పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : చనుదెంచెన్ ఘనుఁ డల్లవాఁడె

వ॥ ఇట్లు పొడగని.
మ॥
నుదెంచెన్ ఘనుఁ డల్లవాఁడె; హరి పజ్జం గంటిరే లక్ష్మి? శం
నినాదం బదె; చక్ర మల్లదె; భుజంధ్వంసియున్ వాఁడె; క్ర
న్న యేతెంచె నటంచు వేల్పులు నమోనారాయణాయేతి ని
స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్.
బాహ్య॥ అడుగో హరి - యాతని మ్రోల లక్ష్మి - శంఖధ్వని - చక్రము - గరుఁడుఁడు - వచ్చుచున్నారని దేవతులు నమోనారాయణా యని గజము యొక్క దురవస్ధను జక్కపర్ప నేతెంచెడి విష్ణువునకు నమస్కరించిరి.
రహ॥ అదిగో పరమాత్మ - చెంతఁ బ్రకృతి - ఓంకార ధ్వనిజ్ఞాన చక్రము - గరుడుఁ డనగా శుక మార్గము - మున్నగు నివృత్తి మార్గములు వచ్చుచున్నవని. ఓం నమోనారాయణాయ యని మోక్ష దీక్షాపరులు మ్రొక్కి రని తాత్పర్యము. -

అకార -నా-న
ఉకార-రా-మ
మకార-య-మ
అర్ధమాత్ర -ణా. -వా
నాదము -య -య.
వ॥ అయ్యవసరంబున గుంజరేంద్ర పాలన పారవశ్యంబున దేవతా నమస్కారంబు లంగీకరింపక మనస్సమాన సంచారుండై పోయిపోయి కొంతదూరంబున శింశుమారచక్రంబునుం బోలె గురు మకర కుళీర మీనమిధునంబై, భాగ్యవంతుని భాగధేయంబునుంబోలె సరాగజీవనంబై, వైకుంఠపురంబునుంబోలె శంఖ చక్ర కమలాలంకృతంబై, సంసార చక్రంబునుంబోలె ద్వంద్వ సంకుల పంక సంకీర్ణంబై, యొప్పు నప్పంకజాకరంబుఁ బొడగని-
బాహ్య॥ కుంజరావన పరవశత్వంబున-దేవతా నమస్సుల నందుకోక, మనోవేగుండై వెడలి మకరిలగ్నరాశింబోలి గుర్వాది గ్రహంబులతోఁ గూడి కిన్నరభాండాగారముఁబోలి శ్వేత తాబేటినిధి గలిగి తియ్యని నీటితోఁగూడి శంఖచక్రాదులు గలిగి సంసార చక్రంబు మాడ్కి సుఖదుఃఖాది ద్వంద్వ సంకులంబై యున్న యా సరస్సుం జూచి -
రహ॥ జీవరక్షణ పరవశత్వంబున విష్ణువు శింశుమార చక్రం బనగా సహస్రారము నందు ఓతప్రోత ఆక రసాదుతోఁగూడి రాగమను నీటితోడను - సారముంబోలి రాగ ద్వేషాది ద్వంద్వ యుక్త మనో సరస్సును జూచి -