పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : పల్వలంబుల లేఁత పచ్చిక

సీ||
ల్వలంబుల లేఁత చ్చిక మచ్చికఁ;
జెలుల కందిచ్చు నచ్చికము లేక;
నివురుజొంపములఁ గ్రొవ్వెలయు పూఁగొమ్ములఁ;
బ్రాణవల్లభలకుఁ బాలువెట్టు;
నదానశీతల ర్ణతాళంబుల;
యితల చెమటార్చుఁ నువు లరసి;
మృదువుగాఁ గొమ్ముల మెల్లన గళములు;
నివురుచుఁ బ్రేమతో నెఱపు వలపు;
తే||
పిఱుదు చక్కట్ల డగ్గఱి ప్రేమతోడ
డాసి మూర్కొని దివికిఁ దొండంబు జాఁచు
వెద వివేకించుఁ గ్రీడించు విశ్రమించు
త్తమాతంగ మల్లంబు హిమతోడ.
బాహ్య।-మాతంగమల్లము (బలిష్ఠమైన యా గజము) నీటిపల్లముల యందలి, బాలతృణములను, దన ప్రియురాండ్ర కందిచ్చుచుఁ జిగురుటాకులగుంపులతోఁగూడిన పూ గొమ్మలను దన ప్రాణవల్లభలకుఁబంచిపెట్టుచుఁగర్ణ (తాళవృంతంబు) విసన కఱ్ఱలచే దయితల చెమటలార్చుచు, దంతములచే, గళములను స్పృశించుచుఁ బిఱుఁదుల మూర్కొనుచు, ఋతుసమయము నిరీక్షించుచుఁ విశ్రమించు చుండెనని తాత్పర్యము.
రహ|| -జీవుఁడు తన ప్రియురాలనఁగా మనస్సునకు సంతోషము గలుగునట్సు, విషయంబుల నెఱవేర్చుచు వృత్తులను దంతములచే నవిద్య నా నందింపఁజేయుచు, నవిద్యకు నానందంబుఁ గలుగఁ జేయుచుండె నని తాత్పర్యము.