పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : జీవనంబు దనకు జీవనంబై

వ|| అంత
ఆ|| వె||
జీవనంబు దనకు జీవనంబై యుంట
లవుఁ జలము నంతకంత కెక్కి
కర మొప్పెఁ డస్సె త్తేభమల్లంబు
హుళపక్ష శీతభాను పగిది.
బాహ్య|| - జీవనం బనగా జలముఁ జలచరంబునకు స్వస్ధాన మగుటచే, నలవు - యుద్ధ పరిశ్రమము, చలము - పట్టుదల క్రమంబున వృద్ధియై యుండెను. మత్తేభము కృష్ణపక్ష చంద్రుని మాడ్కి బల క్షీణమై యుండెను.
రహ - జీవనంబు - చిన్మయ సంకల్పము కామమునకు జన్మస్ధానమగుటచే "కామజానామి తేమూలం సంకల్పాత్త్వం హిజాయసే" కామమా! నీ మూలము, నే నెఱుంగుదును. సంకల్పమునఁ గదా పుట్టుచున్నావు. అను స్మృతి వాక్యము చొప్పున, సంకల్పమే తన వృద్ధికిఁ గారణ మగుటచే నంతకంతకు జీవుని విషయ జలధి యందు మునుంగఁజేయు పట్టుదలతోఁ గామము ప్రాతఃకాల సూర్యునివలె నభివృద్ధియై యుండెను. స్వరూపానందము కృష్ణపక్ష సీత కిరణుని మాడ్కి - క్షీణించు చుండెను. (వివరణ) విషయము స్మరణచే విషము కంటె బలవత్తరమైనది.
శ్లో|| విషస్య విషయాణాంచ*దూరమంతరమేతయోః
ఉపభుక్తం విషంహంతి* విషయస్మరణాదపి||
తా|| విషయ విషములకు మిక్కిలి బేదము కలదు. అనగా విషముకంటె విషయమే హానిచేయునది. విషముఁ ద్రాగినంగాని చంపదు. విషయమో, తలంచినంత మాత్రముననే చంపుచున్నది. (తెలివిఁ దప్పునట్లు చేయుచున్నది.) కావున, స్త్రీ యాదికముల స్మరించఁగూడదు.
శ్లో|| స్త్రీయాదికంవిషయంచిత్తం - నస్మర్తవ్యంమనీషిభిః
తచ్చింత యాభవేత్సంగో*తతోమృత్ర్భవిష్యతి||
తా|| స్త్రీ మొదలగు విషయములను చిత్తమునందు స్మరించనైనఁగూడదు. తచ్చింతనముచే, సంగము (ఆశక్తి) దానివలన మృత్యువును సంభవించును గావున విషయములకు నంతరమీయక నంతరాయములనే గల్పించుకొను చుండవలయునని ఆశయము. సంపర్క దోషమునఁ బురూరవ, నహుష విప్రనారాయణ, యజామిళాదులు పెక్కుమంది భ్రష్టులై నటులు దృష్టాంతములు కలవు. జనకునిసభ యందు "విదగ్ధ శాఖల్యుడు దేవతలను గూర్చి యాజ్ఞవల్క్యునిఁ బ్రశ్నించగా నంత్యము నందు జీవునిఁ బేర్కొని తదమతర్గతుఁ డగు కామమయ పురుషునిగా, వచించి యా కామమయ పురుషునికి - నాయతనము - జ్యోతి - దేవతను అడుగఁగా "కామ యేవయస్యాయతనం హృదయంలో కోమనోజ్యోతి, స్త్రీ యేవదేవతా" కామమే - ఆయతనం - హృదయము - లోకము - చూపు - మనస్సు జ్యోతి - ప్రకాశింపఁజేయునది స్త్రీ యే దేవత యనగా నాధారమని చెప్పెను. కావున స్త్రీని జయించినచో సమస్త కామములు జయింపఁబడును. గాన తత్సంర్గ కూడ దని భావము.
క|| విచ్చలవిడి నింద్రియముల
నెచ్చటి కైననుజనంగ *నిచ్చిన నిరయం
బచ్చుపఱచు గుదియించినఁ
దెచ్చుసుగతికి స *తీమళిమణీ||
గీ|| విడువరాదు దుర్మతులకు *నొడలు ముదియ
దానుముదియదు ప్రాణాంత* మైనరోగ
మనఘ తృష్ణవర్జితకాముఁ *డై యతండు
దానిఁబోద్రోచి సౌఖ్యసాం *ద్రత్వమెండు||
కం|| ఇంతకు మూలము తృష్ణా
తంతు లతయె *దానికి నడరం
గాంతాజనంబు తొలుబ్రా
కింతయెఱిఁగి విడువు *టిచ్చువిముక్తిన్