పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం - 5-501-600

501
చట ధ్వనులు హెచ్చఁగ బిడికిళ్ళు
టియించి నొప్పించి గాతయైఁ గలసి
వొత్తుచు నొత్తుచు నొక్క యుమ్మడినె
త్తియంగములచే నంగంబు లూఁది
చిమ్ముచు నిలుకడల్చెదరించి సారె
హుమ్ముహుమ్మునుచు మహోగ్రతల్ బలియఁ
రుషతం బరిరంభపాతనాక్రమణ
రిపీడనాటోపభంజనా కృష్టి
చానోన్నయన సంస్థాపన గ్రహణ
కీనాదులఁ జాలఁ గినుకమై నెఱపి
పెనఁగి రన్యోన్యంబు పెంపులుఁ గాంచి
నులెల్లఁ జుట్టును సారెకుం బొగడ

శ్రీకృష్ణుఁడు చాణూరుని సంహరించుట

అంతఁజాణూరుండు ట పట్టు సడలి
యెంయు వడి మీదికెగసె రోషమున
రిపేరురము ముష్టితుల నొందించె
రియు నా మల్లుని వలీల నొడిసి
టుశక్తి బాహువుల్పట్టి కుదించి
టుకున బిరబిరం ఱచుగాఁ ద్రిప్పి
నంబు నందె నిర్గత జీవుఁ జేసి
తిపైఁ బడవైచె ను లహో యనఁగ

బలరాముఁడు ముష్టికు నంత మొందించుట

511

సి ముష్టికుఁడు నెక్కటొఁ[60] గొంత పెనఁగి
ముష్టి ఘాత విభ్రాంతుఁడై వ్రాలె
ఱియు రాముఁడు కూటు[61] డియించె, శౌరి
గుఱిగాగ చలదోసకులఁ గీటణంచె
దిగని తలకొక నక జెట్లెల్ల[62]
వద పడి పాఱి రందఱు నవ్వ

కోపించిన కంసుఁడు యదువీరులను సంహరింపుడని సైన్యమున కాజ్ఞాపించుట

కంసుండు నింతయుఁగాంచి రోషించి
హింసించి యీడువుఁడీపిన్న వాండ్ల
ఱుకుండు వసుదేవనందులఁ బట్టి
నుఱుమాడుఁడుగ్రసేనుని యదువరుల”

శ్రీకృష్ణుఁడు కంసుని యాతని తమ్ములైన కంకాదులను సంహరించుట

నిపల్కుటయు శౌరి యాలించి యతని
తరంబగు మంచము మీది కెగసి
రుడండు ఫణి వోలె తఁ జీవుఁజేసి
మీదఁ బడ నీడ్చెఁ త్క్షణంబునన
మయంబున క్కంసు తమ్ము
లాసుర మతులు కంకాదులుఁ గూడి
నిసేయ వచ్చిన రి యొక్క పరిఘ
మువారి నణఁచెఁ బ్రమోదంబు తోడ
దివిదుందుభులు మ్రోసె దివిజులు నొగడి
నిపై దివిజ పుష్పాసార మలరె

[60] ఎక్కటి- మల్లయుద్దము
[61] కూటు- గుంపు మల్లులకూటు
[62] జెట్టి- మల్లయోధుడు

తాతకు తల్లి దండ్రులకు బంధ విముక్తిని గల్గించి తాతయైన యుగ్రసేనుని పట్టాభిషిక్తునిఁ జేయుట

521

ల్లన కంసు భార్యల నూరడించి
ల్లిదండ్రులకు బంవిముక్తిఁ జేసి
వాలు తము గారమున ముద్దాడ
వారితోఁ దగునట్టి వాక్యంబులాడి
రులు మెచ్చం గడునాథుగా, నీతి
రునుగ్రసేనునిం ట్టంబుఁ గట్టి
వదపడువారలైడాఁగియున్న
దువృష్ణి ముఖ్యుల పుడ రావించి
నంవ్రజమున కానందంబు తోడ
నందుని సబహుమానంబుగా ననిపి

శ్రీ కృష్ణుఁడు గురువు సాందీపని యొద్ద విద్యాభ్యాసము చేయుట

ణాగతానీకసంరక్షకుండు
గురుకీర్తి యగునట్టి గోవిందుఁ డంత
లితోపనయన సంస్కారుఁడై కీర్తి
తికితుండైన సాందీపని యొద్ద
ల విద్యలుఁ జతుష్షష్టి దినములఁ
బ్రటంబుగాఁ దానులుఁడును నేర్చె
యంకుం జేరినయాగురుపుత్రు
నంకు వలన శౌర్యంబునం దెచ్చి
గురుదక్షిణన నొనంగూర్చి యవంతి
పురినుండి మధురకుభోరన వచ్చె

తన కుమార్తెలకు జరిగిన ఘోర పరాభవమునకుఁ గినిసి మగధ దేశాధీశుఁడు జరాసంధుఁడు మధురపై దండెత్తుట

531

స్తియుం బ్రాప్తియు ను కంసు భార్య
న్త జీవితనాథ గుట శోకమున
మ తండ్రి యగు మాగక్షోణిపతికిఁ
మ పరాభవము నంయునుఁ దెల్పుటయు
నాజరాసంధుండు తి కుపితాత్ముఁ
డైజయకాంక్షచే రదంబు నెక్కి
క్షంబు[63] లగుచు నిర్వదియమూడైన
క్షౌహిణులు[64] తన్ను నాసక్తిఁ గొలువ
యేతెంచి రాజసం బెసగంగ మధుర
నాతంకకారియై యావరించుటయు[65]
యీదుర్మదాంధుని నిపుడ త్రుంచుటయు
చెయ్దిగా[66] దీసారి వెడలిన నితఁడు
ఱియుఁ గొందరఁ గూడి సల కేతెంచుఁ
ఱి యగు నట్లైన ర భారముడుప

మేఘమండలము నుండి రెండు దివ్యరథములు బలరామ కృష్ణుల నెదుట వచ్చి నిల్చుట

నితలపోయు కంసారి యగ్రమున
మార్గమున[67] నుండి నతర ద్యుతులఁ
బ్ర[68] సన్నాహ విభ్రాజితంబైన
యుగళం బుదారంబుగా నిలిచె
అందొక్క రథము తాలాంకున[69] కొసఁగి
దండి[70] నొక్క రథంబు తానెక్కి


[63] పక్షములు- బలములు సేనా విభాగములు
[64] అకౌహిణి- సేనావిశేషము, 21,870 రథములు, అదే సంఖ్యగల ఏనుగులు, 6560 గుఱ్ఱములు, 109350 కాల్బలము గలది. ఇటువంటివి 23 అక్షౌహిణులు. జర
[65] ఆవరించుట- ముట్టడించుట
[66] చెయ్ది- చేయదగినది
[67] ఘనమార్గము- గగనము
[68] ప్రథనము- యుద్దము
[69] తాలాంకుడు- బలరాముడు
[70] దందడి- తరచుగా దొమ్మిగా

541
వెలి జరాసంధ వీరసైన్యములఁ
దొడిఁబడం గడముట్టఁ ద్రుంచె బెంపలర

పదియేడు మారులు శ్రీ కృష్ణున కోడిపోయిన జరాసంధునికి నారదుఁడొక మహోపాయము చెప్పుట

లుఁడు జరాసంధు వరంబులోన[71]
వెయంగఁ బట్టిన విడిపించె మరల
డుఁడగు నా జరాసంధుండు నాత్మఁ
డుసిగ్గు పడి యేఁగి క్రౌర్యంబు తోడ
ఱియు నంతేసి సగ్ర సైన్యంబు
ఱుముక కొలువంగ రుదెంచి తాఁకి
దియేడు మారు లిప్పగిదినే నొచ్చి
యెదురు నిల్వఁగ లేక యేగె దుర్బలత
యివొంద మాగధోర్వీశుండు మఱియు
రుదేర నుద్యుక్తుఁగు నంతలోన
నాదముని బోధనంబును జేసి
జుం[72] డగు కాలవనుండు గినిసి

సముద్ర మధ్యములో శ్రీకృష్ణుఁడు ద్వారకాపురీ నిర్మాణము చేయుట

న త్రికోటి సహాయత వచ్చి
ణుఁడై మధురాపురంబుపై విడియ
వీనితో నని సేయువెడలిన యిపుడె
తానేగుదెంచు నాల జరాసుతుఁడు
రీతి జనుదెంచి యామహావీరుఁ
డూక చననేరఁ డుద్ధతుండగుట
దువుల నెత్తుక రుగు నొండేని ,
దిలుఁడై పురి చొరఁబాఱు నొండేని


[71] బవరము- యుద్ధము
[72] ఆరజుడు- రజోగుణం అధికంగా కలవాకు

551
కావున మర్త్యదుర్గమమగు నొక్క
కైశం బైన దుర్గముఁ గల్గ వలయు
నిద్వారకాపురి బ్ధి మధ్యమునఁ
నఁబడ నిర్మించె రుడధ్వజుండు[73]

ద్వారకాపురీ సౌందర్య వర్ణనము

వార్ధిలో నుండి హిరాజకన్య
లావీటి వరణ[74] శృంగాగ్రంబు[75] లెక్కి
నెయ్యంపు మాటలు నెఱపం బగళ్ళ
య్యెతేలి మహోరగావలి చూచి
చుట్టునుం గోటపైఁజూడ నా నగరి
ట్టాలకంబుల[76] నవరతంబు
మందార మంజరీ కరంద పూర
సందోహముల దొనల్ చాల నొప్పారు
ప్పురి టెక్కెంబు లంబర తటిని
ప్పులం దడిసి యొయ్యన గాలిఁ దూలి
రారు వైజయంములోని సతుల
కొరించు నెపుడు శైత్యోపచారముల
తు లే కప్పురి సౌధంబు లెక్కి
యువిదలు శృంగారమొనరించుకొనఁగ
గుఁగాదనుచుఁ గూర్చియుందురా వేల్పు
చిగురుబోణులు చేరి చెలుల చందమునఁ


[73] గరుడధ్వజుడు- కృష్ణుడు
[74] వరణ- కోటప్రహారీగోడ
[75] శృంగాగ్రము- బురుజుపైకి
[76] అట్టాలకము- నగరిలోని ఎత్తైన భవనాలు

561
బొలుపారు దిక్పాలపుర చతుష్టయముఁ[77]
దెలిసి నవ్వుటకునై తెఱవఁగా బడిన
నంబులోయన వాకిళ్ళు నాల్గు
దిలంబులై యెన్నఁడు నప్పురమున
రత్న కాంచనవ్యంబు గాను
నంబు వరలెడు న్నిదంబునకు[78]
నీయ గృహ చంద్రకాంత నిష్యంద
ధిక కుల్యా ప్రసారముల్[79] పెనుప
పెరిగి మిన్నంటి శోభిల్లుచునుండుఁ
రిసరోద్యానముల్ ప్రబలి యవ్వీట
నవరత్న భాతులు పూర్వంబు
టితంబులగు వర్ణణములం గప్ప
కుముద హల్లక పద్మ కోకనదాది[80]
ల భేదము దృష్టిఁగానంగ లేక
ప్పురి సరసుల ళి తతుల్ తేనెఁ
ప్పక యాని భేదంబు నెఱుంగు
లోబాంధవ శుభాలోకంబుఁగలుగ
సైకంబుగాఁ[81] గల్గి రసియుం బోలె
మెసి రత్నాకరమేఖల[82] యగుచు
మెవణి[83] గల యట్టి మెలఁతుక వోలె


[77] దిక్పాలపుర చతుష్టయము - 1. తూర్పు ఇంద్రుడు అమరావతీ పట్టణము, 2. పడమర వరుణుడు శ్రద్ధావతీ పట్టణము, 3. ఉత్తరము కుబేరుడు అలకా పట్టణము, 4. దక్షిణము యముడు సంయమనీపురము
[78] పన్నిదము- పన్నుగడ, రచన
[79] కుల్యా- కాలువలు, ప్రసారాము- సమూహము విస్తారము
[80] కుముదము- ఎఱ్ఱతామర, హుల్లకము- చెంగలువ, పద్మము- తామర, కోకనదము- చెంగలువ, (వ్యు. చక్రవాకము దీని యందు అవ్యక్తముగా కూయును)
[81] సైకము- సూక్ష్మత్వము
[82] రత్నాకరమేఖల- సముద్రానికి మొలనూలు / చెలియలికట్ట
[83] మెఱవణి- ఊరేగింపు.

571
వివిధ మనోహరవీధీ విశేష
విలాసయై నాట్యద్విద్య[84] వోలె
హస్తి నఖ నవాం ద్వార యగుచు
వరతస్థాయి రిదరి[85] వోలె
భోగి వాసతార్ణనీయతల
సిరిమించి బలిసద్మసీమయ[86] పోలె
సునో వితాన విస్ఫూర్తి యెల్లపుడుఁ
దెలక యమరావతీపురి[87] వోలె
తి నుజ్జ్వల పుణ్యన సమాకీర్ణ
గుచుఁ బెంపొందిన లకయ[88] పోలె
స్మణ మాత్రంబున నపాపహరణ
శక్తిఁ గలిగి గంగానది[89] వోలె
మిత లక్ష్మీ విహారాలయం బగుచు
ధిక విష్ణువక్షస్స్థలి[90] వోలె
వాసికెక్కు ననంతరవిహారముల
భాసిల్లి వైకుంఠదవియ[91] పోలె

తననే నమ్ముకొన్న మధురానగర ప్రజలను శ్రీకృష్ణుఁడు యోగబలముతో ఒక్క రాత్రిలో ద్వారకాపురి చేర్చుట

ధికంబుగా నొప్పు ద్ద్వారవతికి[92]
ధువైరి యప్పుడు ధురలోఁ గలుగు
ప్రల నందఱ యోగలమున రాత్రి
గుగుజల్ గానీక కొనిపోయె వేగ


[84][84] నాట్ససద్విద్య- భరత నాట్య శాస్త్రముదశరూపకములలో వీధి యొకటి.
[85] హరిదరి- సింహంగుహ
[86] బలిసద్మము- రసాతలము
[87] అమరావతి- ఇంద్రుని పట్టణము
[88] అలక- అలకాపురి, కుబేరుని పట్టణము
[89] గంగానది- దేవలోకమున విష్ణు పాదోద్భవమై శివుని శిరస్సు చేరి భూమి కవతరించి సముద్రముఖమున పాతాళము స్పృశించునది
[90] విష్ణువక్షస్థలి- అనపాయని యైన లక్ష్మీదేవి నివాసము
[91] వైకుంఠపదవి- బ్రహ్మానంద రూపమైన మోక్షపదివి
[92] ద్వారకానగరము

581

యీరీతిఁ దన వారి నెల్లనుఁ గరుణ
ద్వావలీపురిం[93] గనిల్పి శౌరి
ధురకు మఱునాఁడు ఱలి యేతెంచి
ధురలో నుండె నిర్మలవేషుఁ డగుచు

శ్రీకృష్ణుని పట్టబోయిన కాలయవనుని ముచుకుందుఁడను మాంధాతృసుతుఁడు భస్మీపటల మొనర్చుట

వెలిన విషమ దుర్విషయ రోషాగ్ని[94]
రెడు నక్కాలవనుండు సూచి
నాదోదిత లక్షణంబుల కలిమి
శౌరిఁగాఁ దెలిసి మచ్చర మేద నితని
నిట్టెపట్టెద నని యెదురుగా నడవ
ట్టిరీతికి భీతుఁగు లీల శౌరి
రునెత్తుటయుఁ దోనె రువెత్తెవైరి
రియొక్క గుహ సొర తఁడుఁ దోఁజొచ్చె
ప్రచురుండు మాంధాతృపార్థివ సుతుఁడు
ముచుకుందుఁడను మహాత్ముఁడు మున్నుఁ గడిమి
ర నాథునకుఁ దోడైదైత్యవరుల
యించి వెలసె, యచ్చట నిద్ర నొంది
యున్నవాఁ డమ్మహాయోగీంద్రచంద్రు
న్నీచుఁడగు కాలవనుండు గాంచి
నునిట తోతెంచి టనతో నిట్లు
నుమూసితే” యని దిరి తన్నుటయు


[93] ద్వారావలీ- ద్వారక
[94] విషమ దుర్విషయ రోషాగ్ని- రోషాగ్నిసమము కానిది విషమము. విషయములనగా యింద్రియములు అరిషడ్వర్గములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు ఇందులో రెండవదైన రోష మనెడి అగ్నిరోషాగ్ని. ష కార పునరావృత్తిచే అక్షర రమ్యత.

591

తఁడుఁ గన్నులు విచ్చె త్తురుష్కాధి
తియును నీఱయిడియె నగ్రమున[95]

స్తోత్ర నమస్కారములు చేసిన ముచికుందునకు శ్రీకృష్ణుఁడు మోక్ష మనుగ్రహించుట

ముచుకుందుఁడునుఁ బార్శ్వమున నున్న కృష్ణు
నుచితంబుగాఁ దన యునికెల్లఁ దెలిపి
యీవెవ్వ రనుటయు నెఱిగించి, యతఁడు
గావించు నతి, నుతుల్ గైకొని శౌరి
త్మపదం బిత్తు ని పల్కి వెడలి
యాత్మీయ బలముతో ప్పుడ కలసి

జరాసంధుఁడు రెండవసారి శ్రీకృష్ణునిపై దండెత్తి పరాభూతుఁడై మరలిపోవుట

నుల ఖండించి వనధనంబు
రించుకొనిపోవు[96] మయంబు నందు
ప్రక్షోభ మలర నిర్వదియుమూడైన
క్షౌహిణులఁ గూడి యాజరాసుతుఁడు
తెరువున దాఁక భీతిల్లిన పగిది
సుథులు రామకృష్ణులు పలాయనము
నందిప్రవర్షణంన నొక్క యద్రి
యందెక్కి డాఁగిన ట జరాసుతుఁడు
అందాక జాడ చయ్యనఁ దెచ్చి యందు
క్రందైన వానచేఁ గానంగ లేక
మునం దిరిగిరా దారువుల్ పేర్చి
ళత ననలంబు గిలించు నంత


[95] అగ్రమున- ఎట్టెదుట, కాలయవనుఁడన్న పేరు విచిత్రముగా నున్నది. పాణిని కాలము (క్రీ.పూ. 2వ శతాబ్దిః నాటికే ‘యవన’ శబ్దము గ్రీకులకు పర్యాయపదమైనట్లు ‘యవనాల్లి స్యామ్’ ‘యవనుల లిపి’ అనే సూత్రము వలన తెలుస్తోంది. భరతుని నాట్య శాస్త్రము (క్రీ.పూ. 3వ శతాబ్ది) లోని ‘యవనికా’ శబ్దము (జననికా) యవనుల నుండి ఎరవు తెచ్చుకొన్న పదమని చెబుతారు. మఱి, ‘తురుష్కాధిపతి’ అను మాట వలన ఇతడు అరబ్బు దేశమునకు చెందిన మహమ్మదీయుడా? అను సందేహము కల్గుచున్నది. ఏదిఏమైనప్పటికీ మహాభాగవత కథ క్రీస్తుపూర్వము 3వ శతాబ్దిలో జరిగినది. ఇది చర్చంచనీయము (సౌజన్యము- డా. బూదూరు కుసుమాంబ)
[96] గమనిక:- శ్రీ కృష్ణుఁడు యవనులైన గ్రీకుల సేనలను సంహరించి, వారి ధనాన్ని దోచుకున్నట్లుగా భాగవత పురాణము చెబుతున్నది.