పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బాల ద్విపద భాగవతం : భాగ 4- 301-400

301

లి వాహన చిత్రల్యాణ గతుల
నుధి గేహమున కింపొదవ నేతెంచె

శ్రీ లక్ష్మీ నారాయణుల కల్యాణ వైభవము

రిదీశుఁడును[74] బంధు హితుఁడై యపుడు
గురుభక్తితో నెదుర్కొని సమ్మదమున
నొరించె మధుపర్క ముచిత మార్గమున
మునిమంత్రపూర్వకంబుగ ముకుందునకు
విలంబమున లచ్చి ధర బింబంబు
విఁజూచు వాఁడయి క్రి తామున్న
తాతమ్యంబుఁ జిత్తమున నేర్పఱుపఁ
గోరివీక్షించు లాగులు[75] చెన్నుమీర

రిశుద్ధమగు మధుర్కంపుఁ దేనె
హాసమంద ముంఱఁ జవిచూచె
క వస్త్రయుగంబుఁ మలజ హరులు
ర వధూ పరాంరమున[76] నిల్ప
సిరికి లచ్చికిఁ జిత్త సీమలం బొదలు
రిలేని యనురాగ సంపదలపుడు
వోర్వలేక సత్వరముగాఁ గూడ
వెలి యన్యోన్యంబు వింతమార్గమున
లిసి యాలింగన క్రమముఁగైకొన్న
వుచూపి చెలంగె వ్వస్త్రయుగము

[74] సరిదీశుడు- సముద్రుడు

[75] లాగులు- విధానములు

[76] పరాంతరము- వెనుకభాదమున

311

ధి యంతఁ, దనూజ నుర్వీధరునకు
ముముతో శుభలగ్నమున ధారవోసె,
రి వాడక యుండుట్లుగాఁ దలఁచి
ముతోఁ గూడనే లజకుట్మలము
కైకొను గతి దోఁచెఁ డుదాన సలిల
సే[77]శోభనమైన సిరికరాబ్జంబు
గున శరధి హస్తంబున నుండి
ణీధరుఁడు వేడ్కఁ దానందు వేళ
పుత్రి నంభోజవాసినిఁగాఁగ
రుదుగా వరుని నారాయణుఁగాఁగ

పుచుఁ గన్యకాదానంబుసేయఁ
లిగెడు పుణ్యం బణ్యం బనంగ
సియ కన్యక యును శేషతల్పుండె
రుఁడును నైన యవ్వనధికిఁ గలుగు
పుణ్యమెవ్వరికైన భువిఁ బల్కఁజాలు
పుణ్యంబు కలిమి యద్భుతముఁ గాకున్నె
లితో భయరాగ హిత చిత్తములఁ
సి యహంపూర్విలు వేగిరింప
జికరగుడము లా సిరియును హరియుఁ
జేరి యన్యోన్యంబు శిరములందాల్ప

[77] సేక- తడసిన

321

వియొప్పెఁ గడుఁ గోర్కును మహీజముల
ప్రవిమలోదిత దృశ్యలములఁ బోలి
రియును సిరియును న్యోన్యవదన
సిజంబులు చూడఁ జాగు నవ్వేళ
నియెడిదేమి యయ్యాది దంపతులఁ
గొబు[78] చిత్తముల సిగ్గునకు సిగ్గొదవె

మయంబున వ్వధూవరులు
సేవలత్తియల్శిఖరాల[79] దాల్చి
శాబ్ధిచే నసంర పయో బంధు
కుములచే నింపు గొనసాగి పొదల[80]

తివిచిత్రంబుగా భిషిక్తులైన
తిఁబ్రకాశించి రేప్రకారమున
మా గోవిందు ప్పు డమరియు[81]
నారీతి శేషముక్తావళుల్ దాల్చి
రిపూర్ణ చంద్రబింసమాస్య[82] జనిత
హాస చంద్రికా రుణాంకురముల
నిరువురుం దమలోన నిది చిత్రమనఁగ
శిముల ధరియించు చెలువుఁ గైకొనిరి
రియు లచ్చియు వింత గుఁ గంకణముల
రియించి రూర్ణీకృతంబుల[83] నపుడు

[78] గొనబు- మనోజ్ఞము

[79] సేస వలత్ తియలు శిఖరాల- పరివేష్టించిన అక్షింతలు మధురముగ తలలమీద

[80] పొదలు- వర్ధిల్లు

[81] అమరు- కూర్చుని ఉండు

[82] సమ అస్య- సరిపోలిన మోము

[83] ఊర్ణీకృతములు- పట్టువస్త్రములు (ఊర్ణనాభి కృతములు)

331

ప్రవిమల తత్కర పంకజంబులకు
వినాచుఁదీఁగెలో నఁగ నొప్పారె
క్రముక రత్న సువర్ణ లితంబులైన
లాచ్యుతుల యంశుముల కొంగులకు
లువుగా శోభన బంధంబు వైచె
జాసనుఁడు మంత్ర సంగతి మెఱయ
దివివాహంబుల యందెల్లనాడు
మొలుగా భువి బ్రహ్మముడి యనవెలసె
పుడద్రి నందని రశాసనమున
నిపుణత సతులెల్ల నెఱి సన్నుతింప

ధి పుత్రిక తోడ నుచిత మార్గమునఁ
దురులాడుచు[84] విలాము చిత్తరింప
రుని కేలువఁ గూర్చె న్నియ మీఱ
రిమ నయ్యిందిర రపంకజంబు
లినట్టితఱిఁ గోకదమైత్రి సేయు
జాత[85] మనఁజాలె గదంబకరము
దంపతులఁ బంకజాసును రాణి
వేదిక యొక్కించి వెఱవుతో నచట
ణీయ నవహేమ త్నపీఠమునఁ
గొరప్ప డగ్గఱం గూర్చుండఁబెట్ట

నూత్న దంపతులైన శ్రీ లక్ష్మీనారాయణుల పరస్పరావలోకన సౌందర్య వర్ణనము

[84] చదురులు- వేళాకోళములు, నేర్పరి యైన మాటలు

[85] కోకనదమైత్రిసేయు జలజాతము- చెంగల్వతో స్నేహం చేస్తున్న పద్మము

341

రి,లచ్చిఁ జూచెద ని చూచునంత
రిఁజూతునని లచ్చి ల్లన చూచు
చూచువారల రీతి చూచి మొఱంగి
చూచువేళలుఁ గోరి చూతు రిద్దఱును
చూచినం దనుఁజూచు చూపు లేదనుచుఁ
జూచుజాడలు మాని చూతు రన్యంబు
చూచుచోఁ జూపునుం జూపునుం గలయఁ
జూచియుం జూడని సొబగుఁ గైకొండ్రు
చూచిచూచి తొలంగఁ జూడని చూపుఁ
జూచుకాంక్షలఁ జిక్కి చూడరు మదుల

చూచిన యంగంబు చూడ కొండొరులఁ
జూచుచోఁ గలయంగఁ జూతురొండొరులు
చూపులలోఁ దేటచూపు లేర్పఱచి
చూపుచందంబులు చూపుదు రెలమి
ఱుముక యొదవు తత్తరము బిత్తరముఁ
రితీపు[86] మఱపునుం గులంబు లధిప!
సిబ్బితి[87] వేడ్కయుం జెరలుకొట్టుటయు[88]
బ్బునుగబ్బును[89]  లుకువాడియును
కూరు శృంగార రధి వీచికలు
ధిక ప్రేమరప్రవాహములును

[86] తరితీపు- ప్రీతి

[87] సిబ్బితి- సిగ్గు

[88] చెరలుకొట్టుట- ఉత్సాహముచూపుట

[89] అబ్బునుగబ్బును- అబ్బురము, గర్వము

351

నింగితంబుల పొంక మెఱిగించు గతుల
నంవించిన[90] పెక్కు లైన నేర్పులునుఁ
లిగి యన్యోన్యంబుఁ డలేని తముల
సొవక పైకొను చూపు సందడుల
దేవిదేవరయు వేదిక మీద నుండి
యావేళఁ గ్రీడించి టుఁ గొంతఁదడవు

బావమఱదియైన చంద్రుఁడు శ్రీమన్నారాయణునితో సరసోక్తులాడుట

రిణాంకుఁ డావేళ రిఁ జూచి నవ్వి
సోక్తులొగిఁ బల్కెఁ తురాక్షరముగ
ముదిపెండ్లి కొడుక వీ మురిపెంబు నీకు
నొవించుకొన నేల యుండు మూరకయ

రకు మింక, మా డుచు పాదంబు
లెఱొమ్మునందు నికిడఁ గల దిపుడు
వడ నెపుడు మా క్క పేరిటనె
పిలిపింతు నిను బావ పెక్కేల పలుక
వాక మా మూక వారిలో మెఱయఁ
గోక తల గుట్టుకొని యుంట మేలుఁ!
బాకుఁ దన మాటఁ డుదువు గాని
ధీతమై నోరు దెఱచితి నేని
కొదిగా మము వేఁడుకొనఁబడ నీకు
విగా వల్లుని లుక లిచ్చోట

[90] అంగవించు- మించు, ఉత్సహించు

361

యిమ్మెయి నొంటి నీ కెట్టి మాటకును
మ్ముని నొక్కనిం గఁ గూర్చుకొనుము!
నీముచ్చు విద్యలు నెఱయంగనెపుడు
మామూక యెఱుఁగుగా లయంగ రాదు
జలోచన! సిగ్గు దలెడు నట్టి
గొములుఁ దలపెట్టు కొనకుమీ యిచట
టువవై కొంచెపు వారి పెంజూపు
న మా ముందఱ డవ దెల్లపుడు

మన్మధుఁడు లక్ష్మీనారాయణులపై తన ప్రభావము చూపుట కుద్యమించి విష్ణుమాయకు లోనై యశక్తుఁడగుట

నిచందురుఁడు వల్కు నంత, మన్మధుఁడు
లోచనానంద సంధాయి మూర్తి

తిచిత్ర యౌవనాత మదాకలిత
తిసతి కుచకోక మణీయ లిప్త
మృమద కర్పూర మిళిత పటీర
దుత్తరామోద సంపదా కలిత
దురోవిన్యాస లాలిత దివ్య
కుసుమాలి మాలికా కుల మకరంద
రిచయ పరిణత టు చంచరీక
వర్ణినీ గణ ర్ణిత గాన
మిన విశేషితామిత రసోదార
లిత సార రసాల కార్ముక గుణజ

371

టంకార సంకరా డంబర రచిత
శంకాకులిత సర్వన మానసుండు
చెకెద నని వచ్చి సిరివరుమాయ
నుమోహ పరస నత్తఱి నూరకుండె

దేవకాంతలు వివాహవేదిక చుట్టు నిలిచి పెండ్లి పాటలు పాడుట

తెలివి వివాహవేదిక చుట్టు వార
నిలిచి మోదంబున నిర్జసరతులు
హువిధ రాగమై హు చిత్ర మధుర
జ కంఠస్వర సంవిధానముల
రుల చిత్తము లుచ్చిరువుల తోడఁ
గఁ బాడిరి పెండ్లి పాటలుఁ గూడి

సముద్ర రాజ తనయా సౌందర్యవర్ణనము

యఁబర్విన దేహకాంతిపూరములు
నిలిచిన గంభీర నీరంబు గాఁగ
సోపులై మించు చూపులగములు
లోలంబులైన కల్లోలముల్ గాఁగ
డుఁజిత్రమై మించు గానంబు పెంపు
లేక యెప్పుడుఁ ల మ్రోత గాఁగ
విరివిగాఁ గనఁబడు విమలాంశుకములు
బెయుచు నెరసిన ఫేనముల్గాఁగ
మెఱుఁగులు గిరిగొని మెఱయు మీఁగాళ్ళు
నెఱిమించు కచ్ఛప[91]  నికరంబు గాఁగ

[91] కచ్ఛపము- తాబేలు, కూర్మం

381

జిచక్రతల వరించిన నితంబములు[92]
ప్రతిలేని యంతరీపంబులు[93] గాఁగ
చారిమ నిధులనంజాలు పొక్కిళ్ళు[94]
వాక పొడము నార్తముల్గాఁగ
లగ్నముల[95] బెడంగారు మువ్వళులు
విలి యల్లన పొల్చు రఁగలు గాఁగ
బంధుర స్ఫురణ శోన రోమలతలు[96]
సంధిల్లు శైవాలజాలంబు[97] గాఁగ
సిజంబులు కోక యుగళముల్గాఁగ[98]
బాహువులు బిసవారముల్[99] గాఁగ

ములు విరియు కోనదముల్[100] గాఁగ
సురుచిర నఖము లచ్చుగ మణుల్గాఁగ
కాంకంఠంబు శంమ్ములు గాఁగ
దంతంబు లమల ముక్తాతతుల్ గాఁగ
న్నులు మీన సంమ్ములు గాఁగ
న్నుత ముఖములు లజముల్ గాఁగ
కురులందు వ్రాలి పైకొని మూఁగియున్న
చిమత్త మధుకర శ్రేణులు గాఁగ
సుదతీ వర్గ ప్పు డచ్చోట
నాముద్రునకు నీగుచుఁ జూవట్టె

దేవగణముల ఉత్సాహము వివాహోత్సవ కోలాహలము

[92] జిత చక్రితలు- చక్రవాకములను జయించిన, నితంబములు- పిఱుదు

[93] అంతరీపము- దీవి

[94] పొక్కిలి- బొడ్డు

[95] అవలగ్న- నడుము

[96] రోమలత- నూగారు, బొడ్డునకు కొనసాగు రోమమలు

[97] శైవాల- నాచు

[98] ఉరసిజము- చన్ను, కోకము- చక్రవాకము, జక్కవపక్షి

[99] బిసము- తామరతూడు

[100] కోకనదము – తెంగల్వ, ఎఱ్ఱని కలువ

391

వేలుపుల్ దగఁ జతుర్విధవాద్యరవము[101]
నోలిమై ఘనముగా నొనరించి రమర
ణీశ! యచట గంర్వ గానములు
రుదైన యప్సరో ల్లీసకములు[102]
రుడ ఖేచర సిద్ధ ణ సన్నుతులును
గురుమౌని జన మంత్ర కుల ఘోషములును
ముది తోభయ బంధు సాధు వాదములు
రించె జగముల కానంద గరిమ

బ్రహ్మ, లక్ష్మీనారాయణుల వివాహమును శాస్త్రోక్తముగ జరిపించుట

తీధరుఁడు శాస్త్రరణి నవ్వేళఁ
నొనరించెఁ బ్రధానహోమంబు

గావంబునఁజేసెఁ మలాక్షుఁ డంత
నీజ నిలయ పాణిగ్రహణంబు
నుగాఁ బులకించె రహస్త మపుడు
యంగఁ జెమరించెఁ మలాకరంబు
ప్పుడా పులక సస్యంబులం దడిపి
యొప్పుగాఁ బోషణం బొనరించు పనికి
పంశరుండు శంర మంటి లీల
నించిన గతి దోఁచి నిక్కంబు గాఁగ

శ్రీ లక్ష్మీ నారాయణులు లాజహోమము చేయుట

లిమిచూపులతల్లి మనీయ హస్త
జముల్గూర్చి లాలు దోయిలించి

[101] చతుర్విధ వాద్యము దీనికే ఆతోద్యము అని పేరు. i) తతము, ii) ఆనద్ధము, iii) సుషిరము, iv) ఘనము. అందు, తీగెలు బిగింపబడిన వాద్యము తతము, ఆనద్ధమునకే అవనద్ధమని కూడ పేరు. మృగ చర్మముచే కప్పబడిన వాద్యము, గాలిని పూరించుచు వాయించెడి వాద్యము సుషిరము, పిల్లనగ్రోవి, బాకా వంటివి. ఘనమనగా గుండ్రని తట్టల వంటివి రెంటిని శబ్దింప జేయుట, చూ. భరత నాట్య శాస్త్రము

[102] హల్లీసకము- గొండ్లి, స్త్రీల నృత్యవిశేషం, చాలామంది స్త్రీలు చేరి గుండ్రంగా తిరుగుతు చేయు నాట్యవిశేషం, ఒక సంకీర్తన