పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం 7

601
నిలిచెఁ ద్రిలోకమాణిక్యంబు భాతి
జాక్షు కరుణ నిశ్చలముగా ధ్రువుఁడు

మైత్రేయునిచే ధ్రువచరిత్ర విన్న విదురుఁడు ప్రచేతసు లెవ్వరని ప్రశ్నించుట

తులేక మెఱయు నీ ధ్రువచరిత్రంబు
తెలిసి యా నారదదేవర్షి మున్ను
హిఁ[284]బ్రచేతసుల సత్రమునఁ గీర్తించె
జ వీణారవశ్రవ్యంబుఁగాఁగ
నుఁడుఁ బ్రచేతసు నువార లెవ్వ
నివిదురుండుఁ దన్నడుగ నాలించి
తెలుపంగఁదొడఁగె మైత్రేయుఁ “డో విదుర!
ఘుఁడు ధ్రువపుత్రుఁ గు వత్సరునకు

మైత్రేయుఁడు విదురునికి వేనాదుల చరిత్రములను ముందుగా చెప్పుట

నొవెఁ బుష్పార్ణుఁ డ య్యుర్వీశమణికి
విదితుఁడై వ్యుష్టాఖ్య విభుఁడుదయించె
సుతుఁడయ్యె సర్వతేజుండానృపతికి
ని కార్యుఁడు చక్షును మనువొదవె
నికి నుల్ముకుం తనికి నంగుఁ
నికి నట వేనుఁ నువాఁడుఁ గలిగె

దుర్మార్గుఁడైన వేనుని మార్చలేక తండ్రి అంగమహారాజు అర్ధరాత్రి అడవుల ప్రవేశించుట

వేనుని దుర్మార్గ వృత్తి వీక్షించి
నానావిధముల మాన్పఁగ లేక రోసి
{రి వీడిరహస్య మార్గాన పట్టి
నంగు డడవుల డిరేయి పోగ


[284] రహి- ఆనందము, బాగు

611
మునులంత వేనుని మును రాజనంగ
[285] పాలకు నంగు ని మునీశ్వరులు}
కొంక యాత్మీయ గురుతపోమహిమ
హుంకార మొనరించి యుర్విపై వ్రాల్ప

వేనుని మరణముతో దేశమరాచకము కాగా, తత్పాపపరిహారార్థము ఋషులు వేనుని యూరువును మధింపగా ఒక నిషాదుఁడు జన్మించుట

రాజ్యంబు నెల్లఁ జోకులు[286] జారులునుఁ
బ్రాజ్యమదంబున[287] బాధించి రేది[288]
దిచూచి మునులెల్ల వ్వేను మేనఁ
దిసి తారొక పుత్రుఁ లిగింపఁ గోరి
యూరువుల్ దరువ[289] నం దొక నిషాదుండు[290]
ధీరుండు గిరిచరాధీశుండు వొడమె
వేనుమేనున నుండి వెడలెఁ బాపంబు
లానిషాదుని తోనె నవశేషముగ

ఋషులు వేనుని బాహుద్వయమును మధింపఁగా లక్ష్మీ నారాయణులు జంటగా అర్చి, పృధువులను పేర నుద్భవించుట

అంతఁదద్బాహుద్వయంబు మధింప
గాంమైథునయుద్గతంబయ్యె నపుడు
గురుతర మహిమానుగుణ లక్షణముల
రియును, సిరియును ని వారిఁ దెలిసి
ప్రథితు లమ్మును లెల్ల భావించి వారిఁ
బృథుఁడు, నర్చియు నని పిలిచి రింపలర

ఋషులు పృథువుకు పట్టాభిషేకము చేయుట

ట్టియా మునులెల్ల నాపృథు నపుడ
ట్టంబుఁ గట్టిరి ప్రజలతోఁ గూడి


[286] చోరకులు- దొంగలు
[287] ప్రాజ్య మదంబున- అధికమైన గర్వంతో
[288] ఏదు- పెరుగు
[289] ఊరువులు తరువ- తొడలు మథింపగా
[290] నిషాదుడు- వేటగాడు, ఒకతెగ బోయ, పాపము యుండువాడు

621
డంబైన హేమపీముఁ దెచ్చె ధనదుఁ
డంబునాయకుఁ[291] డిచ్చె నాతపత్రంబు
చారంబుల[292] నభస్వంతుఁ[293] డొసంగెఁ
బ్రేనింద్రుండు కిరీట మర్పించె
రిచక్రమును, వార్థి మలశంఖంబు
సిరులు దైవార నిల్చిరి విశేషముగ

పృథు మహారాజు గోరూపయైన పృథివితో సంభాషించుట

పృధుండంత నన్యసామాన్యుఁ
డీపృథివీ తలం బెన్నఁ బాలించె
ట్టికాలమున ధాన్యము లెల్ల కడలఁ
బుట్టక ప్రజలార్తిఁ బొరలంగఁ జూచి
యిమీఁద నలిగి యా పృథుఁడు చాపమున
లిమి మించఁగ నొక్క బాణంబుఁ దొడుగ
డఁకుచు ధేను భాము ధరియించి
పుమి యెందేనియుం బోవంగఁ గాంచి
యుఁడై వెన్నాడి నుచు నదల్చి
రుష మార్గంబున భాసించె నిట్లు
నులెల్ల నలఁగ సస్యంబులం దొఱఁగి
నిమాని యుండు నిష్ఫలమైన నిన్ను
యీతి గోమూర్తి నెందేనిఁ జనిన
సానిత్తునె వృథాశ్రాంతియ[294] కాక


[291] అంబునాయకుడు- వరుణుడు
[292] చామరములు- వీవెనలు
[293] నభస్వంతుడు- వాయుదేవుడు
[294] శ్రాంతి- అలసట

631
లుషించి నా మాట గైకొనవేని
తిమాత్రములుగా వధించెద నిన్ను”
నుటయుఁ బృధివి యిట్లనియె, “నో వైన్య
నాథ! మున్ను దుర్జను లేచియుండ
నెయ నోషధుల నన్నింటిని మ్రింగ
ఱిగె నా కుక్షిలో న్నియు నవియు
యిప్పుడు ననుఁబట్టి హింసించి తేని
ప్పు[295] నిజ్జగం బంతయు మునుఁగు
యేరీతి నిల్చెద రీప్రజలెల్ల
నాసి కొ”మ్మన్న నాతఁ డిట్లనియె
నీగౌరవం[296] బెంత? నిన్ను దండించి
యోశక్తిన నిల్వ నొనరింతుఁ బ్రజల”
నావుఁడు విని ధాత్రి వ్వి, “యో మనుజ
దేనీవయ యాదిదేవుండ వరయ
లక నాకొక త్సంబుఁ గూర్చి
పిదుకుము, పిదికింపు పెక్కు మార్గముల
ష్టార్థముల నెల్ల నిచ్చెద నిపుడ
శిష్టసన్నుత! దయసేసి పాలింపు

పృధు చక్రవర్తి మనువును లేఁగదూడగఁ జేసి గోరూప ధారిణియైన పృథివి నుండి ఓషధులను పిదికి భూమిని సస్యశ్యామలమొనర్చుట

నిప్రసన్నత నిల్ప నావైన్యుఁ[297] డపుడ
నువుఁ గ్రేపుగఁ[298] జేసె హనీయ లీల


[295] అప్పుల- జలములు
[296] గౌరవము- బరువు, గొప్పదనము
[297] వైన్యుడు- వేనుని పుత్రుడైన పృథుచక్రవర్తి
[298] క్రేపు- దూడ

641
దు హస్తంబె పాత్రంబుగాఁ జేసె
వినుతౌషధుల నెల్ల వేగంబ పిదికి
ప్రలకు నర్పించెఁ బ్రజలు నింపొంది
వియాఢ్యు నవ్విభు వినుతించి రచట
గిరులును, మునులునుఁ గిన్నరాదులును
రిచిత బహువత్స[299] పాత్ర కల్పనల
కభీష్టముఁగాగఁ గిన పదార్థ
మితులం బిదికి యాక్తిఁ గైకొనిరి

పృథువు పరిపాలించుటచే ధాత్రికి పృథివి యనుపేరు వచ్చుట

ఱియు నా పృథుఁడు భీగదాభిహతులఁ
ఱితోడ ధర సమస్థలిఁగా నొనర్చి
గ్రాపట్టణ, దుర్గ ర్వట, ఖేట
సీలేర్పరచె విచిత్రముల్ గాఁగ
పృథుఁడిట్టిగతిఁ జక్కఁబెట్టిన కతనఁ
బృథివి” యనంగ శోభిల్లె నిద్ధాత్రి

పృథు చక్రవర్తి కుమారుఁడు పృథుశ్రవసుఁడు తన తండ్రి యొనర్చు యజ్ఞాశ్వమును హరించిన యింద్రుని జయించి గుఱ్ఱమును తెచ్చి, ‘జితాశ్వుఁ’ డను పేరు పొందుట

త్రియాజకుఁడుగా నావైన్య నృపతి
త్రముల్ నూరు విస్మయముగాఁ జేసె
తమాధ్వరమున[300] సంక్రందనుఁండు[301]
వితోరు పాషండవేషుఁడై వచ్చి
క్రతువాజిఁ[302] గొనిపోవఁని యా నరేంద్ర
సుతుఁడు పృథుశ్రవసుండను నతఁడు


[299] వత్స- దూడ
[300] శతతమాధ్వరము- నూటయొకటవ యజ్ఞము
[301] సంక్రదనుఁడు- ఇంద్రుఁడు.
[302] క్రతువాజి- యజ్ఞాశ్వము

651
మ్మహేంద్రుని గెల్చి ధ్వరాశ్వంబుఁ
గ్రమ్మఱందెచ్చెఁ బరాక్రమం బెసఁగ
ని నందఱును “జితాశ్వుఁ” డటంచు
నుతిసేసి రిట్లు వైన్యుడు ధన్యుఁడగుచు

మైత్రేయుఁడు పృథు చరిత్రకు ఫలశ్రుతి చెప్పుట

ప్రలఁ బ్రోచి శుభాత్మ దవికి వేడ్క
వియంబు సేసె నవ్వెలఁదితోఁ గూడి
యీపృథు చరితంబు నెవ్వరు వినిన
పాపంబు లణఁగు శుభంబు చేకూరు
విదితము గాగఁ జెప్పెఫలశ్రుతినిని
విదురునితోడను మైత్రేయుఁ డపుడు

మైత్రేయుడు ప్రాచీనబర్హి వృత్తాంతమును చెప్పుట

వైన్యుని తరువాత సుధాతలంబు
న్యాయగతి జితాశ్వప్రభుండేలె
తఁడు నభస్పతి ను కాంతయందుఁ
బ్రతిలేని సుతు హవిర్థామనిం గనియె
విర్ధానున కాత్మజుండయ్యె
బాహుబలాఢ్యుండు ర్హిషదుండు
ని యంతయునుఁ బ్రాగ్రకుశముల[303]
ములం[304] గలయ నాచ్ఛాదించు కతన
ప్రాజ్ఞులు ప్రాచీనర్హి[305] యనంగఁ
బ్రజ్ఞాతుఁడయ్యె నా ర్హిషదుండు


[303] ప్రాగగ్రకుశములు- తూర్పు దిశవైపుగా చివళ్ళు గల దర్భలు
[304] సవము- యజ్ఞము
[305] ప్రాచీనబర్హి- ఇంద్రుడు, బర్హిషదుడను రాజు, బర్హి- దర్భ, బర్హి- నెమలి పింఛము

661
తఁడు శతద్రుతి ను పత్ని యందు
సుతులఁగాంచెఁ బ్రచేతసులు నాఁగఁ బదుర
తుల్య[306]నామంబులఁ తుల్యవ్రతముల
తుల్యాకృతులను బొల్తురు వారు చాల
కాజ్ఞచేఁ బ్రజార్గంబు[307] కోర్కిఁ
రంగ నా ప్రచేసులు పదుండ్రుఁ
దోధి[308] నడుమ దాంతులు మెచ్చఁ దపము
సేయుటకై కూడి శీఘ్రంబ సనుచు
తెవున నొకచోట దివ్యకాసార
జలోద్ధితుడైన[309] వామదేవుండు
రికీర్తనార్చన ధ్యానక్రమముల
రుసతోఁ దెలుప భావంబుల మెచ్చి
నిధిలో నొక్క న్నపుదీవి
యక తపముసేయఁదొణంగి రంత

నారద, ప్రాచీన బర్హి సంవాదము

నివడ[310] ప్రాచీనర్హిఁ జేరంగఁ
నుదెంచి నారద సంయమీంద్రుండు
వినుము, బర్హిషదుండ! విడువక యిటుల
యంబు నీవు కర్మాసక్తి నొంద
యేమిఫలంబు వహించితి” వనుఁడు
నాహీపాలుఁడా తికి నిట్లనియె

[306] తుల్య- సమానము, ఒకటేయైన
[307] ప్రజాసర్గము- పిల్లలుపుట్టించుట
[308] తోయధి- సముద్రము
[309] వర జల ఉద్ధితుడు- శుభ్రమైన జలములనుండి ఉత్పన్నమైన / లేచిన వాడు
[310] పనివడు- పనిపడు, పూనికొను


671
తాసవర్య! యే గులును నెఱుఁగ
నోపికఁ గర్మంబు నొనరింతు నెపుడు
జ్ఞామార్గముఁ దెల్పి డు నన్నుఁ బ్రోవు
మానితగతి” నన మౌని యిట్లనియె
రిభజించుట మాని నిశంబుఁ గర్మ
త నుండుట నీతి దమె? రాజేంద్ర!
ముల నీ చేత డిసిన పశువు
ఖిల మార్గముల నిన్నటులనే మఱల
దిలంబుగాఁ బట్టి బాధింతు మనుచు
నెదురు చూడ దొణంగె నిదె చుట్టు వార
దిట్టి పనికి నొక్కటి యుపాఖ్యాన
వడఁ తెలిపెద నాలింపు మలర

నారదుఁడు ప్రాచీనబర్హికి పురంజనోపాఖ్యానము చెప్పుట

రాజొక్కరుండు పురంజనుఁ డనఁగ
రాజిల్లు నెంతయుఁ బ్రఖ్యాతుఁ డగుచు
తఁడు పురాన్వేషి యైధాత్రిఁ దిరిగి
శితికంఠుశైల[311]క్షిణ సానువందు
యంమై తూర్పున నైదు[312] పశ్చిమము
నందిరు[313], బార్శ్వమున రెండు రెండు[314]
నైవాకిళ్ళఁ బెంపారు పురంబు[315]
సానురాగతఁ జేరి యందు చిత్రముగ


[311] శితికంఠు శైలము- శివునికొండ, కైలాసము
[312] తూర్పుననైదు- 2 కళ్ళు 2 ముక్కురంధ్రాలు 1 నోరు
[313] పశ్చిమంబు నందు ఇరు- మూత్రావయవ, మలావయవ రంధ్రములు
[314] బార్శములనరెండు రెండు- రెండు ప్రక్కల రెండు చెవిరంధ్రములు
[315] పురము- జీవుడు వసించు దేహము

681
పంచాననోరగ[316] ప్రతిహార సహితఁ
బంక ద్వయ సఖిఁ[317] బ్రమదోత్త[318] మాఖ్యఁ
నుఁగొని దానితోఁ లసి యవ్వీట
నుపమ భోగంబు నందుచు నుండె
నాతండు మఱియుఁ బంచాశ్వ[319] యుక్తంబు
నాత చక్ర ద్వయాభిశోభితము[320]
నీయ కూబర[321] ద్వయము సువర్ణ[322]
నాంచితముఁ బంచ జ్జు[323] బద్ధంబుఁ
తుర సారథిక[324]క్షయ తూణ[325] యుతము
వితాధిపత్యుప దేశ స్థలంబు
ర భీమమునైన యురురథం బెక్కి
నొకండ్రగు చమూతులు[326] సేవింప
నాతుక మఱి వేఁటలాడును మఱియు
ఘాతుకుం డగుచు మఖంబు లొనర్చు
ప్రదోత్తమాకేళి రవశుండగుచు
మిత సంతతిఁగాంచి యాపురంజనుఁడుఁ
బెయుచు నుండంగఁ బెద్ద గాలంబు
రిగె నప్పుడు నోర్వఁజాల కప్పురిని
కానామకుఁడైన గంధర్వు భటులు[327]
చాలఁబోరుదురు నిస్సత్వంబుఁగాఁగ


[316] పంచానన ఉరగము- పంచవాయువులతో ఊపిరి
[317] పంచకద్వయసఖులు- దశేంద్రియములు
[318] ప్రమదోత్తమ- మనసు
[319] పంచాశ్వములు- ఇంద్రయ విషయపంచకము
[320] చక్రద్వయము- పాపపుణ్యాలు
[321] కూబరద్వయము- రెండునొగళ్ళు, శోకమోహములు
[322] సువర్ణము- బంగారము, రజోగుణము, అహంకారం
[323] పంచరజ్జువులు- పంచప్రాణాలు
[324] చతుర సారధికము- చతురంతఃకరణములు
[325] అక్షయతూణ- అక్షయ అమ్ములపొది, అనంత వాసనారూప అహంకార ఉపాధులు
[326] పదనొకండ్రగు చమూపతులు- 11గురు సేనాపతులు ఏకాదశ ఇంద్రియములు
[327] గంధర్వులు- దివసములు

691
య నబ్భటులతోఁ డు పోరి పోరి
సెఁ బ్రతీహారుఁ డైనట్టి ఫణియు
అంభయాహ్వయ వనాగ్రజుండు
హంయప్పురి సొచ్చి విషహ్యగతుల[328]
బాయొనర్పంగ యనామకుఁడును
సాధించి యా పురంనుఁ గాసిఁ బెట్టె
ఖుఁడైన యా యవిజ్ఞాతుని[329] మఱచి
సుఖియైన యా పురేశుఁడు చాల నలఁగి
ప్రదోత్తమా సతిఁ బాయంగ లేక
భ్రసె యారవము ఘోరంబుగా నొదవ
వెలె నప్పురి నుండి వెడలిన యపుడ
తొడిఁబడ బడలించె దురితంబు లెల్ల
క్రతుహత పశువు లుత్కట రోష వృత్తి
తివేల మర్మప్రహారముల్[330] సేసె
తులేని బహువిధార్తులఁ గొంతఁగాల
వద పడినొచ్చి యాపురంజనుఁడు
ఖులతోఁ బాసి యా ఖి యెఱింగింప
ఖునవిజ్ఞాతునిం క్కఁగాఁ దెలిసి
ట యంతయు మాని వాసికి నెక్కి
నియె నచ్యుతపదాలనసౌఖ్యంబు[331]


[328] అవిషహ్యగతులన్- న + వి + సహ్యగతులు- మిక్కిలి సహించుటకు వీలు లేకుండ
[329] అవిజ్ఞాతుడు- తాను జీవాత్మ సఖుడు పరమాత్మ, ఇద్దరికిని అబేధము కనుక సఖులు
[330] అతివేల మర్మప్రహరములు- అనోక వేలకొద్దీ ఆయువు పట్టు నొప్పించు దెబ్బలు
[331] అచ్యు పద ఆకలన సౌఖ్యము- చ్యుతము లేని, క్షతిలేని విష్ణుపదభక్తి అవగాహనముచే కలిగిన సౌఖ్యము