పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : తలఁగవు కొండలకైనను

కంద||
లఁగవు కొండలకైనను
లఁగవు సింగములకైన మార్కొను కడిమిం
లఁగవు పిడుగుల కైనను
ని బలసంపన్న వృత్తి నేనుఁగు గున్నల్.
బాహ్య|| - బలసంపన్నముతోఁగూడి , కోమలమగు నాయేనుఁగులు, కొండలడ్డమైనను, తొలఁగి తప్పించుకొని యొసిలిపోవు - సింహాములను గూడ నెదిరించు మాడ్కి మార్గములనుండి మరలవు-పిడుఁగులుపడినను జడియవన్ తాత్పర్యము-
రహ|| -కొండలవంటి కష్టములు సంప్రాప్తించినను , ధైర్యమును విడువక కామాదులను జయించుటకు సింగములవంటి పట్టుదలఁగలవియై -పిడుగుఁవంటి యాపదలను భరించు - అవిద్యావృతపారమార్ధిక జీవులని తాత్పర్యము-
శ్రు|| సుషుప్తి వజ్జాగ్రతియోన పశ్యతి
ద్వయంతు పశ్యన్నపిచాzద్వయత్వతః
తధాచకుర్వన్నపియశ్చ అక్రియః
స ఆత్మవిన్నాన్య ఇతీహ నిశ్చయః
అద్వయ స్వరూపుఁ డగుటచే, జాగ్రత యందు ద్వైతమును జూచుచున్నను సుషుప్తి యందువలె ద్వైతమును భావించఁడో, యటువలెనే, కర్మ జేయుచున్నను అక్రియుఁడో, (కర్మ నాచరించనివాఁడో) వానినే ఆత్మజ్ఞాని యని నిశ్చయించవలెను. గాని యితరునిఁ గాదు వాఁడే పారమార్ధిక జీవుఁ డని భావము.