పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : తన కుంభముల పూర్ణతకు

సీ||
న కుంభముల పూర్ణకు డిగ్గి యువతుల;
కుచములు పయ్యెదకొంగు లీఁగఁ;
న యానగంభీరకుఁ జాల కబలల;
యానంబు లందెల నండగొనఁగఁ;
న కరశ్రీఁ గని లఁకి బాలల చిఱు;
దొడలు మేఖలదీప్తిఁ దోడు పిలువఁ;
న దంతరుచి కోడి రుణుల నగవులు;
ముఖచంద్ర దీప్తుల ముసుఁగు దిగువఁ;
తే||
నదు లావణ్యరూపంబుఁలఁచిచూఁడ
నంజనాభ్రము కపిలాది రిదిభేంద్ర
యిత లందఱుఁ దనవెంటఁ గిలినడవఁ;
గుంభివిభుఁ డొప్పె నొప్పులకుప్ప బోలె.
అష్టదిగ్గజములు - భార్యలు
బాహ్య|| స్వభావోక్తి- - తన గండస్థలంబులకు - స్ర్తీల వక్షోరుహములు -త్రపాయుతములై, సిగ్గుపడి పయ్యెదలోఁ దాఁగొనియెను-తననడలకబలలనడకలోడి, నూపురము (అందెల) ల, నాశ్రయించినవి - తనతొండము యొక్క శోభకు బాలికల చిఱుతొడలోడికటిసూత్రయుతములై యుండెను. తన దంతరుచికి సాటిరాక, యువతుల పరిహాస చంద్రికలు (ముసుఁగుఁబడు) నోష్టములచేఁ బరివేష్టింప బడిన - యనగాఁ బెదవులచేఁ గప్పబడినవి - తన సౌందర్య శోభను వీక్షించుటకు నేతెంచిన, దిగ్దంతావళులు, తన వెనువెంట నడచుచున్న కాంతలతో , నొప్పిదమై యుండె నని తాత్పర్యము.

రహ|| -జీవుఁడు పంచకోశయుక్తుఁడై సప్తధాతువులతోడను, బహిరంతరేంద్రియముల తోడను-దశవిధ ప్రాణంబుల తోడను - శద్దాది విషయంబుల తోడను - శరీరత్రయాన్వితుఁడై యవిద్యాకన్యకాపరిణయార్థమై, యలంకృతుఁడైన పెండ్లికుమారుని మాడ్కిఁ బ్రకటితుఁ డయ్యె నని తాత్పర్యము.
వ|| మఱియు, నానా, గహనవిహరణ, మహిమతో, మదగజేంద్రంబు మార్గంబుఁదప్పి పిపాసాపరాయత్తంబున మత్తగజేంద్రంబుల, మొత్తంబునుందానుంజని చని-
బాహ్య|| - - గజేంద్రుండు, గహన, విహరణ, సామర్ధ్యంబుతోఁబిపాసఁ(నీరుఁద్రావునిచ్ఛచే)గ రేణువులతోఁజనుచుండి- -
రహ|| - - జీవుఁ డనేక జన్మంబులు వడియుటకు సమర్ధుడై సంకల్పించి, నివృత్తినుండి తప్పి, ప్రవృత్తిమార్గంబునఁ బ్రవేసించె నని తాత్పర్యము.
శ్రు|| సఐక్షత బహుశ్యాం ప్రజాయే యేతి, సతపోతప్యత ఆపరమాత్మ యనేక విధములుగా జనించెద నని సంకల్పించెను.