పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : ఓ కమలాప్త

ఉ||
! మలాప్త! యో! వరద! యో! ప్రతిపక్షవిపక్షదూర! కు
య్యో! వియోగివంద్య! సుగుణోత్తమ! యో! శరణాగతామరా
నోహ! యో! మునీశ్వర మనోహర! యో! విమలప్రభావ! రా
వే రుణింపవే తలఁపవే శరణార్థిని నన్నుగావవే.
బాహ్య|| ఓ పద్మాక్షా! యో వరప్రదా! యో శత్రుమిత్ర సమత్వభావా! భేదరహితా! యోసర్వజ్ఞా! యోయోగిజన పూజ్యుఁడా! సుగుణోత్తమ యోగిశరణ్యా! యో దేవతా కల్పభూజా! యో మునిజన మనోహరా! యో విమలప్రభావా! శరణ్యుఁ డగు నన్ను రక్షించుముఁ
రహ|| కం - బ్రహ్మము - అలతి - ప్రకాశయతి - కమలం - బ్రహ్మజ్ఞానము అక్షియస్యసః - నేత్ర మెవనికో వాఁడు కమలాక్షుఁడు , బ్రహ్మజ్ఞానమే నేత్రముగాఁ గలవాఁడా! వరద - పురుషార్ధమగు మోక్షప్రదాతా! యో శత్రుమిత్రసమత్వభావా! శ్లో|| "సమశ్శత్రౌచమిత్రేచ, తధామానావ మానయోఃశత్రుమిత్రులయందును, మానావ మానముల యందును, సముఁ డగువాఁడు (నా స్వరూపుఁడే) తలఁపవే - శరణార్థిని నన్నుఁ గావవే, అయస్కాంత మయస్సు నాకర్షించు నట్లు నా బుద్ధి ప్రతిబింబిత కళను నాకర్షించి బ్రహ్మతాదాత్మ్యము చేయుము,
శ్లో॥ విషయేభ్యస్సమాహృత్య విజ్ఞాతాత్మామనోమునిః చింతయేన్ముక్తుయేతేన బ్రహ్మభూతం పరేశ్వరం
ఆత్మభావం - నయత్యేనం దద్బ్రహ్మాధ్యాయినం మునే వికారమాత్మ నశ్శక్త్యాలోహ మాకర్ష కోయదా॥
తా॥ విజ్ఞాని యగువాఁడు విషయములనుండి చిత్తమును మరలించి - ముక్తికొఱకుఁ బరేశ్వరుఁ డగు బ్రహ్మమును ధ్యానించ వలయును - అట్టి ధ్యాత యొక్క భావమును, ఆత్మ యొక్క శక్తిచే నయస్కాంత మెటు లయస్సును నాకర్షించునో యట్లు బ్రహ్మభావన (తాదాత్మ్యము) నొందించును కావున శరణుఁజొచ్చిన నా చిత్తవృత్తిని నాకర్షించి పరమాత్మా।నీయందైక్యముఁజేసికొమ్ము.
వ॥ అని పలికి మఱియు, నరక్షిత రక్షకుండై యీశ్వరుండా పన్నుండైన నన్నుఁ గాచు గాక యని నింగి నిక్కి చూచుచు నిట్టూర్పులు నిగిడించుచు బయలాలకించుచు నగ్గజేంద్రుఁడు మొఱ సేయుచున్న సమయంబున.
బాహ్య॥ మఱియు నగ్గజము - అరక్షిత రక్షకుండైన యీశ్వరుఁడు శరణ్యుఁడ నైననన్ను రక్షించు నని నిశ్చయించి యంతరిక్షమువంకఁ జూచుచు నిట్టూర్పి విడుచుచున్న యాసమయంబున ముందు కన్వయము.
రహ॥ మఱియు నా జీవుఁడు శ్లో॥ అరక్షితం తిష్ఠతి దైవరక్షితం సురక్షితం దైవహతం వినశ్యతి" మనుష్యులచే నరక్షితమైనను దైవరక్షితమైన యెడల క్షేమముగా నుండును. మానుష రక్షితమైనను దైవహతమైనచో నాశనమునొందును అనగా జీవుఁడు జగదభిముఖుఁడు కానిచో నాత్మయే తనకభిముఖమున జేసి రక్షించును. అట్టి యాత్మరక్షించుగాకయని సర్వము బ్రహ్మమేయను వృత్తిచే చిత్తము నరికట్టి యంతరిక్షమనగాఁ బరమాత్మ నీక్షించుచు ధ్యానించు చుండె నని తాత్పర్యము.