పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : భిల్లీ భిల్ల

కం।
భిల్లీ భిల్ల లులాయక
ల్లుక ఫణి ఖడ్గ గవయ లిముఖ చమరీ
ఝిల్లీ హరి శరభక కిటి
ల్లాద్భుత కాక ఘూక యమగు నడవిన్.

బాహ్య - బోయ, భల్లూక, మర్కటాదులచే నిండిన యడవి
రహ|| -భిల్లీ- - నిర్ధయత్వము-లులాయక - బద్ధకము - భల్లూక-- అజ్ఞానము-(జ్ఞానానంద - విరోధి) ఫణి-శౌర్యము- వలీముఖము- - తృష్ణ
శ్రు। చిరంచిష్ఠతి నైకత్ర- తృష్ణాచపల మర్కటీ||
తృష్ణయను చపల స్వభావ మర్కటమునకు నిలుకడలేదు. ఝిల్లీ -ఊలపురువు-అనగా; గామనకుని తీవ్ర సంకల్పము -ఘాక -గ్రుడ్లగూబ- పగలు దృష్టిలేక నిశయందు సంచరించునది. యనగా నాత్మదృష్టిలేక - ప్రపంచ దృష్టిఁ గలిగియుండుట
శ్రు|| ఉలూకస్యయధాభాను-రంధకారః ప్రతీయతే
స్వప్రకాశే పరానందే-తమోమూఢ స్యజాయతే||
గ్రుడ్లగూబ లెట్లు పగటియం దంధత్వమునొందునో,
యట్లేమూఢునకు స్వప్రకాశదృష్టియం దంధుఁడగును, అట్టిసూక్ష్మశరీరారణ్యమందు-