పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం 4

301
[125] దుందుభి మహాస్వనములు నెఱసె
లక నవపుష్ప ర్షముల్ బెఱసె
మేష్ఠి ముఖ సుర ప్రకరంబు మ్రొక్కి
మౌని తతి సంస్తముసేసి నిక్కి
జ్ఞమయ వరాహంబట్లు భీతి
వా[126]ధారుణి తొంటిద్ధతి నిలిపె
మహత్త్వము తదాధారంబుఁగాఁగ

వరాహ, హిరణ్యాక్షుల యుద్ధము

నువొంద[127] నిలిపి, యయ్యసుర నీక్షించి
డావచ్చుచుఁ బ్రచండంబుగా[128] నవ్వి
పాని రోష సంభ్రమమునం బలికె,
“జతిపై విపినగోరము[129] లైనట్టి
మృముల మేమెల్ల మేలని పొగడఁ
లక మీ వంటి గ్రామసింహముల[130]
టణంతుము[131] గానవాదితివటువ!
నిలిచెద మెట్లైన నీతోడి యాజి[132]
నిలువకయున్నఁ బోనేర్తు మెచ్చటికి?”
నుఁడు నాకర్ణించి యాదితిసూతి
లి[133] యా పోత్రిని[134] దఁగొని వైచె
యోగియంతయుఁ బోలె నొదిగి యా పోత్రి
యాదాఘాతంబు టు పొల్లువుచ్చెఁ[135]


[125] చదలు- ఆకాశము
[126] వాయు- తొలగు
[127] అనువొందు- తగియుండు, ఒప్పియుండు
[128] ప్రచండము- భీకరము
[129] విపిన గోచరములు- అడవిలోకనబడునవి
[130] గ్రామసింహము- కుక్క
[131] అదటు- గర్వము, మదము
[132] ఆజి- యుద్ధము
[133] కనలు- కోపంతోమండిపడు
[134] పోత్రి- వరాహము
[135] పొల్లుపుచ్చు- వ్యర్థముచేయు

311
మీద నా గదాదండంబు వైవఁ
నుఁగొని చేసాఁచి గ్రక్కునంబట్టి
ఱియొక్క గద పూని లయు[136] నాదైత్యు
కు వక్షము పోత్రిఁ డఁగొని మోదె
యివ్విధంబున వార లిద్దరు బలము
నివ్వటిల్లఁగ గిరుల్ నెఱిదాఁకు నటులఁ
యంగఁ బడి గదాఘాత భగ్నాంగ
లిత రక్తాసార సంసిక్తులగుచు

బ్రహ్మ యజ్ఞవరాహమూర్తిని హెచ్చరించుట

పోరంగ నలువ[137] యంభోదమార్గమునఁ[138]
జేరియా హరిఁ బిల్చి చేతులు మొగిచి
“యుద్ధతుం డీ దైత్యుఁ డుదితప్రతాపుఁ
డిద్ధబలంబున[139] నిటుల వర్తింప
హిని[140] బాలుఁడు వోలె నాడించెదేల?
హితాత్మ! మాయచే డియింపు వీని
సం[141]డగ్గరిన రాక్షసులకు బలము
సంజాతమగు వినిశ్చయముగా, నెచట
సిరిఁజెందె, నదె, యభిజిన్ముహూర్తంబు
రియింపు మిట్టె దుస్తరము నో దేవ!”

యజ్ఞవరాహము హిరణ్యాక్షుని సంహరించుట

నితెల్పుటయుఁ బోత్రి యంతయు వినుచు
మీద నొక గద దైత్యుండు వైవ


[136] మలయు- ఉద్రేకించు
[137] నలువ- బ్రహ్మదేవుడు
[138] అంభోదమార్గము- మేఘములు సంచరించు ఆకాశమార్గము.
[139] ఇద్ధ- ప్రకాశము, ప్రజ్వలించిన
[140] అహి- పాము
[141] సంజ- సంధ్య

321
మునంబట్టి రక్కసునకు మరల
రుదుగా నీఁబోవ తఁడొల్లఁడయ్యె
సువైరి యొక్క త్రిశూలంబు వైవ
పురుషోత్తముఁడు చక్రమున ద్రుంచి వైచి
నురుతుర క్రోధుఁడై హుమ్మని యసుర
రిరొమ్ము ముష్టి నాతముగాఁ[142] జేసె
పుడె తిరోహితుండైవిష్ణుమీద
రిమేయముగ[143] మాలఁబుట్టఁజేసె
చిత్రవర్ణంబైన జీమూతకులము[144]
మూత్రరక్త పురీషముల బిట్టుఁ గుఱిసె
ప్రతిలేని[145] గిరులు శస్త్రముల వర్షించి
తురంగ యుత నిశార సేన లెదిరె
శాశూలలు[146] వివస్త్రలు కీర్ణకచలు
యాతుధానులు[147] నిల్చి రంతంత నెదుట
నిట్టిమాయల విష్ణుఁ డీక్షించి పాయఁ[148]
ట్టెసుదర్శనాస్త్రము ప్రయోగించ
మాయలన్నియుం లఁగి పోవుటయు
నుఁడు రక్కసుఁడు డగ్గర వచ్చి తన్ను
పిడికిళ్ళఁ బొడువ నోపికఁ బోత్రి చేతఁ
డువింకఁ గొట్టెఁ దత్కర్ణ మూలంబు


[142] ఆహతము- కొట్టబడినది
[143] అపరిమేయము- లెక్కలోనన్ని
[144] జీమూత- మేఘము, కులము- సమూహము
[145] ప్రతిలేని- తిరుగులేని, ఎదురులేని
[146] శాత- పదునైన
[147] యాతుధానులు- పిశాచభేదము, గాలి, యాతువు, బాధించువాడు
[148] పాయన్- విడిపోవునట్లు, తొలగునట్లు

331
రికరాహతి నోర స్రంబు[149] వెడలి
యువడి వ్రాలె నయ్యుగ్రంపుటసుర
నుఁబదాహతుఁ జేయు దైత్యారి మొగముఁ
నుఁగొను చతఁడు నిర్గతజీవుఁడయ్యె
సిజభవముఖ్య న్నుతుండగుచు
రియేగె నాత్మీయగు ధామమునకు

సంక్షిప్త ఫలశ్రుతి

నీయుపాఖ్యానంబు నింపున వినినఁ
బాయుబ్రహ్మవధాది పాతకశ్రేణి

మైత్రేయుఁడు కర్దమ ప్రజాపతి వృత్తాంతము చెప్పందొడంగుట

అంనిద్ధర నిల్చి య్యాది మనువు
సంసంబునఁ బ్రజాసంవృద్ధి చేసె
యానుపుత్రిక గు దేవహూతి
కామినీమణి వేడ్కఁ ర్దము వలన
దుహితల మునుఁ గాంచెఁ దొమ్మండ్రఁ గపిల
హితాఖ్యు విష్ణుఁ గుమారుఁగాఁ గనియె”

విదురుఁడు మైత్రేయునిచే కపిలావతార కథ విపులముగా వినఁగోరుట

నుటయు “నో యనఘాత్మ! యా చక్రి
నుపుత్రికకు నే క్రమంబున నొదవె?
విరింపు” మనియెడు విదురుని తోడ
దివిజ సన్నతుడు మైత్రేయుండు పలికె

కర్దమ ప్రజాపతి దేవహూతిని వివాహమాడిన వృత్తాంతము

లినసంభవుని[150] యాతిఁ గర్దముండు
తెలివి మీఱ సరస్వతీనది కేఁగి


[149] అస్రము- రక్తము
[150] నలినసంభవుడు- బ్రహ్మదేవుడు

341
యక దశసహస్రాబ్దముల్ నిష్ఠఁ
లఁపు నిశ్చలముగాఁ పముఁ గావింప
మ్మదంబున హరి న్నిధిసేసి[151]
మ్మౌని వరున కిట్లని యానతిచ్చె

కర్దమునికి విష్ణుదేవుని హితవు

తిఁగూడి యింక నిచ్చటికి సర్వాభి
తుఁడు స్వాయంభువను వేగుఁదెంచి
పుత్రికను నీకుఁ రుణిగా నొసఁగు
నుమతింపుము నీవు ట్టి కృత్యంబు,
నియింతు మీకు నే సంప్రీతి యెల్లఁ
నఁబడ సుతుఁడవై పిల నామమున”

స్వాయంభువ మనువు తన కుమార్తె దేవహూతిని కర్దమ ప్రజాపతి కిచ్చుట

నితిరోహితుఁడయ్యె నంత నచ్చటికి
నుపుత్రికయు భామయుంగొల్వ వచ్చి
బలంబుల బహిస్థలమున నిలిపి
నుమణితోఁ[152]గూడి నయఁ దోడ్కొనుచు
ప్రణుతవర్తనునిఁ[153]ర్దమ మునిం గాంచి
ప్రతుఁడై[154] యాతండు క్తితో నిచ్చు
పూలుఁ గైకొని పుత్రికం జూపి
రాజిల్లుఁ వినయాదరంబున బలికె,
“ఓ మ్యచరిత! యీ యుత్పలనేత్రి[155]!
నాదువలన నీ వగుణశ్రేణి[156]


[151] సన్నిధిచేయు- ప్రత్యక్షమగు
[152] తనుమణి- సుందరి
[153] ప్రణుతవర్తనుడు- స్తుతింపబడు ప్వర్తన కలవాడు
[154] ప్రణతుడు- నమస్కరించినవాడు
[155] ఉత్పలనేత్రి- కలువ, చెంగల్వకోష్టు వంటి కన్నులు కలామె
[156] నవగుణ శ్రేణి- క్రొత్త గుణముల వరుస, అనేక విశిష్ట గుణములు

351
నెయ నాకర్ణించి నీకరగ్రహము[157]
తెఱఁగొప్పఁ గావించు తెలివి నేతెంచె
నిక్కన్యకాభిక్ష[158] నిపుడ కైకొమ్ము
క్కఁగా నా కోర్కి ఫలత నొంద
నులయాచితముగాఁ[159] లిగిన దాని
వినుమొల్ల మన రెట్టివిధమున నైన”
వుండు హరియాజ్ఞ నాత్మలోఁ దలఁచు
కొనికర్దముండు మేకొనియె[160] నప్పనికి
స్వాయంభువుండును లజాక్షిఁ గూడి
యాయుత్తమునకుఁ గన్యామణి నచట
వైదిక సరణి వివాహంబు సేసె
సారంబుగ భూష ణాదు లొసంగి
దేహహూతికి రణంబు[161] లిచ్చి
యైదువ నగుమని యాశీర్వదించి
గువతోఁ గూడి యా ను వాత్మపురికి
నేఁగ సైన్యవితానముల్ గొలువ

కర్దముడు దేవహూతి చేయు పరిచర్యలకు మెచ్చి పుష్పక విమానంబు కల్పించి విహరించుట

దేహూతియును భక్తిశ్రీల సేవఁ
గావించుఁ బెక్కు మార్గంబులం బతికి
తియు నిట్లొనరించు రిచర్య మెచ్చి,
తిచాలఁ గృశయైన చందంబు చూచి,


[157] కరగ్రహము- వివాహము
[158] కన్యకాభిక్ష- కన్యాదానము, వివాహము
[159] అయాచితము- కోరకనే సమకూడినవి
[160] మేకొను- అంగీకరించు
[161] అరణము- వివాహసమయంలో పెళ్ళికూతురుకు ఇచ్చే కానుకలు

361
“యీ న్వి కొనరింతు నెల్ల భోగముల
నాపఃశక్తి వర్ణనకెక్క” ననుచు
నముల్ మేడ లుప్పరిగె[162] లంగళ్ళు[163]
వివిధోపవనములు విహరణాద్రులును
లాకరము లాదిగాఁగల్గునట్టి
ధి కాద్భుత విశేములచే మించు
నొక్కవిమానంబు నురుతపోమహిమ
గ్రక్కునం గావించి కామినిం బిల్చి
చెలువ! నీ విపుఁ డభిషేకం బొనర్చి
విసిల్ల నిందుఁ బ్రవేశింపు మనుఁడు
స్నానంబునకు నింతి రసిలోఁ డిగ్గి
యానీటిలోనఁ గన్యకల వేయింటి
నీక్షించె, వారు నవ్వెలఁదికి మ్రొక్కి
యాక్షణంబ నిజాలయంబున కర్ధి
గునం దోడుకని యొక్క చోట
నురురత్న పీఠిపై నునుచి సంరభము
నిగుడ సంపంగి నూనియఁ దలయంటి
రు గంధంబున లుగును వెట్టి
న్నీట జలక మొప్పఁగ జేసి నేర్పు
లెన్నుచు శృంగార మెల్ల నొనర్చి


[162] ఉప్పరిగ- ఉపరిగృహముల, పై అంతస్తు
[163] అంగడి- సభ, సరుకులు పెట్టుకొను కొట్టుగది

371
ష్టాన్నపానాదు లిడి యాత్మలోనఁ
దుష్టివుట్టించి రా తోయజముఖికి
యింతియును నప్పు డంతయుం బ్రాణ
నాకు మహిమ చందంబుగాఁ దలఁచె
మునియుఁ గన్యాయుతంబుగ బుష్పకమునఁ
యింతి నిలిపి నితాం[164] లోకములఁ
విశేషంబులు నఁబడం జేసె
లుఁదెఱంగుల భోగరతఁ గైకొనుచు
హుశతాబ్దంబులు ప్రమదం బొనర్చి
హిళాలలామయు ది మెచ్చి యంత
విధంబగు మునినాథు వీర్యమున
లీలఁ బుత్రికా వకంబుఁ గాంచె
నుపుత్రి మఱియు నమ్మౌనీంద్రునాజ్ఞ
జాక్షు నుజ్జ్వల వ్రత తుష్టుఁజేసి

సాంఖ్య తత్త్వ ప్రవర్తకుఁడైన కపిల మహర్షి అవతరణము

రికళా మహనీయు, నుపమ శీలు,
కరోపమ[165] తేజుఁ, పిలునిఁ గనియె
యుక్తమతి[166] దేవహూతి యబ్భంగిఁ
పిలాఖ్యుఁడగు విష్ణుఁ నిన నవ్వేళ
కురిసెఁ బువ్వుల వాన, ఘోషించె మింట
సుదుందుభులు, ముని స్తుతులు శోభిల్లె,


[164] నితాంత- మిక్కిలి
[165] ఖర కర ఉపమ- తీక్షణమైన (సూర్యుని) కిరణములతో పోల్చదగ్గ
[166] ఉపయుక్తమతి- న్యాయసమ్మతమైనబుద్ధికలామె

381
జజుం[167] డంతఁ బాన మరీచ్యాది
మునియుక్తుఁడై కర్దముని వనంబునకు
చ్చియా సృష్టి ప్రర్తకుం[168] జాల
మెచ్చియిట్లను, “నో సుమేరు జిద్ధీర[169]!
పురుషోత్తముఁడు నీకుఁ బుత్రుఁడై పుట్టె
రిలేదు, నీ గృహస్థతకు నెచ్చోట,
నుకూల వర్తనులైన మౌనులకుఁ
యుల నొసగుము గు ప్రకారమున”
నుచు మానినిఁ జూచి “మ్మ! నీ కుక్షి
నియించి నట్టి యీ లజలోచనుఁడు
సిద్ధేశుఁడై సాంఖ్య సేవితుఁడై ప్ర
సిద్ధుఁడౌఁ గపిల విశేష నామమున”
నితెల్పి కమలజుం రుగఁ గర్దముఁడు
మున మిగుల సమ్మదము వహించి

కర్దమ ప్రజాపతి నవకన్యకలను నవబ్రహ్మల కిచ్చి వివాహంబు సేయుట

నుఁడు మరీచికిం ళయను కన్య
సూయయను పుత్రి య్యత్రి మునికి
రు శ్రద్ధాదేవి నంగిరసునకు
లుపుమించు పులస్త్యుకు హవిర్భువను
తియనంగల పుత్రిపులహునకును
క్రతునామమౌనిశేరునకుం గ్రియను


[167] వనజజుడు- బ్రహ్మదేవుడు
[168] సృష్టిపవర్త- ప్రజాపతి
[169] చిత్ ధీరుడు- మనోధైర్యంకలవాడు

391
ఖ్యాతిని భృగువున ల వసిష్ఠునకు
నాత శ్రీకీర్తి గు నరుంధతిని
శాంతినధరువఁడన్ సంయమీంద్రునకు
సంతోషమున శాస్త్ర రణి నొసంగె
మునీంద్రులుఁ గర్ద మాత్మజా సహితు
లైముదంబున నేఁగి రాశ్రమంబులకు
ర్దమమునియునుఁ పిలయోగీంద్ర
నిర్దిష్ట విజ్ఞాన నియతాత్ముఁ డగుచు
యీకలంబు లక్ష్మీశుఁగా దెలిసి
వాసికెక్కిన భాగత గతిం జెందె

కపిలుఁడు తన తల్లియైన దేవహూతికి సాంఖ్యతత్త్వము నుపదేశించుట

ప్రకృతికిం బురుషుండు రుఁడు సుమ్మనియు
ప్రకృతి యవ్విభుఁ గూర్చి రతంత్ర యనియు
పంభూతంబులు బంచ మాత్రలును
పంకన్నఁల నెన్నఁ డు నింద్రియములు
మనో బుద్ధ్యహంకార చిత్తంబు
నునివి తత్త్వంబు నఁదగు ననియు
మీద నిర్వది యైదవ లెక్క
కైమించుఁ గాలంబు నాత్మయు ననియు
రివేడ్క నిజయోని యందాత్మ వీర్య
రుదుగా నిడ మహత్తటు వుట్టుననియు,