పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం - 5-901-1000

901

డుమించెఁ బిక కుహూకార సంపదలు
డుసరి! వే పాట ఱచెఁ దుమ్మెదలు
యిచ్చటి విరులకై యేల తత్తరము
నిచ్చలుఁ గలదుగా నీకు బిత్తరము
కొమ్మలొయ్యన వంచి కోయుమో కొమ్మ!
మ్మని విరులటు గావు రా రమ్మ
బాలా!తపము చాయఁ ఱపు క్రొన్ననలు

లాలించి కోయుట లన! మన్ననలు
పొడఁ జాలిన తావి పొగడ[52] క్రొవ్వాడు
మిగులఁబట్టకు చాలుమీయన్న తోడు
వంతులు వెట్టు సేవంతులుఁ[53] గోయ
వింమాటలు నీకు వింతయే యెపుడు
వింరమ్మిటఁ గురువింద పందిరికి
చంనం బిదె డాయు చందనగంధి!
కువకంబులకు[54] మాకురవంబు లేల?
ములుఁ గట్టు కేరముల నిపుడు
యేమోవిచారించితేమోవి కింద
లేమో!విడంబింతులేమావి[55] చేరి
న్నెగేదంగికై[56] న్నె! రావేని
న్నలేమిటికి నాన్నలం జూచి


[52] పొగడ- వకుళము
[53] సేవంతులు- చేమంతులు
[54] కురవకములు- ఎఱ్ఱగోరింట, (దీనికి దోహద క్రియ ఆలింగనము, -శబ్దరత్నాకరము), ఎఱ్ఱచేమంతి
[55] మావి- మామిడి
[56] గేదంగి- మొగలి

911

వారిజామోద! అవ్వారిఁగా నిపుడు
వాకందుము సిందువారంబు[57] లిచట
పాలగంధి! యాపాటలంబులకు[58]
పాలతో నేగు పాటలరారు[59]
విరివిగా గొజ్జంగ విరి విశేషంబు
దొకె నిమ్ముదము మాదొరకె యర్పితము
చాలులె యామల్లె చాలు పోరాము
కీల్లఁ దెలిసెఁగా కీలల్ల మాకు
వాదులేఁటికి విరవాదులు[60] చూచి
వేదింతు నవియు నివేదింతు నీకు
పొడివడకుండఁ బుప్పొడి కుప్ప త్రోవ
డుపుండు చెలులార! డవడి మెఱయ
నిపెక్కు గతుల నొయ్యారంబు తోడ
ములోఁ గల విరుల్వరుసతోఁ గోసి
తులేని చిగురు బంతుల వేటులాడి
యఁ బూదేనియ కాలువల్ గట్టి
వొక్కొక్క యెడఁ దీఁగె యుయ్యాల లెక్కి
పెక్కుచందంబులఁ బ్రియములుఁ గాంచి
కుములు చూచి కోకంబులు బెదరఁ
బ్రచురాంగ గంధ సంద కలు ల్చెదర
చెలువలు వనకేలి సేయంగఁ బొడము
పున నయ్యంబుజాక్షునిం గూడి


[57] సిందువార- వావిలి
[58] పాటలి- కలిగొట్టు
[59] పాటలలరారు- పాటు అలరారు
[60] విరవాదులు- విరజాజులు

పదియారు వేల సతులతో, నెనమండ్రుగురు పత్నులతో శ్రీకృష్ణుఁడు జలక్రీడ లాడుట

921

యొయ్యన జలకేళి యొనరింపఁబూని
య్యన నొక్క కాసారంబు చేరి
స మీఁగాళ్ళు కచ్ఛపములం దఱుమ
నుసిజంబులు కోకయుగముల నఱుమ
తెలివినారులు నాఁచుదీవెలం బరఁపఁ
జులుకఁగాఁ బొక్కిళ్ళు సుళ్ళుఁ గీడ్పరఁప
న్నులు మీన సంము మించి నిలువఁ
జెన్నైన కురు లలిశ్రేణులఁ గెలువ
లిలంబులోఁ జొచ్చి శౌరితోఁ గూడి
వెలఁదు లింపెసలార విహరించి రపుడు
ర కాంతలఁ గూడి యాకాశ తటిని
రంగ విహరించు మరేశుఁ బోలి
క్రీడించె నా దేవకీనందనుండు
వేడుక మెఱయ నవ్వెలఁదులం గలసి

జలకేళిలో చల్లు పోరాటముల నోల శ్రీకృష్ణుని సతులహేల

భీరువుల్ కరపుటోత్పీడిత వారి[61]
ధాలొండొరులపైఁ నరించు వేళ
దేతల్ మెచ్చి మౌక్తిక వృష్టిఁ గురియు
కైడిం గనుపట్టిఁ చముల మీఁద
న్నులల్లార్చు నాలికిపై నోల[62]
న్నత వక్షోజయుగళిపై నోల


[61] కరపుట ఉత్పీడిత వారి- అరచేతులతో లేక దోసిళ్ళతో నీటిని ఎగజిమ్ముట. దీనికే ‘ఓల’ అని ‘చల్లుపోరాట’ మనీ, ‘చల్లులాట’ అని పేరు.
[62] ఓల- జలక్రీడా విశేషము, చల్లుపోరాటం లేదా చల్లులాటలో నీటి జల్లు

931

జిలిబిలి సేతల చెలువపై నోల
యని యా హంసయానపై నోల
నున్న మలయజగంధిపై నోల
కంటి చూపులన్నెపై నోల
తేమాటల ప్రోడతెఱవపై నోల
దాఁటియట్లేగు బిత్తరి మీఁద నోల
నిపెక్కు విధముల నాడుచుం గలసి
నుమతంబులఁ జల్లులాడుచు బెలసి

శ్రీ కృష్ణుని సతులు పట్టు చీరలు శృంగారించి కొనుచు సరస సల్లాపము లాడుట

భినవానేక విహార విశేష
సంబుచేఁ బరిశ్రాంతి వహించి
రికి నేతెంచి యంఱును శృంగార
సి కైకొనఁబూని పుడు మోదమున
బింబాల పట్టు[63] శోభిల్లెడు నీకు
బింబోష్ఠి![64] కైకొను ప్రేమంబు చెలఁగ
నిలువు మగ్గము[65] పట్టు నీకిత్తు నింతి!
నిలువు మగ్గము[66] గాదె నీకు నీ సొమ్ము
ప్రతిమల పట్టు[67] చేట్టుము ముగుద!
ప్రతిమల పట్టు నీట్టున నొడువ
అంన! సింగారగు నీకు సర్వ
సింగా[68] మిదె యిట్టె చేపట్టి తేని


[63] బింబాలపట్టు- ఆ కాలపు ఒక పుట్టుచీర పేరు, బింబము(అద్దము)లు కూర్చినచీర
“చీరయె శృంగారమండ్రు స్త్రీలకు సుమతీ” అని సుమతీ శతకకారుడు బద్దెన చెప్పారు. అందకే స్త్రీలు ఆయా రంగుల, పూల, ఆభరణాల, వస్తువుల పేర్లను, జరీ, నేతలు, అంచులు, అమరికలను బట్టి చీరలకు రకరకాల పేర్లు పెట్టి పిలవడం ప్రాచీనకాలం నుండి, ఈ కాలందాకా ఉన్నదే.. అలా, ఈ కాలములో స్త్రీల చీరలకు రకరకాలపేర్లు ఉన్నట్లే, పూర్వకాలములో కూడ అనేక పేర్లు ఉండేవి. వాటిలో ఈ బాలభాగవత దశకాలలో వాడిన 29 పేర్లు గమనించండి. - 1.బింబాలపట్టు, 2.నిలువుమగ్గముపట్టు, 3.ప్రతిమలపట్టు, 4.సర్వసింగారము, 5.చిల్కచాలు, 6.రాజహంసావళి, 7.చౌకాలమంజిష్ఠి, 8.సన్నకంటి,, 9.ముప్పట్టి, 10.అంగనగరి, 11.రత్నావలి, 12.మాదావవళము, 13.పుష్పదండావళి, 14.తుమ్మెదలచీర, 15.చంద్రగాని, 16.జీబుచీర, 17.ఉదయరాగము, 18.కప్రంపుపలుకులచీర, 19.గందగావుల, 20.సర్వతోభద్ర, 21.మీనంచు, 22.పొన్నాటంకములచీర, 23.రాజావర్తము, 24.పొగడపువ్వంచు, 25.పసిమిడిచీర, 26.పచ్చగడలు, 27.గజపుప్పొళియ, 28.సింహావళము, 29.దుప్పట
[64] బింబోష్ఠి- దొండపండులాంటి క్రింది పెదవి గల సుందరి
[65] నిలువుమగ్గముపట్టు- ఆ కాలపు ఒక పుట్టుచీర పేరు, నిలువుమగ్గం భూమికి లంబాంగా ఉంటే మగ్గం?
[66] నిలువుము అగ్గము- అందుబాటులో ఉన్నది
[67] ప్రతిమలపట్టు- ఆ కాలపు ఒక పుట్టుచీర పేరు, బొమ్మల పట్టు చీర
[68] సర్వసింగారము- ఆ కాలపు ఒక పుట్టుచీర పేరు

941

తినిలుగట్టినం తి నీకు మేలు
కూన! యా నేతుకు నేతులేల?
దుపు నీ కిపుడు నొమ్మదు[69] పువ్వుఁబోణి!
నఁ గట్టుము చాలుదె చిల్క చాలు[70]
తోహత్తులు నీకుఁ దోర హత్తెపుడు
నారాయిడేల, రావిభాళములకు
హంయానవు! గాన లరునే రాజ
హంసావళియ[71] నీకు నుమానమేల?
కంక మేలకో? లవు రుద్రాక్ష
కంకు లెపుడు నా మలలోచనకు!
చౌకాలతాతన్వి! సారెకుం జూడ
చౌకాల మంజిష్ఠి[72] వరింపు మిపుడ
న్నకంటికి[73] చూచి న్నలవేల?
మున్నముప్పట్టెకై[74] మున్నాడి తటుల
అంన! గరిమె తోనందు కొమ్మింద
యంనగరి[75] నీకు లవడుం జూడ
లి మాట రత్నావలి[76] కేల?
నీవెకట్టగదమ్మ నీరజనేత్రి!
తాళం బయ్యె మాదావళంబులకు[77]
పోమ్మ చెలి! ముల్కపూవన్నె లేల?


[69] మదుపు- ఆకుపచ్చ, ఒమ్మదు- నప్పదు, అచ్చుకాదు
[70] చిల్కచాలు- ఆ కాలపు ఒక పుట్టుచీర పేరు
[71] రాజహంసావళి- ఆ కాలపు ఒక పుట్టుచీర పేరు
[72] చౌకాలమంజిష్ఠి- ఆ కాలపు ఒక చీర పేరు, చిక్కని ఎఱుపురంగు గల చీర?
[73] సన్నకంటి- ఆ కాలపు ఒక చీర పేరు, సన్నని జరీగల చీర
[74] ముప్పట్టి- మూడు పట్టెలు తీర్చిన చీర
[75] అంగనగరి- ఆ కాలపు ఒక చీర పేరు
[76] రత్నావలి- ఆ కాలపు ఒక చీర పేరు, కాశ్మీరపు బట్ట
[77] మాదావవళము- కపిలవర్ణపు చీర, తావళము- హారము

951

దండంబు వెట్టెద యచేసి పుష్ప
దండావళియ[78] నీకుఁ గుఁ గట్టు మబల!
మెలెదు తళుఁకుఁ దుమ్మెదల చీరలకు[79]
గజగమన! సమ్మదము మాకెపుడు
లంబియేమిటికిఁ గళంబి వన్నెలకు
నంబుజనేత్రి! నీదె చంద్రగాని[80]
మంనంబేల సామంత విదులకు
నింతి!కొంచెమె నీకునీజీబు చీర[81]
యరాగము[82] చూచి యుదయించు నీదు
హృయరాగం బెల్ల నింతిరో! తెలిసె
లుకు లేమిటి కింకభామ! కప్రంపుఁ
లుకుల చీర[83] యాణఁతికి నిమ్ము
దూఱినం గలవె కస్తూరి! మళ్ళిపుడు
గావించితి గందగావుల[84] నపుడు
బాతియే సర్వతోద్రలు[85] మాకు
నాతి!నీ మీనంచు[86] నాకు నిమ్మిపుడు
ములుచ! సొన్నాటంకముల చీర[87] నీకుఁ
చనే కళిదాసుపైదృష్టి యేల?
మున్నురాజావర్తము[88] నిల్చి కలికి!
తిన్నఁగా ద్రాక్షపందిరి వేడఁ దగవె?


[78] పుష్పదండావళి- ఆ కాలపు ఒక చీర పేరు
[79] తుమ్మెదలచీర- ఆ కాలపు ఒక చీర పేరు
[80] చంద్రగాని- ఆ కాలపు ఒక చీర పేరు
[81] జీబుచీర- ఆ కాలపు ఒక చీర పేరు, ఆడువారు కట్టుకొను కోక
[82] ఉదయరాగము- ఆ కాలపు ఒక పట్టు చీర పేరు, ఉదయరాగపట్టులు
[83] కప్రంపుపలుకులచీర- ఆ కాలపు ఒక చీర పేరు, కర్పూరపలుకుల చీర
[84] గందగావుల- ఆ కాలపు ఒక చీర పేరు, గధపుపొడి చీర
[85] సర్వతోభద్ర- ఆ కాలపు ఒక చీర పేరు, స్వస్తికగుర్తుల చీర
[86] మీనంచు- ఆ కాలపు ఒక చీర పేరు, చేపల బొమ్మలు అంచుగా కల చీర
[87] పొన్నాటంకములచీర- ఆ కాలపు ఒక చీర పేరు, బంగారు బిళ్ళల చీర
[88] రాజావర్తము- ఆ కాలపు ఒక చీర పేరు, రాజావర్తము అను రాతిపొళ్ళు పొదిగిన చీర

961

గుట్టు చక్రకోలాటమో యక్క
భోగిని! నీ గుట్టు పొగడ పువ్వంచు[89]
అంనకు యిలు పటావళి దాఁటెఁ
జెంలి నీరుపైచేసాఁచఁ దగవె?
సిమిడి చీర[90]స యెంత గలదు?
పొసఁగ జూడుము లక్కపొత్తు లబ్జాక్షి!
జిబిజి యా పచ్చడలపై[91] యేల?
పుష్పొళియ[92] తెమ్ము మలాదివదన!
సింహావలగ్న! వీక్షింతు నే వేడ్క
సింహావళం[93] బీవు చేపట్టి తేని
దుప్పటంబుల[94] మీఁదఁ దోయజనేత్రి!
యెవ్వియుం బలికి రావిచ్చలోఁ దెలియు
నితమలోన మెలఁగు నేర్పుఁబలుకు
లొరఁ గాంతలు వల్వ లొప్పారఁ దాల్చి

శ్రీ కృష్ణుని సతులు వివిధాభరణములు దాల్చుచు సరస ప్రసంగములు చేయుట

గువ! యిప్పుడు గిల్కుట్టెలుఁ[95] దొడుగ
మిగుల గర్వించె నేమిటికి నన్నడుగ
నొల్లనే వింత చెయ్వుల కాలి నులులు
ల్లవాధరికి నేర్పరచిరీ చెలులు
లినాక్షి! యీ కంకపు మొలనూలు[96]
కొలఁదియె పలుకంగ కోటికిఁ జాలు


[89] పొగడపువ్వంచు- ఆ కాలపు ఒక చీర పేరు
[90] పసిమిడిచీర- ఆ కాలపు ఒక చీర పేరు
[91] పచ్చగడలు- ఆ కాలపు ఒక చీర పేరు
[92] గజపుప్పొళియ- ఆ కాలపు ఒక చీర పేరు, నాగకేసరాల చీర
[93] సింహావళము- ఆ కాలపు ఒక చీర పేరు
[94] దుప్పట- వెలగల సన్నపాటి వెడల్పు వస్త్రము
[95] గిల్కుమట్టెలు- ఆభరణం, మహిళలు కాలికిధరించే నడుస్తుంటే ధ్వనించు మట్టెలు
[96] కంకణపుమొలనూలు- ఆభరణం, ముత్యాలు పగడాలు గుచ్చిన మొలత్రాడు

971

ఆంగికమైన కట్టాణి ముత్తియము[97]
ముంరపైఁ గదా ముగుద! నీ ప్రియము
బొంనేఁటికి బాహుపురులు[98] ధరించి
పంజేనేత్రి! చూట్టితి మించి
డుఁగనుఁ బట్టె నో కామినీ! కాంచి[99]
పుడుకదండలు[100] నీకుఁ బొడవులైతోఁచి
కొమ్మరో! యెఱుఁగుదో క్రొన్నెల వంక
మ్మలు[101] నా కియ్యల దాన వింక
కుచకోలాటమ్మల[102] చాయ
నియేల ముత్తేలమ్మలు[103] రోయ
ళాబ్జలోచన! దాని కుందనపు
విరెల[104] యొప్పు చూరదృష్టిఁ దనువు
జాక్షి! ముత్తేల రపణి[105] పూని
చఁగా నందఱం లికెదో కాని
లిగె నీ కింద్రాణి డియ[106] మిందఱముఁ
లెత్తి చూడంగఁ గవె చిత్తరము
రండుచూడుడు పద్మ వుల[107] విశాల
దంల నెంతలింలు సేసె బాల
లినీకు నింద్రనీముల యొడ్డాణ[108]
వడి కడువింతయ్యెనే జాణ!


[97] కట్ఠాణిముత్తియముముంగర- ఆభరణం, గుండ్రటి ముత్యపు ముక్కెర, ముక్కుపుడక
[98] బాహుపురులు- ఆభరణం, దండకడియం, కేయూరము, భుజకీర్తి
[99] కాంచి- ఆభరణము, స్త్రీల ఒంటిపేట మొలత్రాడు,
[100] పుడుకదండలు- ఆభరణం, (పుడుక, పుడక, సన్ననిపుల్ల)
[101] క్రొన్నెలవంకలు- ఆభరణము, కర్ణాభరణము
[102] కోలాటకమ్మలు- ఆభరణము- కర్ణాభరణ విశేషము
[103] ముత్తేలకమ్మలు- ఆభరణుం, ముత్తములు కూర్చిన కర్ణాభపణము
[104] బవిర- ఆభరణము, వర్తులాకారపు కర్ణాభరణము, వలయము.
[105] ముత్తేలసరపణి- ముత్యములు గుచ్చిన బంగారు గొలుసు,
[106] కడియము- మణికట్టపైకి ధరించు ఆభరణము, కటకము, వలయము
[107] పద్మరవి- పద్మరాగమణి
[108] ఇంద్రనీలములయొడ్డాణము- ఆభరణము, వడ్ఢాణ విశేషము

981

సందియొత్తులు[109] పూనఁనదు నీ కరయఁ
జంనగంధి! నీ నుగవ యెఱయ
మొసె సొన్నాటంకముల యొడిదార[110]
ముకుఁ గాఁద గదె యమ్ముద్దియం జీర
ల్లిపెండెము[111] వింతచాయలం గురియ
ల్లిరో! నీకింకఁ గునమ్మ మురియ
బాగుమీఱిన నాగబంధంపు[112] మొగపు
తీగెదానికిఁ గల్కఁ దీరదె యెగవు
కంణంబులు సూదెములతో[113] నంట
పంజానన! యొత్తు ప్రౌఢవన్నింట
లాక్షి! నీ గుండుదండల[114] మించు
రికింపఁగా మోదరముఁ జనింప
శ్రీమించియున్న గజ్జెలకాలినూలు[115]
నేమొల్ల మది వేఱ యింతుల చాలు
భాసురంబగు నాగడిగెలదండ[116]
యాలం జేరె నయ్యతివ నీ దండ
దురుతో నీలపు వికెలు నిలిపి
ముదిత! బాటించితి మొగమాటఁ దెలిపి
ఇందుబింబానన! యిట్టి నేవళము[117]
పొందుగాఁగలుగు పెంపులకుఁ దావళము[118]


[109] సందియొత్తులు- ఆభరణము, చనుగవను ఒత్తుకొను బాహుపురులు
[110] సొన్న- నాణెము విశేషము, టంకము- బిళ్ళ, ఒడిదారము- మొలనూలు
[111] జల్లిపెండెము- ఆభరణము, కాలిభూషణము, పట్టీ.
[112] నాగబంధము- ఆభరణము, వస్త్రవిశేషము
[113] కంకణము- గాజు, కడియము, సూదెగము- గాజులు
[114] గుండుదండలు- ఆభరణము, బంగారుగొలుసు విశేషము
[115] గజ్జెలకాలినూలు- ఆభరణము, కాలిగజ్జలు
[116] నాగపడిగెలదండ- ఆభరణము, స్త్రీల కంఠాభరణ విశేషము, తోకమట్టకింద నాగుపాము పడగ మాదిరి ఉండే సుడి/మెలిక
[117] నేవళము- ఆభరణము, మణులు గ్రుచ్చిన హారము
[118] తావళము- ఆభరణము, రుద్రాక్షలు మున్నగునవి గ్రుచ్చిన మాల

991

నిబాహుపురులకుం[119] నువైనఁ దగవె?
నుఁగొన్న గతి యెఱుంక యున్నఁ దగెవె?
మొక చన్నుల కేల ముత్తెపు సరులు[120]
లికివిగా నీకుఁ లిగె నీ మరులు
బుడిబుడి నా చామపువ్వులకడియ[121]
డిగిన మేలాయ నందుకుం జడియ
రూఢిగా నిడ మురుుల[122] మించునకు
నాఁడికఁ గలదె యిట్లమరించుటంకు
యిదెలెస్సయారె! నీకీపైడిబొట్టు[123]
లించితేని యక్కరొ! నీకు నొట్టు
యీకొప్పువల[124] నంబుజేక్షణ మిగుల
నీకొప్పుఁ బతిమాడ్కి నీయందుఁ దగుల
తొయ్యలి! సూర్యచంద్రులను[125] ధరించి
య్యనం దలయెత్తు చాలు మన్నించి
గున జీవితేశ్వరుఁ డిచ్చు కంట
రిపూని వినుతింపఁజాలె నీ దంట
వుళ సరములు[126] ముంగామరంబులును[127]
తీయఁగొని యాడఁజాలు నిచ్చలును
చెలువ! నీ కమరేని చివురుంగరములు[128]
యెమిఁ జేయఁగ నేర వింత తోరములు[129]


[119] బాహుపురులు- ఆభరణము, భుజకీర్తి, కేయూరము, దండకడియము
[120] ముత్తెపు- ముత్యాల, సరులు- ఆభరణము, దండలు, పేరు (నూట ఎనిమిది పేటల ముత్యాల పేరు హారము)
[121] చామపువ్వుల కడియము- ఆభరణము, కడియములలో విశేషము (చామ- స్త్రీ)
[122] మురుగులు- ఆభరణము, ముఱుగులు, పట్టెలుతీర కడ్డిగా కొట్టించి ముంజేత ధరించెడు స్వర్ణాభరణము; అల్లికవేసిన బంగారు కమ్మి
[123] పైడిబొటిటు- ఆభరణము, నుదుట ధరించు బంగారపు బొట్టు
[124] కొప్పువల- ఆభరణము
[125] సూర్యచంద్రులు- ఆభరణము, చంపలను ధరించు బంగారు శిరోభూషణములు
[126] కవుళసరములు- ఆభరణము, కంఠాభరణము, దండలకట్ట.
[127] ముంగామరములు- ఆభరణము, ముంజేత ధరించు ఆభరణము, కంకణము
[128] చివురుంరము- ఆభరణము, వ్రేలికి ధరించేడి భూషణము ఉంగరములందు విశేషము
[129] తోరము- ఆభరణము, ముంజేతికి కట్టుకొను దారములు