పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

యక్షగానములు : కీర్తన : కల్యాణి - ఆది

పల్లవి
వచ్చును హరి నిన్నుఁ జూడ - మెచ్చును హరి నిన్నుఁ జూచి
అనుపల్లవి
కుచ్చిత విషయాదుల - జొచ్చురీతి నెంచి నీవు
హెచ్చుగాను మా స్వామిని - మచ్చికతో నుతియింపుము
చరణ (1):
ధీరుని సీతారామావ - తారుని సకల లోకా
ధారుని నిజభక్తమం - దారుని నుతియింపవయ్య
చరణ (2):
ధన్యుని వేల్పులలో మూ - ర్ధన్యుని ప్రతిలేని లా
వణ్యుని పరమకా - రుణ్యుని నుతియింపవయ్య
చరణ (3):
ఏ జప తపములకు రాఁడు - యాజనాదులకు రాఁడు
రాజిగా నుతియించు త్యాగ - రాజనుతుఁడు ఈవేళ

ప్రథమాంకము సమాప్తము