పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : తోయజగంధంబుఁ దోఁగిన

సీ||
తోయజగంధంబుఁ దోఁగిన చల్లని;
మెల్లని గాడ్పుల మేను లలరఁ
ల నాళాహార విలవాక్కలహంస;
వములు చెవుల పండువులు చేయ
ఫుల్లదిందీవరాంభోరుహా మోదంబు;
ఘ్రాణరంధ్రంబుల గారవింప
నిర్మల కల్లోల నిర్గతాసారంబు;
దన గహ్వరముల వాడు దీర్పఁ
తే||
త్రిజగ దభినవ సౌభాగ్య దీప్తమైన
విభవ మీక్షణములకును విందు చేయ
రిగి పంచేంద్రియ వ్యవహారములను
ఱచి మత్తేభయూధంబు డుఁగుఁ జొచ్చె.
బాహ్య|| -వీచికలచే నార్ద్రితమైన పుప్పొడినుండి వచ్చు మందమారుతముచే మేనులు సంతరింపఁ-
గమలనాళాశనులై మంజులముగాఁబల్కు హంసల నిస్వానముచే వీనులు విందుఁగొన, సితపద్మములయందలి సువాసనలచే నాసికా వివరంబు లుచ్ఛ్వాసములచేఁబూర్ణీభవించ, నిర్మల కల్లోల (నుఱఁగ) జనిత జలముచే జిహ్వల కుపశమనముఁ గలుగుచుండ జగంబులకు నూతన శోభచే వీక్షణా లంకృతంబై, యొప్పు నగ్గజవ్రజంబు పర వశమున సరస్సులోఁ బ్రవేసించె నని తాత్పర్యము.
రహ|| -పూర్వకృత సద్వాసనలచే, స్థూల, సూక్ష్మ, కారణ శరీరత్యమలరారఁ-గుటీచక, బహూదకఁహంస, పరమహంస, సన్యాసులలో శ్రేష్ఠులగు పరమహంసలయొక్క బ్రహ్మ విచారణచే శ్రవణానందంబుఁ గలుఁగ, శుద్ధసాత్వికాదివృత్తుల (శ్వాసలు)చే నాసికావివరంబులు పూర్ణీభవింపఁ సత్సంకల్ప కల్లోల (పరిణామ) జలముచే జిహ్వచాపల్యము, శాంతింప, నవస్దాత్రయముచే నొప్పు, ఇంద్రియ వ్యాపారముల నధిదేవతా యత్తములుజేసి మనఃకాసారముఁ జొచ్చె నని తాత్పర్యము.