పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : మానవాధీశ్వరా

సీ||
మానవాధీశ్వర! నువు నాలవవాఁడు;
తామసుం డనఁగ నుత్తముని భ్రాత
పృథ్వీపతులు కేతు వృష నర ఖ్యాత్యాదు;
తని పుత్రులు పద్గు ధిక బలులు;
త్యకహరి వీర సంజ్ఞలు వేల్పులు;
త్రిశిఖనామమువాఁడు దేవవిభుఁడు;
మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు; హరి పుట్టె;
రిమేధునకుఁ బ్రీతి రిణియందు;
ఆ||
గ్రాహబద్ధుఁ డయిన జరాజు విడిపించి
ప్రాణభయము వలనఁ బాపి కాచె
రి దయాసముద్రుఁ ఖిలలోకేశ్వరుఁ
నిన శుకునిఁ జూచి వనివిభుఁడు.
బాహ్యార్థము - హే పరీక్షన్మహారాజా। ఉత్తముని భ్రాత యగు తామసుం డను చతుర్ధమనువునకుఁ గేతు, వృషనర, ఖ్యాతాది పుత్ర దశకంబుఁ గలిగినది. సత్య, హరి, వీర, నామకు లగు వేల్పులను - త్రిశిఖుఁ డను దేవవిభుఁడును - జ్యోతిర్వ్యోమాది మునులును - హరియును జన్మించిరి, హరిమేధునకుఁ బురంధ్రి యగు హరిణి యందు - గ్రాహముచే, పట్టువడిన గజేంద్రుని రక్షించి నట్టి శ్రీమహావిష్ణు వవతరించె నని శుకమహాఋషి చెప్పినఁ బరీక్షిద్భూవిభుండు -
రహస్యార్థము - క్షరాక్షరముల కంటె నన్యుఁ డఁగు పరమాత్మ "ఉత్తమః పురుషన్త్యః" అతని యొక్క భ్రాత మాయాప్రతిబింబితుఁ డగు నీశ్వరుఁడు. వాని వంశ మందు ముఖ్యుఁ డగు హరి వాసుదేవవ్యూహాత్మకుం డగు శ్రీ మహావిష్ణువు గజెంద్రుఁ డగు జీవుని - కామ గ్రాహమువలన రాగహేతుకమైన జన్మ పరంపరల నుండి విముక్తునిఁజేసి రక్షించె నని శుకముని చెప్పిన విని యవనివిభుండు వానినిఁ గాంచి -