పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : పులుల మొత్తంబులు

సీ||
పులుల మొత్తంబులు పొదరిండ్లలోఁ దూఱు;
ఘోరభల్లూకముల్ గుహలు జొచ్చు;
భూదారములు నేల బొఱియలలో డాఁగు;
రిదంతముల కేఁగు రిణచయము;
డువులఁ జొరఁబాఱు హిషసంఘంబులు;
గండశైలంబులఁ పులు ప్రాఁకు;
ల్మీకములు జొచ్చు నభుజంగంబులు;
నీలకంఠంబులు నింగి కెగయు;
తే||
వెఱచి చమరీమృగంబులు విసరు వాల
చామరంబుల విహరణశ్రమము వాయ
యదపరిహేల విహరించు ద్రకరుల
గాలివాఱిన మాత్రాన జాలిఁ బొంది.
బాహ్య।- - స్వభావాలంకారము - -
భయంకరములుగా విహరించు, నేనుఁగుల జాఁడ పొడమి నంతమాత్రాన జాలిఁబొందినవై, పులులు పొదరిండ్లలోను - భల్లూకములు గుహలలోను - భూదారములు (అడవిపందులు) సొరంగముల యందును హరిణములు (లేళ్ళు) దిగంతములయందును-నెనుపోఁతులు మడువు (జలాశయము)లందును - మర్కటములు పర్వతాగ్రములయందును - బాములు పుట్టలయందును నెమళ్ళు అంతరిక్షములవైపును - పరుగులిడుచుండెను - మఱియు సవరపుమృగములు తమవాలములను, వింజామరలచే వీచుచుండెను-
రహ|| - - కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, యీర్ష్య, అసూయాదులు వాటివాటి యధిదేవతల యందడఁగియుండెనని తాత్పర్యము.