పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : నిటలాలకము లంట

నిటలాలకము లంట నివుర జుంజుమ్మని;
ముఖసరోజము నిండ ముసురుఁ దేంట్లు;
ళులఁ జోపఁగఁ జిల్క ల్ల నల్లన చేరి;
యోష్ఠబింబద్యుతు లొడియ నుఱుకు;
శుకములఁ దోలఁ జక్షుర్మీనములకు మం;
దాకినీ పాఠీనలో మెసఁగు;
మీన పంక్తుల దాఁట మెయిదీఁగతో రాయ;
శంపాలతలు మింట రణిఁ గట్టు;
ఆ॥ వె॥
శంపలను జయింపఁ క్రవాకంబులుఁ
గుచయుగంబుఁ దాఁకి క్రొవ్వుజూపు;
మెలఁత మొగిలు పిఱిఁది మెఱుఁగుఁదీవయుఁ బోలె
లదవర్ణు వెనుకఁ నెడునపుడు.
బాహ్య॥ చక్రాయుధునివెనుక జనుచున్న లక్ష్మి యొక్క లావణ్యమును వర్ణించుచున్నాడు - తుమ్మెదలవంటి ముంగురులు - దొండపండువంటి యధరోష్ఠము - మీనములవంటి చంచలదృష్టులు - మెఱుపు దీపవంటి తనువును - చక్రవాకములవంటి కుచములు గలిగి - మేఘము ననుసరించు విద్యుల్లతలవలె జనుచుండె నని భావము. -
రహ॥ ప్రకృతి పరమాత్ము ననుసరించి పోవు నపు డొక వస్తువు మఱియొక వస్తువువలెఁ గనుపడఁ జేయుచున్న దని భావము. దీనిని భ్రాంత్యాలంకార మందురు. -
శ్లో॥ పాలాశకుసుమ భ్రాంత్యా - శుకతుండే పతత్యళిః
జంబూఫలమితి భ్రాంత్యా తంఅళింహంతు మిచ్ఛతి
తా॥ మోదుగపుష్పమను భ్రాంతిచే తుమ్మెద చిలుకముక్కుపై వ్రాలినది. యా చిలుక యా తుమ్మెదను నేరేడుపండును భ్రాంతిచేఁ బరమాత్మను, జగత్తు వలెను - జగత్తును బరమాత్మవలెను జూచుచున్నా రని భావము.