పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం 3-601-700

601
రియు నొప్పుగ నరరిమూర్తి యగుచు
నఖరముల నా లు సంహరించె
సావఁబుట్టిరి[222] వారు గతిపై మఱల
రాణ, కుంభకర్ణత్వంబు పూని
వాల రాముఁడై ధియించెఁ జక్రి
సౌరాష్ట్రతానుత గతీశ తిలక!
అంట వారె యుద్ధతి శిశుపాల
దంవక్త్రాఖ్యులై రఁ బుట్టి రిటుల
రియునుఁ గృష్ణుఁడై వనిపైఁ బుట్టె
రిభావమున ముక్తుఁ య్యెఁ జైద్యుండు
మూడుజన్మంబుల మునిశాపతరుణ
మీడేరె[223] నిప్పటికీవైష్ణవులకు”

పరీక్షిత్తు శుకయోగిని ప్రహ్లాదుని కథాక్రమముఁదెల్పుఁడని విన్నవించుట

వుండు నా హిరణ్యకశిపుం డేల
యుని నొప్పించెఁ త్కథాక్రమము
ప్రటింపుమని తన్నుఁ బ్రార్థించి యడుగ
శుయోగి చంద్రుండు సుముఖుఁడై పలికె

శుకయోగి ప్రహ్లాద చరిత్రము చెప్పుటకు ముందు హిరణ్యకశిపుని తామసప్రవృత్తిని వర్ణించుట

నుజాతుఁడగు హిరణ్యాక్షుఁ డీరీతిఁ
నుటయు శంబర కునాదులైన
సురుల నా హిరణ్యకశిపుం డాత్మ
విసృమర[224] క్రోధుఁడై వేర్వేర పిలిచి


[222] సావంబుట్టిరి- చచ్చుటకు పుట్టారు
[223] శాప తరుణము ఈడేరె- శాపము నియమము తీరినది
[224] విస్రమర- వ్యాపించు స్వభావముతో

611
మాహిరణ్యాక్షుని డియించె నప్పు
డాహరి కిరిమూర్తి[225] యైకపటమున
దయత యేనట్టి హితు కంఠంబు
ప్రిదులఁగ[226] శూల నిర్భిన్నంబు సేసి
డయక తద్రక్తధార తమ్మునికి
డలిక దీరఁ దర్పణ మొనరింతు
యీరలు నహితు నకిష్టంబు సేయ
రణీసురల గోతతులను హింసించి
క్రతుకర్మములకు విఘ్నములుఁ గావించి
క్షితిమీఁద గలభులు సేయుఁ డెల్లెడల”

హిరణ్యకశిపుఁడు తల్లియైన దితికి సాంత్వన వాక్యములు చెప్పుట

నివారి ననుపుచు నంతిపురమున
తి దూరంబగు చ్చోట నిలిచి
ల్లిని మరదలిం మ్ముని సుతుల
ల్లన రావించి యారసి సొక్కి
అందులోఁ దమ తల్లి గు దితిం జూచి
సందీప్తశోకంబుఁ రచి[227] యిట్లనియె
నీకుమారుఁడు శూర నికరంబు మెచ్చ
వైకుంఠు నెదిరించె లదింక వగవ
త్మనిత్యుఁడు శుద్ధుఁ వ్యయుం డట్టి
యాత్మకు నెప్పుడు నంతంబు లేదు


[225] కిరిమూర్తి- వరాహావతారుడు
[226] ప్రిదులు- తెగిపడిపోవు
[227] చరచు- తొలగించు

622

నుఁడు కన్నుఁ గదల్ప గతియుం గదలు
నువునం దోఁచిన టుల నాత్మయును
ర్మవశమున నంగంబున[228] నుండు
ర్మంబు చేతనే డనైన నేఁగు
వొవేళఁ గూడుదు రొకవేళఁ జనుదు
ట బంధులు పక్షుగములఁ[229] బోలె

హిరణ్యకశిపుఁడు కన్నతల్లి దుఃఖోపశమనునకై ప్రేతబంధు యమ సంవాదమను ఉపాఖ్యానము సెప్పుట

మ్మ!యిందుల కుపాఖ్యానంబు నొకటి
యిమ్మెయిం[230] జెప్పెద హృదయార్తి యణఁగ
దుశీనర[231] మనఁగాదేశ మొకటి
వడు నందు సుజ్ఞుఁడన్ రాజు
డినతం డనిలోన[232] వైరులు వ్రాల్ప[233]
డియుండు నంతఁ దద్భామినుల్గూడి
హువిధంబుల విలాములు సేయుచును
హిమీదఁ బొరలుచు రిఁగెడు వేళ
ముఁడొక బాలుఁడై రుదెంచి నిలిచి
లనేత్రులఁ బల్కె ఘంటారవమున
యేశోకించెద రిట్లింతులార!
యేలెడు మీ పతి యెట కేఁగి నాఁడు?
చ్చునే యతఁడిట్లు గచిన మీకు
చ్చునాశమునకు గవ రదేల


[228] అంగము- శరీరము
[229] గములు- సమూహములు
[230] ఇమ్మెయి- ఈ ప్రకారము
[231] ఉశీనరము- ఒక దేశము, ప్రస్తుత పంజాబులోని ప్రాంతం, అర్థం నరులు ఇక్కడ ఉండుటకు ఇష్టపడతారు అని.
[232] అని- యుద్దము
[233] వ్రాల్పు- పడగొట్టు, సంహరించు

632

నాశమెఱుఁగక తారొరుల్ చనిన
క్రములుఁ గని పొక్కఁగానాయమగునె?[234]
లుఁడొక శబరుండు కానలోఁ దొల్లి
వైచి పక్షుల డిఁ బట్టుకొనుచు
వొకుళింగినిఁ[235] బట్టి యుండెడునంతఁ
బ్రటించి దానిఁ బుంక్షి[236] యిట్లనియె
యిదియిట్టి గతిఁబోవ నిపుడును రెక్క
లొవని పిల్లలెట్లోపును బ్రదుక
నుమున్నె యణఁపక[237] దైవ మిమ్మగువఁ
నఁజేసె నిటుమీఁద సైతు నేనెటుల’
నంత నెఱుక[238] హుమ్మని యొక్క కోలఁ[239]
నుఁగొని యా కుళింముఁ బడనేసె
యెట్టివారికినైన నెన్నఁ గాలంబు
ట్టుఁదప్పిన ధాత్రిఁ డక పోరాదు
నుఁడు వెఱ్ఱితనంబు చాలు లెం” డనుచు
నినందనుఁడు[240] తిరోహితుఁడయ్యె నంత
యింతులును శోకమంతయు మరచి
పోయిరి తమ గృహంబులకు, నట్లగుట,
వకుం” డని యిట్లు ర్ణించి పలుక
పెఱుంగక వారు ర్తించి రంత
[234] చచ్చిన వారి కేడ్చెదరు చావని వారల భంగి పోతన భాగవతము (7-46-ఉ.)
[235] కుళింగి- ఆడపిచ్చుక, పిచ్చుకపెట్ట, కుళింగము- మగపిచ్చుక, పిచ్చుకపుంజు
[236] పుంపక్షి- మగపక్షి, పుంజు
[237] అణచక- అణచివేయక, చంపక
[238] ఎఱుక- వేటగాడు
[239] కోల- బాణము
[240] ఇన నందనుడు- యముడు

హిరణ్యకశిపుఁడు తన తమ్ముడైన హిరణ్యాక్షుని సంహరించిన శ్రీమన్నారాయణునిపై పగఁదీర్చుకొనుటకు బ్రహ్మను గూర్చి ఘోరతపం బొనర్చుట

641
హిరణ్యకశిపుఁ డాగ్రహోదీర్ణ[241]
సాసంబునఁ బెంపు సాధింపఁగోరి
మంరద్రోణి కమం[242] వేగమునఁ
బొందుగాఁ జని మౌని పుంగవుల్ మెచ్చ
వొక్కయంగుష్ఠంబె[243] యుర్విపై మోపె
క్కఁగా దివికి[244]స్తంబుల నెత్తి
యురుతర తపము సేయుచునుండ నతని
శిమునం దేజ మూర్జితవృత్తి[245] వెడలి
అంట దుస్సహంబైన నిలింపు[246]
లెంయు నొగిలి వాణీశునిం[247] జేరి
విన్నవించుటయు భావించి విరించి
యిన్నియు మున్నె తానెఱుఁగు వాఁడగుట

హిరణ్యకశిపునికి బ్రహ్మ ప్రత్యక్షంబగుట

నుదెంచి వల్మీక సంఛన్నుఁ[248] డైన
నుమనిఁ గాంచి సమ్మదము వహించి
వర్జముగ[249] దివ్యమములు[250] వేయి
లిపితిఁ దపమింకఁ జాలునో వత్స!”
నికమండలు తీర్థ ర్థిఁ బైఁజల్లఁ
నుబడ్డ పుట్ట లోల నుండి వెడలి
దివ్యదేహత నున్న దితినందనుండు[251]
వ్యాత్ముఁడగు పద్మవుఁ[252] గని మ్రొక్కి,
[241] ఉదీర్ణము- ఉదారము, గొప్పది
[242] అమంద- మందము కాని, వేగవంతమైన
[243] అంగుష్టము- బొటకనవేలు
[244] దివి- ఆకాశము
[245] ఊర్జిత వృత్తి- గట్టి, దృఢమైన విధముగ
[246] నిలింపులు- దేవతలు
[247] వాణీశుడు- బ్రహ్మదేవుడు
[248] వల్మీక సంఛన్నుడు- పుట్టలో కప్పబడినవాడు
[249] జలవర్జముగ జలపానము చేయకుండ
[250] సమము- సంవత్సరము
[251] దితి నందనుడు- హిరణ్యకశిపుడు
[252] పద్మభవుడు- బ్రహ్మదేవుడు

651
దేమర్త్య భుజంగ తిర్యగాధికత
నీవొనరించిన యీసృష్టి వలన,
లు రాత్రులును, లోలను వెల్వలను,
విలి సజీవ సంతి, నజీవముల,
చావులేక్కునియును, కల దిక్పాల
కాలిమించిన యైశ్వర్య పదము,
భునజయంబును, భుజబలోన్నతియు,
విశేషమైన రాజ్యంబునుం గలుగ
ములు నాకిమ్ము రతేజ!” యనుఁడు
విందసంభవుం[253] “డౌగాక” యనుచు
న్నియు వరములు నురక్తి నొసఁగి
మున్నువచ్చిన మార్గమునఁ జాగి యరిగె

హిరశ్యకశిపుఁడు అష్టదిక్పాలకులు మొదలుగాఁగల దేవగణములను హింసించుట

ములుఁగొని దైత్యరుఁడు దర్పించి,
రుస దిక్పాలదేతల దండించి,
ద్వాశాదిత్యులఁ రిమి, రుద్రులకు
ఖేదంబు మనములఁ గీల్కొనంజేసె,
రుడ, ఖేచర, సిద్ధ గంధర్వ, యక్ష,
,భోగి ముఖ్యుల లినలి సేసె
చ్చరల్గొలువంగ జ్ఞభాగములు[254]
పుచ్చుక నిర్జరపురిఁ[255] గొల్లఁగొట్టె


[253] అరవింద సంభవుడు- బ్రహ్మదేవుడు
[254] యజ్ఞభాగములు- హవిర్భాగములు, వేల్చిన హవిస్సులోనుండి వివిధ దేవతలకు చెందు ఆయా వంతు భాగములు

దేవతలు ద్వాదశాక్షరీ మంత్ర స్వరూపుఁడైన వాసుదేవుని శరణు జొచ్చగా, స్వామి అభయమిచ్చుట

661
మ ప్రతాపాఢ్యుఁ[256]డైయుండు నంత
విసివి యేకతముగా వేల్పులుఁ గూడి
ద్వాశవర్ణమంత్ర[257]విశేషగతుల
నాదిదేవుని విష్ణు భినుతి సేయ
తఁడదృశ్యాకారుఁడైదయారసము
వితంబుఁ[258] గాఁగ నవ్వేల్పులతోడ
వెవకుం[259] డేను మీ విప్రకారముల[260]
నెఱుఁగుదు మున్నె యిట్లేల కలంక
వుల యందు నా యందును ధరణి
దేతలందుఁ గ్రోధించి యెవ్వాఁడు
కఱిసేయు[261] నా ఠినచిత్తునకు
కుఱుఁగట[262] మృత్యువుఁ గూడు నిక్కముగ
త్మజుండైన ప్రహ్లాదుని నెప్పు
డాత్మలో దయలేక ణపంగఁ జూచు
బుధులార! యేను నప్పుడె యద్దురాత్ము
ధియింతు నిదియు తత్త్వంబు సుం” డనియె
ట్టియానతి నమ్మి యావేల్పు లెఱుక
ట్టిట్టినక యుండి రందఱు నణఁగి

ప్రహ్లాదుఁ డాగర్భవైష్ణవుఁడై[263] జన్మించి, విష్ణుభక్తి తత్పరుఁడై ప్రవర్తించుట

యీలీల దితిపుత్రుఁ డెదురెందులేక
కాలాభుఁ[264] డయి పెక్కుఁ గాలంబుఁ గడపె


[255] నిర్జరపురి- అమరావతి
[256] అసమ- అసమానమైన, ప్రతాపుం- పరాక్రమము, ఆఢ్యుడు- సమృద్ధిగా కలవాడు
[257] ద్వాదశవర్ణమంత్రము- ద్వాదశాక్షరీ మంత్రము “ఓం నమోభగవతే వాసుదేవాయ”, వాసుదేవద్వాదశాక్షరీ.
[258] వితతము- విరివి
[259] వెఱవకుడు- భయపడకండి
[260] విప్రకారము- తిరస్కారము
[261] కఱకఱి చేయు- బాధపెట్టు
[262] కుఱగలి- సమీపము
[263] గర్భవైష్ణవుడు- తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి విష్ణుభక్తుడు
[264] కాలాభుడు- యముడు

671
నంను లతనికి లువురుఁ గలిగి
రందెన్నఁజాలి ప్రహ్లాదుండు వెలసె
ల్లిగర్భంబులోఁ గనుండు నపుడ[265]
నుల్లమచ్యుతునిపై నునిచిన వాఁడు
చుచోఁ దిరుగుచో వ్వెడు చోటఁ
గుడుచుచోఁ బవళింపఁ గోరెడు చోట[266]
రి!హరి! సర్వేశ! యార్తశరణ్య!
మేశ!” యని చాల లికెడు వాఁడు
నొంటిపాలైనచో, “నోకృష్ణ దేవ!
కంకోద్ధారక! లజాక్ష!” యనుచు
విజయీభవ లజాక్ష” యనుచు
యుత భంగులఁ బాడి యాడెడు వాఁడు
వొక్కొక్క యెడ నంబుజోదరుఁ దలచి
క్కువఁ దనుచింత దిలేనివాఁడు
నైయా ప్రహ్లాదు సమానగుణము
లానిత్యునకు నెన్ని న్నియుఁ గలవు
శాంతుండు, దాంతుండు సౌశీల్య సత్య
వంతుండు, గాంభీర్యవంతుఁ డుత్తముఁడు
ధీరుఁడుదారుండు ధృతవినయుండు
సారోన్నతుఁడు, సర్వముఁడు, నిస్పృహుఁడు


[265] తల్లిగర్భంలో ఉండునపుడు ఉల్లము అచ్యుతునిపై ఉనిచిన వాడు- గర్భవైష్ణవుడు
[266] పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషింపుచున్ హాసలీలాని ద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతా స్వాద సంధానుండై మఱచెన్ సుదారిసుతుఁడేత ద్వాశ్వమున్ భూవరా! పోతనభాగవతం (7-123-శా.)

681
ప్రతిభానవంతుండు ప్రాజ్ఞుండు, సుకృత
తిశాలి, దాక్షిణ్యతి సవశ్యుండు

హిరణ్యకశిపుఁడు పుత్రుఁడైన ప్రహ్లాదుని శుక్రాచార్యుల కుమారులైన చండామర్కుల వద్దకు చదువఁబంపుట

నఁబ్రసిద్ధుండైన యాపుత్రుఁ దండ్రి
నులకు మెచ్చుగాఁ దివింపఁ గోరి
పుడ చండామర్కును కవిసుతుల[267]
విపుల మోదమున రావించి మన్నించి
నుతుండైన నంను నొప్పగించి
గున నబ్బాలుఁ దివింపుఁ” డనుఁడు
దివింపఁ గల నీతిశాస్త్రవాక్యములు
దివించి రాబాలుఁ లపట్టి గురులు
దిమెచ్చకయు మారుమాటలు లేక
దివించునంతయుం దివె నా ఘనుఁడు
పిమ్మటం దన యోజ ప్రిదులక విష్ణు
మ్మితి ననుచు నానందంబు నొందు

ప్రహ్లాదుని చదువెట్లు సాగుచున్నదో తెలియఁగోరి హిరణ్యకశిపుఁడు స్వయముగాఁ బరిశీలించుట

అంట నొక్కనాఁ డాదైత్యవిభుఁడు
సంతంబును నట్లు దువుచునున్న
కొడుకును రప్పించి గొబ్బునం దనదు
తొలపై నిడుకొని తొలుత లాలించి
న్న!నీ కభిమతం గు నొక్క చదువు
విన్నాణమున మాకు వినఁజేయు” మనుఁడు
[267] కవిసుతులు- శుక్రాచార్యుని పుత్రులైన చండామార్కులు


691
ధిప! యీ సంసార ను కుక్కి నూత
ముఁడై పడి చిక్కి యార్తుండుఁ గాక
జాక్షుదాసుఁడై నటలు లేక
సీమ నుండి పానుఁ డగుటొప్పు”
నిపల్కెఁ బ్రహ్లాదుఁ సుర యా పల్కు
వినిశుక్రతనయుల వీక్షించి నవ్వి,
డిగిన గతి బాలు లాడుదు రిట్టి
ణికి[268] నీరలు న నిచ్చుటెట్లు
రివంక వారి నెయ్యంబు లేకుండ
సి శిక్షింపుఁడీ” నుచుఁ బంపుటయు

గురుశిష్య సంవాదము

నాపురోహితులుఁ బ్రహ్లాదుఁ దోడ్కొనుచుఁ
దాపంబుఁ దోడుతం మ యిండ్ల కేఁగి,
వోత్స! నీకిట్టి యుక్తులెవ్వారు
భావించి తెలిపిరి లుకవే” యనిన,
వొరుఁడుఁ, దానను బుద్ధి యుర్వినందఱకు
రిమాయచే నిల్చి లరెడుఁగాదె
వొరులుఁ దెల్పెడు వారలున్నారె యెచట
రిమయం బగు నెల్ల దియు నిక్కముగ
యినుమంటురాతికి[269] నెగసిన భంగి
యంబు నా మది రిఁ గూర్చి కదలు”


[268] సరణి- దారి, విధము
[269] అంటురాయి- సూదంటు రాయి. అయస్కాంతము. హరి అయస్కాంతము, భక్తుడా అయస్కాంత శక్తిచే నాకర్షింప బడు యినుపముక్క వంటివాడు.- పోతన భాగవతము ( 7-149-తే.)