పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

రచనలు : డా. భ. శ్రీరామ సుబ్రహ్మణ్యం - పోతన - తీర్థుల - కృష్ణ చరితాలు

శ్రీ భమిడిపాటి శ్రీరామ సుబ్రహ్మణ్యం వారి - తులనాత్మక పరీశీలన
పోతన - తీర్థుల - కృష్ణ చరితాలు

వేదవ్యాస కృతమైన మహాభాగవతం ఆంధ్రదేశంలో విస్త్రుతమైన వ్యాప్తికి కారణమైనవారు పోతన, నారాయణ తీర్థులు. పోతనగారు భాగవతాన్ని తెలుగులో అందంగా తీర్చిదిద్ధగా, తీర్థుల వారు దశమస్కంధంలో కృష్ణ జననం మొదలు రుక్మిణీ కల్యాణం వరకు గల కథా భాగాలను యక్షగాన రూపంలో 12 తరంగాలుగా విభజించి సంస్కృత గ్రంథం రచించారు.
ఈ రెండు యజ్ఞాల తులనాత్మక పరిశీలన అనే బృహత్కృషి చేసిన భమిడిపాటివారికి శుభాభినందనలు. . .
అద్భుతమైన ఆ తులనాత్మక గ్రంధాన్ని క్రింది లింకు ద్వారా ఆస్వాదించగలరు.

పోతనామాత్య విరచిత భాగవత దశమ స్కంధ పూర్వ భాగం -
శ్రీ కృష్ణలీలా తరంగిణీ - తులనాత్మక పరిశీలన -
పరిశోధకులు - శ్రీ భమిడిపాటి శ్రీరామ సుబ్రహ్మణ్యం,
ఎం.ఎ,(సంస్కృతం), ఎం.ఎ. (తెలుగు), పి.హెచ్.డి.