పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : కరుణాసింధుఁడు శౌరి

మ॥
రుణాసింధుఁడు శౌరి వారిచరమున్ ఖండింపఁగాఁ బంపె స
త్త్వరితాకంపిత భూమిచక్రము మహోద్యద్విస్ఫులింగచ్ఛటా
రిభూతాంబర శుక్రమున్ బహువిధబ్రహ్మాండభాండచ్ఛటాం
నిర్వక్రముఁ బాలితాఖిల సుధాంశ్చక్రముం జక్రమున్.
బాహ్య॥ భూకంపము గలిగించినట్టియు - విస్ఫులింగము(అగ్నికణములు)చే భయంకర ధ్వనులచే గప్పడిన నంతరిక్షము గలిగినదియు - బ్రహ్మాండ సముహాంతరములం దడ్డులేనిదియు-దేవతులను రక్షించునదియు నగు చక్రమును మొసలిని ద్రుంచుటకుఁ జక్రహస్తుఁడు పంపె నని తాత్పర్యము
రహ॥ కామమును ద్రుంచుటకునై (యోగముచే) శరీర కఫమును విస్ఫులింగము లనగా -
శ్రు॥ యధాసుదీప్తాత్పావకాద్విః స్ఫులింగాఃసహస్రశః ప్ర భవంతే సరూపాః తధాక్షరాద్వివిధా సోమ్యభావా ప్రజాయంతే॥
తా॥ హే సోమ్య - ప్రజ్వలితాగ్నినుండి మిణుఁగురు లెట్లు వెడలుచున్నవో యట్లాత్మ నుండి కళలు బైలుదేరుచున్నవి. అట్టి బ్రహ్మతేజోవంతమైన కళలతోఁ గూడినట్టియు బ్రహ్మాండముల వ్యాపించినట్టి ప్రజ్ఞాన ఘన చక్రమును బంపె నని తాత్పర్యము॥