పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం 3

201
ఆంబికేయుని యరణ్యప్రవేశంబు
నంబుజాక్షుఁడు విజయంబు సేయుటయు
పాండునందన మహోప్రస్థాన కథయు
పాంవ మధ్యమ పౌత్రు దిగ్జయము
లిభంజనము శృంగి నశాప గతియు
నిఱేఁడు గంగకు నేఁగి నిల్చుటయు
లువొందు శుకదర్శనంబును నాఁగఁ
ప్రథమస్కంధ థలును మఱియు
నాదిఁబరీక్షితుం డిగిన తెఱగు
నాదృతుండైన ఖట్వాంగు మోక్షంబు
నొప్పారు ధారణాయోగ లక్షణము
ప్పరమేశుని వతార నుతియు
శుకజు డడిగిన సూటి తెలిపిన
జజు నారద సంవాద వివృతి

బ్రహ్మదేవుండు తపంబొనర్చుటయు
బ్రహ్మకు విష్ణుండు ప్రత్యక్షమగుట
బ్రహ్మయు హరియును భాసించు తెఱఁగు
బ్రహ్మనారదుల సంభాషణ క్రమము
నొరెడు దశలక్షణోదాహరణము[59]
నఁ బేరుకల ద్వితీస్కంధ కథలు


[59] మహాపురాణ దశలక్షణములు- 1సర్గము 2విసర్గము 3స్థానము 4పోషణము 5ఊతులు 6మన్వంతరములు 7ఈశానుకథలు 8నిరోధము 9ముక్తి 10ఆశ్రయము,

211
విదురుఁ డుద్ధవుఁ బెంపు వెలయఁ గాంచుటయు
విదురు మైత్రియును సంవిహిత వాదంబు
ధాజన్మంబునుఁ చ్చరిత్రంబు
నాత కాల కల్పాది లక్షణము
ర్గప్రకారంబు స్వాయంభువుండు
ర్గైక కార్యుఁడై సంభవించుటయు
తిచిత్రమగు వరాహావతారంబు
దితికశ్యపులకు సంధిల్లు పల్కులును
విజయుల కట్టి శాపంబు కలిమి
విజయులు ధాత్రి నియించుటయును
ర్వితుం గనకాక్షుఁ డిమిఁ ద్రుంచుటయు
నుర్వీతలముఁ జక్రి యుద్ధరించుటయు
నొగిఁగర్దముఁడు దేవహూతిఁ గూడుటయు
గునట్టి కపిలావతార క్రమంబు
పిలుండు తల్లికిఁ డు సాంఖ్యయోగ
విపుల మార్గంబులు వివరించుటయును
నఁగ బ్రఖ్యాతంబులైమనోహరము
నఁగ మించిన తృతీస్కంధ కథలు
ధిక మనుసుతాసంతతి క్రమము
ణీయ దక్షాధ్వధ్వంసనంబు


221
ధ్రువేన పృధు మహాద్భుత చరిత్రములు
బ్రవిమల ప్రాచీనర్హిరున్నతియు
మ పురంజనోపాఖ్యానకంబు
వెసఁబ్రచేతసులు శ్రీవిష్ణుఁ గాంచుటయు
వారికి మారిషానిత యందధిక
సాత దక్షునిననంబు నాగ
నీయ విస్మయకారణ లీలఁ
బ్రణుతంబులగు చతుర్థస్కంధ కథలు
కీర్తి యగు ప్రియవ్రతు చరిత్రంబు
త ప్రమోదవైవము నాంగిరస
హుగణ భాషణక్రమము బ్రహ్మాండ
హిమ విశేష ప్రమాణ వర్ణనము
యంగ నుపరిలోముల[60] నిల్కడయు
నెకొన్న పాతాళ[61] నిరయ[62] క్రమములు
నానేక విధాభినందిత మార్గ
మానిత బహు పంచస్కంధ కథలు
దినజామిళోపాఖ్యాన మంద
యాదానవారి దాస్యప్రభావంబు
క్షుతపంబును క్షు సంతతియు
క్షీణ దేవాసురాది జన్మములు


[60] ఊర్ధ్వ లేక ఉపరి లోకము లేడు- భూ: భువ: సువ: మహ: జన: తప: సత్యమ్. సత్యలోకము బ్రహ్మ నివాస స్థానము కాగా దానిపై వైకుంఠము.
[61] పాతాళములు- అధోలోకము లేడు- అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకములు.
[62] నిరయము-నరకము.

231
రూఢినొందిన విశ్వరూపు వర్తనము
తోనే పుట్టు వృత్రుని దుర్నయంబు[63]
వినుతమైన దధీచి వితరణ కథయు
దేవ దైత్య సంగ్రామ సంభ్రమము
వృత్రాసురుని దేవవిభుఁడు దృంచుటయు
చిత్రకేతు కథావిశేష సంగతియు
వి నేకోనపంచాశత్కుమార[64]
రితంబు ననియెడు ష్ఠంబు కథలు
తుల యముని సంభాషణ క్రమము
క మించు హిరణ్యశిపు వృత్తంబు
ప్రహ్లాదు జన్మంబు గవంతుసేవ
నాహ్లాదమున బొందు తని వర్తనము
శ్రీనృసింహుఁడు ప్రకాశించిన తెఱఁగు
దావపుర నిపాన పద్ధతియును
త వర్ణాశ్రమాచార నిర్ణీత
ములు నను సప్తస్కంధ కథలు
స్వాయంభువాదిక రితంబు దంతి
నాక మోక్ష మావ వర్తనములు
బ్ధిమంథనము కూర్మావతారంబు
బ్ధిశాయి లతాంగి యైన చందంబు
లిపక్ష దానవల నిర్ణయంబు
లిత హరిహరల్లాప కథయు


[63] దుర్నయము- దుర్ + నయము, చెడు నడత, చెడు నడవడిక.
[64] ఏకోన పంచాశత్కుమారులు- ఏ కోన పంచాశత్ అంటే ఒక్కటి తక్కువగా గల యాభై. అనగా 49. దైత్యుల తల్లి దితి గర్భంలోని పిండాన్ని యింద్రుడు ఏడు ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కను మరలా ఏడు ముక్కలుగా నరికాడు. అలా ఏడు ఏడులు- 49 మంది ఐరి. వారే మరుద్గణము అను దేవయోని

241
మీద వైవస్వతాది వృత్తములు
వానావతరణ వైభవంబులును
ధీసత్యవ్రత స్థితియు మీనావ
తారంబు ననఁగ విస్తారంబుఁ గలిగి
జ విశేష రప్రపంచముల
హినెన్నఁ గల యష్టస్కంధ కథలు
రావంశావు కీర్తనము సుద్యుమ్న
రాచరిత్ర చిత్రంబు నిక్ష్వాకు
పతి ప్రముఖ జన్మము మరుత్తాది
రితంబు నంబరీప్రభావంబు
రాజిల్లు మాంధాత ప్రౌఢియు సగర
రావృత్తియు భగీథ విలాసంబు
శ్రీరామకథయును శీతాంశు కులము
వాల యనుభావ ర్ణనోద్యమము
శురామకథా ప్రపంచంబుఁ గీర్తిఁ
దిమైన యల యయాతిప్రచారంబు
నుమణి యగు శకుంల వివాహంబు
నుతంబైన దౌష్యంతి[65] వర్తనము
సండి భీష్మాది న్మంబు ఋశ్య
శృంమౌని తపోవిశేషంబు విధము


[65] దౌష్యంతి దుష్యంతుని కుమారుడు, భరతుఁడు

251
దువంశ కథనంబు నందు శ్రీకృష్ణు
నుయ సూచనము నా నుర్విలో వెలసి
వ్యతరంబులై ప్రణుతింపఁజాలి
వ్యంబులైనట్టి వమంబు కథలు

దేకీ పరిణయ స్థితియుఁ, గంసుండు
దేకి నణఁపంగ దెగువఁ జాపుటయు,
దేవ కృష్ణుల ప్రభవంబు, వార
రి నందుని పల్లె యందుంచుటయును,
వికృతాంగిఁ బూతన విదళించుటయును,
ట తృణావర్త సంహరణంబు,
ర మృత్తికఁ దిన్న యాచిత్రకథయు,
[66] మద్దుల శాప ణగించుటయును,
రిమ బృఁదావనా మనంబు, వత్స
ణంబు, కాళీయు దటుమాన్చుటయు,
వహ్ని పానంబు, ల్లవీవ్రతము[67],
గత వల్లవీ స్త్రాపహృతియు,
ల మెత్తుటయు, యానందానయంబు,
నుచిత రాసక్రీడయును సుదర్శనుని
శామోచనమును, శంఖ చూడాది
పానిష్ఠులఁ బట్టి భంజించుటయును,


[66] అమడ- జంట
[67] వల్లవీవ్రతము- గోపికలు చేసి వ్రతము కాత్యాయనీవ్రతము.

261
కెలి కంసుఁడు దేవకిని వసుదేవుఁ
రుణ లేక నిరోధతులఁ జేయుటయు
క్రూర రాకయు, మునలో నతఁడు
క్రితనూవిశేషంబుఁ జూచుటయు,
విశ్రుత మధురా ప్రవేశవృత్తంబు,
శ్రమ కృత మహేష్వాస భంగంబు
పెనుపొందు కువలయాపీడ నాశనము,
మునుకొని చాణూర ముష్టిక వధయు,
యేతోఁ[68] గంసుని హింసించుటయును,
దేకీ యుత వసుదేవ మోచనము
శ్రీమాన్యుఁగా నుగ్రసేను నిల్పుటయు
రాకృష్ణులు విద్య హి[69] నేర్చుటయును
గురుతనూజుని నొసంగుటయు మాగథుని
రిమోక్తియును ద్వారకాప్రవేశంబు
రుఁడైన యా కాలవన ఘాతనము
మొప్పు రుక్మిణీల్యాణ కథయు

ప్రద్యుమ్న చరిత జాంవతి చేకోలు
ప్రద్యుతి యను సత్యభామ పెండ్లియును
లు కాళింది వివాహంబు నట్టి
ఱి నైన మిత్రవిందాసమాగమము


[68] ఏవ- రోషము
[69] రహి- బాగు

271
కుదియించి ముర నరకులఁ ద్రుంచుటయును
దియారు వేవురు ణఁతుల వృతియు[70]
కొని పారిజాము హరించుటయు
లుషించు రుక్మి నిగ్రహము[71] సేయుటయు
షఁదెచ్చుటయును నృగోర్వీశు తెఱఁగు
విమతం గాళింది వేగఁ జించుటయు
[72] పౌండ్ర కాశీశ మర్దనము
కాశిదీపనము నుగ్రత నొనర్చుటయు
ద్వివిద సంహృతియు హస్తిన పురి రాముఁ
లీల హలముచే లమి యీడ్చుటయు
శౌరినారదుల విస్రంభ గోష్ఠియునుఁ
జేరికఁ గల యుధిష్ఠిరు యాగ కథయు
జరాసంధ సంహార చాతురియుఁ
టుశక్తి నల శిశుపాలుఁ ద్రుంచుటయు
సాల్వాది నిర్జయసంభ్రమోక్తియును
ల్వలాసురుని దర్పంబణచుటయు
ఘు కుచేల ద్విజాఖ్యానకంబు
పొలుపారు దేవకీ పుత్రార్పణంబు
ప్రథితమైన సుభద్ర రిణయోత్సవము
మిథిలకుఁ గృష్ణుండు మెరసి యేగుటయు


[70] వృత్తి- వరించుట
[71] నిగ్రహము- నిర్బంధించుట
[72] ఈశతన్- సర్వశక్తిమంతముగా

281
మృవిప్రపుత్రు నర్మిలి నొసంగుటయు
శ్రుతిగీతలును వృకాసురు చరిత్రంబు
హికెక్కు[73] భృగు మహత్వంబును ననఁగ
హిఁబేరు కల దశస్కంధ కథలు

సుధామరులు శాపచన దానంబు
సుదేవ మౌని సంవాద మార్గంబు
తులితార్షభ విదేహాధి పోక్తులును
తురాస్యు ప్రార్థనా సంవిధానంబు
నురక్తి నుద్ధవుం డిగెడు తెఱగు
నువైన యవధూత దు వివాదంబు
శౌరియుద్ధవునకు కల తత్త్వములు
కారుణ్య వివశతం గానఁబల్కుటయు
యు ప్రభాస యాత్రయు యదుప్రవరు
డఁగుట హరి విజయంబు సేయుటయు
నఁగ నామ్నాయ తుల్యంబులై మెఱయు
వినుతైకాదస్కంధ కథలు

ప్రగుణిత కలియుగ రాజవంశములు
యులక్షణము ప్రళయోరు లక్షణము
రీక్షిత్తు నిర్యాణంబు మిగుల
నోపిన జనమేజయుని సర్పమఖము


[73] వహికెక్కు- వాసికెక్కు

291
శ్రుతిశాఖ లేర్పరించుటయు, మృకండు
సుతునుపాఖ్యాన మచ్చుత మహాపురుషు
నంశస్త్రముల విన్యాసక్రమంబు
నాంగిరమైన సూర్యప్రశంసయును
గుపురాణముల ప్రస్తారంబు ననఁగ
తి మించిన ద్వాదస్కంధ కథయు

లిగి సాంగోపాంగకంబుగా వెలయుఁ
లుఁదెఱంగుల బాలభాగవతంబు
యిదియ వేదము, శాస్త్ర మిదియ, పురాణ
మిదియ, యలంకార మిదియ, యటంచు
ల విద్వజ్జనుల్సన్నుతి సేయఁ
బ్రటమౌ భువి బాలభాగవతంబు

ఫలశ్రుతి

భాసిల్లు నీ బాలభాగవతంబు
వ్రాసినఁ జదివిన ర భక్తి వినిన
నిందిరేశుఁడు వారి హృదయంబులందు
వింయి వసియించి వేడ్క యొనర్చు
ఖిల తీర్థంబులనాడిన ఫలము
ఖిల దానముల సేయఁగ గల్గు ఫలముఁ
జేట్టి వారు లక్ష్మీవిశేషముల
దీపింతు రఖిల దిగ్దేశంబులందు