పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం 2

101
రారు నమ్మహత్తత్వ సర్గంబు,
ను! తాహంకార ర్గంబు, భూత
ర్గంబు, నింద్రియ ర్గాధిదైవ
ర్గంబులునుఁ, దమస్సర్గంబు ననఁగ
నామలజుకంటె టమున్నె యగుటఁ
బ్రాకృతంబు లనంగఁ రగునో విదుర!
వృక్షాది సర్గంబు మృగముఖ్య సర్గ[31]
క్షీణమగు మానుషాఖ్య సర్గంబు
ర సర్గమునన మరునీ నాల్గు
కూరె వైకృత ర్గంబు లనఁగ
దిసర్గములు నిట్లు భాసురమార్గ
విదితముల్ గా నీకు -వివరింపబడియె
గురువులు[32] పది వల్కఁ గూడిన కాల
రుదుగా నొక ‘ప్రాణ’[33] నుపేరఁ బరఁగు
కొలు[34] ప్రాణము లారుఁ గూడ ‘వినాడి’[35]
ఱువది యది యైన గు నొక్క ‘ఘడియ’
ఱువది ఘడియల ‘హము’ను, ‘నిశ’యు
లఁ జొప్పడ నొక్క ‘వాసరం’[36] బెసఁగు
వియు ముప్పది యైన గు నొక్క ‘మాస’
విపదియును రెండు నైన యందొకటి

[31] సర్గము- సృష్టి; ఇది ప్రాకృతము, వైకృతము అని రెండు విభాగాలు, పది ఉపవిభాగాలు కలది, 1మహత్తు, 2అహంకారం, 3మహాభూతములు, 4ఇంద్రియములు, 5ఇంద్రియాధిదేవతలు, 6తమస్సు, ప్రాకృతములు; 7వృక్ష, 8మృగ, 9మానవ, 10దేవ యోనులు వైకృతములు అనబడును.


[32] గురువు- ఛందస్సులోని గురువు, రెండుమాత్రల కాలము పట్టు అక్షరము
[33] ప్రాణము- 20 మాత్రలకు (లఘువులకు) పట్టుకాలము
[34] కొఱలు- కలుగు
[35] వినాడి- విఘడియ, విఘటిక
[36] వాసరము- దినము

111
సంరిధామ సంర్గ స్వభావ
సందం దనరు వత్సర మైదుగతుల
నుమాస మఖిల సమ్మతిఁ చైత్ర దినము
నువత్సరంబె యర్త్యవాసరము[37]
వినుము దివ్యాబ్జముల్ వేలు పండ్రెంటి
నొరంగ నొక మహా యుగమనం బరగు
తెలివొందుఁ గృతమును త్రేత ద్వాపరము
లియు నా నందు యుములగు నాల్గు
న్నతంబుగఁ గృత యుగము వర్షంబు
లెన్ననాలుగు వేలు నెనిమిది నూఱ్లు
త్రేతాయుగమున వర్తించు నబ్దములు
వీకల్మష! మూడు వేలు నార్నూఱు
లుకంగఁ జాలు ద్వార యుగంబునకు
వెయ నేండ్లును రెండు వేలు నన్నూఱు,
వేయినన్నూరన వెరసున కెక్కు[38]
ధీయుత! కలియుగా దిన వర్షములును
వొనఁగూడి యిమ్మహా యుగములు వేయి
నుఁడి దినంబగుఁ తురాననునకు

సర్గ కాల కల్ప లక్షణము

దిమెంత విరివి యంతియ రాత్రి కొలది
దివిరామమున నిద్రించు నా ధాత


[37] మను వత్సరమె- మానవుల సంవత్సరము అనగా, అమర్త్యవాసరము- దేవతలకు దినము
[38] వెరసునకెక్కు- వరుసగా లెక్కకు వచ్చు

121
సంర్షణాగ్నిచే మసె పెన్వెల్లిఁ
బొంకంబుసెడి లోకములు మూఁడు మునుఁగు
సిజాసను దివసంబు తోఁగూడఁ
రిమితంబుగ నింద్రట్టంబు[39] సెల్లు
నుతవ్రత! పదు లుగురు మనువు
రుగుదు రా యొక్క హమున యందె
వొక్కొక్క మనువున కొనర డెబ్బదియు
నొక్కటి యగు మహాయుగములు సెల్లు
దిసంబు లెల్ల నీ తెఱఁగున నడచు
తు[40] చెప్పఁగలేక లజాసననుకు
రాతిరి చన దినారంభంబు నందు
ధాసృష్టికిఁ బ్రవర్తకుఁ డగుం దిరుగ
యీరీతి దినముల యేండ్లు నూరైన
యం బరమాయు గుఁ బద్మజునకు
బ్రహ్మకు నిప్పు డేఁది యేండ్లు చనియె
బ్రహ్మజ్ఞ! వానితోఁ ద్మ కల్పంబు
రిగె నిప్పుడు ద్వితీపరార్థమయ్యె
రియాది నిందు కోలాకారుఁ[41] డగుచు
యీగంబున నిప్పు డెన్నంగఁజాలె
రాజిల్లు శ్వేత వరాహకల్పంబు


[39] ఇంద్రపట్టణము- అమరావతి
[40] సవతు- సామ్యము, పోలిక
[41] కోలాకారుడు- వరాహ రూపంతో అవతరించినవాడు

131
యిదికల్పలక్షణం బిట మీఁద నింక
విదుర! యవ్విధి సృష్టి విధమెల్ల వినుము

విధి సృష్టి విధాన లక్షణము

లువుర సనక సనందనాదులను
లువఁ దాఁ దన నెమ్మమునఁ బుట్టించి,
సృష్టినియోగంబు సేయుఁడు, వారు
రుష్టులై[42] నవ్వి పారుష్యంబు[43] మెఱయ
“సంసార భాగ ప్రసంగంబు లిట్లు
హంవాహన! మాకు నానతీఁదగునె?”
నిప్రతిభాషణం బాడిన మిగులఁ
లు[44] పూనిన పద్మర్భుని నుదుట
దీప్తి[45] నీలలోహితుఁ డొక్కరుండు
నియించి యగ్రదేశంబున[46] నిలిచి
“తానా కొక పేరు గఁ బెట్టు” మనిన
ధాయా బాలు నా రమునం జూచి
“వేవిశ్రుత! సంభవించుచు నీవు
రోదించి తటుఁగాన, రుద్రుండ వగుము
తురత్వమున సృష్టి సాగింపు” మనుఁడు
తఁడు రుద్ర శతంబు పుడ పుట్టించె
భున సంహృతి[47] సేయఁబూను నా రుద్ర
నిహంబుఁ గాంచి “యో నియతాత్ములార!
మీసృష్టి చాలును మీరు తపంబు
చేసియచ్యుతు మెచ్చఁ జేయుఁ” డం చనిపి


[42] రుష్టులు- కోపించినవారు
[43] పారుష్యము- పౌరుషము
[44] కనలు- కోపంతోమండిపడు
[45] ఇనదీప్తి- సూర్యప్రకాశము
[46] అగ్రదేశమున- ఎదుట
[47] సంహృతి- సంహారము

141
వాంచి చింతించు ధాత కాత్మజులు
లిగిరి పదుగురా థ యెల్ల వినుము

నవబ్రహ్మల జననము

న్నుతంబగు మానమున మరీచిఁ,
న్నుల నత్రి, మొమున నంగిరసు,
నొర వీనులఁ బులన్త్యుని, నాభిఁ బులహు,
నుఁడగు క్రతువునుం రపంకజమున
పెనుపొందు తోలున భృగువు, వసిష్ఠ
మునిఁబ్రాణమున, దక్షు మొగి నుంగరమున
నాదుం దొడ, సము న్నతి గాంచె నల్వ
యూక దైవ నియోగంబు కతన
వాలం జూచి భాము పల్లవించు
సాసభవునకుఁ య్యన మఱియు

ధర్మాధర్మముల జననము

ర్మంబు దక్షిణస్తనమున, నయ్య
ర్మంబు, మృత్యువుఁ గ వెన్ను వలన ,
రఁ గామము హృదమునఁ, గ్రోధంబు
బొల, లోభం బోష్ఠమున, వాక్కు నోర,
తరంబైన లింమున సింధవులు,
నుత! పాయు దేమున నైఋతియుఁ
లిగె దేహచ్ఛాయఁ ర్దమ మౌని
తెలివొంది దేవహూతికి భర్త యయ్యె

151
తురాననుని మనస్తనువుల వలన
విదితమై యీ రీతి విశ్వంబు వొడమె
నిపుత్రియైన వాణీదేవిఁ జూచి
ప్రనిత కాముఁడై రమేష్ఠి యపుడు
చేట్టుటయు మరీచిమునీంద్రముఖ్యు
లాపుత్రు లందఱు వ్విధం బరసి
దూఱిన లజ్జించి ద్రుహిణుఁ[48] డమ్మేను
భోనఁ దొలగింప బొలుపుగా దిశలు
దానిఁగైకొనియె నో ర్మాత్మ! యదియుఁ
బూనియిప్పుడు జగంబున సేమ మయ్యె
త్తఱి మది యొక్క యంగంబు పూను
త్తోయజాసను న్యాస పద్మముల
విసిల్లు వేదోపవేద పురాణ
ములుమఖక్రియలు నద్భుతముగాఁ బొడమె

స్వాయంభువ మనుసంభవము

సృష్టియీ గతిఁ గొంత సేసియు మిగులఁ
దుష్టుండుఁ[49] గాక చతుర్ముఖుఁ డాత్మ
నెక్కుఁడు చింత వహింపఁ దత్తనువు
గ్రక్కున రెండు భా గంబులై నిలిచె
తులాత్మ! యవియ స్వాయంభువమనువు
రూప యనుపేరి తియునై పొలిచె


[48] ద్రుహిణుడు- బ్రహ్మదేవుడు
[49] తుష్టుడు- తృప్తి చెందినవాడు

161
లువయు విగ్రహాంరము[50] ధరించి
కొల్పె[51] వారి చి త్తములు సృష్టికిని
స్వాయంభువుండు నా తరూప[52] యందు
పాక సృష్టి సంభ్రమశాలి యగుచు
దృత యశులం బ్రివ్రతోత్తాన
పాదులు నాఁ దనూవుల నిద్దరను
తెలివి నాకూతియు దేవహూతియును
రు ప్రసూతియు ను పుత్రికలను
నియె వారల ప్రజోత్కరముల[53] చేత
మునుకొని ముల్లోక ములు నిండె విదుర!”

విదురుఁడు మైత్రేయుని ప్రశ్నించుట

విని “యో పుణ్య యాది నయ్యాది
నువేమి యొనరించె హినెట్లు నిలిచె?
తెలుపవే” యనిన మై త్రేయ మునీంద్రుఁ
వు చొప్పడఁగ ని ట్లని తెల్పఁ దొడఁగె

వరాహావతరణము వసుధోద్ధరణము

స్వాయంభువుండట్లు నియించి మ్రొక్కి
తోజసంభవు తోడ నిట్లనియె
“వనిధిలోన నివ్వసుధాతలంబు
మునిఁగి యున్నది చతుర్ముఖ యసాధ్యముగ
నాకును నాదు సంతికి నుండంగ
జోసేయుము[54] మంచి చోటుగా నెలవు[55]


[48] ద్రుహిణుడు- బ్రహ్మదేవుడు
[49] తుష్టుడు- తృప్తి చెందినవాడు
[50] విగ్రహాంతరము- మరియెక దేహము
[51] తలకొల్పు- పురిగొల్పు, కలిగించు
[52] శతరూప- “సహస్ర పరమాదేవీ శతమూలా శతాంకురా” అని కీర్తించబడిన దేవి
[53] ప్రజోత్కరము- ప్రజలను పుట్టించుట
[54] జోకచేయు- అనుకూలపరచు, బాగుచేయు
[55] నెలవు- నివాసము

171
నావుండు “నివ్వసుంర యింక నెత్తు
టేవిధమున నగు నివ్వేళ” ననుచు
రివోక చింతించు ద్మసంభవుని
గురుతర నాసికా క్రోడంబు[56]వలన
అంగుష్ఠమాత్ర దేతఁ బోత్రి[57] యొకటి
యంగీకృతోద్ధతి యైజనియించి
ధాయు, మునులు “నితఁడె హరి” యనుచుఁ
జేతులెత్తి నుతింప శీఘ్రంబె పెరిగి
తర భంగ సంఘాత సంఘట్ట
దుగ్ర[58] ఘుమఘుమాకార వర్ణితము
భూర్భువస్వర్నామ[59] భువన విస్తార
ర్భీకృతప్రవేప్రగల్భంబు
ణిగన ఫూత్కృతి ప్రహతి విభ్రాంత
నీయ బలమహాగ్రాహ సంకులము
రివహ పవన ఝంపా[60]సముద్గమిత
గురుతర డిండీర[61]కూట భీషణము
స విద్రావిత ప్రకట తత్కాల
య మహర్లోకన సంకరంబు
నైయుండి నారాయణాశ్రయత్వమునఁ
బాక సజ్జన భావంబు పోలె


[56] గురు-గురుతరము-గురుతమము, నాసికాక్రోఢము- నాసాదండము, (క్రోఢము- మధ్యభాగము)
[57] పోత్రి- వరాహము
[58] కనత్- ప్రకాశించుచున్న, ఉగ్ర- భీకరమైన
[59] భూర్భువస్వర్నామ భూః భువః సువః పేరులతో
[60] ఝంపా- దూకుడు
[61] డిండీర- నురుగు, ఫేనము

181
త్యక్త[62]గోత్రానుకూలాచార మహిమ
క్తియై దుష్టప్రచారంబ పోలె
యాశుగాపాత[63] లిత కీలాల
మయి కదన భూభాగంబ పోలె
లోత్రయా కాంతి లోలుపం బగుచు
వైకుంఠు కుబ్జతావ్యవహృతి వోలె
రిహితకర యానపాత్రోపయోగ
విహితంబై లోభి విత్తంబ పోలె
భ్రభంగకల్పిత ప్రాచుర్య భణన
యమై యద్వైత శాస్త్రంబ పోలె
రాజిల్లు కల్పాంబు రాశిపూరంబు[64]
తేజోవిశేషంబుఁ దిలికింప జొచ్చి
తీతలము కోరఁ క్కఁగా నెత్తి
ణిత శక్తి మహాయుక్తి నిలిపె”

విదురుఁడు మరల మైత్రేయునిఁ బ్రశ్నించుట

నుటయు, “నో తాపసాగ్రణి! యెట్లు
నిధిం బోత్రిభావంబుఁ గైకొన్న
రిభూమి యెత్తుచు చటికిం గ్రొవ్వి
రుగుఁదెంచిన హిరణ్యాక్షునిం ద్రుంచె?
నుకథ విందు; మీవ్విధం బెల్ల
వినఁజేయవే” యని విదురుండు వేడ


[62] త్యక్త- విడిచిన
[63] సరయు- వీచెడి, ప్రవాహం, ఆశుగ- వాయువుల, బాణముల, ఆపాతము- ఆక్రమణము, పడుటలు
[64] కల్పాంబు రాశిపూరంబు- ప్రళయ జలాలు

191
మైత్రేయుఁ డధిక సమ్మదమున బద్మ
త్రాక్షుఁ దలఁపునఁ ట్టి యిట్లనియె

దితి కశ్యప సల్లాపము

“ఆత్మభూసంభవుండైన మరీచి
కాత్మజుం డలరెఁ గశ్యపుఁ డను మౌని
నికిం బత్నియై భివృద్ధి నొందె
దితియను దక్షపుత్రిక కోమలాంగి
య్యింతి యొక్కనా ర్కుండు గ్రుంకు
య్యెడ నొయ్యన ప్రాణేశుఁ జేరి
తికేళిఁ గోరుండు ప్రౌఢి, నమ్మగువ
ధృతిగాంచి యమ్మౌని తెలివి నిట్లనియె
“కామిని! యిది సంజడ యిట్టి వేళ
కాముక భావంబు గైకొనందగునె?
యీవేళ భూత సమేతుఁడై మింటఁ
బానమతి శూలపాణి చరించు
తఁడు నీ మఱఁది మహాత్ముండు దుష్ట
తుల నెల్లెడఁ బలుమారును వెదకు
యించుక సేపు సయించు నీవింక
చంలనేత్రి! నిశావేళ వచ్చు
ణిపైఁ దను నిందదాఁకక యుండఁ
దిరుగుట యది సుమ్ము తెలివి పద్మాక్షి!”