 450 యేండ్ల క్రిందనే ఈ కవి భావించడం “కవిఃక్రాంతదర్శ” అను మాటను సార్థకపరుస్తున్నది. అని బూదూరు కుసుమాంబగారు వ్యాఖ్యానించారు

91

ముల తుదలచేఁ రిణులందిచ్చు
సి జలముఁ బెక్కు వులివ్వఁ ద్రావు
బంతిగట్టుచు మీఁద బంభర[44] శ్రేణి
మంనం బాడ వేమారును మునుఁగు
పైనంటి నాచు జొంము పచ్చఁబరపుఁ
గానోపు ననఁ జేయఁగానొయ్య లేచు
విలి పద్మములు పద్మకములం[45] గప్ప
లీలగా నిండి యాడుచు నిలుచు
యీవిధంబున నగ్గజేంద్ర ముప్పొంగి
వేవేలు విధముల విహరించు నంత

హస్తీంద్రుని చరణము సరోవరమందలి మకరదంష్ట్రా గ్రస్తమగుట

సుకృత సంగతి దైవచోదితం బగుచు
ర మొక్కటి డాసి హితోరు శక్తిఁ
బొరిఁబొరి జలము గుభుల్గుభిల్లనఁగ
గున[46] హస్తీంద్రు రణంబు వట్టె
ట్టినఁ గుంజర తియును దంత
ట్టన చేత వేమున నమ్మొసలి
చిప్పలట్టట్టునుం జెదరించి పట్టు
ప్పిఁజేయుటయు నంటఁ బోవనీక
క్రమ్మఱం బట్టె నీ రణి సారెకును
గ్రమ్మెడు చలములం[47]  రియు గ్రాహంబు

[44] బంభరము- తుమ్మెద

[45] పద్మకములు- ఏనుగు ముఖముమీద ఉంటే బొట్లువంటివి

[46] సరగు- వేగము, వడి

[47] చలము- పట్టుదల