పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగం-5-1101-1200

1101

రుణయై నతని యా[149] నున్న నృపుల
నిరువది వేవుర నెనమ నూర్గురను[150]
విడిపించి వారల వినుతు లాలించి
ముడి కవ్వడుల్వరుసతో[151] గదిసి
నుభజియింప నింద్రప్రస్థ పురికిఁ
నియె; ధర్మజుఁడును సంతసంబంది

ధర్మజ రాజసూయ ధ్వరమునందగ్రపూజ నందిన శ్రీకృష్ణుని నిందించి, శిశుపాలుడాతని సుదర్శన చక్రముచే ఖండిత శిరస్కుఁడగుట

రాసూయ మహాధ్వరంబొనరించె
రాజులు మునులు వాక పనుల్సేయ
రాజ సూయంబు నందగ్రపూజ
వారిజాక్షున కిచ్చె రమతుల్ మెచ్చ
దిచూచి శిశుపాలుఁ పు డోర్వ లేక
పడి యా శౌరి లుమారుఁ దెగఁడె
చ్చక్రియును నిశితాంత చక్రమునఁ
జెచ్చెఱ ఖండించె శిశుపాలు శిరము
శిశుపాలు తేజంబు శ్రీకృష్ణుఁ జేరెఁ
బ్రమ చిత్తులకునుఁ రితాప మొదవ
తీపతుల మునీశ్వరుల బంధువులఁ
గుపూజ లర్పించి ర్మజుం డనిపె

తన మిత్రుఁడైన శిశుపాలుని మరణముచే శ్రీకృష్ణునిపై పగ బూనిన సాల్వుని వృత్తాంతమును శుక మహర్షి పరీక్షితునకు దెల్పుట

లీల శ్రీకృష్ణుఁ టిచ్చోట నుండు
నాలోన ద్వారకకాసాల్వుఁ డరిగె


[149] ఆకలు- బంధనములు
[150] నిరువది వేవుర నెనమ నూర్గురు- మంది
[151] వడముడి- భీముడు, కవ్వడి- అర్జునుడు

1111

నుఁడైన యా సాల్వు థ యెల్ల నీకు
వినుపింతుఁ జక్కఁగా వినుము ధాత్రీశ!
వైర్భిఁ[152] గృష్ణుండు డిఁ దెచ్చు వేళ
చేదీశుఁ[153] గూర్చి వచ్చిన సాల్వ నృపుఁడు
దువీరవరుల కావమున నోడి
వద నొంది పలాయితుం డగుచు
నకృష్ణయు నయావయుఁగా నిపుడ
రఁగింతుఁ జాడుఁ డీపార్థివులార!”
నిప్రతిజ్ఞ యొనర్చి రుఁ దపోమార్గ
ముమెచ్చఁ జేసి ప్రమోదంబు తోడ

తపస్సుచే శివుని మెప్పించిన సాల్వుఁడు కామగమనము గల అయోమయమైన సౌభమను విమానమును పొందుట

తలం పెఱిఁగింపఁ డయక కరుణ
లాక్షుఁడును మయుంను వాని చేత
కాగంబును దృఢాంము నయోమయము
నైమించు నొక సౌభను విమానంబు
నుజోరగాసురారులకు నైన
నిశంబుఁ గడు నభేద్యముగఁ జేయించి
సాల్వ భూపతి సమాన దర్ప
భాసురాత్మకునకు క్తియై నొసఁగె

శ్రీ కృష్ణుఁడు ద్వారకలో లేని సమయములో సాల్వుఁడు శివదత్తమైన సౌభంబులో నుండి ద్వారకానగర శోభను నాశనము చేయుట

నంతఁదాదృశ విమానారూఢుఁ డగుచు
సంతోష కలితుఁడై సాల్వ భూపతియు


[152] వైదర్భి- రుక్మిణీదేవి
[153] చైదీశుడు- శిశుపాలుడు

1121

మొప్ప నా ద్వారకాపురంబునకు
రుదెంచి శ్రీ కృష్ణుఁ పు డందు లేమి
మేది[154] యా తేరు లిమిఁ దాకించి
మున నట్టిళ్ళ మ్యత చెఱిచి
కోకొమ్మలు వ్రాల్చి గోపురావళుల
వాటంబుల గలంచి నములు విఱిచి
మేలుప్పరిగెలు మెఱయుచు నుండు
జాలు దఱగించి సంరంభ మెసఁగ
శింనీ నాదముల్సింహనాదములు
నంక రోదసి యందు క్రిక్కిరియ
ప్పురిపై భీషణాశుగ వృష్టి
కుప్పఁదెప్పలు గాఁగ గురియించెఁ గడిమి
లుమారు మఱియు సౌభంబుననుండి
శిలు వృక్షంబులుఁ జెదరక కురిసె
ర్కరా పవనంబు సారెకు విసరె
ర్కశంబై ద్వారకాపురి మీద
వియ కాలాభీల విభ్రమం బిటుల
లిమియై సాల్వ భూపాలుండు చూప

శ్రీకృష్ణుని కుమారుఁడు ప్రద్యుమ్నుడు ప్రజల సంతాపమును పోగొట్టుటకై యాదవ వీరులతో కలిసి సాల్వునితో యుద్ధము సేయుట

నంయుఁ బ్రద్యుమ్నుఁ డారసి జనుల
సంతాప ముడుప నుత్సాహంబు పూని


[154] భయము ఏది- భయము విడిచి

1131

చారుదేష్ణుండునుసాత్యకి సాంబ
వీరులుఁ దగ భానువిందు లక్రూర
హార్దిక్య శుక సారణాదులు వైరి
ర్దనుల్ తనుఁగూడి హిమతో నడవ
దారుక తనయ సూతంబైన రథము
నారోహణము సేసి తులంబులైన
చ కార్ముక దండ కాండముల్ పూని
వితేజ మలర భోనఁ బురి వెడలి
లితాంగ భీమతాక్షిత గతులఁ
జెరేఁగు సాల్వునిసేనలుం దాఁకి
ని సేనాపతియైన ద్యుమంతు
విత సాయక పంచవింశతిఁ బొదివె
క పుంఖోజ్జ్వలకాండ శతంబుఁ
జొనిపె సాల్వుని మేనఁజోద్యంబుఁగాఁగ
దియేసి బాణముల్ప్రౌఢి నంటించెఁ
దిసి యూధపుల యంగంబుల యందు
కరి గజ తురంగంబుల నెల్ల
ఱుముక మూడేసిమ్ముల నేసె
వొక్కొక్క కరమున నొక్క యుఁమ్మడినె
యుక్కర సకల సైన్యులఁ బ్రహరించె

1141

క్కక యయ్యద్భుతంబు వీక్షించి
యొక్కట వినుతించి రుభయ సైనికులు
అంవిమానస్థుఁగు సాల్వ నృపతి
యంతంతఁ బొడ చూపు వనిపై నిలిచి
దిమున కెగసె వర్తించుఁ జిత్రముగఁ
విలి పయోధరాంరములఁ గలయ
యెదిరించిఁ బ్రద్యుమ్ను నెక్కటి నంత
వంతుఁడైన ద్యుమంతుండు మెఱసె
దుటునఁ గొంత యావ మొనరించి
నక్కుమారు వక్షము వడిమోది
మోదిన నమ్మహాత్ముఁడు దనమేన
నూదిన మూర్ఛచే నొఱగుచు నుండఁ
పోసి యారణస్థలమున నుండి
తొలఁగంగఁదోలె సూతుఁడు రథం బపుడ
అంతఁబ్రద్యుమ్నుండు ల్లన తెలిసి
యంతికంబున నున్నయాసుతుఁ జూచి
బాక! సమర భూభాగంబు విడిచి
యేనా యరదంబు నిట తెచ్చి తిటుల
దుకులీనులకు నావమున నుండి
లి పోవుట రీతిగాదెట్టి యెడల

1151

యీతెఱంగున జారియేఁగిన వాఁడ
మాతండ్రి మొగమెట్టి తమునఁ జూతు
డినా ద్యుమంతుండు రలు నచ్చటికె
పుము నా తేరు గాంభీర్య మలర
నుటయు సూతుండు లరి యౌగాక
నిద్యుమంతునిఁ జేర రదంబుఁ దోలె
రుక్మిణీ సుతుఁ డంతద్యుమంతు
నారూఢి నెనిమిది మ్ముల నొంచె
వ్వుచు రయమున నాల్గు బాణముల
వ్వైరి హయముల తి నొందఁజేసె
వొక్కింతఁ దడవులో నొక్క యమ్ముననె
క్కజంబుగఁ ద్రుంచె వ్వీరు సూతు
నొక్కొక్క యమ్మున నరుదని పొగడఁ
క్కక ద్రుంచె కోదండకేతువుల
ఱియొక్క యశని సమాన బాణమున
నెఱిద్రుంచె నవ్వాహినీపతి శిరము
లోన సాంబ సాత్యకి గద ప్రముఖ
లాలంబులో నొంచిరాసాల్వు బలము
యీరీతి నిరువదియేడునా ళ్ళతుల
సారుఁడా హరిసూతి సాల్వుని తోడ

1161

దువీర సహితుఁడై యాహవ కేళి
యొవిన ముదముతోనొనరించుచుండ

ధర్మనందనునిచే రాజసూయాధ్వరమును పరిపూర్తి గావించి శ్రీకృష్ణుఁడు ద్వారకకు తరలి వచ్చుట

పాండునందను ధ్వరం బటుల
నాపూర్ణ మగుటయు నాత్మ నింపొదవ
మిత బలాన్వితుండైయాత్మ పురికిఁ
లనేత్రుండునుఁ దలి యేతెంచె
పుమున కేతెంచి పురి చుట్టువారఁ
రువులు వారు నబ్బలములం జూచి
ని నారసమున హితు విమాన
లీలఁ దిరుగు సోగమునుఁ గాంచి
ను శతాంగంబుఁ దారకు చేత
నువుగాఁ దోలించె నాసాల్వు మీద

శ్రీ కృష్ణుఁడు సాల్వునితో యుద్ధం చేసి యాతనిని సంహరించుట

సాల్వ నృపతియు ట్లెదుర్పడిన
వాసుదేవునిఁ గాంచి వాఁడిమి చెడక
పంజాక్షుని సూతుపైఁగఠోరముగ
హుంకార మొనరించి యొక యీటె వైచె
ట నాటక సూత్రర్త యా శక్తి
పుడ చూర్ణము సేసె మిత బాణముల
నియాఱు[155] శితకలంముల నొప్పించె
యుక్తుఁ డగు సాల్వహిపతి నలుక


[155] పనియీఱు- పదియాఱు, పదహారు

1171
రివామబాహువునందు సాల్వుండు
భసంబుగ నొక్కరము నాటించె
హతి వేదనం య్యన హరికిఁ
మున నున్న శార్ఙ్గము జారిపడియె
దిచూచి యదువులు హాహా యటంచు
వొవించి రారావములును గలంగి
పుడ గర్జనము బెట్టడరించి సాల్వ
నృతి గర్వమున నాకృష్ణు నిట్లనియె

సాల్వుఁడు శ్రీ కృష్ణుని చెయిదములను ఖండించి ‘నీకు మోక్షమును గ్రహించెదను ర’ మ్మని వీరాలాపము లాడుట

దు మిత్రుని కళత్రముఁ దెచ్చికొంటి
నులనువర్తించు జాడ వోవిడిచి
పట వానినే లుష వర్తనత
చితి మొగమాట ణువైన లేక
గుఁగాక యేమి నాగ్రంబు నందు
తెగువమై నిట్టి బుద్ధిన నిల్చితేని
పునరావృత్తిగా మరించు నిన్ను
నిపుడ నీ చుట్టంబు లెల్ల వీక్షింప”

శ్రీకృష్ణుఁడు సాల్వునికి సరియైన సమాధానము చెప్పుట

నుటయుం గృష్ణుఁడు సియించి, “యోరి!
పరాధమ శూరనుఁ డెట్టియెడల
పెమ్మెలు[156] వలుకునే పేర్చిన శక్తి
మ్మతంబుగఁ జోపి యమొందుఁ గాక”


[156] పెమ్మెలు- గప్పాలు

1181

నుచు నలాత[157]క్రాకృతి భ్రాంతి
నువొందు సౌభంబునందు నృపాలు
భిదురోపమేయతాభీకరంబైన
చేత జత్రుభాము[158] నందు మోఁదె
తఁడును నగ్గదాతిఁ జాల నొచ్చి
ధారమగుచు రక్తము నోరవడియ
సౌభంబుతో నదృశ్యత నొందెఁ బద్మ
నాశౌర్యమున నెంయు భీతి నొంది

సాల్వుఁడు మాయతో కూడిన కపట యుద్ధనీతిని మాయావి యైన శ్రీకృష్ణునిపై ప్రయోగించుట

వేళ నొక్కఁ డా రిఁ జేర వచ్చి
దేకీదేవి పుత్తెంచె నన్న నుచు
నాతుండై, యార్యుఁగు వసుదేవు
నీనీచుఁడగు సాల్వుఁడిట పట్టి తెచ్చె”
నునంత సాల్వుండు నంబర వీథి
నఁబడి మాయ చేఁల వసుదేవు
చూపుచు, “నోశౌరి! చూడు మీ జనకు
వేపొలియింతు నావిక్రాంతి” ననుచు
టపు వసుదేవుఖండించి మఱియు
పుడ త్రుంచి తదుత్తమాంగంబుఁ గొనుచు
సౌభంబు సొచ్చె, నాశౌరియు నిట్లు
ప్రావంబున సాల్వతి సేయు మాయ

[157] ఆలాతము- కొరివి, ఉల్ముకము
[158] జక్రుభాగము- మెడ మూపురము మధ్య భాగము

సాల్వుని మాయకు కారణమైన సౌభంబును గదచే తునాతునకలు చేసి, సుదర్శనముచే శ్రీకృష్ణుఁ డాతని శిరస్సును ఖండించుట

1191

తెలిసి నవ్వి సమగ్రదీప్త రోషాగ్ని
మాన మానసర్ణితుం డగుచు
లఁ ద్రిమ్మరునట్టి సాల్వు సౌభంబు
చేతఁ బొడిసేసెఁ డలిలోఁ బడఁగ
గత సౌభుఁడై యాసాల్వ భర్త
పుడ గదాదండ లరఁ గైకొనుచు
యెదురుగా జనుదేర నీక్షించి శౌరి
యున్న చై సాయకంబునం దునిమి
ప్రటించి త్రుంచెఁ జక్రంబున నతని
కిరీటకుండలోజ్జ్వల మస్తకంబు
నులెల్ల యజవాద సాధువాదముల
నొరించి రపు డమర్త్యుల యట్ల కదిసి

తనమిత్రుఁడు సాల్వుఁడు రణనిహతుఁడు కాగా దంతవక్త్రుఁడు శ్రీకృష్ణునిపై పగ దీర్చుకొనుటకు యుద్ధ రంగమున దిగుట

టుల సాల్వుఁడు రణతుఁడైనఁ జూచి
కుటిలుండు దంతవక్త్రుఁడు చాల నలిగి
దీర్చికొనఁ బూని ప్రళయార్క బింబ
ధగాయితము లెంయు మించునట్టి
ణిగణ ఖచిత హేరథంబు మీద
ణుతింపఁ దగు కార్ముము పూని నిలిచి
పెనుపొందు నిస్సాణ భేరీ మృదంగ
నిదంబు రోదసి నెఱి వ్రయ్యసేయ