పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం - 5-601-700

601
నొర నేకాదశయోజనౌన్నత్య
వినుతమౌ నా పృథివీధరాగ్రమున
నుండిభూమికి దిగనుఱికి శ్రీనిధులు
దండిగా నేగి రిద్దఱును ద్వారకకు
భీషకుడు జరాసంధుండు నరులు
నిరందె యని యేగె సంతుష్టుఁడగుచు

రేవతుఁడు తన కుమార్తె రేవతిని బలరామునకిచ్చి వివాహము చేయగా, శ్రీ కృష్ణుఁడు భీష్మకుని కుమార్తె రుక్మిణిని రాక్షస విధిలో వివాహమాడుట

అంనానర్తేశుఁడై[97] రేవతుఁడు
సంతోషమునఁ దనూజాత రేవతిని
ధరునకు నిచ్చె నాకథ మున్నె
తెలిపితి నీకు ధాత్రీనాథచంద్ర!
గోవిందుఁడును భీష్మకుని బిడ్డ రుక్మి
ణీనజాక్షి నన్విత గుణోద్దామఁ
జెలఁగు రాక్షస విధిఁ జేపట్టె” ననుఁడు
నిఱేఁడు యోగీంద్రు నీక్షించి పొగడి
థఁ దెలుపవె” నుఁడు వైయాసి
చేకొనిఁ యిట్లని చెప్పంగఁ దొణఁగె

పరీక్షిత్తు కోరికపై శుక మహర్షి రుక్మిణీ కల్యాణ గాథను సవిస్తరముగా వర్ణించుట

వినుము విదర్భ భూవిభునకు భీష్మ
కుకాది రుక్మిగాఁ గొడుకు లేవురును
న్యరుక్మిణియునుం లిగిరా కన్య
న్యతద్రూపంబుఁగఁ బల్క దర


[97] ఆనర్తేశుడు- ఆనర్తదేశాధిపతి కకుద్మి ఇతనే రేవతుడు. ఈ రేవతుని కూతురు రేవతి. ద్వారక ఆనర్తదేశం ఉంది

611

పంజంబులఁ[98] గ్రిందుఱచు పాదములు
నంయుతేందుఁ[99] గాను నఖంబులును
చ్ఛపంబుల రోయఁలుగు మీఁగాళ్ళు
తుచ్ఛ కాహళములం[100]దొడరుఁ బిక్కలును
భంబులకు[101] నిందగావించు తొడలు
రు రథాంగము[102] పెంపుగిడించుఁ బిఱుఁదు
ర్తముల[103] లోఁతుసియించు నాభి
శైవాలలత[104] చాయచారు నూగారు
య లేనెలల[105] లేనిపించు నడుము
వి జక్కవల మెచ్చని యురోజములు
బిముల[106] వళుకులంబెట్టు బాహువులు
వెసఁ జిగుళ్ళ రసంబువిఱుచు హస్తములు
క్రము[107] కంఠము చెల్వుఁడచు కంఠంబు
మిలి బింబము[108] డంబుఁడకొత్తు మోవి
డఁగి యద్ధములతోఁ లహించు చెక్కు
లొడికమై[109] నువుఁబువ్వు నుదిరించు ముక్కు
మీలఁ[110] దగవులలరించు కన్ను
గును శ్రీకారంబునఁజాలు చెవులు
ళికుల[111] దుర్మదరములౌ కురులు
లుఁదోయముల[112] మించుహు విలాసములుఁ


[98] పంకజము- పద్మము
[99] అంక యుత ఇందుడు- మచ్చతో కూడిన చంద్రుడు
[100] కాహళము- తుత్తూరి / బాకా అను వాద్యము
[101] కరభము- ఏనుగు తొండం, చిటికిన వ్రేలి మొదలు నుండి మణికట్టువరకు గల అరచేతి వెలుపలి భాగము
[102] రథాంగము- చక్రము, మరుని రథచక్రంలా ఉన్న పిఱుదులు
[103] ఆవర్తము- సుడిగుండము
[104] శైవాల లత- నాచు తీగ, నూగారు- రోమరేఖ, బొడ్డుకన్నా పైనుండి రొమ్మువరకు సాగు రోమముల వరుస
[105] లేనెల- లేత చంద్రుడు పాడ్యమినాటి?
[106] బిసము- తామర తూడు
[107] క్రముకము- పోకచెట్టు, ఎఱ్ఱలొద్దుగ
[108] కమిలి- మిగలపండిన, బింబము- దొండపండు
[109] లొడికము- జానపొడుగు?
[110] మగమీల- పోతు చేప
[111] అళికుల- తుమ్మెదల గుంపు
[112] పలుదోయము- సముద్రము

621

లిగి రుక్మిణి ముజ్జముల భూషణము
చెలువంపుఁగని యనం జెలువారుచుండె

రుక్మిణీ శ్రీకృష్ణులు పరస్పర ప్రేమ భావనా బద్ధులగుట

రుక్మిణీ దేవి తిథులు వొగడ
శౌరిగుణంబులు సారె నాలించి
కు శ్రీకృష్ణుండె వుఁడని యుండె
ములో నిశ్చయ హితభావమున
రుక్మిణీదేవి నురాగ మహిమ
శౌరియు జేపట్టఁ ర్చించె నాత్మ
శిశుపాలునకుఁ దన్నుఁ జేర్చెదననుచు
శిశుబుద్ధిచే రుక్మి చింతించు నంత

రుక్మిణి రహస్య వర్తమానముఁ బంపగా శ్రీ కృష్ణుఁడు రథారూఢుఁడై వచ్చి రుక్మిణిని ద్వారకకుఁగొనిపోవుట

తెలిసి రుక్మిణి ధరిత్రీసురు నొకని
జాక్షునకు రహస్యంబుగా ననిపె
జాక్షుఁడును నగ్రన్ముండుఁ దెలుప
ఘు రథారూఢుఁడైవేడ్కఁ గదలి
రాత్రంబున నేతెంచె బెండ్లి
యాకాంక్షచేఁ గుండినాహ్వయ పురికి
శిశుపాలుండు నంత సాల్వాది
కుటిలాత్మకుల తోఁడఁగూడి యేతెంచె
హంబు శౌరికిఁ లుగునో యనుచు
లుఁడుఁ గూడఁగ వచ్చె లయుక్తుఁడగుచు


631

అంతిపురంబున రిగి విప్రుండు
నింయు రుక్మిణి కెఱిఁగించె నంత
అంబికావందనంబాచరించుటకు
నంబుజానన యొక్క రదంబు నెక్కి
ల్లులుం జెలులు బాంవులును భటులు
ల్లబిల్లిగ జంటలైవెంట నడవ
హువాద్యరవము లంరమున నిండ
నీయ సంభ్రమహిమచే నడచి
గౌరిఁబూజించి మంళ వస్తువిత్త
వాముల్ ముత్తైదులకు నొసంగి
రినాత్మఁ దలఁపుచు తిభీత యగుచు
ద మెక్కఁగఁ జూచునంతటిలోన
కంసారి యట సొచ్చి కౌఁగిట బొదివి
హంయానను తన రదంబు మీదఁ
బొందించి శంఖంబుపూరించి కదలె
నంమై నిజబలం ఱుముక కదల

సాల్వ, దంతవక్త్ర, విదూరథ, రుక్మి మొదలుగాఁగల యోధాగ్రేసరులు శ్రీకృష్ణుని వెంబడించి పరాభూతు లగుట

నిసాల్వ, దంతవక్త్ర,విదూరథాతి
పతు లోర్వంగఁజాలక[113] కవిసి
య దామోదర శార్ఙ్గ విముక్త
తేజముల నోర్వజాలక[114] చనిన


[113] ఓర్వంగజాలక- అసూయారోషములచే ఓర్వలేక
[114] ఓర్వజాలక- శౌరి శౌర్యము నడ్డుకొనలేక, ఈ రెండు శబ్దాల ప్రయోగం కవి రచనా శిల్పం వ్యక్తపరచెను

641

లేపమున[115] రుక్మి యావహంబునకుఁ
విసిన గెలిచి చక్రధరుండు వట్టి
తునుమంగఁ బూని యాతొయ్యలి సేయు
నునయంబున మాని స్తముల్ గట్టి
యు మొగంబునుం రవారి ధారఁ[116]
గొది సందులు వారఁ గొఱిగి పోవిడిచె
యీరీతిఁ దెచ్చి యాయింతిఁ గైకొనియె
శౌరిద్వారకలోన శాస్త్రమార్గమున

శివునిచే భస్మసాత్కృతుఁడైన మన్మథుఁడు ప్రద్యుమ్నుఁడను పేర రుక్మిణీ శ్రీ కృష్ణులకు జన్మించుట

అంనయ్యింతితో ఖిలోప భోగ
సంతుష్ట చిత్తుఁడై శౌరి చరింప
మునుశంకరుని చేత మునిఁగిన మరుఁడు
నియించెఁ దిరుగ నా లజాస్య యందు

మన్మథుని భార్యయైన రతి, ప్రద్యుమ్నుని పత్నియైన విచిత్రోదంతము

ద్యుతి యై యిట్లు సంజాతుఁడైన
ప్రద్యుమ్ను నొక్క శంరుఁడను నసుర
ధిలో వైచిన నొక్క మీనంబు
చెరక యుండంగఁ జివుకన మ్రింగె
దానినే జాలరుల్దగఁ బట్టితెచ్చి
కానుక యిచ్చిరా పటదక్షునకు
బాల[117] గొనిపోయి మ్మీనుఁ జించి
డుపులో నొక బాలుఁని వెఱగంది


[115] అవలేపము- గర్వము
[116] తరవారి- పట్టాకత్తి, దార- పదును, అంచు
[117] అడబాల- వంటమనిషి

651
చేరిశంబరునకుఁ జెప్పిన నతఁడు
భీరుఁడయ్యునుఁ గొంత ప్రియముగాఁ దలచి
మున్నుగా నారదముని నిదేశమున
న్నుగా వంటలని దాన ననుచు
తిఁ[118]గోరుకొని దీనతాగతి నున్న
తిచేతి కిప్పించె రాజసం బెసఁగ
తిదేవియును బాలు మణుఁగాఁదెలిసి
ప్రతిదినంబును నింపుపైకొనం బెనిచె
యంగనారత్న మారీతిఁ బెనిచి
ప్రాయంబు వాఁడైన ప్రద్యుమ్నుఁ జూచి
మోహంబు నెఱపి సంభోగ లీలలకు
నూహించుటయునుఁ బ్రద్యుమ్నుండు జడిసి
ల్లివి నీకిట్లు గవె” యటన్నఁ
ల్లవాధరి యప్డు ప్రాణేశుతోడ
నాదుండెఱిఁగించె నాకు మున్నీవు
మారుండ నేను నీమానిని రతిని
కృమతి రుక్మణీకృష్ణపుత్రుఁడవు
హితుఁడు గాఁడు విరోధి యీశంబరుండు”
నితెల్ప బ్రద్యుమ్నుఁ పుడ శంబరుని
నిగెల్చి రతిఁ గూడి యాద్వారవతికి


[118] తతి- అదను

661

నుదెంచి నారదసంయమి వలనఁ
వార లెఱుఁగుచుఁ ను గారవింప
వుండెసుఖంబున నుర్వీశచంద్ర!
రెంవ కృష్ణుఁడీ శ్రీమంతుఁడనగ

ప్రతిదినమున కెనిమిది బారువల బంగార మిచ్చు శ్యమంతక మణిని సత్రాజితుని తపస్సుకు మెచ్చి సూర్యుఁ డనుగ్రహించుట

బంగార మెనిమిది బారువుల్[1] గురిసి
మంళంబగుచు శ్యమంతకం బనఁగ
రత్న మొకటి భాస్కరుఁ డిచ్చెఁ దపము
నమేది[2] యొనర్చు త్రాజితునకు
మ్మణి నొక్క నాఁడిగెఁ గంసారి
మ్మెయి నీఁ జాలయ్యె నా లోభి


ని తమ్ముఁడు ప్రసేనాఖ్యుఁడా రీతి
తుల రత్నముఁ దన ఱుత[3] ధరించి
వి నొక్కెడ వేఁటలాడుచునుండఁ
డఁగొట్టె వడి నొక్క పంచాననంబు[4]
పంచాననముఁ ద్రుంచి ల్లూకభర్త
సంచిత గురుకీర్తి జాంబవంతుండు
గురుకాంతి యమ్మణిఁ గొనిపోయి తనదు
పుత్రి నాడించు స్తువు సేసె
అంనిచ్చటఁ దమ్ముఁ ణఁగి పోవుటయు
సంత దుఃఖియై త్రాజితుండు


[1] బారువ- ఇరవై మణుగులు, 8x20-160 వీసెలు, 1.65x160- 264 కిలోగ్రాములు
[2] చలనమేది- నిశ్చలంగా
[3] అఱుత- మెడ
[4] పంచాననంబు- సింహము

671

నుజుని మణికినై రియ యణంచె
నుకొను నవ్వార్త రి యొయ్య వినుచు

శ్రీ కృష్ణుఁడు తన కేర్పడిన నీలాపనిందను బాపికొనుటకు బయలుదేరి జాంబవంతునితో పోరాడి మణితో జాంబవతీమణితో తిరిగి వచ్చుట

పౌరులుఁ గొలువంగ లయుతుండగుచు
భో[5] నవ్వనంబున కేగి యచట
సింనిర్దళితుం బ్రసేనునిం గాంచి
సింహంబు జాడనె చెచ్చెర నరిగి
గ్రక్కున సింహ మొక్కయెలుంగు[6] చేత
క్కుటఁగాంచి తన్మార్గంబు వట్టి
ని,జాడ చొచ్చిన శైలగహ్వరము
నుచరావలి రాకుని నిల్పి చొచ్చి
జాంవన్నందనయ్యాంతికంబు
నంబుజనాభుండు[7] డయాడఁ జూచి
డిమొఱలిడ జాంబవంతుఁ డేతెంచి
యక బాహు యుద్ధమునకుం గదిసె
యిరువురు నిరువదియెనిమిది నాళ్ళు
రుషతం జేసిరి బాహు యుద్ధంబు
మున్నె పదియు రెంహముల దనకఁ
టుకన[8] వచ్చు మావుఁ డిదె యనుచు
రి ప్రతీక్షించి వాకిట నున్న
నులు వేసట నొంది నిరి ద్వారకకు
అంనా ఋక్షేశుఁ[9] డాత్మ సత్వంబు
గొంయత్తఱిఁ దఱఁగుట, నాత్మలోన


[5] భోరన- శీఘ్రమే
[6] ఎలుగు- భల్లూకము, ఎలుగుబంటి
[7] అంబుజనాభుడు- శ్రీకృష్ణుడు
[8] తటుకన- చటుక్కున, తప్పక
[9] ఋక్షేశుడు- భల్లూకేశ్వరుడు, జాంబవంతుడు

681

ని మర్త్యతనున్న[10] రిఁగాఁ దలంచి
నుతియించి యతని మనోరథం బడిగి
జలోచన జాంబతి నాఁగఁ గల్గు
పుత్రితో శ్యమంకము నొసంగి
ణుల బూజించిన మాధవుండలరి
ప్రతుఁడై నతనికి రభక్తి యొసఁగి
జాంబవతిఁ గూడి యాగుహ వెడలి
రాజితంబైన యాత్నంబుఁ గొనుచు
పురి కేతెంచి న్మణి యొసఁగె
నులెల్ల చూడంగ త్రాజితునకు

శ్యమంతకమణిని సాధించి తెచ్చి యిచ్చిన శ్రీ కృష్ణునికి సత్రాజితుఁడు సత్యభామనిచ్చి తన తప్పును దిద్దుకొనుట

త్రాజితుండునుంజాల లజ్జించి
పాత్రతం దన తప్పువాపు కోగోరి
ప్పుడ తన బిడ్డగు సత్యభామ
ప్పుణ్యమణియును రికి నర్పించె
రియును వరియించె నాసత్యభామ
విరివి వైభవముల వేదోక్తసరణి
ణియొల్లఁ డయ్యె మామాయని, సుగుణ
ణులు మెచ్చఁగ మామకే యిచ్చె మరల

శతధ్వనుఁడు సత్రాజితుని చంపి శ్యమంతకమణిని గ్రహించి, దానిని యక్రూరునకిచ్చి, తానడవుల కేగుట

ణిశ! యట్టి సత్రాజితుం జంపి
రియించె శతధన్వుఁడాశ్యమంతకము


[10] మర్త్యతనున్న- మానవుడిగా ఉన్నటువంటి, హరి- విష్ణువు

691

అంలోననె యుల్కి యాశతధన్వుఁ
డంతికంబున నున్న క్రూరుఁబిలిచి

మణి కొఱకు మామ చంపబడుట, తిరిగి తనపై యపవాదుకు దారితీయునని తలఁచి శ్రీ కృష్ణుఁడు శతధ్వనుని చంపి, యక్రూరుని వద్ద గల మణిని గ్రహించి యథార్థ విషయమును యాదవుల కెఱింగించుట

మ్మణి యిచ్చి తాటవికిం జనిన
గ్రమ్మనం దోడనె మలాక్షుఁ డరిగి
వానివధించి యారరత్న మచటఁ
గాక యక్రూరుడ నుంటఁ దెలిసి
తాచ్చి యాశ్యమంకముఁ దెప్పించి
యావిధం బెఱిఁగించె దువులకెల్ల

శుకుఁడు శ్యమంతకోపాఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పుట

యుపాఖ్యానంబునింపున వినినఁ
బాయుదుష్కీర్తి పాములు, మేలొదవు

శ్రీకృష్ణుఁడు కాళింది, మిత్రవిందాది కన్యలనుఁ బెండ్లాడుట

ఱియును భానుకుమారిఁ గాళింది
మెయు మేనర్కంబుమిత్ర విందాఖ్య
వొగిసప్తవృషజయం[11]బుంకువ గాఁగ
ణిత శ్రీమతిగు నాగ్నజితిని
శ్రుకీర్తికి ననుంగుసుతయగు భద్ర
తులిత లక్షణగు మద్రకన్య
రిణయంబయ్యె సంభావిత శాస్త్ర
ణిచే వరుస నాశౌరి చిత్రముగ

సత్యభామ సహితుఁడై వచ్చి శ్రీకృష్ణుఁడు నరకాసురుని సంహరించుట

ల శస్త్రాస్త్రనలాంబు సమీర
రుచిర దుర్గములును రూపైన యట్టి

[11] సప్తవృషజయం- ఏడు వృషభాలను జయించుట, ఉంకువ- కన్యాశుల్కము