పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : వరధర్మకామార్థ

సీ||
రథర్మకామార్థ ర్జితకాములై;
విబుధు లెవ్వాని సేవించి యిష్ట
తిఁ బొందుదురు? చేరి కాంక్షించువారి క;
వ్యయ దేహ మిచ్చు నెవ్వాడు కరుణ?
ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు? ;
రానందవార్ధి మగ్నాంతరంగు
లేకాంతు లెవ్వని నేమియుఁ గోరక;
ద్రచరిత్రంబుఁ బాడుచుందు?
ఆ||
రా మహేశు నాద్యు వ్యక్తు నధ్యాత్మ
యోగగమ్యుఁ బూర్ణు నున్నతాత్ము
బ్రహ్మమయిన వానిఁ రుని నతీంద్రియు
నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు.
బాహ్య|| విబుధు లెవ్వని సేవించి, ధర్మార్ధ కామవర్జితులై పురుషార్ధ మగు మోక్షమును బొందుదురో, యాశ్రితులై యవ్యయ దేహముఁ గాంక్షించు వారికి జన్మరాహిత్యము నెవ డొసంగుచుండునో, సంసారవిముక్తాత్ము లెవని చింతింతురో, బ్రహ్మానందజలధి నిమగ్ను లగు నేకాంత రంగసాధకు లితర మేమియును గోరక నెవని శుభప్రద చరిత్రముఁ బాడుచుందురో, యాద్యుఁడు నవ్యక్తుఁడును. నధ్యాత్మ యోగ మనగాఁ బ్రత్యగాత్మను దెలియుట యను యోగముచేఁ బొందదగినవాఁడును, బూర్ణుడును, శుద్ధ బ్రహ్మస్వరూపుఁడును, నతీంద్రియుఁడు స్థూల సూక్ష్మ రూపుఁడు నగు వానిని భజింతును.
రహ|| (త్రివర్గము) ధర్మార్ధ కామములను గోరక (అనగా "అంత్యేషు రేమిరేధిరే - నతేమధ్యేషురేమిరే - అంత ప్రాప్తిం సుఖం ప్రాహుః దుఃఖ మంతర మేతయోః ||" ధీరులు - ధర్మార్ధ కామమోక్షములలో - మధ్యగా నుండు, దుఃఖవంతములగు నర్ధకామముల కంటె నంత్యముల యందుండు, ధర్మ - మోక్షములు సుఖరూపము లగుటచే వాటి యందే రమించిరి (కోరిరి). కావున నెవనిని సేవించి యిష్టగతి (మోక్షమును) బొందుదురో, యాశ్రితులైన ముముక్షువులకు, నెవఁ డవ్యయ (జన్మరాహిత్య) - విదేహముక్తి నొసంగునో, సంసారబంధవిముక్తు లెవనిని ధ్యానింతురో. యానందవార్ధిమగ్నైకాంతరంగ సాధకులు " శ్రు|| ఏకాకినాసము పగమ్య వివిక్త దేశం - ప్రాణాదిరూప మమృతం పరమార్ధతత్వం - లఘ్వాశినాధృతిమతా పరి భావితవ్యం - సంసార రోగహరమౌషధమద్వితీయం" తా|| ఏకాంతమున లఘ్వూశనుఁడై, ప్రాణాదుల నమృత స్వరూపములుగా గ్రహించి యనగా , సమిష్టిగా నుండు మహాభూతముల యందలి యమృత స్వరూప బ్రహ్మమే - వ్యష్టిగా నుండు ప్రాణాదుల యం దమృత స్వరూపముగా నున్న దను భావనమే సంసార రోగహార మైన, యద్వితీయ మగు నౌషధ మని గ్రహించవలెను. - కావున నేకాంతవాసులై యానందార్ధి మగ్నాంత రంగసాధకులై శ్రు|| యత్రనాన్యత్పశ్యతినాన్యశ్చృణోతి, నాన్యద్విజినాతి సభూమా" యే స్థితి యందితరము వినఁడో యితరమును జూడఁడోఁ యితరము నెఱుఁగఁడో, యదియే భూమా (బ్రహ్మ)నంద మట్టి యానందాంతరంగ సాధకులై, బ్రహ్మమును, గీర్తింతురో, యట్టి మహేశు, నాద్యుఁడు - సృష్టికిఁ బూర్వ మందున్నవాడు, అవ్యక్తుడు - " శ్రు|| నామరూప భిర్నవ్యజ్యతే త్యవ్యక్తం - నామ రూపములచే వ్యక్తీకరింప దగినవాఁడు కాడు - కావున నవ్యక్తుని - నధ్యాత్మ యోగ గమ్యు - దహరా కాశము నందుండు ప్రత్యగాత్మ నెఱుంగుటయే, యధ్యాత్మ యోగ మట్టి యోగ గమ్యుఁడును, బూర్ణుఁడు. "పూర్ణమదః పూర్ణమిదం - పూర్ణాత్పూర్ణము దచ్యతే - పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వావశిష్యతే" అదః - నిర్గుణ బ్రహ్మము - ఇదం సగుణ బ్రహ్మము (జగత్తు) రెండును పూర్ణమే - గాని, సగుణబ్రహ్మము కంటె - నిర్గుణ బ్రహ్మ మతిశయించు చున్నది. - సగుణ బ్రహ్మము (ప్రపంచము) నకు నిర్గుణ బ్రహ్మమును గారణముగా గ్రహించినవాఁడు, పూర్ణుఁడై, శేషింపఁబడుచున్నాడు. అట్టి పూర్ణుఁడు నింద్రియాతీతుఁడును స్ధూల, సూక్ష్మ రూపుఁ డగు వానిని భజింతు నని తాత్పత్యముఁ.