పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం 3

201
నుటయు మిగులఁ గామాంధయై యింతి
సు నిల్వఁగ లేక మౌనింద్రుఁజేరి
చేలంబు వట్టి యీడ్చిన నతండగ్ని
శాలో నతివకుఁ జాల నింపొసఁగి
చేత సలిలుఁడై టు లోనిచూడ్కిఁ
జూచియిట్లను “భావి సుత కార్యసరణి
వసరంబున[65] గుట నీ గర్భ
మునిద్దరుగ్రకర్ములు పుట్టఁగలరు
బాధింతు రింతి! గో బ్రాహ్మణతతుల
సాధింతు రుద్ధతి గముల వారు
మున నిద్దరు లజాక్షు చేతఁ
బొలియుదు రఁటమీఁదఁ బుట్టంగగలరు
రుధైర్యుఁ డందు రెంవ యాత్మజుండు
మభాగవతుండు ప్రబలంగఁ గలఁడు”
నితెల్ప మనమున డలు సంతసముఁ
బెగొన దితియు గర్భిణియయి మించె
రుదుగా నయ్యింతి ట్టి గర్భంబు
గున శతవత్సములును పెరుగ
నంతఁదద్గర్భ నిర్యాత తేజంబు
వింగాఁ బెరుగుచు విశ్వంబుఁ బొదువ


[65] అనవసరంబున- అవసరమనగా సకాలము, సరియైన సమయం కానిది వేళకానివేళలో, అకాలంలో

211
తిఁదప్పి వేల్పుమూలు ధాతఁ జేరి
తినుతుల్ సేసి యంయు విన్నవింప
న్నయంతయుఁ దెల్ప, నుద్యుక్తుఁడగుచు
న్నించి యా ధాత రల నిట్లనియె

బ్రహ్మ జయవిజయుల శాపవృత్తాంతంబుఁ దెల్పుట

వినుఁడు దేవతలార! విష్ణుదాస్యమునఁ
బెనుపొంది మీకంటెఁ బెద్దలై నాదు
మాససుతులైన హనీయ మహిమ
మానితుల్ సనకాది మౌనిపుంగవులు
ల లోకంబులం రియించుచుండి
యొనాఁడు హరిఁ జూచు నుత్కంఠమతులు
నెయంగ[66] వైకుంఠ నిలయంబు చేర
రిగిరి వైమానికావళుల్ మ్రొక్క
రికంటె దైవమన్యము లేదు హరియ
దైవతంబని జియించు వారు,
రిదాసదాసుల నవతరంబు
రియ మెచ్చఁగ దాసులైయుండువారు,
రికిఁ గైంకర్యంబు[67] విరళ భక్తి
నితులై కావించు నియత వర్తనులు,
శాంతులై దాంతులై[68] కల భూతముల
యంస్థ్పితునిఁ గాఁగ రిఁ జూచువారు,


[66] నెరయంగ- నిండుగా
[67] కైంకర్యము- భక్తిప్రపత్తితో, దాసభావముతే చేయు భగవత్సేవ
[68] శాంతులు- కామక్రోధాది రాహిత్యము, శమము కలవారు, దాంతులు- బ్రహ్మచర్యాది తపఃక్లేశము నోర్చు తనము కలవారు.

221
ముఁ గోరక యెల్ల నులును హరికి
ఘు యత్నంబున ర్పించువారు,
దోషదూరులు, ప్రవిమలోష్ణీష[69]
విశేష భూషణ చారు మస్తకులు[70],
ధికి శ్రీచూర్ణ[71] హితాంతరాళ
విలోర్ధ్వపుండ్రముల్[72] విలసిల్లువారు
రకుండల దీప్తి హిత కపోలు
కుటిల మందహాసాంచితాధరులు
శ్రీ లాలిత[73] తులసీ నలినాక్ష
మాలికా కలిత నిర్మభుజాంతరులు[74]
రిదళధరులు[75] పీతాంబరుల్ మంజు
ణ శింజాన[76] హంకులునై చేరి
సిరితోడఁ గలుగు మచ్చిక వెలిఁగాఁగ
రికి నిత్యముఁ గల్గు ఖిల భోగములఁ
జెలఁగుచు జగముల సృష్టియ వెలిగ
జాక్షుతోఁదారు సామ్యంబుఁగాంచి
డునొప్పు పరమభావతు లచ్చోట
డుగని మహిమ సంయుక్తి[77] నుండుదురు
రించుఁ[78] గన్నులపండువు నెలమి
ట నైశ్రేయసం ను నుపవనము
ల్లవ విలసన దముఁ గాకయును
ల్లవ విలసనాస్పద మనం బఱఁగి


[69] ఉష్ణీష- కిరీటము, తలపాగ, తల
[70] మస్తకము- తల, శిరస్సు
[71] శ్రీచూర్ణము- స్వచ్ఛమైన కుంకుమ
[72] ఊర్ధ్వపుంఢ్రములు- వైష్ణవులు ధరించు నిలువుబొట్టు, పట్టెవర్ధనము
[73] శ్రీల లాలిత- సిరులొలుకు
[74] భుజాంతరము- ఱొమ్ము, వక్షము
[75] అరిదళము (వి)- హరితాళము (ప్ర). వైష్ణవులు ధరించు పసుపు రంగు వృక్షసంబంధ లేపనము ఉపధాతువు.
[76] శింజానము- గజ్జలధ్వని, హంసకము- కాలి యందె, గజ్జలు, హంసవలె మధురధ్వని చేయును కనుక హంసకము
[77] సంయుక్తము- కూడుకున్నది
[78] పచరించు- కనబరచు

231
విసిత మధుపాయి వికృతిఁ గాకయును
విసిత మధుపాయి[79] వికృతి నాఁ బఱఁగి
యంగఁ గలికాలయంబునుం[80] గాక
రుదుగా కలికాలయంబనం బఱఁగి
సర్వమంగళారముఁ[81] గాక యును
సర్వ మంగళారమనం బఱఁగి
సంచిత సుమనోరజంబుఁ[82] గాకయును
సంచిత సుమనోరజంబనఁ బఱఁగి
మాతులుంగ లవంగ మందార లికుచ[83]
చూకదంబ ఖర్జూర నారంగ[84]
కేకి కురవక కింశు కాశోక[85]
సేతుపూగ శిరీష శింశు పామలక[86]
కు[87] పున్నాగ తక్కోలాది వివిధ
కుముల[88] నవ్వని కొమరారుచుండు
ట్టి వైకుంఠ పురాంతర సీమ
ట్టిత బహురత్న మనీయ మగుచు
ధర సంవాస నందితంబైన
రు[89] సొత్తెంచు నా లుగురు మునుల
వీక్షించి జయుఁడును విజయుండు ననఁగ
క్షులౌ ప్రాగ్వర[90]ద్వారరక్షకులు


[79] మధుపాయి- 1. మధ్యము త్రాగువాడు, 2. కోకిల, 3 మధుపాయీ- తుమ్మెద, విష్ణుభక్తి యను తేనె గ్రోలువారు
[80] కలికాలయము- 1. కయ్యాలకు నిలయము, 2. మొగ్గ, అంకురము లకు నిలయము, వైకుంఠము
[81] సర్వమంగళాకరము- 1. సర్వమంగళ పార్వతీదేవి నిలయం, కైలాసం, 2. సర్వ మంగళాకరము- సమస్తమైన మంగళములు కలిగించునది, వైకుంఠము
[82] సుమనోరజము- 1. పుష్ప పరాగము, 2. సుమనః మంచివారి మనసు రజము రంజింపజేయునది
[83] మాతులుంగ- మాదీఫలము,. . . లికుచ- నిమ్మ
[84] చూత- మామిడి, నారంగ- నారింజ
[85] కేతకి- పచ్చమొగలి పువ్వు, కురవక- ఎఱ్ఱపూవుల పెద్దగోరింట, ఎఱ్ఱచామంతి, కింశుక- మోదుగ
[86] సేతు- ఉలిమిరిచెట్టు, పూగ- పోకమ్రాను, గంగరావి, శిరీష- దిరిసెనచెట్టు
[87] కుటజ- కొండమల్లె,
[88] కుటము- కుటజము, చెట్టు
[89] నగరు- అంతఃపురము
[90] ప్రాగ్వర- తూర్పు ప్రహరి గోడ / శ్రేష్ఠమైన

241
మునులార! నిలువుఁ డింపున లచ్చిఁగూడి
జాక్షుఁ డేకాంతవాసంబు నందు
వేడుకనున్నాఁడు వినుఁడు మీకరుగఁ
గూడఁదచ్చోటికిఁ గొలువు లేకునికి
రులు మౌనులు వసరం[91] బెపుడు
కూరునోయని సందడిఁ గొనుచు
నివడి వరములుడి[92] యున్న వార
నిపల్కి వేత్రంబు[93] డ్డంబుఁగాఁగ
నిడిన నమ్మునివరు లీక్షించి మదులఁ[94]
బొము కోపాటోపములు నిల్పలేక
రిఁజూచు వేడుక రిగెడు మనకు
తెరు వరికట్టిరి తెగువ నిక్రూరు
లిట్టిపాపమున నియ్యిరువురు నుర్విఁ
బుట్టుదు రసురలై భోరన” ననిన
గొబ్బున దౌవారికులు[95] భీతి మ్రొక్కి
బ్బరి[96] పెక్కు మార్గములఁ బ్రార్థింప
న్మత్రయంబునం క్రి వైరమున
నున్మత్త భావంబు నొంది యామీద
ఱియుఁ జేరెదరు తారసపత్రాక్షు
వెవకుం”డని వారు వివరించునంత


[91] అవసరము- ప్రభువును కలియుటకు అవకాశము కల సమయము
[92] పనివడి- పనిపడి, కావాలని, వరములవడు- వరములుపడు, వ్రతనిష్ఠ చేపట్టినట్లు
[93] వేత్రము- బెత్తము
[94] మది (ఏకవచనం)- మదులు (బహువచనం)
[95] దౌవారికులు- ద్వారపాలకులు
[96] గబ్బరించు- గబగబ పలుకు

251
త్మదాసులకు నట్లార్తి చేకురుట
యాత్మలోఁ దెలిసి దయానిధి యగుట
చ్చెనచ్చోటికి వైకుంఠుఁ డపుడ
చ్చితోఁగూడి విలాసముల్మెఱయ
రుడుం డొసంగెడు కైదండ యూఁది
రుదెంచి నిలిచి యా రి వల్కు నిటుల
“తాసులార! నా దౌవారికులకు
శాపంబు మీవంక[97] మకూరె నిపుడు
దియేనుఁ ద్రిప్పంగ నాత్మలోఁగోర
మొల విప్రులె దైవములు నాకు నెపుడు
తెలియంగ తీర్థ కీర్తియు నాకు మీరుఁ
లుగంగఁ గలిగి జగంబున నిలిచి
ఖండింతు నా బాహుకాండంబునైన
దండియై మీకుఁ జిత్తంబు రాదేని
బా[98] ముఖమునం బ్రతికబళంబు
తోడుతం బొడము సంతోషంబు నాకు
యఁగ యజమానుఁ గ్నిలో వేల్వఁ
జెలువొందు హవ్యంబు చేనైన లేదు
వేరు విప్రుల విమలాంఘ్రిరజము
నేమూర్థమున ధరియింతు సద్భక్తి


[97] మీవంక- మీనుండి
[98] బాడబ- బ్రాహ్మణుడు

261
ణీసురోత్తముల్ లఁప నాదైన
శరీరము లని నార్యు లెచ్చోట
యెవ్వండు విప్రుల నీక్షించు ముదము
వ్వునుం గల భాషణంబాదియైన[99]
వర్తనమున సేయొనర్చునట్టి
గురుమనీషులకుఁ జిక్కుదు సత్యమేను
మీరాడినట్ల నీమెయిఁ[100] బ్రతీహారు
లారూఢి నవనిపై సురలై పుట్టి
క్రమ్మఱ ననుఁ జేరఁ ల రని యిట్లు
మ్మతిం దెలుపు నా లజలోచనునిఁ
నుఁగొని పెక్కు మార్గముల నుతించి
కాదు లానంద సంభృతులగుచు
నిరి నిజేచ్ఛ నా యవిజయలును
జనాభు నిదేశ[101] చనంబు వినుచు
చ్చోట వాసి హాహాకార మెసఁగ
నెచ్చై[102] రయమున నేతెంచి రిలకు
క్రతుభుజులార![103] యా నులె చిత్రముగ
దితిదేవి కడుపులో ధృతి నున్నవారు”
ని తెల్పుటయు వేల్పు జునికి మ్రొక్కి
నిరి గ్రక్కున నిజాశ్రయముల కంత


[99] నవ్వునుం గల భాషణంబాదియైన- చిరునవ్వుతోకూడినపలుకులుకల, స్మిత పూర్వ మభిభాషణమ్
[100] ఈమెయి- ఈవిధము
[101] నిదేశము- పనుపు, ఆజ్ఞ
[102] ఎచ్చైన- అధికమైన
[103] క్రతుభుజులు- దేవతలు

హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జన్మప్రకారము

271
నుమణి దితియు నిద్దరఁ గాంచె సుతులఁ
రె నుత్పాత బృందంబు లవ్వేళ
సంయమియునుఁ బూర్వాధానుఁ[104] దనయుఁ
జేసెహిరణ్యకశిపు నాముఁగాఁగ
పూర్వజుని[105] హిరణ్యాక్ష నామమున
టియించె వేదోక్తర్మపూర్వముగ
అంగ్రజుఁడు హిరణ్యకశిపుం డెసముఁ[106]
జెందెఁబితామహుచేవరంబంది
నుజాతుఁడగు హిరణ్యాక్షుండు నెపుడుఁ
నుఁజూచి యన్న మోదంబు నొందంగ
చేతఁ బూని సంగ్రామంబుఁ గోరి
త్రిదివంబునకు నేగి త్రిదశుల వెదక
వారునెదిర్చు చేలు లేక భీతి
నారోషనిధికి లక్ష్యముఁ గాక చనిరి
రుడునింగని భుజంములట్ల సురుగు
సులఁ గన్గొని రక్కసుఁడు బొబ్బలిడుచు
లి భూమికి వచ్చి త్తేభ మటులఁ
గుచు ననిఁ గోరి పాధోధి[107] చొచ్చి
లఁక వుట్టించినం[108] డు భీతి దాఁగె
చరంబులుఁ బాసె సైన్యసంఘములు


[104] పూర్వధానుడు- ముందు గర్భంలో ధరించబడినవాడు
[105] పూర్వజుడు- ముందు పుట్టినవాడు
[106] ఎసము (వి)- యశము (ప్ర)
[107] పాధోధి- పాలసముద్రము
[108] కలక- కలకువ, నీటిని కదుపుతూ చేయు చిందఱవందఱ

హిరణ్యాక్షుఁడు వరుణునితో కయ్యమునకుఁ గాల్ద్రవ్వుట

281
నాదైత్యుఁడును వరుణాలయంబునకు[109]
నాట నేఁగి యా బ్ధీశుఁ[110] గాంచి
“వెమ్రొక్కు మ్రొక్కి యో వీర! నాకిపుడు
త లేక యొసంగు సంగ్రామభిక్ష”
నుఁడుఁ బుట్టినఁ గోపణఁచి యా వరుణుఁ
నుపమాహంకారు నాదైత్యుఁజూచి.
వినుదైత్యవర్య! యా విష్ణుండుఁ దక్క
నినుఁజూచి పోరిలో నిలుచు నెవ్వాఁడు?”

నారద ప్రేరితుఁడై హిరణ్యాక్షుఁడు రసాతలమున వరాహరూపుఁడైన విష్ణువు నెదిరించుట

నావుఁడు నా దితినందనుం డడరి
యావిష్ణువృత్తాంత మంతయు నపుడు
నొప్ప నారదు లన నెఱింగి
లఁకక[111] యా రసాలమున[112] కేఁగి
చ్చోట దంష్ట్రచే వనీతలంబుఁ
గ్రుచ్చుక యెత్తు నా కోలంబుఁ[113] జూచి
వ్వుచు హుంకరణంబొనరించి
వ్విశ్వనాథుని నియె గర్వమున,
దేశముల[114] యందు ర్తించు మృగమ!
నుఁ గానవే మదోన్నతి నొందె దేల?
దితిసూను నన్ను నెదిర్చి పెనంగు[115]
విత శక్తిని నీవ విష్ణుండవేని


[109] వరుణాలయము- పాలసముద్రము
[110] అబ్ధీశుడు- వరుణుడు
[111] తలకు- వెనుదీయు
[112] రసాతలము- జలగర్భము
[113] కోలము- వరాహము
[114] వనదేశములు- జల అటవీ ప్రదేశములు
[115] పెనగు- పోరు

291
విలి వీరుండు యుద్ధమునకుఁ బిలువ
నితోఁ బోరాడు ది యుక్తమగునె?
వినుమద్గదాగ్ర చూర్ణీకృతమస్త
కునిఁజేయ మూలంబుఁ గూలుటం జేసి
నుదురు సురలెల్ల సందడి మాని
మునులు నాకై హవ్యములు వేల్తు రెపుడు“
నిదితి నందనుం డాడెడు నుక్తి[116]
వినియు నమ్మఖపోత్రి[117] వినని చందమున
నొక్కట భువనంబు లుఱ్ఱూతలూఁగ
నొక్కొక్క పరి వేగ నొడలుఝాడించు
రుదంష్ట్రికల చేత నొక్కొక్క మాటు
ధిలో కుధరముల్[118] రపు నిట్టట్టు
క్క[119] పోత్రి విదారణక్రీడ[120]
యొక్కొక్క పరి రవంబొదవఁ గావించు
హువిధంబుల నిట్లు లిమి దీపింప
విరించి విహరించి విష్ణుండు వేడ్క
ధౌతగిరికూట[121] మనీయదంష్ట్ర
నియెత్తె మీఁద వేవెల్లియై[122] తోఁప
హురంధ్ర గళిత శంరధార[123] లందు
హినిల్పె ముక్తాసరంబుల[124] భాతి


[116] ఉక్తి- పలుకులు
[117] మఖపోత్రి- యజ్ఠవరాహము
[118] కుధరము- పర్వతములు
[119] తక్కక- విడువక,
[120] విదారణక్రీడ- రణము, యుద్దము
[121] కలధౌతగిరికూట- వెండికొండశిఖరము
[122] వేవెల్లి- వేవెలుగు, సూర్యుడు
[123] గళిత- కారుతున్న, శంబరధారలు- జలధారలు
[124] ముక్తాసరములు- ముత్యాదండలు