పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

రచనలు : సూర్యస్థుతి - వ్యాసభాగవతము

భాగవతములో సూర్య స్తుతి

శ్రీ లక్కప్రగడ వేంకట గారు

Referred links. :-

ऊँ
॥ఓం నమో భగవతే వాసుదేవాయ॥

॥శ్రీమద్భాగవతమ్॥

॥ద్వాదశస్కన్ధః॥
॥షష్ఠోఽధ్యాయః - 6॥

యజ్ఞవల్క్య మహర్షి కృత సూర్యస్తుతి

- - -
యాజ్ఞవల్క్య ఉవాచ:-
ఓం నమో భగవతే ఆదిత్యాయాఖిలజగతా మాత్మస్వరూపేణ కాల-
స్వరూపేణ చతుర్విధభూతనికాయానాం బ్రహ్మాదిస్తమ్బపర్యన్తానామన్తర్హృదయేషు-
బహిరపి చాకాశ ఇవోపాధినావ్యవధీయమానో భవానేక-
ఏవ క్షణలవనిమేషావయవోపచితసంవత్సరగణేనాపామాదాన-
విసర్గాభ్యామిమాం లోకయాత్రామనువహతి ॥ 67॥
67 తాత్పర్యము: -
ఓంకార స్వరూపుడైన సూర్య భగవానునకు నమస్కారము, ఓ ఆదిత్యుడా! నీవు జగత్తునకు అత్మ స్వరూపునిగనూ, కాలస్వరూపునిగనూ, బ్రహ్మ మొదలు కొని స్తంబ పర్యంతములగల ప్రాణుల హృదయములందునూ బాహ్యాముననూ ఉపాధిచే ఆకాశమువలె సంబంధము లేనివాడ్డె ప్రకాశించుచున్నావు. క్షణములు, లవములు, నిమషములు మొదలగు కాల ప్రమాణములతో కూడిన సంవత్సరముల ద్వారానూ సముద్రములోని నీటిని ఆకర్షించుచూ, విసర్జించుచూ సకల లోకముల ప్రాణులకూ జీవనాధారముగా విలసిల్లుచుంటివి.
- - -

యదు హ వావ విబుధర్షభ సవితరదస్తపత్యనుసవనమహర్-
అహరామ్నాయవిధినోపతిష్ఠమానానామఖిలదురితవృజిన-
బీజావభర్జన భగవతః సమభిధీమహి తపనమణ్డలమ్ ॥ 68॥
68. తాత్పర్యము: -
ఓ సూర్యదేవుడా! దేవతా శ్రేష్టుండవని నిన్నందరూ కీర్తిచుచుందురు. నీవు ఎల్ల వేళాలా తపింపజేయిచుందువు., త్రికాలములయందునూ శాస్త్ర విధిగా నిన్నుపాసించువారి సమస్తపాపములనూ, దు:ఖములనూ, అజ్ఞానమునూ భస్మమొనర్చుదువు. అందుచే, నీ తేజోమండలమును ఏకాగ్రతతో ధ్యావించెదము.
- - -

య ఇహ వావ స్థిరచరనికరాణాం నిజనికేతనానాం మనైన్ద్రియాసు-
గణాననాత్మనః స్వయమాత్మాన్తర్యామీ ప్రచోదయతి ॥ 69॥-
69. తాత్పర్యము: --
ఓ భాస్కరా! నీవిచ్చటగల ప్రపంచమందలి చరాచర ప్రాణులన్నిటికినీ ఆత్మవు, అంతర్యామివి, ఆశ్రయుడవు, ఆప్రాణుల అచేతనమైన మనస్సులకు, ఇంద్రియములకు, ప్రాణములకు ప్రేరకుడవు.
- - -

య ఏవేమం లోకమతికరాలవదనాన్ధకారసంజ్ఞాజగరగ్రహ-
గిలితం మృతకమివ విచేతనమవలోక్యానుకమ్పయా పరమకారుణిక -
ఈక్షయైవోత్థాప్యాహరహరనుసవనం శ్రేయసి స్వధర్మాఖ్యాత్మావ-
స్థానే ప్రవర్తయతి ॥ 70॥-
70 తాత్పర్యము: --
లోకమందలి జనులు నిత్యమూ అంధకారమనెడి అజగరము యొక్క భయంకరమగు ముఖమున చిక్కువడి మృతులవలె అచేతన స్థితిలో వుందురు. పరమదయాళుడైన నీవు (సూర్యుడు) వారిపై కృపాదృష్టిని ప్రసరింపజేసి చైతన్యవంతులనుగావించి అన్ని వేళలయందునూ శుభకారములగు ధర్మానుష్ఠానములయందు వారిన ప్రవర్తిల్లజేసి ఆత్మాభిముఖలుగా ప్రవర్తింపజేయుచున్నావు. దుష్టులకు భయమును గూర్చుచూ రాజు పాలించునట్లు నీవునూ జారులూ, చోరులూ మొదలగు దుర్మార్గులను భయభ్రాంతులను చేయుచూ సంచరించుచుందువు.
- - -

అవనిపతిరివాసాధూనాం భయముదీరయన్నటతి పరిత ఆశాపాలైస్-
తత్ర తత్ర కమలకోశాఞ్జలిభిరుపహృతార్హణః ॥ 71॥-
71 తాత్పర్యము: --
చుట్టు ప్రక్కలగల దిక్పాలకులు తమతమ దిక్కులయందు తమ కమలకముల వంటి అంజలులను ఘటించి నీకు సూర్య ఉపహారములను సమర్పించుతు యుందురు.
- - -

అథ హ భగవంస్తవ చరణనలినయుగలం త్రిభువనగురుభిరభివన్దితమ్-
అహమయాతయామయజుష్కామ ఉపసరామీతి ॥ 72॥-
72 తాత్పర్యము: --
ఓ సూర్యభగవానుడా! నీ పాదపద్మద్వయమునకు ములోకముల యందలి గురువులు వందనమాచరించుచుందురు. నేనునూ నీచరణకమల యుగళమును శరణుజొచ్చుచున్నాను. ఇంత వరకు ఎవరికినీ లభ్యము గాని యుజుర్వెదమును నాకు ప్రసాదింపుము.
- - -