పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం 4

301
నిట్టికావ్యంబు నందెంతయు మెఱయు
ట్టికథా సూత్రది యెట్టి దనిన

కథా సూత్రము

తెలివి మించిన గోమతీనది చెంతఁ
బొలుచు నైమిశ నామ పుణ్యాశ్రమమున
ఘవృత్తులు శౌనకాదికులైన
మునివరుల్ పురుషోత్తమునిఁ గూర్చి భక్తిఁ
జెన్నొంద వెయ్యేండ్లు సేయంగడఁగిన
న్నంబు సేయు నామయంబునందు
రోహర్షణ కుమారుఁడు సూతుఁ డచట
నామోద మలరంగ రుగుఁదెంచుటయు
సంయమిశ్రేష్ఠు ప్పుడ పూజ
సేసియా కల్యాణశీలు నిట్లనిరి
“సూమాకిపుడు విష్ణుని కథల్ వినఁగ
గౌతూహలము చాలఁలదు నెమ్మదుల
నువయ్యె మాకిప్పు దియు మాదైన
పాళి కిటుల నీచ్చుట కతన
పుణ్యంబు నభినుతాంబుజనాభ చరిత
ణ్యంబు నుభయలోసమగ్ర సౌఖ్య
మూలంబు సాత్విక మునిజన కల్ప
సాలంబు వివృత వైష్ణవదర్శనోరు


311
ర్మంబు బహుమార్గర్శిత జ్ఞాన
ర్మంబునై యసమానంబునైన
యొపురాణంబు మాకొనరంగఁ దెలుపు
లంక చరిత దయావిశేషమున”
నుటయు నా శౌనకాది భాషణము
వినిసూతుఁ డాత్మ భావించి యిట్లనియె
తివరేశ్వ రులార! మ ప్రార్థితంబు
నుతియింపఁ దగిన మనోహర క్రమము
డిగినఁ బలికిన నాదట[74] వినిన
డినుద్ధరించు శ్రీర చరిత్రంబు
వొరిన హరి భక్తియోగంబు పొదలి
మున వైరాగ్యహిమఁ గైకొలుపు
నారాయణుని కథాన్వయమున జనుల
కారూఢిఁ బైకొనర్థ కామములు
మాత్మ యనఁ బరబ్రహ్మంబు ననఁగ
రియ కా నెఱుఁగుదు రసి సాత్వికులు
రికి నర్పించిన దియ తపంబు
రిఁగూర్చి సేసిన దియ యోగంబు
రిఁదన్నుఁ దలఁచిన నఘుల హృదయ
సిజంబుల విశేషంబుగా నుండు


[74] ఆదట- ప్రేమము

321
రికృపఁ గలిగిన పవర్గ లక్ష్మి
తలామలకంబుతిఁ గనవచ్చు
ట్టివిష్ణుఁ డనాది చ్యుతుం డతఁడు
ట్టభద్రుఁడు[75] దేవపంక్తికి నెల్ల
ని కనంత మూర్ధాక్షికరాంఘ్రి
వితు లద్భుతముగా విలసిల్లుచుండు
ట్టిమూర్తియ నిఖిలావతారములుఁ
బుట్టంగ మూలమైపొలుచు నాకరము
బ్రహ్మ రుద్రాభిధానుఁడై యతఁడె
తికి నుదయ నాముల నొసంగు
ని యంశాంశంబు వనిపైఁ బుట్టి
తిధర్మమువ నిల్పు మచోటు చేరు
వియు నెయ్యవి యని డిగెదరేని
విరించి తెల్పెద వినుఁడు నిక్కంబు
యాయ బ్రహ్మ చర్యపరుండుఁ, గిటియు,
నాదండును, నరనారాయణులును,
రుదైన కపిల దత్తాత్రేయ మునులు,
సునాథుఁడైన యజ్ఞుం,డురుక్రముఁడు,
లియుఁడైన పృథుండుఁ, బాఠీన కూర్మ
ములును, ధన్వంతరి, మోహినీమణియు,


[75] పట్టభద్రుడు- నాయకుఁడు, ప్రధాని.

331
శ్రీన్నృసింహమూర్తియును, వామనుఁడు,
రాముండు, వ్యాసులు, రామచంద్రుండు,
భద్ర రుక్మిణీతియు, బుద్ధుండుఁ,
లికియ నను పేర్లుఁ లిగి యొప్పారు
నివియాదిగా ధాత్రి నెసఁగు మాధవుని
తారముల నెన్న జునకు వశమె
దేవదేవుని రిఁ గూర్చి వ్యాసుఁ
డాట శ్రుతుల చిక్కణచిన ఘనుఁడు
భాతం బనుపేరఁ రగు నామ్నాయ
సారంబు నిలిపిన కలార్థవేది
తి భాగవతాఖ్య న్నుతింపంగ
గుపురాణము చెప్పి నయుఁ డైనట్టి
శుకునిచేఁ జదివించె, శుకయోగిమణియుఁ
బ్రటించె గంగలోఁ బ్రాయెవ్రతమున
కృతియైన యా పరీక్షితున కిబ్బంగిఁ
బ్రతిలేని యట్టి పురాణరత్నంబు[76]
వినుపింతు మీ కేను విశదంబుఁ గాఁగ”
నుటయు నమ్మౌనుతని కిట్లనిరి

మునుల ప్రశ్న

ప్పురాణము వ్యాసుఁ డెట్లాది జెప్పె?
ప్పరీక్షితుఁ డెవ్వఁ? తఁ డేల యుండె


[76] పురాణరత్నము- శ్రీమద్భాగవత పురాణము

341
గంలో? నతనికి నాశుకుం డెట్టి
సంతిఁ దెలిపె నీ త్పురాణంబు?
వ్యాసులు తొల్లి యా యాత్మజు వెంట
నాక్తిఁ జనువేళ నాత్రోవ యందు
కేళి సలుపు నిర్జర సతుల్ శుకుని
లఁగ కూరక యుండి టతరువాత
రుదెంచు తనుఁ గాంచి యంతంత వల్వ
సి కైకొనఁ జూచి ట్టి విధంబు
డిగెడు నమ్ముని ప్పుడా వేల్పుఁ
తు లందరు నొక్కద్ధతిఁ గాఁగ
“నలయు, మగవాఁడు ను బుద్ధి నీకు
సొగొందుఁగాని శ్రీశుకులకు లేదు
కావున మాకు నిన్గని సిగ్గు వొడమె
నావిధం బమర దా నఘునిఁ జూడ”
నిపల్కి రను కథ ఖిల లోకముల
వినఁబడు నెప్పుడు వినుతంబుఁ గాఁగ
నంక యెచ్చోట నావునుం బిదుకు
నంకుం దడవుండ[77]తఁ డెట్టి వేళ
తఁడు భాగవతంబు నానరేంద్రునకు
హివృత్తిఁ దెలుపుట యెన్నంగ వింత”


[77] ఆవునుబితుకు నంతకుం దడ వుండడు- శుకమహర్షి ఒకే చోట ఎక్కువ సేపు ఉండడు, ఆవు పాలు పితుకుటకు పట్టేటంత సమయం దాటి ఒకేచోట ఎక్కడా ఉండడు.

351
నుటయు నా రౌమర్షణి[78] వారిఁ
నుఁగొని యిట్లనుం గౌతుకం బలర

సూతుని సమాధానము

మునులార! ద్వాపరంబున సత్యవతికి
నియించె భువిఁ బరారముని వలన
రియ వేదవ్యాసుఁ నఁగ నమ్మౌని
రుఁడు సరస్వతివాహినీ దరిని
రాజిల్లు బదరికాశ్రమమున నిలిచి
యీగంబున కెల్లహితకాంక్షి యగుచు
వేచతుష్కంబు విభజించి పైలుఁ
డాదిగాఁ గలుగు శిష్యగణంబుఁ జదువ
రించి భారతాఖ్యానంబు నిలిపె
లఁపులో నంతటం నివి చేకుఱక
యొనాటి ప్రొద్దున నుల్లంబులోన
నొకొంత నిర్వేద మొదవి చింతించి
కోరివేదముల చిక్కులు హరించితిని
భాతాఖ్యానంబులికితి వెలయ
చేవందపంబు చేసితి శక్తి కొలఁదిఁ
బాన భూము లేర్పడఁ గనుంగొంటి
నింయుఁ గాఁగ నిట్లేలకో పొడమె
మంరంగంబున పరితోషంబు


[78] రోమహర్షిణి- రోమహర్షుని పుత్రుడైన వ్యాసుడు

361
కేల హరికథాకీర్తనోన్నతులు
భావించి యొకనాఁడుఁ లుక లేనైతి
విరింతు నికనైన విష్ణుని కథలు
విశేషముగ జనుల్సంతసిల్లంగ
నివిచారము సేయునంత నచ్చటికిఁ
నుదెంచె నారద సంయమీంద్రుండు

నారద మౌని ఆగమనము

మునులార! వ్యాసు లమ్మునిమణి కపుడుఁ
తలంపంతయుఁ గ నెఱింగించె
హాశనుండు[79], నా కానీనమౌని[80]
పెల్లఁ దెలిసి యుక్తముగ నిట్లనియె

వ్యాసునికి నారదమౌని యుపదేశము

ఘాత్మ! భారతాఖ్యానరత్నంబు
నుపమంబుగఁ బల్కి లరితి కీర్తి
దియునుఁ గేవల రికథా వినుతి
ముఁ గాక నరాధితి వృత్తమయ్యె
వంటి వారలు ధురిపు కథలు
వినఁజేయు చదువులు వివరింపకున్న
రుఁడెట్లు భవబంధనంబునుఁ బాసి
మపదస్థితి డయంగ నోపు
సామంబు లవహిత నతమోమిహిర[81]
ధామంబు లపవర్గ[82]దాన ప్రభావ


[79] కలహాశనుడు- నారదుడు
[80] కానీనమౌని- వేదవ్యాస మహర్షి, పరాశరమహర్షికి జాలరి కన్య యందు పుట్టినవాడు
[81] అవహిత జనతమోమిహిరుడు- జనులకు స్థిరంగా ఉన్న తమస్సు అనే చీకటికి సూర్యుడు
[82] అపవర్గము- మోక్షము

371
సీమంబులనఁ బ్రకాశించు లక్ష్మీశు
నామంబు లతిపావములు సత్యముగ
యిట్టిపెంపమరుచునీడెందు లేని[83]
ట్టిమాధవుని నామావళి నుతికి
దృష్టాంతమైన మదీయ జన్మంబు
శిష్టులెన్నుదు రది చెప్పెద వినుము.”

నారద మౌని పూర్వ జన్మ వృత్తాంతము

నుత! పూర్వ జన్మంబు నందేను
ణీసురల యింటిదాసికి సుతుఁడ
నైయుండి యా విప్రు తి భక్తిఁ బెనుపఁ
బాక పెరిగి యాట్టణంబుననె
వ్రము సల్పుచు యోగిరు లొక్కచోట
ధృతినిల్చి యుండంగఁ దెలివిసెలంగ
యేవారిఁజేరి వారెపుడు లక్ష్మీశు
వేవేల విధముల వినుతించు తెఱఁగుఁ
నుఁగొని యా యోజగైకొని వారి
కొర సేవకుఁడనై యుండంగ వారు
చేసి శ్రీహరిదాసుల నడక
ప్రిమున నాకుఁ దెల్పిరి రహస్యముగ
యేడేండ్ల వాఁడనై యేను మా తల్లి
యోక సవరింప[84]నుంటి, నాలోన,


[83] పెంపమరుచునీడెందు లేని- పెంపు అమరుచును ఈడు (సాటి) ఎందును (ఎక్కడా) లేనట్టి
[84] సవరింప- పాలింప

381
వులం బిదుకంగ నంధకారమునఁ
బోవుచు నహి[85] చేత బొలిసె మజ్జనని
వక యేనును వైరాగ్యయుక్తిఁ
దెగువమై నుత్తరదిశ వట్టి యేగి
క్రముతో నొక మహాణ్యంబుఁ జొచ్చి
మిత పరిశ్రాంతి టు చాలనొచ్చి
యొయేటిఁ బానీయ మొకకొంతఁ ద్రావి
యొపిప్పలము నీడ నొనరంగ నిలిచి
మునులు చెప్పిన పథంబు[86] విష్ణు నాత్మఁ
నుటకై ధ్యానంబుగైకొంటి నంత
నంరంగంబున రి గాంచి మెచ్చి
యంలోనన చూడమరక[87] యున్న
ప్పటియునుఁ[88] జూతుని యేఁ బెనంగ
ప్పుఁడిట్లని పుట్టె నాకాశవాణి
బాక! నీవిట్లు ప్రాకృతదేహ[89]
శాలివై ననుఁ గనంజాల వివ్వేళ
నాయందు భక్తి ఘనంబైన, నదియ
చేయునా చేరిక చింతింప వలదు,
క్కంగ నిక నొక్క సాత్వికాంగంబుఁ[90]
గ్రక్కునం గైకొని నియెదు నన్ను


[85] అహి- పాము
[86] పథము- విధానము
[87] చూడనమరక- కనబడక
[88] అప్పటియును- అప్పటికిని
[89] ప్రాకృతదేహము- భౌతికశరీరము
[90] సాత్వికాంగము- సాత్విక శరీరము

391
నుచు నా చెవులకు టు వినంబడిన
వినువీధి పలుకులు విని సంతసిల్లి
రినామ సంకీర్తనాసక్తి మెఱయఁ
దిరుగుచునుండి యద్దేహంబు మాని
రారు నీ సాత్వికాంగంబు పూని
ధిలోఁ గల్పావసానంబు నందు
నించి యున్న యా తురాస్యు మేను
ప్రిమున నూర్పుతో బెరసి లోఁ జొచ్చి
మెలుపున నవ్విధి మేల్కొను వేళ
తొలిఁదొలి నిట్టూర్పుతోఁగూడ వెడలి
దేదత్తంబయి తెలివొందుచున్న
యీవీణె చేత సర్వేశుఁ బాడుచును
నిరుపమ హరి భక్తి నిశ్చింతవృత్తి
మౌని యన నున్నవాఁడ నిబ్భంగి
టుఁగాన యిపుఁడీవు రి కథాస్తవము
టియింపు మిపుడ లోహితంబుఁగాఁగ”
నుచు సంభాషించి యాదివ్యమౌని
నియె నిజేచ్ఛకుఁ య్యన నంత

భాగవత పురాణ నిర్మాణ ప్రకారము

తలంపునకు మిత్రముభంగి[91] నున్న
మునిపల్కు విని వ్యాసముని ముదంబంది


[91] మిత్రముభంగి- అనుకూలముగ