పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : విశ్వమయత లేమి

ఆ॥ వె॥
విశ్వమయత లేమి వినియు నూరక యుండి
రంబుజాసనాదు డ్డపడక
విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు
క్తియుతున కడ్డడఁ దలంచె.
బాహ్య॥ బ్రహ్మాదులకు విశ్వమయత - సర్వవ్యాపకత్వము లేకుండుటచే మొఱనాలకించి నను నడ్డపడఁజాల రైరి, విశ్వమయుఁడును వ్యాపకశీలుండును, జయశీలుఁడు నగు విష్ణుండు భక్తియుతుం డగు గజమున కడ్డపడ దలంచి.
రహ॥ మాయోప, హిత చైతన్య యుపాధి రూపు లగుటచే బ్రహ్మాదు లడ్డపడ రైరి. అనగా మాయా ప్రతిబింబ స్వరూపు లగుటచే సర్వవ్యాపకత్వము లేదని తాత్పర్యము. పరమాత్మ దేశకాలాద్య పరిచ్ఛిన్నుఁ డగుటచే వ్యాపక స్వరూపుఁ డగు విష్ణువు భక్తున కడ్డపడ దలంచె నని తాత్పర్యము.