పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : ఎక్కడఁ జూచిన

కం||
క్కడఁ జూచిన లెక్కకు
నెక్కువ యై యడవి నడచు నిభయూధములో
నొక్క కరినాథుఁ డెడతెగి
చిక్కె నొక కరేణుకోటి సేవింపంగన్.
బాహ్య|| అడవిలో నెచ్చోటఁ జూచినను, మిక్కుటమై
సంచరించు గజ సమూహములో నొక్కగజనాధుఁడు ప్రియ బృందముతో మార్గముఁ దప్పిపోయె నని తాత్పర్యము.
రహ|| సమష్టిమాయా ప్రతిబింబిత - ఈశ్వర - కూటస్థ హిరణ్మయాదులనుండి, వ్యష్టిరూప, అవిద్యాప్రతిబింబిత - జీవస్వరూపమును బొంది యష్టవిధ (అపరా) ప్రకృతి సమూహముతో - సంసారాణ్యములో జిక్కె నని తాత్పర్యము.
సమష్టి - మూలప్రకృతి యందుఁ బ్రతిబింబితుఁడు - సదాశివుఁడు.
శ్రు|| సదేవ ఇదమగ్రఆసీత్
మాయ - (గుణసామ్యావస్ధ యందుఁ బ్రతిబింబితుఁడు ఈశ్వరుఁడు - మహత్తత్వము నందుఁ బ్రతిబింబితుడు - హిరణ్మయుఁడు.
వ్యష్టి
అవిద్యా ప్రతిబింబితుఁడు-జీవుఁడు.
సమిష్టి | వ్యష్టి
(అధిదైవము) | (ఆధ్యాత్మము)
1 పృధివి | శారీరమయ్యః (శరీరమయుఁడు)
2 ఆపః | రైతసః (రేతస్సంబంధి)
3 అగ్ని | వాగ్మయపురుషః
4 వాయుః | ప్రాణమయపురుషుఁడు
5. ఆదిత్యః | చాక్షుషఃపురుషః
6. దిశః | శౌత్రః (శోత్రసంబంధుఁడు)
7 చంద్రః | మానసః
8 విద్యుత్ | తైజసః (తేజోమయుడు)
9 స్తనయిత్నుః | సౌవరః (స్వరమందైనవాఁడు)
(గర్జనము) | `
10 ఆకాశః | హృదయాకాశః (దహరము)
11 ధర్మః | ధార్మికః
12 సత్యం | సాత్యః
13 మానుషం | మనుష్యం
జాతి | వ్యక్తిః
14 భూతములు | జీవులు
15 సామాన్యము | విశేషము

సమష్టినుంచి వ్యష్టిరూపమును బొందుటే - యాత్మవలన నెడబాటునొంది సంసారణ్యములోఁ జిక్కుట లేక తప్పిపోవుట యని తాత్పర్యమ. -
వ|| ఇట్లు వెనుక, ముందట, నుభయపార్శ్వంబులఁ దృష్టార్దితంబులై యరుఁగు దెంచు నేనుఁగు గములం గానకఁ దెఱఁవుదప్పి తొలంగుఁడు పడి యీశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబుఁ గాకుండుటం జేసి, దానును, దన కరేణు సముదయంబును నొక్క తెరువై పోవుచు.
బాహ్యము|| ఇప్పగిదిఁ దప్పిఁగొని వచ్చు నేనుంగు గుంపులను గానకఁ దెరవుఁదప్పి యీశ్వర ప్రేరితమున విస్మృతచిత్తయై యుండుటఁ జేసి యాశ్రిత కరేణు సముదయంబుతోఁ బోవుచు (ముందు కన్వయము)
రహ|| -జీవుఁడు స్వస్థానఁబు దప్పి; యన్నమయాదికోశంబులతో, జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞానాద్యావరణోపాధులతోడఁ బరిభ్రమణ శీలుండై-